సూర్యాస్తమయాన యూదుల విశ్రాంతిదినం ఆరంభమై తరువాతి రోజు సూర్యాస్తమయందాకా కొనసాగేది. ఈ సమయంలో వారు ఏ పనీ చెయ్యకూడదు (నిర్గమకాండము 20:8-11). అందువల్ల సూర్యాస్తమయానికి ముందే యేసు దేహాన్ని సిలువ పైనుండి దించి సమాధి చేయాలని యోసేపు కోరాడు. ఇక్కడ చెప్పిన విశ్రాంతి దినం మామూలుగా శనివారం నాడు వచ్చే విశ్రాంతి దినం కాక, ఏడు రోజుల పొంగనిరొట్టెల పండుగను మొదలు పెట్టె ప్రత్యేకమైన విశ్రాంతి దినమై ఉండవచ్చు. యేసు బుధవారం నాడు చనిపోయాడని పండితులు కొందరూ, గురువారం నాడని కొందరూ, శుక్రవారం నాడని కొందరూ అభిప్రాయపడ్డారు. అయితే అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇందులో మనం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పవలసిన అవసరం లేదు.