Mark - మార్కు సువార్త 15 | View All

1. ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.

1. और भोर होते ही तुरन्त महायाकों, पुरनियों, और शास्त्रियों ने वरन सारी महासभा ने सलाह करके यीशु को बन्धवाया, और उसे ले जाकर पीलातुस के हाथ सौंप दिया।

2. పిలాతుయూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.

2. और पीलातुस ने उस से पूछा, क्या तू यहूदियों का राजा है? उस ने उस को उत्तर दिया; कि तू आप ही कह रहा है।

3. ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా

3. और महायाजक उस पर बहुत बातों का दोष लगा रहे थे।

4. పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
యెషయా 53:7

4. पीलातुस ने उस से फिर पूछा, क्या तू कुछ उत्तर नहीं देता, देख ये तुझ पर कितनी बातों का दोष लगाते हैं?

5. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.
యెషయా 53:7

5. यीशु ने फिर कुछ उत्तर नहीं दिया; यहां तक कि पीलातुस को बड़ा आश्चर्य हुआ।।

6. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.

6. और वह उस पर्व्व में किसी एक बन्धुए को जिसे वे चाहते थे, उन के लिये छोड़ दिया करता था।

7. అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.

7. और बरअब्बा नाम एक मनुष्य उन बलवाइयों के साथ बन्धुआ था, जिन्हों ने बलवे में हत्या की थी।

8. జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా

8. और भीड़ ऊपर जाकर उस से बिनती करने लगी, कि जैसा तू हमारे लिये करता आया है वैसा ही कर।

9. ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని

9. पीलातुस ने उन को यह उत्तर दिया, क्या तुम चाहते हो, कि मैं तुम्हारे लिये यहूदियों के राजा को छोड़ दूं?

10. పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.

10. क्योंकि वह जानता था, कि महायाजकों ने उसे डाह से पकड़वाया था।

11. అతడు బరబ్బను తమకు విడుదల చేయ వలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.

11. परन्तु महायाजकों ने लोगों को उभारा, कि वह बरअब्बा ही को उन के लिये छोड़ दे।

12. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.

12. यह सून पीलातुस ने उन से फिर पूछा; तो जिसे तुम यहूदियों का राजा कहते हो, उस को मैं क्या करूं? वे फिर चिल्लाए, कि उसे क्रूस पर चढ़ा दे।

13. వారువానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి.

13. पीलातुस ने उन से कहा; क्यों, इस ने क्या बुराई की है?

14. అందుకు పిలాతు ఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

14. परन्तु वे और भी चिल्लाए, कि उसे क्रूस पर चढ़ा दे।

15. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

15. तक पीलातुस ने भीड़ को प्रसन्न करने की इच्छा से, बरअब्बा को उन के लिये छोड़ दिया, और यीशु को कोड़े लगवाकर सौंप दिया, कि क्रूस पर चढ़ाया जाए।

16. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనిన తరువాత

16. और सिपाही उसे किले के भीतर आंगत में ले गए जो प्रीटोरियुन कहलाता है, और सारी पलटन को बुला लाए।

17. ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి,

17. और उन्हों ने उसे बैंजनी वस्त्रा पहिनाया और कांटों का मुकुट गूंथकर उसके सिर पर रखा।

18. యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.

18. और यह कहकर उसे नमस्कार करने लगे, कि हे यहूदियों के राजा, नमस्कार!

19. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి.

19. और वे उसके सिर पर सरकण्डे मारते, और उस पर थूकते, और घुटने टेककर उसे प्रणाम करते रहे।

20. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.

20. और जब वे उसका ठट्ठा कर चुके, तो उस पर बैंजनी वस्त्रा उतारकर उसी के कपड़े पहिनाए; और तब उसे क्रूस पर चढ़ाने के लिये बाहर ले गए।

21. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి.

21. और सिकन्दर और रूफुस का पिता, शमौन नाम एक कुरेनी मनुष्य, जो गांव से आ रहा था उधर से निकला; उन्हों ने उसे बेगार में पकड़ा, कि उसका क्रूस उठा ले चले।

22. అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.

22. और वे उसे गुलगुता नाम जगह पर जिस का अर्थ खोपड़ी की जगह है लाए।

23. అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.
కీర్తనల గ్రంథము 69:21, కీర్తనల గ్రంథము 69:26

23. और उसे मुर्र मिला हुआ दाखरस देने लगे, परन्तु उस ने नहीं लिया।

24. వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి.
కీర్తనల గ్రంథము 22:18

24. तब उन्हों ने उस को क्रूस पर चढ़ाया, और उसके कपड़ों पर चिटि्ठयां डालकर, कि किस को क्या मिले, उन्हें बांट लिया।

25. ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.

25. और पहर दिन चढ़ा था, जब उन्हों ने उस को क्रूस पर चढ़ाया।

26. మరియు యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.

26. और उसका दोषपत्रा लिखकर उसके ऊपर लगा दिया गया कि 'यहूदियों का राजा'।

27. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని

27. और उन्हों ने उसके साथ दो डाकू, एक उस की दहिनी और एक उस की बाईं ओर क्रूस पर चढ़ाए।

28. ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి.
యెషయా 53:12

28. तब धर्मशास्त्रा का वह वचन कि वह अपराधियों के संग गिना गया पूरा हुआ।

29. అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,
కీర్తనల గ్రంథము 22:7, కీర్తనల గ్రంథము 109:25, విలాపవాక్యములు 2:15

29. और मार्ग में जानेवाले सिर हिला हिलाकर और यह कहकर उस की निन्दा करते थे, कि वाह! मन्दिर के ढानेवाले, और तीन दिन में बनानेवाले! क्रूस पर से उतर कर अपने आप को बचा ले।

30. సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించు కొనుమని చెప్పి ఆయనను దూషించిరి.

30. इसी रीति से महायाजक भी, शास्त्रियों समेत,

31. అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచువీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.

31. आपस में ठट्ठे से कहते थे; कि इस ने औरों को बचाया, और अपने को नहीं बचा सकता।

32. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.

32. इस्राएल का राजा मसीह अब क्रूस पर से उतर आए कि हम देखकर विश्वास करें: और जो उसके साथ क्रूसों पर चढ़ाए गए थे, वे भी उस की निन्दा करते थे।।

33. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
ఆమోసు 8:9

33. और दोपहर होने पर, सारे देश में अन्धियारा छा गया; और तीसरे पहर तक रहा।

34. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
కీర్తనల గ్రంథము 22:1

34. तीसरे पहर यीशु ने बड़े शब्द से पुकार कर कहा, इलोई, इलोई, लमा शबक्तनी? जिस का अर्थ है; हे मेरे परमेश्वर, हे मेरे परमेश्वर, तू ने मुझे क्यों छोड़ दिया?

35. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి.

35. जो पास खड़े थे, उन में से कितनों ने यह सुनकर कहा: देखो यह एलिरयाह को पुकारता है।

36. ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను.
కీర్తనల గ్రంథము 69:21

36. और एक ने दौड़कर इस्पंज को सिरके से डुबोया, और सरकण्डे पर रखकर उसे चुसाया; और कहा, ठहर जाओ, देखें, कि एलिरयाह उसे उतारने कि लिये आता है कि नहीं।

37. అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.

37. तब यीशु ने बड़े शब्द से चिल्लाकर प्राण छोड़ दिये।

38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.

38. और मन्दिर का पर्दा ऊपर से नीचे तक फटकर दो टुकड़े हो गया।

39. ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి - నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.

39. जो सूबेदार उसके सम्हने खड़ा था, जब उसे यूं चिल्लाकर प्राण छोड़ते हुए देखा, तो उस ने कहा, सचमुच यह मनुष्य, परमेश्वर का पुत्रा था।

40. వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.

40. कई स्त्रियां भी दूर से देख रही थीं: उन में मरियम मगदलीनी और छोटे याकूब की और योसेस की माता मरियम और शलोमी थीं।

41. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి.

41. जब वह गलील में थ, तो ये उसके पीछे हो लेती थीं और उस की सेवाटहल किया करती थीं; और और भी बहुत सी स्त्रियां थीं, जो उसके साथ यरूशलेम में आई थीं।।

42. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము

42. जब संध्या हो गई, तो इसलिये कि तैयारी का दिन था, जो सब्त के एक दिन पहिले होता है।

43. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.

43. अरिमितिया का रहेनवाला यूसुुफ आया, जो प्रतिष्ठित मंत्री और आप भी परमेश्वर के राज्य की बाट जोहता था; वह हियाव करके पीलातुस के पास गया और यीशु की लोथ मांगी।

44. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.

44. पीलातुस ने आश्चर्य किया, कि वह इतना शीघ्र मर गया; और सूबेदार को बुलाकर पूछा, कि क्या उस को मरे हुए देर हुई?

45. శతాధిపతి వలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.

45. सो जब सूबेदार के द्वारा हाल जान लिया, तो लोथ यूसुफ को दिला दी।

46. అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.

46. तब उस ने एक पतली चादर मोल ली, और लोथ को उतारकर चादर में लपेटा, और एक कब्र मे जो चट्टान में खोदी गई थी रखा, और कब्र के द्वार पर एक पत्थर लुढ़कार दिया।

47. మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.

47. और मरियम मगदलीनी और योसेस की माता मरियम देख रही थीं, कि वह कहां रखा गया है।।



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పిలాతు ముందు క్రీస్తు. (1-14) 
వారు యేసును బంధించారు మరియు మన కొరకు ఆయన ఎలా బంధించబడ్డాడో మనం తరచుగా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. రాజును అప్పగించడం ద్వారా, వారు దేవుని రాజ్య పాలనను సమర్ధవంతంగా అప్పగించారు మరియు ఆ విధంగా, తమ అధికారాన్ని ఇష్టపూర్వకంగా వదులుకున్నారు, దానిని మరొక దేశానికి బదిలీ చేశారు. యేసు నేరుగా పిలాతు ప్రశ్నలకు ప్రతిస్పందించాడు, కానీ సాక్షుల ఆరోపణలు అబద్ధమని తెలిసినందున వారితో సంబంధం పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాడు, ఈ వాస్తవాన్ని పిలాతు కూడా గుర్తించాడు. యాజకుల చేతుల నుండి యేసును విడుదల చేయమని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని పిలాతు ఆశించాడు, కాని పూజారులు "సిలువ వేయండి! ఆయనను సిలువ వేయండి" అని నినాదాలు చేసిన గుంపుపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. మనం వ్యక్తులను మరియు పరిస్థితులను వారి మెరిట్‌ల ఆధారంగా మరియు దేవుని వాక్యానికి అనుగుణంగా, వినికిడిపై ఆధారపడకుండా అంచనా వేయాలి. భూమ్మీద నడిచిన అత్యంత పరిపూర్ణమైన జ్ఞానవంతుడు, పవిత్రుడు మరియు అద్భుతమైన వ్యక్తి అటువంటి అవమానకరమైన వ్యవహారానికి గురయ్యాడనే గ్రహింపు మానవ దుష్టత్వం మరియు దేవుని పట్ల శత్రుత్వం యొక్క లోతును గుర్తించేలా చేస్తుంది. ఈ వేధింపుదారులు ప్రదర్శించే హానికరమైన వైఖరిని మనం ఎక్కువగా తిరస్కరిద్దాం.

క్రీస్తు శిలువ వేయబడటానికి దారితీసింది. (15-21) 
క్రీస్తు మరణాన్ని దాని అత్యంత భయంకరమైన రూపంలో ఎదుర్కొన్నాడు - మరణం అత్యంత దౌర్భాగ్యమైన నేరస్థులకు కేటాయించబడింది. సిలువ మరియు అవమానం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, ఎందుకంటే మానవ పాపం కారణంగా దేవుని అవమానం నేపథ్యంలో, మానవ స్వభావం భరించగలిగే అత్యంత అధోకరణాన్ని ఇష్టపూర్వకంగా భరించడం ద్వారా క్రీస్తు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. యూదుల చట్టంలో deu 21:23నిర్దేశించినట్లుగా అతని మరణం శపించబడింది. రోమన్ సైనికులు యేసును రాజుగా ఎగతాళిగా కీర్తించారు, అంతకుముందు, ప్రధాన యాజకుని ప్రాంగణంలో, అతని సేవకులు ఆయనను ప్రవక్త మరియు రక్షకునిగా ఎగతాళి చేశారు. ఊదారంగు లేదా స్కార్లెట్ వస్త్రం క్రీస్తుకు నిందకు మరియు అవమానానికి చిహ్నంగా ఉన్నప్పుడు క్రైస్తవునికి గర్వాన్ని తీసుకురావాలా? అతను సంపాదించిన కీర్తి కిరీటాన్ని మనం ఏదో ఒక రోజు ధరించేలా మనకు అర్హమైన ముళ్ల కిరీటాన్ని ధరించాడు. మనము పాపముచే కళంకితమయ్యాము, శాశ్వతమైన అవమానము మరియు ధిక్కారానికి అర్హుడు, కానీ మనలను విమోచించడానికి, యేసు ఇష్టపూర్వకంగా అవమానాన్ని మరియు ధిక్కారాన్ని స్వీకరించాడు. అతను ఏ పాపం చేయనప్పటికీ, అతను నేరస్థుడిలా నడిపించబడ్డాడు.
సున్నితమైన మరియు పవిత్రమైన విమోచకుని యొక్క బాధలు విశ్వాసులకు మార్గదర్శకత్వం యొక్క శాశ్వతమైన మూలంగా పనిచేస్తాయి, వారి అత్యుత్తమ క్షణాలలో కూడా వారు ఎప్పటికీ అలసిపోని స్ఫూర్తిని అందజేస్తుంది. యేసు ఎలా బాధపడ్డాడో ఆలోచించినప్పుడు, పాపాత్ముడైన నేను ఆందోళనకు గురవుతానా లేదా చేదుగా ఉంటానా? నేను కోపం నన్ను తినేస్తానా లేదా సవాళ్లు మరియు నేరాలకు ప్రతిస్పందనగా అవమానాలు మరియు బెదిరింపులను ఆశ్రయించాలా?

శిలువ వేయడం. (22-32) 
మన ప్రభువైన యేసు శిలువ వేయబడిన ప్రదేశం "పుర్రె స్థలం" అనే అరిష్ట పేరును కలిగి ఉంది, ఇది ఉరితీయడానికి ఒక సాధారణ ప్రదేశం, ఎందుకంటే అతను అతిక్రమించిన వారితో పూర్తిగా సంబంధం కలిగి ఉన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును మనం చూసినప్పుడల్లా, అతని తలపై వ్రాసిన దానిని మనం గుర్తుచేసుకోవాలి: అతను ఒక రాజు, మరియు నమ్మకమైన ఇశ్రాయేలీయుల మాదిరిగానే మనం నిజమైన పౌరులుగా మనల్ని మనం అప్పగించుకోవాలి. అతనితో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు, ఇది ఉద్దేశపూర్వకంగా అగౌరవపరిచే చర్య. అయినప్పటికీ, అతను మన పాపాలను భరించాడు కాబట్టి అతను అతిక్రమించేవారిలో లెక్కించబడతాడని ముందే చెప్పబడింది. దారిన వెళ్లేవారు కూడా ఆయనను అవహేళన చేశారు, సిలువ నుండి దిగమని ఆయనను కోరారు, అతను అలా చేస్తే నమ్మమని వాగ్దానం చేశారు, కానీ సమాధి నుండి లేవడం ద్వారా అతను అందించిన మరింత బలవంతపు సంకేతం ఉన్నప్పటికీ వారి విశ్వాసం అస్పష్టంగానే ఉంది.
క్రీస్తు బాధల ద్వారా వెల్లడైన సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించే వ్యక్తి మోక్షాన్ని తీవ్రంగా కోరుకుంటాడు. ప్రగాఢమైన కృతజ్ఞతతో, వారు క్షమాపణ మరియు నిత్యజీవం కోసం ఆశ యొక్క మెరుపును స్వాగతిస్తారు, ఇది దేవుని కుమారుని బాధ మరియు మరణం ద్వారా సురక్షితం. మహిమగల ప్రభువును సిలువ వేసిన పాపాల గురించి వారు తీవ్ర పశ్చాత్తాపంతో కూడా దుఃఖిస్తారు.

క్రీస్తు మరణం. (33-41) 
యూదులు ధర్మసూర్యుడిని అస్పష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడంతో, మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు భూమిని దట్టమైన చీకటి కప్పివేసింది. ఈ చీకటి క్రీస్తు మానవ ఆత్మను చుట్టుముట్టిన ప్రగాఢమైన వేదనకు ప్రతీకగా ఆయన తనను తాను పాపానికి బలిగా అర్పించుకున్నాడు. అతను తన శిష్యులు తనను విడిచిపెట్టినందుకు విలపించలేదు, కానీ తన తండ్రిని విడిచిపెట్టాడు. ఈ క్షణంలో, అతను మా కోసం పాపం యొక్క పూర్తి బరువును తీసుకున్నాడు. పౌలు పరిశుద్ధుల సేవ కొరకు బలిగా అర్పించబడుటకు ఇష్టపడినప్పుడు, అతడు ఆనందమును పొంది ఆనందించగలడు phi 2:17 అయితే, పాపుల పాపాలకు బలి అర్పించడం పూర్తిగా భిన్నమైన విషయం.
అదే సమయంలో, యేసు ప్రయాణిస్తున్న సమయంలో, ఆలయం యొక్క ముసుగు పై నుండి క్రిందికి చిరిగిపోయింది. ఇది విశ్వాసం లేని యూదుల హృదయాల్లో భయాన్ని కలిగించింది, వారి చర్చి మరియు దేశం యొక్క రాబోయే నాశనానికి దూతగా పనిచేస్తోంది. అయినప్పటికీ, ఇది విశ్వసించే క్రైస్తవులందరికీ ఓదార్పునిచ్చింది, ఎందుకంటే ఇది యేసు రక్తం ద్వారా సాధ్యమైన పవిత్ర స్థలంలోకి కొత్త మరియు జీవన మార్గాన్ని తెరవడాన్ని సూచిస్తుంది.
క్రీస్తు దేవునిని తన తండ్రి అని బహిరంగంగా సంబోధించిన విశ్వాసం మరియు అతని ఆత్మను అతని చేతుల్లోకి అప్పగించిన విశ్వాసం శతాధిపతిని ప్రగాఢంగా కదిలించింది. సిలువ వేయబడిన క్రీస్తును సరిగ్గా అర్థం చేసుకోవడం విశ్వాసిని మరణం యొక్క ఆలోచనతో పునరుద్దరిస్తుంది, రాబోయే కోపం నుండి వారిని రక్షించడానికి గాయపడిన మరియు కుట్టిన రక్షకుని చూడడానికి, ప్రేమించడానికి మరియు స్తుతించాలనే కోరికతో వారిని నింపుతుంది.

అతని శరీరం ఖననం చేయబడింది. (42-47)
మన ప్రభువైన యేసు సమాధిని సాక్ష్యమివ్వడానికి మేము ఇక్కడ గుమిగూడాము మరియు కృప ద్వారా మనం దాని పోలికలో రూపాంతరం చెందుతాము. అరిమతీయాకు చెందిన జోసెఫ్ దేవుని రాజ్యం రాక గురించి ఆసక్తిగా ఎదురుచూసిన వ్యక్తి. దాని ఆశీర్వాదాలలో పాలుపంచుకోవాలని కోరుకునే వారు, అది ఓడిపోయినట్లు కనిపించినప్పటికీ, క్రీస్తు పక్షాన నిలబడాలి. దేవుడు ఈ మనిషిని తన సేవ కోసం నియమించాడు. యేసు సజీవంగా ఉన్నాడనే వాదనలకు చోటు లేకుండా పిలాతు అటువంటి సమగ్ర విచారణను నిర్వహించడం ప్రావిడెన్షియల్ చర్య. పిలాతు యోసేపు మృతదేహాన్ని కిందకు దించి, తనకు తగినట్లుగా నిర్వహించడానికి అనుమతి ఇచ్చాడు. కొంతమంది స్త్రీలు జీసస్ వేయబడిన ప్రదేశాన్ని గమనించారు, అంతకుముందు అలా చేయడానికి సమయం లేనందున నిర్జీవమైన శరీరానికి అభిషేకం చేయడానికి సబ్బాత్ తర్వాత తిరిగి రావాలని భావించారు. ఈ శ్మశానవాటికకు ప్రత్యేక శ్రద్ధ లభించింది, ఎందుకంటే ఇది క్రీస్తు పునరుత్థానాన్ని సూచిస్తుంది. తనపై నమ్మకం ఉంచి, ఆయనను పిలిచేవారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు. రక్షకుని కోసం చేసినట్లే, దాని కుట్టడం లేని మరణం, చివరికి విశ్వాసి యొక్క దుఃఖాలకు అంతం తెస్తుంది.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |