Luke - లూకా సువార్త 10 | View All

1. అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.

1. Now after these things, the Lord also appointed seventy others, and sent them two by two ahead of him into every city and place, where he was about to come.

2. పంపినప్పు డాయన వారితో ఇట్లనెనుకోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.

2. Then he said to them, 'The harvest is indeed plentiful, but the laborers are few. Pray therefore to the Lord of the harvest, that he may send out laborers into his harvest.

3. మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.

3. Go your ways. Behold, I send you out as lambs among wolves.

4. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసి కొనిపోవద్దు;
2 రాజులు 4:29

4. Carry no purse, nor wallet, nor sandals. Greet no one on the way.

5. త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.

5. Into whatever house you enter, first say, 'Peace be to this house.'

6. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.

6. If a son of peace is there, your peace will rest on him; but if not, it will return to you.

7. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు.

7. Remain in that same house, eating and drinking the things they give, for the laborer is worthy of his wages. Don't go from house to house.

8. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి.

8. Into whatever city you enter, and they receive you, eat the things that are set before you.

9. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్న దని వారితో చెప్పుడి.

9. Heal the sick who are therein, and tell them, 'The Kingdom of God has come near to you.'

10. మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన యెడల

10. But into whatever city you enter, and they don't receive you, go out into the streets of it and say,

11. మీరు దాని వీధులలోనికి పోయిమా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించి యున్నదని తెలిసికొనుడని చెప్పుడి.

11. 'Even the dust from your city that clings to us, we wipe off against you. Nevertheless know this, that the Kingdom of God has come near to you.'

12. ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
ఆదికాండము 19:24-25

12. I tell you, it will be more tolerable in that day for Sodom than for that city.

13. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణ ములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు.
యోవేలు 3:4-8, ఆమోసు 1:9-10, జెకర్యా 9:2-4

13. Woe to you, Chorazin! Woe to you, Bethsaida! For if the mighty works had been done in Tyre and Sidon which were done in you, they would have repented long ago, sitting in sackcloth and ashes.

14. అయినను విమర్శకాలము నందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును.
యోవేలు 3:4-8, ఆమోసు 1:9-10, జెకర్యా 9:2-4

14. But it will be more tolerable for Tyre and Sidon in the judgment than for you.

15. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు.
యెషయా 14:13, యెషయా 14:15

15. You, Capernaum, who are exalted to heaven, will be brought down to Hades.

16. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను.

16. Whoever listens to you listens to me, and whoever rejects you rejects me. Whoever rejects me rejects him who sent me.'

17. ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా

17. The seventy returned with joy, saying, 'Lord, even the demons are subject to us in your name!'

18. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని.
యెషయా 14:12

18. He said to them, 'I saw Satan having fallen like lightning from heaven.

19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.
ఆదికాండము 3:15, కీర్తనల గ్రంథము 91:13

19. Behold, I give you authority to tread on serpents and scorpions, and over all the power of the enemy. Nothing will in any way hurt you.

20. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.
నిర్గమకాండము 32:32

20. Nevertheless, don't rejoice in this, that the spirits are subject to you, but rejoice that your names are written in heaven.'

21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి - తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించు చున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను.

21. In that same hour Jesus rejoiced in the Holy Spirit, and said, 'I thank you, O Father, Lord of heaven and earth, that you have hidden these things from the wise and understanding, and revealed them to little children. Yes, Father, for so it was well-pleasing in your sight.'

22. సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.

22. Turning to the disciples, he said, 'All things have been delivered to me by my Father. No one knows who the Son is, except the Father, and who the Father is, except the Son, and he to whomever the Son desires to reveal him.'

23. అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి - మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;

23. Turning to the disciples, he said privately, 'Blessed are the eyes which see the things that you see,

24. అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.

24. for I tell you that many prophets and kings desired to see the things which you see, and didn't see them, and to hear the things which you hear, and didn't hear them.'

25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోప దేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.

25. Behold, a certain lawyer stood up and tested him, saying, 'Teacher, what shall I do to inherit eternal life?'

26. అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా

26. He said to him, 'What is written in the law? How do you read it?'

27. అతడు - నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకము తోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నాదని చెప్పెను.
లేవీయకాండము 19:18, ద్వితీయోపదేశకాండము 6:5, ద్వితీయోపదేశకాండము 10:12, యెహోషువ 22:5

27. He answered, 'You shall love the Lord your God with all your heart, with all your soul, with all your strength, and with all your mind; and your neighbor as yourself.'

28. అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.
లేవీయకాండము 18:5

28. He said to him, 'You have answered correctly. Do this, and you will live.'

29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసునడి గెను.

29. But he, desiring to justify himself, asked Jesus, 'Who is my neighbor?'

30. అందుకు యేసు ఇట్లనెనుఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచి

30. Jesus answered, 'A certain man was going down from Jerusalem to Jericho, and he fell among robbers, who both stripped him and beat him, and departed, leaving him half dead.

31. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను.

31. By chance a certain priest was going down that way. When he saw him, he passed by on the other side.

32. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను.

32. In the same way a Levite also, when he came to the place, and saw him, passed by on the other side.

33. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి

33. But a certain Samaritan, as he traveled, came where he was. When he saw him, he was moved with compassion,

34. అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను.

34. came to him, and bound up his wounds, pouring on oil and wine. He set him on his own animal, and brought him to an inn, and took care of him.

35. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను.

35. On the next day, when he departed, he took out two denarii, and gave them to the host, and said to him, 'Take care of him. Whatever you spend beyond that, I will repay you when I return.'

36. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు - అతనిమీద జాలి పడినవాడే అనెను.

36. Now which of these three do you think seemed to be a neighbor to him who fell among the robbers?'

37. అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.

37. He said, 'He who showed mercy on him.' Then Jesus said to him, 'Go and do likewise.'

38. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను.

38. It happened as they went on their way, he entered into a certain village, and a certain woman named Martha received him into her house.

39. ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను.

39. She had a sister called Mary, who also sat at Jesus' feet, and heard his word.

40. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చిప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.

40. But Martha was distracted with much serving, and she came up to him, and said, 'Lord, don't you care that my sister left me to serve alone? Ask her therefore to help me.'

41. అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచార ముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే

41. Jesus answered her, 'Martha, Martha, you are anxious and troubled about many things,

42. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.

42. but one thing is needed. Mary has chosen the good part, which will not be taken away from her.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

డెబ్బై మంది శిష్యులను పంపారు. (1-16) 
యేసు డెబ్బై మంది శిష్యులను జంటగా పంపాడు, ఒకరినొకరు ప్రోత్సహించడానికి మరియు ప్రోత్సహించడానికి. సువార్త పరిచర్య వ్యక్తులు క్రీస్తును తమ యువరాజుగా మరియు రక్షకునిగా స్వీకరించమని కోరింది. ప్రతిగా, క్రీస్తు, తన ఆత్మ యొక్క సాధికారత ద్వారా, తన అంకితమైన సేవకులను పంపే ప్రతి ప్రదేశానికి నిశ్చయంగా చేరుకుంటాడు. అయితే, దేవుని దయను వృధా చేసేవారికి భయంకరమైన విధి వేచి ఉంది. క్రీస్తు నమ్మకమైన సేవకులను అవహేళనగా విస్మరించి, వారిని చిన్నచూపు మరియు ధిక్కారాన్ని ప్రదర్శించే వారు దేవుని మరియు క్రీస్తును దూషించేవారిగా పరిగణించబడతారు.

క్రీస్తు శిష్యుల ఆశీర్వాదం. (17-24) 
సాతానుపై మన విజయాలన్నీ యేసుక్రీస్తు నుండి మనం పొందిన శక్తి నుండి ఉద్భవించాయి మరియు అతను అన్ని క్రెడిట్లకు అర్హుడు. అయితే, అనేకుల పతనానికి దారితీసిన ఆధ్యాత్మిక గర్వం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రభువు చాలా మంది ఆత్మలను రక్షించే అవకాశంలో ఆనందాన్ని పొందాడు, అతను దుఃఖంలో ఉన్న వ్యక్తి కాబట్టి అరుదైన సంఘటన. ఆ క్షణంలో అతను సాతాను ఓటమిని చూసినప్పుడు మరియు అతని మంత్రుల విజయాన్ని విన్నప్పుడు, అతను సంతోషించాడు. అతను ఎల్లప్పుడూ గర్వించదగినవారిని ఎదిరించాడు మరియు వినయస్థులపై దయను ప్రసాదించాడు. మార్గదర్శకత్వం, సహాయం మరియు ఆశీర్వాదం కోసం మనం దేవుని కుమారునిపై ఎంత ఎక్కువగా ఆధారపడతామో, తండ్రి మరియు కొడుకు ఇద్దరినీ మనం బాగా తెలుసుకుంటాం. ఇది దైవిక రక్షకుని యొక్క మహిమను వీక్షించడంలో మరియు అతని మాటలను వినడంలో ఆశీర్వాదాలను పెంపొందించడానికి దారి తీస్తుంది, అలాగే అతని కారణాన్ని మరింతగా కొనసాగించడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

మంచి సమరిటన్. (25-37) 
నిత్యజీవితం మరియు దాని మార్గం గురించి సాధారణం లేదా ఆలోచన లేకుండా చర్చిస్తున్నప్పుడు, మనం దేవుని పేరును దుర్వినియోగం చేస్తాము. దేవుడు మరియు మన పొరుగువారి పట్ల నిజమైన, ఆధ్యాత్మిక ప్రేమ కృపను మార్చే అనుభవం లేకుండా ఉండదు. అయినప్పటికీ, మానవత్వం యొక్క గర్వించదగిన స్వభావం ఈ నమ్మకాలను తీవ్రంగా ప్రతిఘటించింది.
దయగల సమారిటన్ నుండి సహాయం పొందిన నిరుపేద యూదుడి కథతో యేసు దీనిని వివరించాడు. ఈ అభాగ్యుడు దొంగల బారిన పడి తీవ్ర గాయాలతో మృత్యువు అంచున వదిలేశాడు. అతను తన మిత్రులుగా ఉండవలసిన వారిచే విస్మరించబడ్డాడు, కానీ ఒక సమరయుడు, యూదులు ధిక్కారంగా మరియు అసహ్యించుకునే దేశానికి చెందిన సభ్యుడు, వారితో ఎటువంటి లావాదేవీలు లేవు.
అన్ని వర్గాల ప్రజలను స్వీయ-ఆసక్తి ఎలా నియంత్రిస్తుందో గమనించడం నిరుత్సాహపరుస్తుంది, ఇతరులకు సహాయం చేయడంలో ఇబ్బంది లేదా ఖర్చును నివారించడానికి అనేక సాకులు చూపుతుంది. ఏది ఏమైనప్పటికీ, నిజమైన క్రైస్తవుడు వారి హృదయంలో ప్రేమ యొక్క నియమాన్ని కలిగి ఉంటాడు, క్రీస్తు యొక్క ఆత్మ వారిలో నివసిస్తుంది మరియు వారి ఆత్మలో క్రీస్తు యొక్క ప్రతిరూపం పునరుద్ధరించబడుతుంది. ఈ ఉపమానం దేశం, పార్టీ లేదా మరేదైనా విభజన యొక్క భేదాలను అధిగమించి, మన పొరుగువారిని మనలాగే ప్రేమించాలనే సూత్రాన్ని అనర్గళంగా తెలియజేస్తుంది. ఇది పాపభరితమైన మరియు దౌర్భాగ్యమైన మానవాళి పట్ల మన రక్షకుడైన దేవుని దయ మరియు ప్రేమను కూడా హైలైట్ చేస్తుంది.
మన విరోధి అయిన సాతాను చేత ధ్వంసమై, గాయపడిన ఈ అభాగ్య యాత్రికుడితో సమానం. పాపం మనపై చాలా హాని కలిగించింది, కానీ దయగల యేసు మనపై దయ చూపాడు. వారు శత్రువుగా మరియు తిరుగుబాటుదారుగా ఉన్నప్పటికీ, యేసు వారి కోసం తనను తాను ప్రేమించి త్యాగం చేశాడని విశ్వాసి గుర్తించాడు. ఈ దయ పొందిన తరువాత, అదే ఉదాహరణను అనుసరించడం ద్వారా వారు దానిని ఇతరులకు విస్తరించమని ప్రోత్సహించబడ్డారు.
కష్టాల్లో మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం, సహాయం మరియు ఉపశమనాన్ని అందించడం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత, మన సామర్థ్యాలలో మరియు మా శక్తికి అనుగుణంగా.

మార్తా మరియు మేరీ ఇంట్లో యేసు. (38-42)
ఇంటి సెట్టింగ్‌లో డెలివరీ చేయబడినప్పుడు అర్థవంతమైన ఉపన్యాసం దాని విలువను ఏదీ కోల్పోదు మరియు స్నేహితులతో మన పరస్పర చర్యలు వారిని వారి ఆత్మల మెరుగుదలకు నడిపించేలా నిర్దేశించబడాలి. క్రీస్తు పాదాల వద్ద కూర్చోవడం ఆయన బోధనలను స్వీకరించడానికి సంసిద్ధతను మరియు వాటి ద్వారా మార్గనిర్దేశం చేయడానికి ఇష్టపడడాన్ని సూచిస్తుంది.
ఖాతాలో, మార్తా క్రీస్తు మరియు అతనితో పాటు వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆమె చర్యలు ప్రభువు పట్ల గౌరవం మరియు ఆమె ఇంటి వ్యవహారాల బాధ్యతాయుత నిర్వహణ రెండింటినీ ప్రదర్శించాయి. అయితే విమర్శలకు ఆస్కారం ఏర్పడింది. సమృద్ధి, వైవిధ్యం మరియు ఖచ్చితత్వంపై దృష్టి సారించి, ఆమె తన సేవా విధుల్లో అతిగా నిమగ్నమైపోయింది. దేవుని సేవించకుండా మరియు మన ఆత్మలను సుసంపన్నం చేసుకోకుండా మనల్ని అడ్డుకున్నప్పుడు ప్రాపంచిక వ్యవహారాలు ఒక ఉచ్చుగా మారతాయి. సువార్తలో తోటి విశ్వాసులను అలరించడానికి తరచుగా వృధా చేయబడే అనవసరమైన సమయం మరియు వనరులను పరిగణనలోకి తీసుకోవడం నిరుత్సాహపరుస్తుంది.
ఈ సందర్భంగా ఆమె తప్పిపోయినప్పటికీ, మార్తా తన మొత్తం ప్రవర్తనలో, అత్యంత కీలకమైన విషయాన్ని విస్మరించని నిజమైన విశ్వాసిగా మిగిలిపోయింది. మన సంతోషానికి దేవుని అనుగ్రహం చాలా అవసరం, మరియు క్రీస్తు అందించే రక్షణ మన భద్రతకు ఎంతో అవసరం. ఈ ప్రాధాన్యతలను సమర్థించినప్పుడు, అన్ని ఇతర అన్వేషణలు వాటి సరైన స్థలంలోకి వస్తాయి.
మేరీ మంచి భాగాన్ని ఎంచుకున్నారని యేసు ధృవీకరించాడు, ఆమె చేసిన ఒక అనివార్యమైన విషయం-క్రీస్తు మార్గదర్శకత్వానికి తనను తాను అప్పగించుకోవడం. ఈ ప్రపంచంలోని ఆస్తులు చివరికి మన నుండి తీసుకోబడవచ్చు, కానీ మనం వాటిని విడిచిపెట్టినప్పుడు అవి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. మరోవైపు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదీ మరియు ఎవరూ వేరు చేయలేరు. మనుష్యులు లేదా దయ్యాలు దానిని మన నుండి లాక్కోలేరు మరియు దేవుడు మరియు క్రీస్తు ఎప్పటికీ అలా చేయరు. కాబట్టి మనం ఒక ముఖ్యమైన విషయంపై శ్రద్ధగా దృష్టి కేంద్రీకరిద్దాం.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |