Matthew - మత్తయి సువార్త 21 | View All

1. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి

1. When they had approached Jerusalem and had come to Bethphage, at the Mount of Olives, then Jesus sent two disciples,

2. మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడి దయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కన బడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి;

2. saying to them, 'Go into the village opposite you, and immediately you will find a donkey tied [there] and a colt with her; untie them and bring them to Me.

3. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను.

3. 'If anyone says anything to you, you shall say, 'The Lord has need of them,' and immediately he will send them.'

4. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదే మనగా

4. This took place to fulfill what was spoken through the prophet:

5. ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.
యెషయా 62:11, జెకర్యా 9:9

5. 'SAY TO THE DAUGHTER OF ZION, 'BEHOLD YOUR KING IS COMING TO YOU, GENTLE, AND MOUNTED ON A DONKEY, EVEN ON A COLT, THE FOAL OF A BEAST OF BURDEN.''

6. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి

6. The disciples went and did just as Jesus had instructed them,

7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.

7. and brought the donkey and the colt, and laid their coats on them; and He sat on the coats.

8. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.

8. Most of the crowd spread their coats in the road, and others were cutting branches from the trees and spreading them in the road.

9. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
కీర్తనల గ్రంథము 118:25-26

9. The crowds going ahead of Him, and those who followed, were shouting, 'Hosanna to the Son of David; BLESSED IS HE WHO COMES IN THE NAME OF THE LORD; Hosanna in the highest!'

10. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయుఈయన ఎవరో అని కలవరపడెను.

10. When He had entered Jerusalem, all the city was stirred, saying, 'Who is this?'

11. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.

11. And the crowds were saying, 'This is the prophet Jesus, from Nazareth in Galilee.'

12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి

12. And Jesus entered the temple and drove out all those who were buying and selling in the temple, and overturned the tables of the money changers and the seats of those who were selling doves.

13. నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
యెషయా 56:7, యెషయా 60:7, యిర్మియా 7:11

13. And He said to them, 'It is written, 'MY HOUSE SHALL BE CALLED A HOUSE OF PRAYER'; but you are making it a ROBBERS' DEN.'

14. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

14. And [the] blind and [the] lame came to Him in the temple, and He healed them.

15. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి
కీర్తనల గ్రంథము 118:25

15. But when the chief priests and the scribes saw the wonderful things that He had done, and the children who were shouting in the temple, 'Hosanna to the Son of David,' they became indignant

16. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి
కీర్తనల గ్రంథము 8:2

16. and said to Him, 'Do You hear what these [children] are saying?' And Jesus said to them, 'Yes; have you never read, 'OUT OF THE MOUTH OF INFANTS AND NURSING BABIES YOU HAVE PREPARED PRAISE FOR YOURSELF'?'

17. వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతని యకు వెళ్లి అక్కడ బసచేసెను.

17. And He left them and went out of the city to Bethany, and spent the night there.

18. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.

18. Now in the morning, when He was returning to the city, He became hungry.

19. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.

19. Seeing a lone fig tree by the road, He came to it and found nothing on it except leaves only; and He said to it, 'No longer shall there ever be [any] fruit from you.' And at once the fig tree withered.

20. శిష్యులదిచూచి ఆశ్చర్యపడిఅంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.

20. Seeing [this], the disciples were amazed and asked, 'How did the fig tree wither [all] at once?'

21. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

21. And Jesus answered and said to them, 'Truly I say to you, if you have faith and do not doubt, you will not only do what was done to the fig tree, but even if you say to this mountain, 'Be taken up and cast into the sea,' it will happen.

22. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

22. 'And all things you ask in prayer, believing, you will receive.'

23. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా

23. When He entered the temple, the chief priests and the elders of the people came to Him while He was teaching, and said, 'By what authority are You doing these things, and who gave You this authority?'

24. యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.

24. Jesus said to them, 'I will also ask you one thing, which if you tell Me, I will also tell you by what authority I do these things.

25. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారుమనము పరలోక మునుండి అని చెప్పితిమా, ఆయనఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును;

25. 'The baptism of John was from what [source], from heaven or from men?' And they [began] reasoning among themselves, saying, 'If we say, 'From heaven,' He will say to us, 'Then why did you not believe him?'

26. మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి

26. 'But if we say, 'From men,' we fear the people; for they all regard John as a prophet.'

27. అందుకాయనఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.

27. And answering Jesus, they said, 'We do not know.' He also said to them, 'Neither will I tell you by what authority I do these things.

28. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా

28. 'But what do you think? A man had two sons, and he came to the first and said, 'Son, go work today in the vineyard.'

29. వాడుపోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను.

29. 'And he answered, 'I will not'; but afterward he regretted it and went.

30. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడుఅయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను.

30. 'The man came to the second and said the same thing; and he answered, 'I [will], sir'; but he did not go.

31. అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

31. 'Which of the two did the will of his father?' They said, 'The first.' Jesus said to them, 'Truly I say to you that the tax collectors and prostitutes will get into the kingdom of God before you.

32. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి.

32. 'For John came to you in the way of righteousness and you did not believe him; but the tax collectors and prostitutes did believe him; and you, seeing [this], did not even feel remorse afterward so as to believe him.

33. మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.
యెషయా 5:1-7

33. 'Listen to another parable. There was a landowner who PLANTED A VINEYARD AND PUT A WALL AROUND IT AND DUG A WINE PRESS IN IT, AND BUILT A TOWER, and rented it out to vine-growers and went on a journey.

34. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా

34. 'When the harvest time approached, he sent his slaves to the vine-growers to receive his produce.

35. ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి.

35. 'The vine-growers took his slaves and beat one, and killed another, and stoned a third.

36. మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.

36. 'Again he sent another group of slaves larger than the first; and they did the same thing to them.

37. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.

37. 'But afterward he sent his son to them, saying, 'They will respect my son.'

38. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందమురండని తమలో తాము చెప్పుకొని

38. 'But when the vine-growers saw the son, they said among themselves, 'This is the heir; come, let us kill him and seize his inheritance.'

39. అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.

39. 'They took him, and threw him out of the vineyard and killed him.

40. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.

40. 'Therefore when the owner of the vineyard comes, what will he do to those vine-growers?'

41. అందుకు వారుఆ దుర్మార్గులను కఠిన ముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి.

41. They said to Him, 'He will bring those wretches to a wretched end, and will rent out the vineyard to other vine-growers who will pay him the proceeds at the [proper] seasons.'

42. మరియయేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?
కీర్తనల గ్రంథము 118:22-23

42. Jesus said to them, 'Did you never read in the Scriptures, 'THE STONE WHICH THE BUILDERS REJECTED, THIS BECAME THE CHIEF CORNER [stone]; THIS CAME ABOUT FROM THE LORD, AND IT IS MARVELOUS IN OUR EYES '?

43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొల గింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.

43. 'Therefore I say to you, the kingdom of God will be taken away from you and given to a people, producing the fruit of it.

44. మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.
యెషయా 8:14-15, దానియేలు 2:34-35, దానియేలు 2:44-45

44. 'And he who falls on this stone will be broken to pieces; but on whomever it falls, it will scatter him like dust.'

45. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి

45. When the chief priests and the Pharisees heard His parables, they understood that He was speaking about them.

46. ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.

46. When they sought to seize Him, they feared the people, because they considered Him to be a prophet.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


క్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడు. (1-11) 
జెకర్యా 9:9లో జెకర్యా ప్రవక్త ద్వారా క్రీస్తు రాక గురించి ముందే చెప్పబడింది. క్రీస్తు తన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు, అది మహిమ కంటే సాత్వికతతో వర్ణించబడింది, మోక్షం కోసం దయను నొక్కి చెబుతుంది. జియోన్ రాజు జెరూసలేంలోకి విజయవంతమైన ప్రవేశం సమయంలో సౌమ్యత మరియు బాహ్య పేదరికాన్ని ప్రదర్శించాడు, జియాన్ పౌరులలో దురాశ, ఆశయం మరియు జీవిత గర్వం యొక్క తప్పుగా ఉంచబడిన విలువలకు విరుద్ధంగా హైలైట్ చేశాడు. వారు గాడిదను అందించినప్పటికీ, దానిని ఉపయోగించే ముందు యేసు యజమాని యొక్క సమ్మతిని కోరాడు మరియు అందుబాటులో ఉన్న ఉచ్చులు ఉపయోగించబడ్డాయి. క్రీస్తు సేవలో సమర్పించబడటానికి మనపైన ఏదీ, మన వస్త్రాలు కూడా చాలా విలువైనవిగా పరిగణించబడకూడదనే ఆలోచనను ఇది నొక్కిచెబుతోంది.
తరువాత, ప్రధాన యాజకులు మరియు పెద్దలు యేసును సిలువపై దుర్మార్గంగా ప్రవర్తించిన గుంపుతో జతకట్టారు, కాని వారు ఆయనను గౌరవించిన వారితో చేరలేదు. క్రీస్తును తమ రాజుగా అంగీకరించే వారు ఆయన అధికారం క్రింద సమస్తమును అప్పగించాలి. "హోసన్నా" యొక్క కేకలు, "ఇప్పుడు రక్షించు, మేము నిన్ను వేడుకుంటున్నాము! ప్రభువు నామంలో వచ్చేవాడు ధన్యుడు!" విజయవంతమైనట్లు అనిపించవచ్చు, కానీ ప్రజల ఆమోదం యొక్క చంచలత్వం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే అదే సమూహం "అతన్ని సిలువ వేయండి" అని కేకలు వేయడానికి సులభంగా మారవచ్చు. ప్రజల కరతాళ ధ్వనులు నశ్వరమైనవి, మరియు అనేకమంది సువార్తను ఆమోదించినట్లు కనిపించినప్పటికీ, కొంతమంది మాత్రమే స్థిరమైన శిష్యులుగా మారడానికి కట్టుబడి ఉంటారు. యేసు జెరూసలేంలోకి ప్రవేశించినప్పుడు, నగరం మొత్తం కదిలిపోయింది, కొంతమంది ఇజ్రాయెల్ యొక్క ఓదార్పుని ఊహించి ఆనందాన్ని అనుభవించారు, మరికొందరు, ముఖ్యంగా పరిసయ్యులు అసూయతో కదిలారు. సమీపిస్తున్న క్రీస్తు రాజ్యం ప్రజల హృదయాలలో మరియు మనస్సులలో వివిధ ప్రతిచర్యలను పొందుతుంది.

ఆయన ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిని వెళ్లగొట్టాడు. (12-17) 
కొన్ని దేవాలయాల కోర్ట్‌లు పశువులు మరియు బలిదానాలలో ఉపయోగించే వస్తువులకు మార్కెట్ ప్లేస్‌గా మారాయని, డబ్బు మార్చేవారు స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించారని క్రీస్తు కనుగొన్నాడు. తన పరిచర్య ప్రారంభంలో చేసినట్లే యోహాను 2:13-17, యేసు వారిని ఆ ప్రాంతం నుండి వెళ్లగొట్టాడు. అతని చర్యలు మరియు పనులు హోసన్నల కంటే బిగ్గరగా మాట్లాడాయి మరియు ఆలయంలో అతని స్వస్థత, తరువాతి ఇంటి వైభవం పూర్వపు ఇంటి వైభవాన్ని అధిగమిస్తుందనే వాగ్దానాన్ని నెరవేర్చింది. క్రీస్తు నేడు తన కనిపించే చర్చిలోని అనేక విభాగాల్లోకి ప్రవేశించినట్లయితే, అతను అనేక దాగివున్న చెడులను బహిర్గతం చేసి శుద్ధి చేస్తాడు. మతం ముసుగులో అనేక కార్యకలాపాలు, ప్రార్థనా మందిరం కంటే దొంగల గుహకు తగినవిగా వెల్లడవుతాయి.

బంజరు అంజూరపు చెట్టు శపించింది. (18-22) 
బంజరు అంజూరపు చెట్టును శపించడం సాధారణంగా కపటవాదుల స్థితికి ప్రతీకగా ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రీస్తు నిజమైన మత శక్తిని ప్రకటించే వారి నుండి మరియు దాని యొక్క నిజమైన సారాంశాన్ని దాని బాహ్య రూపాన్ని మాత్రమే ప్రదర్శించే వారి నుండి ఆశిస్తున్నాడనే పాఠాన్ని ఇది తెలియజేస్తుంది. తరచుగా, తమ వృత్తిలో బాహ్యంగా అభివృద్ధి చెందుతున్న వారి నుండి క్రీస్తు యొక్క న్యాయమైన అంచనాలు నెరవేరవు; అతను చాలా మందిని సంప్రదించాడు, ఆధ్యాత్మిక ఫలాలను కోరుకుంటాడు, కేవలం ఉపరితల ఆకులను కనుగొనడానికి.
విశ్వాసం యొక్క తప్పుడు వృత్తి ఈ ప్రపంచంలో తరచుగా వాడిపోతుంది, మరియు ఈ వాడిపోయే ప్రభావం క్రీస్తు శాపానికి ఆపాదించబడింది. పండు లేని అంజూరపు చెట్టు త్వరగా ఆకులను కోల్పోతుంది. ఇది యూదు దేశం మరియు దాని ప్రజల స్థితిని ప్రతిబింబిస్తుంది. యేసు వాటిని పరిశీలించినప్పుడు, అతనికి గణనీయమైన ఏదీ కనిపించలేదు—ఆకులు మాత్రమే. క్రీస్తును తిరస్కరించిన తరువాత, ఆధ్యాత్మిక అంధత్వం మరియు కాఠిన్యం వారిని అధిగమించాయి, ఇది వారి అంతిమ పతనానికి మరియు వారి దేశం యొక్క నాశనానికి దారితీసింది. ప్రభువు చర్యలు వారి ఫలించకపోవడానికి ప్రతిస్పందనగా ఉన్నాయి. బంజరు అంజూరపు చెట్టుపై ఉచ్ఛరించే తీర్పు మనలో లోతైన ఆందోళనను రేకెత్తించే ముఖ్యమైన హెచ్చరికగా ఉపయోగపడనివ్వండి.

దేవాలయంలో యేసు ప్రసంగం. (23-27) 
మన ప్రభువు తనను తాను మెస్సీయ అని బహిరంగంగా వెల్లడించినప్పుడు, ప్రధాన పూజారులు మరియు శాస్త్రులు చాలా బాధపడ్డారు, ప్రత్యేకించి అతను వారు ఆమోదించిన దుర్వినియోగాలను బహిర్గతం చేసి సరిదిద్దాడు. యోహాను పరిచర్య మరియు బాప్టిజం గురించి యేసు వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాడు. తరచుగా, ప్రజలు తమ సొంత ఆలోచనలు, ఆప్యాయతలు, ఉద్దేశాలు లేదా గుర్తుంచుకోవడం లేదా మరచిపోయే సామర్థ్యం గురించి అబద్ధాలు మాట్లాడటానికి దారితీసే పాపం కంటే మోసపూరితమైన అవమానానికి ఎక్కువగా భయపడతారు. వారి ప్రశ్నకు సమాధానంగా, చెడ్డ విరోధులతో అనవసరమైన వివాదాలను నివారించే జ్ఞానాన్ని నొక్కి చెబుతూ, యేసు సమాధానం ఇవ్వకూడదని ఎంచుకున్నాడు.

ఇద్దరు కుమారుల ఉపమానం. (28-32) 
మందలింపు కోసం రూపొందించబడిన ఉపమానాలు నేరస్తులను సూటిగా సంబోధిస్తాయి, వారి స్వంత పదాలను ఉపయోగించి వారిని జవాబుదారీగా ఉంచుతాయి. ద్రాక్షతోటలో పని చేయడానికి నియమించబడిన ఇద్దరు కుమారుల ఉపమానం, జాన్ యొక్క బాప్టిజం యొక్క చట్టబద్ధత గురించి తెలియని లేదా సందేహాస్పదంగా ఉన్నవారు దానిని అంగీకరించి మరియు అంగీకరించిన వారిచే అవమానించబడ్డారని వివరిస్తుంది. మానవాళి మొత్తం ప్రభువు పెంచిన పిల్లలను పోలి ఉంటుంది, కానీ చాలామంది అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఎంచుకున్నారు, కొందరు అవిధేయత యొక్క మోసపూరిత రూపాన్ని ప్రదర్శిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధైర్యమైన తిరుగుబాటుదారుడు పశ్చాత్తాపానికి దారితీసి దేవుని సేవకుడిగా మారడం తరచుగా జరుగుతుంది, అయితే ఫార్మాలిస్ట్ గర్వం మరియు శత్రుత్వంతో స్థిరపడతాడు.

దుష్టులైన భర్తల ఉపమానం. (33-46)
ఈ ఉపమానం యూదు దేశం యొక్క పాపం మరియు పతనాన్ని సూటిగా వర్ణిస్తుంది, బాహ్య చర్చి యొక్క అధికారాలలో పాలుపంచుకునే వారందరికీ హెచ్చరికగా ఉపయోగపడే పాఠాలతో. దేవుని ప్రజలతో వ్యవహరించే విధానం క్రీస్తు భౌతికంగా ఉన్నట్లయితే వ్యక్తులు అతనితో ఎలా ప్రవర్తిస్తారో ప్రతిబింబిస్తుంది. అతని కారణానికి నమ్మకంగా ఉన్నవారికి, దుష్ట లోకం నుండి లేదా క్రైస్తవ మతానికి భక్తిహీనమైన అనుచరుల నుండి అనుకూలమైన ఆదరణను ఆశించడం అవాస్తవమైన నిరీక్షణగా మారుతుంది. ద్రాక్షతోట మరియు దాని ప్రయోజనాలను కలిగి ఉన్న మనం, ఒక సంఘంగా, కుటుంబంగా లేదా వ్యక్తులుగా, సరైన కాలంలో ఫలాలను అందిస్తామా అనే దాని గురించి ఆలోచించమని ఇది మనల్ని ప్రేరేపిస్తుంది.
తన ప్రశ్నను వేస్తూ, మన రక్షకుడు ద్రాక్షతోటకు ప్రభువు వస్తాడని మరియు ఆయన రాకతో దుష్టులపై ఖచ్చితంగా తీర్పు తెస్తాడని నొక్కి చెప్పాడు. ప్రధాన యాజకులు మరియు పెద్దలు, బిల్డర్లుగా పనిచేస్తున్నారు, క్రీస్తు బోధలను మరియు చట్టాలను తిరస్కరించారు, అతన్ని తృణీకరించబడిన రాయిగా భావించారు. అయితే, యూదుల తిరస్కరణ అన్యజనులు అతనిని కౌగిలించుకునేలా చేసింది. సువార్త మార్గాలను ఉపయోగించడం ద్వారా ఫలాలను పొందేవారిని క్రీస్తు గుర్తించాడు. పాపుల అపనమ్మకం అంతిమంగా వారి నాశనానికి దారి తీస్తుంది, అయినప్పటికీ దేవుడు కోపం యొక్క ప్రకోపాన్ని అరికట్టడానికి మరియు దానిని తన కీర్తికి మార్చడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తాడు. క్రీస్తు తన చర్చికి బలమైన పునాది మరియు మూలస్తంభంగా మన ఆత్మలకు విలువైనదిగా మారాలి. ఆయన నిమిత్తము అసహ్యమైనా, ద్వేషాన్నీ సహించేటప్పటికి మనం ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉంటాము.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |