Mark - మార్కు సువార్త 15 | View All

1. ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.

1. udayamu kaagaanē pradhaanayaajakulunu peddalunu shaastrulunu mahaasabhavaarandarunu kalisi aalōchana chesi, yēsunu bandhin̄chi theesikonipōyi pilaathunaku appa gin̄chiri.

2. పిలాతుయూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.

2. pilaathuyoodula raajavu neevēnaa? Ani aayana naḍugagaa aayana neevannaṭṭē ani athanithoo cheppenu.

3. ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా

3. pradhaanayaajakulu aayanameeda anēkamaina nēramulu mōpagaa

4. పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
యెషయా 53:7

4. pilaathu aayananu chuchi maralaneevu utthara mēmiyu cheppavaa? nee meeda veeru ennenni nēramulu mōpuchunnaarō chooḍumanenu.

5. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.
యెషయా 53:7

5. ayinanu yēsu mari ē uttharamu cheppalēdu ganuka pilaathu aashcharyapaḍenu.

6. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.

6. aa paṇḍugalō vaaru kōrukonina yoka khayideeni pilaathu viḍipin̄chuvaaḍu.

7. అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.

7. adhikaarula nedirin̄chi, kalaha mulō narahatya chesinavaarithoo kooḍa bandhin̄chabaḍiyuṇḍina barabba anu okaḍuṇḍenu.

8. జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా

8. janulu gumpugaa kooḍivachi, athaḍu adhivaraku thamaku cheyuchuvachina prakaaramu cheyavalenani aḍugagaa

9. ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని

9. pradhaanayaajakulu asooya chetha yēsunu appagin̄chirani

10. పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.

10. pilaathu telisikoni nēnu yoodula raajunu meeku viḍudala cheyagōruchunnaaraa? Ani aḍigenu.

11. అతడు బరబ్బను తమకు విడుదల చేయ వలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.

11. athaḍu barabbanu thamaku viḍudala cheya valenani janulu aḍugukonunaṭlu pradhaanayaajakulu vaarini prērēpin̄chiri.

12. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.

12. anduku pilaathu alaagaithē yoodula raajani meeru cheppuvaani nēnēmi cheyudunani marala vaari naḍigenu.

13. వారువానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి.

13. vaaruvaanini siluvavēyumani marala kēkaluvēsiri.

14. అందుకు పిలాతు ఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

14. anduku pilaathu enduku? Athaḍē cheḍukaaryamu chese nani vaari naḍugagaa vaaruvaanini siluvavēyumani mari ekkuvagaa kēkaluvēsiri.

15. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

15. pilaathu janasamoohamunu santhooshapeṭṭuṭaku manassugalavaaḍai vaariki barabbanu viḍudalachesi yēsunu koraḍaalathoo koṭṭin̄chi siluvavēya nappagin̄chenu.

16. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనిన తరువాత

16. anthaṭa sainikulu aayananu prēthooryamanu adhikaara mandiramulōpaliki theesikonipōyi, sainikulanandarini samakoorchukonina tharuvaatha

17. ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి,

17. aayanaku oodaaraṅgu vastramu toḍigin̄chi, muṇḍla kireeṭamunu aayana thala meedapeṭṭi,

18. యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.

18. yoodularaajaa, neeku shubhamani cheppi aayanaku vandhanamu cheyasaagiri.

19. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి.

19. mariyu relluthoo aayana thalameedakoṭṭi, aayanameeda ummivēsi, mōkaaḷlooni aayanaku namaskaaramuchesiri.

20. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.

20. vaaru aayananu apahasin̄china tharu vaatha aayanameeda nunna oodaaraṅgu vastramu theesivēsi, aayana baṭṭalaayanaku toḍigin̄chi, aayananu siluvavēyuṭaku theesikonipōyiri.

21. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి.

21. kurēneeyuḍaina seemōnanu okaḍu palleṭoorinuṇḍi vachi aa maargamuna pōvuchuṇḍagaa, aayana siluvanu mōyuṭaku athanini balavanthamuchesiri.

22. అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.

22. athaḍu aleksandrunakunu roophunakunu thaṇḍri. Vaaru golgothaa anabaḍina chooṭunaku aayananu theesikoni vachiri. Golgothaa anagaa kapaala sthalamani arthamu.

23. అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.
కీర్తనల గ్రంథము 69:21, కీర్తనల గ్రంథము 69:26

23. anthaṭa bōḷamu kalipina draakshaarasamu aayanakichiri gaani aayana daani puchu konalēdu.

24. వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి.
కీర్తనల గ్రంథము 22:18

24. vaaraayananu siluvavēsi, aayana vastramula bhaagamu evaniki raavalenō chiṭluvēsi, vaaṭini pan̄chukoniri.

25. ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.

25. aayananu siluvavēsinappuḍu pagalu tommidi gaṇṭalaayenu.

26. మరియు యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.

26. mariyu yoodularaajaina yēsu ani aayanameeda mōpabaḍina nēramunu vraasi paigaanun̄chiri.

27. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని

27. mariyu kuḍivaipuna okanini eḍamavaipuna okanini

28. ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి.
యెషయా 53:12

28. iddaru bandipōṭu doṅgalanu aayanatokooḍa siluvavēsiri.

29. అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,
కీర్తనల గ్రంథము 22:7, కీర్తనల గ్రంథము 109:25, విలాపవాక్యములు 2:15

29. appuḍu aa maargamuna veḷluchunnavaaru thama thalaloochuchu aahaa dhevaalayamunu paḍagoṭṭi mooḍu dinamulalō kaṭṭuvaaḍaa,

30. సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించు కొనుమని చెప్పి ఆయనను దూషించిరి.

30. siluvameedanuṇḍi digi, ninnu neevē rakshin̄chu konumani cheppi aayananu dooshin̄chiri.

31. అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచువీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.

31. aṭlu shaastru lunu pradhaanayaajakulunu apahaasyamu cheyuchuveeḍitharulanu rakshin̄chenu, thannu thaanu rakshin̄chukonalēḍu.

32. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.

32. ishraayēlu raajagu kreesthu ippuḍu siluvameedanuṇḍi digi raavachunu. Appuḍu manamu chuchi nammudamani yokarithoo okaru cheppukoniri. aayanathookooḍa siluva vēyabaḍinavaarunu aayananu nindin̄chiri.

33. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
ఆమోసు 8:9

33. madhyaahnamu modalukoni mooḍu gaṇṭalavaraku aa dheshamanthaṭanu chikaṭi kammenu.

34. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
కీర్తనల గ్రంథము 22:1

34. mooḍu gaṇṭalaku yēsu elōyee, elōyee, laamaa sabakthaanee ani biggaragaa kēka vēsenu; a maaṭalaku naa dhevaa, naa dhevaa, nannu enduku cheyyiviḍichithivani arthamu.

35. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి.

35. daggara nilichinavaarilō kondaru aa maaṭalu vini adhigō ēleeyaanu piluchu chunnaaḍaniri.

36. ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను.
కీర్తనల గ్రంథము 69:21

36. okaḍu parugetthipōyi yoka span̄jee chirakaalōmun̄chi relluna thagilin̄chi aayanaku traaganichi thaaḷuḍi; ēleeyaa veeni dimpavachu nēmō choothamanenu.

37. అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.

37. anthaṭa yēsu goppa kēkavēsi praaṇamu viḍichenu.

38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.

38. appuḍu dhevaalayapu tera painuṇḍi krindivaraku reṇḍugaa chinigenu.

39. ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి- నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను.కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.

39. aayana kedurugaa nilichiyunna shathaadhipathi aayana eelaagu praaṇamu viḍuchuṭa chuchi- nijamugaa ee manushyuḍu dhevuni kumaaruḍē ani cheppenu.Kondaru streelu dooramunuṇḍi choochuchuṇḍiri.

40. వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.

40. vaarilō magdalēnē mariyayu, chinnayaakōbu yōsē anuvaari thalliyaina mariyayu, salōmēyu uṇḍiri.

41. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి.

41. aayana galilayalō unnappuḍu veeraayananu vembaḍin̄chi aayanaku parichaaramu chesinavaaru. Veeru kaaka aayanathoo yerooshalēmunaku vachina ithara streela nēkulunu vaarilō uṇḍiri.

42. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము

42. aa dinamu siddhaparachu dinamu, anagaa vishraanthi dinamunaku poorvadhinamu

43. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.

43. ganuka saayaṅkaalamainappuḍu arimathayiya yōsēpu tegin̄chi, pilaathunoddhaku veḷli yēsu dhehamu (thanakimmani) yaḍigenu. Athaḍu ghanatha vahin̄china yoka sabhyuḍai, dhevuni raajyamukoraku eduru choochuvaaḍu.

44. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.

44. pilaathu aayana inthalōnē chanipōyenaa ani aashcharyapaḍi yoka shathaadhipathini thana yoddhaku pilipin̄chi'aayana inthalōnē chanipōyenaa ani athani naḍigenu.

45. శతాధిపతి వలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.

45. shathaadhipathi valana saṅgathi telisikoni, yōsēpunaku aa shavamu nappagin̄chenu.

46. అతడు నారబట్ట కొని,ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.

46. athaḍu naarabaṭṭa koni,aayananu dimpi, aa baṭṭathoo chuṭṭi, baṇḍalō tolipin̄china samaadhiyandu aayananu peṭṭi aa samaadhi dvaaramunaku raayi porlin̄chenu.

47. మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.

47. magdalēnē mariyayu yōsē thalliyaina mariyayu aayana yun̄chabaḍina chooṭu chuchiri.


Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.