Mark - మార్కు సువార్త 5 | View All

1. వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.

1. వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు.

2. ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను.

2. యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు.

3. వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింప లేకపోయెను.

3. వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు.

4. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను.

4. వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు.

5. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను.

5. వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గర గా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు.

6. వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి

6. వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు.

7. యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
1 రాజులు 17:18

7. “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి.” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు.

8. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.

8. ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకురా!” అని అన్నాడు.

9. మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి

9. యేసు వాణ్ణి ‘నీ పేరేమి?’ అని అడిగాడు. “నా పేరు ‘పటాలం’. మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు.

10. తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.

10. వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి.

11. అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను.

11. ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది.

12. గనుకఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.

12. ssఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి.

13. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను.

13. యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి.

14. ఆ పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.

14. ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.

15. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి.

15. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది.

16. జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా

16. జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు.

17. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.

17. వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు.

18. ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని

18. యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు.

19. ఆయన వానికి సెలవియ్యక నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను.

19. యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు.

20. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.

20. అతడు వెళ్ళి దెకపొలిలో యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.

21. యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడి వచ్చెను.

21. యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు.

22. ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధి కారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీద పడి

22. ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి,

23. నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా

23. “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు.

24. ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.

24. యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది.

25. పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి

25. పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది.

26. తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను.

26. ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది.

27. ఆమె యేసునుగూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని,

27. ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది.

28. జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.

28. తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది.

29. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను.

29. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది.

30. వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగినా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా

30. వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు.

31. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.

31. ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు.

32. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను.

32. కాని యేసు, ‘ఎవరు తాకారు?’ అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు.

33. అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.

33. అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది.

34. అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
1 సమూయేలు 1:17, 1 సమూయేలు 20:42, 2 సమూయేలు 15:9, 2 రాజులు 5:19

34. ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు.

35. ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చినీ కుమార్తె చని పోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి.

35. యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారియైన యాయీరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి?” అని అన్నారు.

36. యేసు వారు చెప్పినమాట లక్ష్య పెట్టకభయ పడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి

36. యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మకంతో ఉండు” అని అన్నాడు.

37. పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరి నైనను తన వెంబడి రానియ్యక

37. యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహాన్ను తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు.

38. సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి

38. యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు.

39. లోపలికిపోయి మీరేలగొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను.

39. ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు.

40. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారి నందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి

40. కాని వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న గదికి వెళ్ళాడు.

41. ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.

41. ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. అంటే చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము అని అర్థం.

42. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి.

42. ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది.

43. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.

43. దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా యివ్వమని వాళ్ళకు చెప్పాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రాక్షసుడు నయమయ్యాడు. (1-20) 
కొంతమంది ధిక్కరించే పాపులు ఇక్కడ పేర్కొన్న అస్తవ్యస్తమైన వ్యక్తిలా బహిరంగంగా ప్రవర్తనను ప్రదర్శిస్తారు. చట్టాల ఆజ్ఞలు పాపులను వారి చెడు మార్గాల నుండి అరికట్టడానికి గొలుసులు మరియు నిర్బంధాలుగా పనిచేస్తాయి, కానీ అవి ఆ బంధాలను ఛేదిస్తాయి, వారిపై దెయ్యం యొక్క పట్టును వెల్లడిస్తాయి. ఒక దళం సాధారణంగా ఆరు వేల మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సైనికులను కలిగి ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, ఒక దౌర్భాగ్యపు వ్యక్తి కూడా సైన్యం చేత పట్టుకున్నప్పుడు, దేవుడు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా, లెక్కలేనన్ని పడిపోయిన ఆత్మలను ఊహించవచ్చు. అనేకమంది విరోధులు మనల్ని ఎదుర్కొంటారు మరియు మన ఆధ్యాత్మిక శత్రువులను మన స్వంతంగా అధిగమించే శక్తి మనకు లేదు. అయినప్పటికీ, ప్రభువు యొక్క బలం మరియు శక్తితో, వారు సైన్యాలు సంఖ్యలో ఉన్నప్పటికీ మనం వారికి వ్యతిరేకంగా నిలబడగలము.
అత్యంత దుర్మార్గుడైన అతిక్రమించిన వ్యక్తి యేసు యొక్క శక్తి ద్వారా సాతాను బానిసత్వం నుండి విముక్తిని అనుభవించినప్పుడు, వారు సంతోషంగా తమ విమోచకుని పాదాల వద్ద కూర్చుంటారు, అతని మాటలు వినడానికి ఆసక్తిగా ఉంటారు. యేసు సాతాను దౌర్భాగ్యపు బానిసలను విముక్తి చేసి, వారిని పరిశుద్ధులుగా మరియు సేవకులుగా తన మడతలోకి స్వాగతించాడు. ప్రజలు తమ స్వైన్ పోయినట్లు తెలుసుకున్నప్పుడు, వారు క్రీస్తు పట్ల పగ పెంచుకున్నారు. అయినప్పటికీ, వ్యక్తులు తమ ఆస్తులను కోల్పోయి తమ ప్రాణాలను విడిచిపెట్టే పరీక్షలలో కూడా, దేవుని ఓర్పు మరియు దయ ప్రకాశిస్తుంది, వారి ఆత్మలకు మోక్షాన్ని కోరుకునే అవకాశాన్ని అందిస్తుంది.
యేసు తన కోసం చేసిన గొప్ప కార్యాలను ఆ వ్యక్తి ఉత్సాహంగా పంచుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ, కొందరు మాత్రమే అతనిని అనుసరించడానికి ఎంచుకున్నారు. చాలా మంది, క్రీస్తు కార్యాలను చూసి ఆశ్చర్యపోయినప్పటికీ, వారు కోరుకున్నట్లుగా ఆయనను అనుసరించరు.

ఒక స్త్రీ స్వస్థత పొందింది. (21-34)
ధిక్కారాన్ని ఎదుర్కొనే సువార్త మరింత స్వాగతించే ఆదరణను కోరుకుంటుంది. ప్రార్థనా మందిర నాయకులలో ఒకరు చనిపోయే దశలో ఉన్న తన పన్నెండేళ్ల కుమార్తె కోసం సహాయం కోసం క్రీస్తును హృదయపూర్వకంగా వేడుకున్నాడు. దారిలో మరో అద్భుత వైద్యం జరిగింది. deu 6:7లో చెప్పబడినట్లుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మనం బయట ఉన్నప్పుడు కూడా మంచి చేయాలని గమనించాలి.
ఇతర సహాయాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రజలు క్రీస్తు వైపు తిరగడం ఒక సాధారణ నమూనా, అన్ని ఇతర నివారణలు, అవి నిరంతరం చేసే విధంగా, పనికిరావు. కొందరు పరధ్యానం మరియు ప్రాపంచిక సాంగత్యం వైపు మొగ్గు చూపుతారు, మరికొందరు తమ పనిలో మునిగిపోతారు, బహుశా మితిమీరిన ఆనందాన్ని కూడా ఆశ్రయిస్తారు. కొందరు తమ స్వంత ధర్మాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తారు లేదా తమను తాము వ్యర్థమైన మూఢనమ్మకాలకు లోనవుతారు. ఈ ప్రయత్నాలలో చాలామంది నశిస్తారు, కానీ అలాంటి మార్గాల ద్వారా వారి ఆత్మలకు నిజమైన శాంతిని ఎవరూ కనుగొనలేరు. దీనికి విరుద్ధంగా, పాపం యొక్క బాధ నుండి క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వారు మంచి కోసం లోతైన మరియు శాశ్వతమైన పరివర్తనను అనుభవిస్తారు.
రహస్య పాపాలు ప్రభువైన యేసుకు తెలిసినట్లే, విశ్వాసం యొక్క రహస్య క్రియలు కూడా. ఆ స్త్రీ తన అనుభవాన్ని పూర్తిగా ఒప్పుకుంది మరియు తన ప్రజలను ఓదార్చాలనేది క్రీస్తు కోరిక. కలత చెందిన హృదయాలకు సాంత్వన కలిగించే శక్తి ఆయనకు ఉంది. మనం ఎంత సరళతతో ఆయనపై ఆధారపడతామో మరియు ఆయన నుండి గొప్ప విషయాలను ఆశించినట్లయితే, ఆయన మన మోక్షానికి మూలంగా మారాడని మనం అంత ఎక్కువగా కనుగొంటాము. విశ్వాసం ద్వారా వారి ఆధ్యాత్మిక రుగ్మతల నుండి స్వస్థత పొందిన వారు శాంతితో ముందుకు వెళ్ళడానికి ప్రతి కారణం ఉంది.

జైరుస్ కుమార్తె పెరిగింది. (35-43)
తన కుమార్తె మరణ వార్త విన్న తర్వాత క్రీస్తును కొనసాగించమని అడగాలా వద్దా అనే నిర్ణయాన్ని ఎదుర్కొన్నప్పుడు జైరస్ సంకోచించడాన్ని మనం ఊహించవచ్చు. అయితే, అనారోగ్యం వచ్చినప్పుడు మరణం మన ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు మనకు దేవుని దయ, ఆయన ఆత్మ యొక్క ఓదార్పు, మన పరిచారకుల ప్రార్థనలు మరియు మన క్రైస్తవ స్నేహితుల మద్దతు అవసరం లేదా? ఇలాంటి సమయాల్లో, దుఃఖం మరియు భయానికి విశ్వాసం మాత్రమే విరుగుడు. పునరుత్థానంపై నమ్మకం ఉంచండి మరియు భయం తొలగిపోతుంది. క్రీస్తు తన శక్తివంతమైన మాట ద్వారా మరణించిన బిడ్డను తిరిగి బ్రతికించాడు. వారి పాపాలు మరియు అతిక్రమణల కారణంగా ఆత్మీయంగా చనిపోయిన వారికి ఇది సువార్త పిలుపుని ప్రతిబింబిస్తుంది. క్రీస్తు వాక్యం ద్వారానే ఆధ్యాత్మిక జీవితం మంజూరు చేయబడింది. ఈ అద్భుత సంఘటనను చూసినవారు మరియు విన్నవారు అద్భుతం మరియు దానిని చేసిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. మరణించిన మన పిల్లలు లేదా బంధువులు ఈరోజు పునరుజ్జీవనం పొందుతారని మనం ఆశించలేకపోయినా, మన పరీక్షల మధ్య మనం ఇంకా ఓదార్పు మరియు ఓదార్పును పొందవచ్చు.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |