వ 52. మామూలుగా మనుషులంతా ఎదిగినట్టుగానే యేసుప్రభువు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు, అయితే ఆయన ఏ విధంగానూ పాపం చెయ్యలేదు (హెబ్రీయులకు 4:15; 1 పేతురు 2:22). ఆయన జ్ఞానం అసామాన్యం. వ 46,47 లో ఈ సత్యం స్పష్టం అయింది. ఆయనపై ఉన్న దేవుని కృప ఆయన్ను ధనవంతునిగా చెయ్యలేదు. మంచితనంలోను, పవిత్రతలోను ఆయన్ను గొప్పవానిగా చేసి హానినుంచీ దుర్మార్గతనుంచీ ఆయన్ను దూరంగా ఉంచింది. ధనం కన్నా ఇది మరెంతో ప్రాముఖ్యమైన, ధన్యకరమైన విషయం.