Luke - లూకా సువార్త 3 | View All

1. తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబి లేనే దేశమునకు లుసానియ అధిపతిగాను,

1. thiberikaisaru ēlubaḍilō padunaidava samvatsaramandu yoodayaku ponthipilaathu adhipathigaanu, galilayaku hērōdu chathurthaadhipathigaanu, ithooraya trakōneethi dheshamulaku athani thammuḍaina philippu chathurthaadhipathigaanu, abi lēnē dheshamunaku lusaaniya adhipathigaanu,

2. అన్నయు, కయపయు ప్రధాన యాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.

2. annayu, kayapayu pradhaana yaajakulugaanu, unnakaalamuna araṇyamulōnunna jekaryaa kumaaruḍaina yōhaanu noddhaku dhevuni vaakyamu vacchenu.

3. అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవ లెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను.

3. anthaṭa athaḍu vachi, paapakshamaapaṇa nimitthamu maaru manassu vishayamaina baapthismamu pondava lenani yordaanu nadee pradheshamandanthaṭa prakaṭin̄chu chuṇḍenu.

4. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళముచేయుడి
యెషయా 40:3-5

4. prabhuvu maargamu siddhaparachuḍi aayana trōvalu saraaḷamucheyuḍi

5. ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును

5. prathi pallamu pooḍchabaḍunu prathi koṇḍayu meṭṭayu pallamu cheyabaḍunu vaṅkara maargamulu thinnanivagunu karaku maargamulu nunnanivagunu

6. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను.

6. sakala shareerulu dhevuni rakshaṇa choothuru ani araṇyamulō kēkaluvēyuchunna yokani shabdamu ani pravakthayaina yeshayaa vaakyamula granthamandu vraayabaḍinaṭṭu idi jarigenu.

7. అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?

7. athaḍu thanachetha baapthismamu pondavachina janasamoohamulanu chuchi sarpasanthaanamaa, raabōvu ugrathanu thappin̄chukonuṭaku meeku buddhi cheppina vaaḍevaḍu?

8. మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.

8. maarumanassunaku thagina phalamulu phalin̄chuḍi abraahaamu maaku thaṇḍri ani meelō meeranukona modalupeṭṭukonavaddu; dhevuḍu ee raaḷlavalana abraahaamunaku pillalanu puṭṭimpagalaḍani meethoo cheppuchunnaanu.

9. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.

9. ippuḍē goḍḍali cheṭla vēruna un̄chabaḍi yunnadhi ganuka man̄chi phalamu phalin̄chani prathi cheṭṭunu narakabaḍi agnilō vēyabaḍunani cheppenu.

10. అందుకు జనులు ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా

10. anduku janulu aalaagaithē mēmēmi cheyavalenani athani naḍugagaa

11. అతడురెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్య వలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలె ననియు వారితో చెప్పెను.

11. athaḍureṇḍu aṅgeelugalavaaḍu ēmiyu lēnivaanikiyya valenaniyu, aahaaramugalavaaḍunu aalaagē cheyavale naniyu vaarithoo cheppenu.

12. సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా

12. suṅkarulunu baapthismamu pondavachi bōdhakuḍaa, mēmēmi cheyavalenani athani naḍugagaa

13. అతడు మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను.

13. athaḍu meeku nirṇayimpabaḍinadaani kaṇṭe ekkuva theesikonavaddani vaarithoo cheppenu.

14. సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడుఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.

14. sainikulunu mēmēmi cheyavalenani athani naḍigiri. Anduku athaḍu'evanini baadhapeṭṭakayu, evani meedanu apaninda vēyakayu, mee jeethamulathoo trupthipondiyuṇḍuḍani vaarithoo cheppenu.

15. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా

15. prajalu kanipeṭṭuchu, ithaḍu kreesthayi yuṇḍunēmō ani andarunu yōhaanunu goorchi thama hrudayamulalō aalōchin̄chukonuchuṇḍagaa

16. యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మ లోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును;

16. yōhaanu nēnu neeḷlalō meeku baapthismamichuchunnaanu; ayithē naakaṇṭe shakthi manthuḍokaḍu vachuchunnaaḍu; aayana cheppula vaarunu vippuṭaku nēnu paatruḍanu kaanu; aayana parishuddhaatma lōnu agnithoonu meeku baapthismamichunu;

17. ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.

17. aayana cheṭa aayana chethilōnunnadhi; aayana thana kaḷlamunu baagugaa shubhramuchesi, thana koṭṭulō gōdhumalupōsi, aarani agnithoo poṭṭu kaalchi vēyunani andarithoo cheppenu.

18. ఇదియుగాక అతడింకను, చాల సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించు చుండెను.

18. idiyugaaka athaḍiṅkanu, chaala saṅgathulu cheppi prajalanu heccharin̄chuchu vaariki suvaartha prakaṭin̄chu chuṇḍenu.

19. అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు

19. ayithē chathurthaadhipathiyaina hērōduchesina sakala dushkaaryamula nimitthamunu, athani sōdaruni bhaaryayaina hērōdiya nimitthamunu, yōhaanu athanini gaddin̄chinanduku

20. అదివరకు తాను చేసినవన్నియు చాల వన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.

20. adhivaraku thaanu chesinavanniyu chaala vannaṭṭu athaḍu yōhaanunu cherasaalalō vēyin̄chenu.

21. ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి

21. prajalandarunu baapthismamu pondinappuḍu yēsukooḍa baapthismamu pondi praarthana cheyuchuṇḍagaa aakaashamu teravabaḍi

22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
ఆదికాండము 22:2, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

22. parishuddhaatma shareeraakaaramuthoo paavuramuvale aayanameediki digi vacchenu. Appuḍu neevu naa priya kumaaruḍavu, neeyandu nēnaanandin̄chuchunnaanani yoka shabdamu aakaashamunuṇḍi vacchenu.

23. యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,

23. yēsu (bōdhimpa) modalupeṭṭinappuḍu aayana daadaapu muppadhi ēṇḍla yeeḍugalavaaḍu; aayana yōsēpu kumaaruḍani yen̄chabaḍenu. Yōsēpu hēleeki,

24. హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,

24. hēlee matthathuku, matthathu lēviki, lēvi melkeeki,

25. మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,

25. melkee yannaku, yanna yōsēpuku, yōsēpu matthatheeyaku, matthatheeya aamōsuku, aamōsu naahōmuku, naahōmu esliki, esli naggayiki,

26. naggayi mayathuku, mayathu matthatheeyaku, matthatheeya simiyaku, simiya yōshēkhuku, yōshēkhu yōdaaku,

27. యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీ యేలుకు, షయల్తీయేలు నేరికి,
ఎజ్రా 3:2

27. yōdaa yōhannaku, yōhanna rēsaaku, rēsaa jerubbaabeluku, jerubbaabelu shayalthee yēluku, shayaltheeyēlu nēriki,

28. nēri melkeeki, melkee addiki, addi kōsaamuku, kōsaamu elmadaamuku, elmadaamu ēruku,

29. ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,

29. ēru yehōshuvaku, yehōshuva eleeyejeruku, eleeyejeru yōreemuku, yōreemu matthathuku, matthathu lēviki,

30. లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యా కీముకు,

30. lēvi shimyōnuku, shimyōnu yoodhaaku, yoodhaa yōsēpuku, yōsēpu yōnaamuku, yōnaamu elyaa keemuku,

31. elyaakeemu meleyaaku, meleyaa mennaaku, mennaa matthathaaku, matthathaa naathaanuku, naathaanu daaveeduku,

32. daaveedu yeshshayiki, yeshshayi ōbēduku, ōbēdu bōyajuku, bōyaju shalmaanuku, shalmaanu nayassōnuku,

33. nayassōnu ameemanaadaabuku, ameemanaadaabu araamuku, araamu esrōmuku, esrōmu peresuku, peresu yoodhaaku,

35. naahōru serooguku, seroogu rayooku, rayoo peleguku, pelegu heberuku, heberu shēlahuku,

37. lemeku methooshelaku, methooshela hanōkuku, hanōku yereduku, yeredu mahala lēluku, mahalalēlu kēyinaanuku,

38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.

38. kēyinaanu enōshuku, enōshu shēthuku, shēthu aadaamuku, aadaamu dhevuniki kumaaruḍu.Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |