ప్రభువు ఆశ్చర్య క్రియలు చేయగలడని ఆమెకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆయన లాజరును సజీవంగా లేపుతాడని ఆమె అనుకున్నదా అన్నది సందేహమే. వ 39 చూడండి. చనిపోయిన వారందరూ తిరిగి లేచే రోజున లాజరు లేస్తాడని ఆమె నమ్మింది (వ 24). అయితే అది వేరే విషయం. యేసు ఒకవేళ లాజరును బ్రతికిస్తాడేమోనన్న ఆలోచన ఆమెలో మొలకెత్తడానికి ప్రయత్నిస్తూ ఉండగా, దాన్ని నమ్మడానికి ఆమె కొట్టుమిట్టాడుతున్నదేమో. 23,25,26 వచనాల్లో ఆమెతో యేసు చెప్పిన మాటలు దాన్ని నమ్మేందుకు ఆమెను ప్రోత్సహించడం కోసమేమో.