Luke - లూకా సువార్త 7 | View All

1. ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను.

2. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను.

3. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను.

మత్తయి రాసినదాన్ని బట్టి కొంత సేపటి తరువాత శతాధిపతి తానే స్వయంగా వచ్చాడని తెలుస్తుంది.

4. వారు యేసునొద్దకు వచ్చినీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;

ఆ శతాధిపతి తన గురించి తాను ఏమనుకున్నాడో (వ 6,7) దీనితో పోల్చి చూడండి. ఒక రోమ్‌వాడి గురించి, లేక యూదేతరుడెవరి గురించైనా యూదులు ఇలా మాట్లాడ్డం చాలా అరుదు.

5. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి.

“సమాజ కేంద్రం”– మత్తయి 4:23.

6. కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచిమీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను.

7. అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును,

8. నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను.

9. యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను.

10. పంపబడిన వారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి.

11. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లు చుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్లుచుండిరి.

నజరేతుకు దాదాపు 10 కిలోమీటర్లు దూరాన ఉన్న ఊరు నాయీను.

12. ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.
1 రాజులు 17:17

13. ప్రభువు ఆమెను చూచి ఆమెయందుకనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

14. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా

15. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.
1 రాజులు 17:23, 2 రాజులు 4:36

యేసు చనిపోయినవారిని బ్రతికించిన సందర్భాలు మూడు చోట్ల రాసివున్నాయి. ఇక్కడ గాక ఇంకా లూకా 8:53-55; యోహాను 11:43-44 లోనూ ఉన్నాయి. యేసు చేసిన అద్భుతాల గురించి మత్తయి 8:3 చూడండి.

16. అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.

లూకా 1:64-65; లూకా 2:13, లూకా 2:20, లూకా 2:28; లూకా 5:25; లూకా 13:13; లూకా 17:5; లూకా 18:43; లూకా 23:47; లూకా 24:53. కీర్తించడం లూకా శుభవార్తలో కనిపించే ఒక లక్షణాన్ని తెలిపే మాట. కీర్తించడం గురించిన నోట్ కీర్తనల గ్రంథము 33:1-3. వారు యేసును ప్రవక్త అన్నారు (మత్తయి 16:13-14; మత్తయి 21:11). ఆయన ప్రవక్తకన్నా ఇంకా ఎంత ఉన్నతుడో వారికి తెలియదు (మత్తయి 16:15-17).

17. ఆయననుగూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను.

18. యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి.

మత్తయి 11:2-19. ఆ సమయంలో అతని ఉపదేశాలను బట్టి యోహానును ఖైదులో పెట్టారు.

19. అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను.
మలాకీ 3:1

20. ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగు టకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి.

21. ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను.

22. అప్పుడాయన మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు,చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది;
యెషయా 35:5-6, యెషయా 61:1

23. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడనివారికి ఉత్తరమిచ్చెను.

24. యోహాను దూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెనుమీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా?

25. మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు.

26. అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

27. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధ పరచును అని యెవరినిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను.
నిర్గమకాండము 23:20, మలాకీ 3:1

28. స్త్రీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను.

29. ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని

ఈ వచనాలు మత్తయి శుభవార్తలో కనిపించవు. సామాన్య ప్రజలనేకమంది పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకునేందుకు యోహాను దగ్గరికి వెళ్ళారు. మత్తయి 3:5-6 చూడండి. అయితే మతాధికారులు మాత్రం యోహాను సందేశాన్ని త్రోసిపుచ్చారు – మత్తయి 3:7-8. ఇలా చెయ్యడంలో తమ గురించి దేవునికి ఉన్న ఉద్దేశాలను కూడా వారు త్రోసిపుచ్చారు.

30. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.

31. కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చు దును, వారు దేనిని పోలియున్నారు?

32. సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.

33. బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగ కయు వచ్చెను గనుకవీడు దయ్యముపట్టినవాడని మీ రనుచున్నారు.

34. మనుష్య కుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరుఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అను చున్నారు.

35. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పుపొందుననెను.

36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడ భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా

లూకా ఒక్కడే ఈ సంఘటనను గురించి రాశాడు. మత్తయి, మార్కు, యోహానులు యేసుకు ఇలా అభిషేకం చేసిన వేరొక సందర్భాన్ని రాశారు. “పరిసయ్యులు” – మత్తయి 3:7.

37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి

అంటే ఈ స్త్రీ బహుశా వేశ్య, లేక వ్యభిచారి అయి ఉండవచ్చు. అయితే ఈమె యేసుప్రభు బోధలు విని పశ్చాత్తాపపడి ఆయనలో నమ్మకం ఉంచిందన్న విషయం స్పష్టమే (వ 50).

38. వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.

ఈ విధంగా ఆమె తన పశ్చాత్తాపం, నమ్మకం, మహిమగల ప్రభువు పట్ల తన నిర్మలమైన ప్రేమ కనపరచింది (వ 47).

39. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచిఈయన ప్రవక్తయైన యెడల2 తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్ము రాలు అని తనలో తాననుకొనెను.

ఈ పరిసయ్యుడు బహుశా యేసు ప్రవక్తకంటే గొప్పవాడై ఉండవచ్చని ఒక్కసారి కూడా అనుకోలేదు. ఇతడు ఆ స్త్రీ గురించి ఆలోచించిన విధం మామూలుగా పరిసయ్యులు ఇతరులను చిన్నచూపు చూచే విధమే.

40. అందుకు యేసుసీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను.

41. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును3 అచ్చియుండిరి.

42. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.

43. అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయననీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి

44. ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.
ఆదికాండము 18:4

సాధారణంగా అతిథులకు చేయవలసిన మర్యాదను ఈ పరిసయ్యుడు చేయలేదు. యేసు తనకు మర్యాదలు జరగనందుకు ఇలా అనడం లేదు గానీ ఈ పరిసయ్యుడికి అతిథి మర్యాదలను మించిన ముఖ్యమైన పాఠం ఒకటి నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు. యేసుప్రభువు తనపట్ల మన అభిప్రాయాన్ని, ప్రవర్తనను చక్కగా కనిపెట్టి చూస్తుంటాడని మనం అర్థం చేసుకోవాలి.

45. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు.

46. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
కీర్తనల గ్రంథము 23:5

47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి

దేవుని పట్ల ఆమెకున్న ప్రేమను బట్టి ఆమె క్షమాపణ పొందలేదు. తనకు క్షమాపణ దొరికింది కాబట్టి ఆమె దేవుణ్ణి ప్రేమించింది. వ 41-43ల అర్థం ఇదే. క్రీస్తు విషయంలో తన ప్రవర్తన ద్వారా తాను క్షమించబడిన సంగతినీ, తాను దేవుణ్ణి ప్రేమిస్తున్న సంగతిని కూడా ఆమె వెల్లడి చేసింది. మత్తయి 25:32-46 పోల్చి చూడండి. క్షమాపణ గురించి నోట్స్ మత్తయి 6:12; మత్తయి 9:5-7; మత్తయి 12:31; మత్తయి 18:23-25; మొ।।.

48. నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.

మత్తయి 9:2-6 పోల్చి చూడండి.

49. అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారుపాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అను కొనసాగిరి.

50. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.

ఆమెకు పాపవిముక్తి కలిగించి శాంతిని ప్రసాదించినది దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ కాదు, క్రీస్తు పాదాల దగ్గర ఏడవడమూ కాదు. ఆమెకు పాపవిముక్తి కలిగించినది ఆమె నమ్మకమే. పాపవిముక్తి అంటే క్షమాపణ పొందడం, పాపభరితమైన జీవితంనుంచి విడుదల, దేవునితో సంబంధం సరి కావడం. రోమీయులకు 3:22-24; రోమీయులకు 5:1; గలతియులకు 2:16; గలతియులకు 3:26; ఎఫెసీయులకు 2:8-9 చూడండి.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |