Luke - లూకా సువార్త 1 | View All

1. ఘనతవహించిన థెయొఫిలా,

“తియొఫిలస్”– ఇతడి గురించి మనకు ఏమీ తెలియదు. ఈ పేరుకు అర్థం దేవుణ్ణి ప్రేమించేవాడు. “నెరవేరిన సంగతులు”– క్రీస్తు జీవితంలో జరిగిన సంగతులు పాత ఒడంబడిక గ్రంథంలో ముందుగానే దేవుని ప్రవక్తలు రాశారు. లూకా 24:44-47; మత్తయి 5:17; అపో. కార్యములు 3:18 మొదలైన చోట్ల నోట్స్ చూడండి. “కళ్లారా చూచి”– యేసు ఎన్నుకున్న ప్రథమ శిష్యులు జరిగిన సంగతులకు ప్రత్యక్ష సాక్షులు. యోహాను 15:27; హెబ్రీయులకు 2:3-4; 2 పేతురు 1:16; 1 యోహాను 1:1; అపో. కార్యములు 4:20. “వాక్కు”– దేవుని వాక్కుకు లోబడడం మూలంగా, దాన్ని ప్రకటించడం మూలంగా శిష్యులు దానికి సేవకులయ్యారు. యోహాను 1:1, యోహాను 1:14 లో క్రీస్తును కూడా “వాక్కు” అన్నాడు యోహాను.

2. ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

“అనేకులు”– మత్తయి, మార్కు, లూకా, యోహానే గాక ఇతరులు కూడా క్రీస్తు జీవితాన్ని గురించి రాశారు. అయితే దేవుడు వాటిని బైబిల్లో చేర్చలేదు.

3. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట

నిజమో కాదో సరిచూడకుండా ఏవేవో పురాణ కథలనూ, ముసలమ్మ ముచ్చట్లనూ లూకా రాయలేదు. ఈ విషయాలు జరిగిన రోజుల్లో ఇతడు జీవించాడు. ప్రతిదాన్నీ జాగ్రత్తగా విచారణ చేశాడు.

4. వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.

“సత్యం...తెలుసుకోవాలని”– లూకా దీన్ని రాయడంలో అతని ఉద్దేశం, దీన్ని లూకా చేత రాయించడంలో దేవుని ఉద్దేశం ఇదే. క్రీస్తు జీవితం, మరణం, మరణం నుంచి సజీవంగా లేవడం, ఆయన పనులు, పలుకులు – ఇవి దేవ ప్రేరితుడైన ఒక నిజాయితీగల చరిత్రకారుడు రాయగలిగినంత ఖచ్చితంగా మనకు అందించడం జరిగింది. ఈ విషయాల్లో ఎవరూ అనిశ్చయతతో, అపనమ్మకంతో ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. యోహాను 20:31; యోహాను 21:24 పోల్చి చూడండి.

5. యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.
1 దినవృత్తాంతములు 24:10

“హేరోదు”– మత్తయి 2:1. దీనికి వెయ్యి సంవత్సరాలకు ముందు ఇస్రాయేల్ రాజు దావీదు యాజులందరినీ 24 శాఖలుగా విభజించాడు (1 దినవృత్తాంతములు 24:10; నెహెమ్యా 12:12). వీటిలో ఒక శాఖకు అబీయా అధిపతిగా ఉండేవాడు. ఇస్రాయేల్‌వారి మొదటి ప్రముఖయాజి అహరోను (నిర్గమకాండము 28:1-3).

6. వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.

“నిందకు చోటివ్వకుండా”– యథార్థంగా, నమ్మకంగా ఉన్నారు – అంటే వారిలో పాపస్వభావం లేదని కాదు (మత్తయి 7:11 నోట్ చూడండి).

7. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)

8. జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా

యాజులందరూ ఎప్పుడూ ఆయన సేవలోనే నిమగ్నమై లేరు. కొంతకాలం తమ ఇళ్ళల్లో ఉండి సొంత పనులు చూచుకుంటూ ఉండేవారు.

9. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను.
నిర్గమకాండము 30:7

10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా

11. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా

“ప్రభు దేవదూత”– ఆదికాండము 16:7

12. జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.

13. అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

“భయపడకు”– న్యాయవంతులు భయపడ వలసినదేమీ ఉండదు. దుర్మార్గులు ఏది చూచినా భయపడాలి. “యోహాను” అనే పేరు “కృపగలవాడు” అనే అర్థాన్ని ఇచ్చే హీబ్రూ పదంనుండి వచ్చింది.

14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,

15. తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
సంఖ్యాకాండము 6:3, న్యాయాధిపతులు 13:4

యోహాను గొప్పతనం గురించి మత్తయి 11:7-14 చూడండి. అతడు ద్రాక్షరసం, మొదలైనవి తాగకూడదన్న మాటనుబట్టి అతడు జీవితాంతం నాజీరుగా ఉండేవాడై ఉండవచ్చని అనిపిస్తుంది. సంఖ్యాకాండము 6:1-4 చూడండి. పుట్టుకనుంచి పవిత్రాత్మతో నిండినవాడని బైబిల్లో చెప్పబడినది ఒక్క యోహాను విషయంలోనే. యోహానును దేవుడు ఒక ప్రత్యేకమైన పనికోసం నియమించాడు. అతడు పుట్టినప్పటి నుంచి దాన్ని సాధించేందుకు అతణ్ణి సిద్ధపరుస్తున్నాడు. పవిత్రాత్మతో నిండిపోవడం గురించి అపో. కార్యములు 2:4; ఎఫెసీయులకు 5:18 నోట్స్ చూడండి.

16. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.
మలాకీ 3:1, మలాకీ 4:5

“ఏలీయా”– మత్తయి 11:14; మత్తయి 17:10-13. మలాకీ 4:5-6 చూడండి.

18. జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా
ఆదికాండము 18:11

ఈ మాటల్లో అపనమ్మకం కనిపిస్తున్నది (వ 20). మహనీయులు, మనుషులందరిలో నీతినిజాయితీ గలవారు కూడా సందేహాలతో, అపనమ్మకాలతో పెనుగులాడుతూ ఉండవచ్చు అనేందుకు ఇది మరో ఉదాహరణ. ఆదికాండము 17:17-18; ఆదికాండము 18:9-12; సంఖ్యాకాండము 20:12; 1 సమూయేలు 27:1; మత్తయి 14:31; మత్తయి 17:17; యోహాను 20:25 చూడండి. దేవుడేదన్నా చెప్తే, మనుషులకేదన్నా సందేశం పంపితే అది అక్షరాలా సత్యం. దాన్ని మనుషులు సందేహించవలసిన పని లేదు.

19. దూతనేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
దానియేలు 8:16, దానియేలు 9:21

జెకర్యాకు గబ్రియేలు అనే పేరు పరిచితమే అయి ఉండాలి – దానియేలు 8:16; దానియేలు 9:21.

20. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.

ఇది అపనమ్మకానికి శిక్ష గాక గబ్రియేలు సత్యమే చెప్పాడని రుజువు చేసే సూచన, తద్వారా జెకర్యా నమ్మకానికి ఇది ఆధారం.

21. ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.

ధూపం వెయ్యడం కొద్ది సమయంలో ముగుస్తుంది. తదుపరి యాజి బయటికి వచ్చి ప్రజలను దీవిస్తాడు (సంఖ్యాకాండము 6:24-26).

22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸

23. అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.

24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు

25. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
ఆదికాండము 30:23

గొడ్రాలితనం ఆ రోజుల్లో ఇస్రాయేల్‌వారు అవమానంగా ఎంచేవారు – ఆదికాండము 30:23; యెషయా 4:1. ఎలీసబెతు గొడ్రాలు (వ 7). అయితే ఒక స్త్రీ పట్ల దేవుని సంకల్పం ఆమెకెన్నడూ అవమాన కారణం కాదు. ఉత్తమ స్త్రీలు కొందరు కొంతకాలం గొడ్రాళ్ళుగా ఉన్నారు – ఆదికాండము 16:2; ఆదికాండము 25:21; ఆదికాండము 30:23; 1 సమూయేలు 1:2, 1 సమూయేలు 1:5.

26. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో

27. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.

ఈ వచనాలు యేసుప్రభువు ఒక కన్యకు జన్మించాడన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. ఇది యెషయా 7:14 లోని భవిష్యద్వాక్కుకు నెరవేర్పు. అక్కడ, మత్తయి 1:18-23 దగ్గర నోట్స్ చూడండి. “దావీదు”– మత్తయి 1:1

28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.

అభిషిక్తుడు, లోకానికి రక్షకుడు అయిన యేసు తల్లిగా ఉండే మహా భాగ్యానికి దేవుడు మరియను ఎన్నుకున్నాడు. ఇది దేవుని అనుగ్రహానికి గొప్ప సూచన. ఆదికాండము 6:8; అపో. కార్యములు 7:46 పోల్చి చూడండి.

29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా

దీనంతటి భావమేమిటో, తననుంచి దేవుడేమి ఆశిస్తున్నాడో మరియకు అర్థం కాలేదు. దేవుని ఆశ్చర్య క్రియలను చూచి సంతోషించవలసింది పోయి దేవుని ప్రజలు కొన్నిసార్లు ఆందోళనపడుతారు.

30. దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.

31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
ఆదికాండము 16:11, న్యాయాధిపతులు 13:3, యెషయా 7:14

32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
2 సమూయేలు 7:12-13, 2 సమూయేలు 7:16, కీర్తనల గ్రంథము 132:11, యెషయా 9:7

పాత ఒడంబడికలో ఏకైక నిజ దేవునికి తరచుగా ఉపయోగించబడిన పేర్లలో “సర్వాతీతుడు” అనేది ఒకటి – ఆదికాండము 14:19; 2 సమూయేలు 22:14; కీర్తనల గ్రంథము 7:10; మొ।।. “సర్వాతీతుని కుమారుడు”– మత్తయి 1:18; మత్తయి 3:17. “దావీదు సింహాసనం”– 2 సమూయేలు 7:11-16; కీర్తనల గ్రంథము 89:3-4; మత్తయి 1:1.

33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
మీకా 4:7, 2 సమూయేలు 7:12-13, 2 సమూయేలు 7:16

కీర్తనల గ్రంథము 45:6; కీర్తనల గ్రంథము 89:3-4; యెషయా 9:6-7; యిర్మియా 33:14-18; దానియేలు 2:44; దానియేలు 7:14, దానియేలు 7:27; మీకా 4:7. “యాకోబు వంశాన్ని”– అంటే యాకోబు సంతానం ఇస్రాయేల్ జాతి (ఆది 25-50 అధ్యాయాలు).

34. అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

35. దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
కీర్తనల గ్రంథము 89:19

మత్తయి 1:18 నోట్. అనేక దేశాల పురాణ గాథల్లోలాగా ఇది దేవునికీ ఒక మానవ స్త్రీకీ వివాహం జరగడం కాదు. దేవుని అదృశ్య పవిత్రాత్మ ఆమె గర్భంలో ఆ కుమారుని శరీరాన్నీ, మానవ స్వభావాన్నీ సృష్టించాడు.

36. మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;

37. దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.
ఆదికాండము 18:14

గొడ్రాలుగా ఉన్న ముసలి స్త్రీ (వ 7) గానీ ఒక పెండ్లికాని కన్య గానీ గర్భం దాల్చి పిల్లల్ని కనేలా చేయడం దేవునికి అసాధ్యం ఏమీ కాదు. మనుషులు అద్భుతాలు అని చెప్పేది దేవునికి ఆయన చేసే పనులన్నిటి మాదిరిగానే సులభమైనవి, సహజమైనవి (ఆదికాండము 18:14; యోబు 42:2; యెషయా 40:29; యెషయా 50:2; యెషయా 51:9; యిర్మియా 32:17, యిర్మియా 32:27; మత్తయి 19:26; రోమీయులకు 4:21).

38. అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.

తన పట్ల దేవుని సంకల్పానికి మరియ పూర్తిగా తల వంచింది. అది కేవలం మంచిదే అని ఆమె దృఢంగా నమ్మింది. ఇందులో ఈమె మనకు ఆదర్శం – రోమీయులకు 12:1-2 పోల్చి చూడండి.

39. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి

40. జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

41. ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
ఆదికాండము 25:22

ఈ సంఘటనలన్నిటిలోనూ దేవుని పవిత్రాత్మ ఎంత శ్రద్ధగా పూనుకుని వీటిని జరిగిస్తున్నాడో చూడండి (వ 15,35,67). ఈ సంఘటనలు, వాటి గురించిన మాటలు అన్నీ దేవుడు భూమిపై ఏదో నిగూఢమైన, అద్భుతమైన, ధన్యకరమైన సంగతిని జరిగించబోతున్నాడని సూచిస్తున్నాయి.

42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును
ద్వితీయోపదేశకాండము 28:4, న్యాయాధిపతులు 5:24

వ 28. క్రీస్తుకు మానవ చరిత్ర అంతట్లో స్త్రీలందరిలో తల్లిగా ఉండేందుకు ఒక్క స్త్రీని మాత్రమే ఎన్నుకోవడం సాధ్యం. ఆ స్త్రీ మరియ. లూకా 11:27-28 కూడా చూడండి. ధన్యులు, దీవెనల గురించి నోట్స్ ఆదికాండము 12:3; సంఖ్యాకాండము 6:22-27; కీర్తనల గ్రంథము 1:1 మొ।। చూడండి. అబ్రాహాము ద్వారా అతని సంతానానికీ, లోకమంతటికీ కలుగజేస్తానన్న దీవెనను దేవుడిప్పుడు వెల్లడి చేయబోతున్నాడు.

43. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?

ఇంకా జన్మించని యేసును ఎలీసబెతు ఏమంటున్నదో చూడండి – “నా ప్రభువు”. లూకా 2:11; కీర్తనల గ్రంథము 110:1; మత్తయి 22:41-45; అపో. కార్యములు 2:36; ఫిలిప్పీయులకు 2:10-11 చూడండి. దేవుని కుమారుని మానవ స్వభావానికి తల్లి మరియ. అయితే శాశ్వతమైన ఉనికి గల దేవునికి, అన్నిటినీ సృష్టించిన స్వయంభవునికి తల్లి ఉండే అవకాశం లేదు. కాబట్టి మరియ “దేవుని తల్లి” అని ఏమాత్రమూ అనుకోకూడదు.

44. ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

వ 38,42.

46. అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
1 సమూయేలు 2:1, కీర్తనల గ్రంథము 113:7-8

రమ్యమైన కావ్య భాషలో మరియ పలికిన మాటలు దేవుని గురించి ఆమెకున్న జ్ఞానాన్నీ, ప్రేమనూ, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించే సామర్థ్యాన్నీ వెల్లడి చేసి అభిషిక్తునికి తల్లి అయ్యేందుకు ఆమెకున్న యోగ్యతలను తెలుపుతున్నాయి. ఆమె మాటలను 1 సమూయేలు 2:1-10 లో హన్నా మాటలతో పోల్చి చూడండి. మరి ఏ ఇతర శుభవార్తలో కంటే స్తుతి, ప్రార్థనల గురించిన మాటలు లూకా శుభవార్తలో ఎక్కువగా ఉన్నాయి. స్తుతి గురించి నోట్ కీర్తనల గ్రంథము 33:1-3.

47. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
1 సమూయేలు 2:1

దేవుణ్ణి తన ముక్తిప్రదాత అని మరియ అంటున్నది. తనకు అభిషిక్తుణ్ణి కనే అపూర్వమైన గౌరవం లభించినప్పటికీ ఇతర మనుషులందరిలాగానే తనకూ ముక్తి ప్రదాత అవసరమని ఆమె గుర్తించింది. క్రొత్త ఒడంబడికలో “ముక్తి ప్రదాత” అనే పదం మొదటి సారిగా కనిపించింది ఇక్కడే. దీనికి విమోచకుడు, కాపాడేవాడు అని కూడా అర్థం. అంటే ప్రజలను వారి పాపాలనుండి విడిపించి వారిని భద్రంగా కాపాడేవాడు.

48. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
1 సమూయేలు 1:11

వ 28,30,42.

49. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.
కీర్తనల గ్రంథము 111:9

కీర్తనల గ్రంథము 71:19 మొ।।. దేవుని పవిత్రత గురించి లేవీయకాండము 20:7; యెషయా 6:3 చూడండి.

50. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.
కీర్తనల గ్రంథము 103:17

51. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.
2 సమూయేలు 22:28, కీర్తనల గ్రంథము 89:10

కీర్తనల గ్రంథము 98:1; యెషయా 40:10 మొ।।. దేవుడు ఆత్మ స్వరూపి (యోహాను 4:24). ఆయనకు రక్తమాంసాలున్న చెయ్యి ఉండదు. ఇది దేవుని ప్రభావాన్ని వర్ణించే కావ్య భాష. దేవుడు గర్విష్ఠులను ఎలా అణగదొక్కుతాడో చూడండి. నిర్గమకాండము 18:11; 2 సమూయేలు 22:28; కీర్తనల గ్రంథము 31:23; కీర్తనల గ్రంథము 94:2; కీర్తనల గ్రంథము 138:6; సామెతలు 16:5; యెషయా 2:12-18; యిర్మియా 13:9; యిర్మియా 49:16; యాకోబు 4:6.

52. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను
1 సమూయేలు 2:7, యోబు 5:11, యోబు 12:19

53. ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.
1 సమూయేలు 2:5, కీర్తనల గ్రంథము 107:9

54. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు
కీర్తనల గ్రంథము 98:3, యెషయా 41:8-9

55. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.
ఆదికాండము 17:7, ఆదికాండము 22:17, మీకా 7:20

సంభాషణలో ప్రార్థనలో దేవుని వాక్కును ధ్యానించడంలో ఆ ఇద్దరూ ఎంత చక్కగా కలిసి సహవాసం చేశారో!

56. అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

57. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

58. అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

59. ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
ఆదికాండము 17:12, లేవీయకాండము 12:3

సున్నతి సంస్కారం గురించి నోట్ ఆదికాండము 17:9-14.

60. తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.

వ 13.

61. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి

62. వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.

63. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.

64. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.

అపనమ్మకం మూసిన నోటిని నమ్మకం, విధేయత తెరిచాయి.

65. అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.

66. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.

67. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను

వ 15,35,41. మత్తయి, మార్కు శుభవార్తలు రెంటిలోనూ కలుపుకుని పవిత్రాత్మ గురించి ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు లూకా శుభవార్త ఒక్క దాన్లోనే ఉంది. దేవుని ఆత్మ ప్రేరణవల్ల జెకర్యా భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఇంకా నెరవేరవలసి ఉన్న సత్యాన్ని ముందుగా చెప్తున్నాడు. దేవుని మూలంగా పలకడం గురించి నోట్స్ ఆదికాండము 20:7; సంఖ్యాకాండము 11:25 చూడండి.

69. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
1 సమూయేలు 2:10, కీర్తనల గ్రంథము 18:2, కీర్తనల గ్రంథము 132:17, యిర్మియా 30:9

“రక్షణ”– లూకా 19:9; అపో. కార్యములు 4:12; రోమీయులకు 1:16. “శృంగం”(అంటే కొమ్ము) గురించి నోట్ 1 సమూయేలు 2:1. దావీదు వంశం గురించి వ 32; మత్తయి 1:1 నోట్స్.

70. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా

ఉదాహరణకు యెషయా 9:6-7; యిర్మియా 23:5 చూడండి.

71. మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
కీర్తనల గ్రంథము 106:10

ఇది పాత ఒడంబడిక భాషలాగా ఉంది. “శత్రువులు” గురించి నోట్ కీర్తనల గ్రంథము 3:7. ఇతర మనుషులు ఎంత శత్రుత్వం కనపరచినా వారికంటే భయంకరమైన శత్రువులు దేవుని ప్రజలకు ఉన్నారు – ఎఫెసీయులకు 6:10-12; 1 పేతురు 5:8. అలాంటి వారందరినుంచి యేసు ప్రభువు తన ప్రజలను రక్షిస్తాడు.

73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
ఆదికాండము 17:7

74. అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును

పాపవిముక్తి కలిగించడంలో దేవుని ఉద్దేశం ఎప్పుడూ ఇదే. తమ జీవితమంతా ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆయనకు సేవ చేసే పవిత్ర ప్రజ ఆయనకు కావాలి.

75. మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని

76. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
యెషయా 40:3, మలాకీ 3:1

వ 32లో క్రీస్తును గురించి చెప్పినదానితో “ప్రవక్త” అనే మాటను పోల్చి చూడండి. యోహాను పరిచర్య ఏమిటో గమనించండి – వ 14-17; మత్తయి 3:1-6

77. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన

పాపక్షమాపణ లేకుండా పాపవిముక్తి లేదు, దాన్ని గురించిన నిజమైన జ్ఞానమూ లేదు. పాపక్షమాపణ గురించి నోట్స్ రిఫరెన్సుల కోసం మత్తయి 6:12; మత్తయి 9:5-7; మత్తయి 12:31; మత్తయి 18:23-25; మొ।। చూడండి.

78. తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
యెషయా 9:2, యెషయా 58:8, యెషయా 60:1-2, మలాకీ 4:2

పాపక్షమాపణకు మనుషులెన్నటికీ యోగ్యులు కాలేరు. తమ ప్రయత్నాలవల్ల దాన్ని సంపాదించుకోలేరు. అది దేవుని కరుణను బట్టి ఆయన కృప మూలంగానే కలుగుతుంది. ఇక్కడ యేసుప్రభువును పరలోకంనుంచి ఉదయించిన సూర్యునితో పోల్చడం చూస్తున్నాం. వేరే చోట్ల ఆయన్ను వెలుగు నక్షత్రంగా చెప్పారు – సంఖ్యాకాండము 24:17; యెషయా 9:2; యెషయా 60:1-3; మలాకీ 4:2; యోహాను 8:12; 2 పేతురు 1:19; ప్రకటన గ్రంథం 22:16. మనుషులను రక్షించడానికి యేసుప్రభువు పరలోకం నుండి వచ్చాడు (యోహాను 3:13; యోహాను 6:38; యోహాను 8:23).

79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.
యెషయా 9:2, యెషయా 58:8, యెషయా 60:1-2, మలాకీ 4:2

యెషయా 9:2; యెషయా 59:9-10; మత్తయి 4:16. మనుషులకు వెలుగు, ఆశాభావం, చీకటి మరణాలనుండి తప్పించుకునే దారి లేనప్పుడు యేసు వచ్చి వెలుగునూ శాంతినీ తెచ్చాడు. శుభవార్త సంగీతంలోని మధుర స్వరాల్లో శాంతి ఒకటి – లూకా 2:14; యోహాను 14:27; యోహాను 16:33; అపో. కార్యములు 10:36; రోమీయులకు 5:1; రోమీయులకు 14:17; రోమీయులకు 15:13, రోమీయులకు 15:33; ఎఫెసీయులకు 2:14. దేవుని ఆత్మ ప్రేరణవల్ల జెకర్యా క్రీస్తు జీవితం పరిచర్యల మూలంగా కలిగే రెండు ఫలితాలను తెలియజేస్తున్నాడు – ఆధ్యాత్మిక వెలుగు, శాంతి.

80. శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.

దాదాపు 30 సంవత్సరాలు వచ్చేవరకు యోహాను ఒంటరిగా, మామూలు మనుషులకు భిన్నంగా జీవించాడు (మత్తయి 3:4). ఇతనికన్నా గొప్పవాడు వేరెవరూ లేరు (మత్తయి 11:11). అయితే ఆత్మలో ఇతడు బలవంతుడైనట్టే విశ్వాసులందరూ ఉండవచ్చు (ఎఫెసీయులకు 3:16).Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |