తాను ఆ పరీక్షలో ఓడిపోయినందుకూ, ఓడిపోయానని గ్రహించినందుకూ అతడు నొచ్చుకున్నాడు. అతడికి శాశ్వత జీవమూ, ఈ జీవితంలో తాను పొందగలిగినదంతా కూడా కావాలి. యేసు దీనికి ఒప్పుకోవడం లేదని అతడు గ్రహించాడు. యేసుప్రభువు తన శిష్యుల జీవితాల్లో స్వార్థాన్ని రాజ్యమేలనియ్యడు. వారు దేవుణ్ణీ ధనాన్నీ కూడా సేవించలేరు (మత్తయి 6:24). మనందరం కూడా ఇక్కడే పరీక్షకు గురి అవుతాం. నిజానికి మనం దేవుడిచ్చిన డబ్బు, ఆస్తులు – అవి ఎంత ఎక్కువైనా, తక్కువైనా – వాటితో ఏం చేస్తాం అనే విషయంలో క్షణక్షణం అనుదినం పరీక్షకు గురి అవుతూనే ఉన్నాం.