అపో. కార్యములు 1:9 దగ్గర “మేఘం” గురించి రిఫరెన్సులు చూడండి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషేకంటే, ఏలీయా కంటే ఉన్నతంగా, అంటే పాత ఒడంబడిక గ్రంథంలోని గొప్పవారందరికంటే, ఎప్పుడైనా భూమిపై జీవించిన వారందరికంటే పైగా యేసుప్రభువును ఘనపరచాడు. యేసు ఎవరితోనూ సరిపోల్చదగని దేవకుమారుడు. మత్తయి 3:17 మొ।। చూడండి. శాశ్వత సజీవ దేవుడూ, విశ్వాన్ని సృజించినవాడూ బైబిల్లో యేసు పలికిన మాటలపట్ల అమితమైన శ్రద్ధాసక్తులు కనపరచవలసిందని కోరుతున్నాడు.
“ఈయన మాట వినండి”– ఈ మాటలకు ఈ లోకంలో మాటలు చెప్పినవారందరికన్నా యేసుప్రభువొక్కడే యోగ్యుడు. యోహాను 7:16-17; యోహాను 12:49-50; హెబ్రీయులకు 1:1-2 పోల్చి చూడండి. ఈ లోకంలో మన బ్రతుకంతా, మన శాశ్వత జీవితమంతా మనం ఆయన మాటలు విన్నామా లేదా అన్న దానిపైనే ఆధారపడి ఉంది – యోహాను 10:3, యోహాను 10:16, యోహాను 10:27; అపో. కార్యములు 3:23. చాలామందైతే ఇతర మనుషుల మాట వింటారు గానీ దేవుని ఏకైక కుమారుని స్వరం మాత్రం వినరు, ఎంత విచారకరం!