John - యోహాను సువార్త 7 | View All

1. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.

1. After that Iesus wet about in Galile and wolde not go about in Iewry for the Iewes sought to kill him.

2. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక
లేవీయకాండము 23:34

2. The Iewes tabernacle feast was at honde.

3. ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.

3. His brethren therfore sayde vnto him: get ye hence and go into Iewry yt thy disciples maye se thy workes yt thou doest.

4. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి.

4. For ther is no man yt doeth eny thing secretly and he him selfe seketh to be knowen. Yf thou do soche thinges shewe thy selfe to the worlde.

5. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.

5. For as yet his brethre beleved not in him.

6. యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.

6. Then Iesus sayd vnto them: My tyme is not yet come youre tyme is all waye redy.

7. లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.

7. The worlde canot hate you. Me it hateth: because I testify of it that the workes of it are evyll.

8. మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.

8. Go ye vp vnto this feast. I will not go vp yet vnto this feast for my tyme is not yet full come.

9. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.

9. These wordes he sayde vnto them and abode still in Galile.

10. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.

10. But assone as his brethren were goone vp then went he also vp vnto the feast: not openly but as it were prevely.

11. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.

11. Then sought him the Iewes at ye feast and sayde: Where is he?

12. మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరుకాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;

12. And moche murmurynge was ther of him amonge the people. Some sayde: He is good. Wother sayde naye but he deceaveth the people.

13. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.

13. How be it no ma spake openly of him for feare of the Iewes

14. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.

14. In ye middes of the feast Iesus went vp into the temple and taught.

15. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.

15. And the Iewes marveylled sayinge: How knoweth he ye scriptures seynge yt he never learned?

16. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.

16. Iesus answered them and sayde: My doctrine is not myne: but his that sent me.

17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.

17. If eny man will do his will he shall knowe of the doctrine whether it be of God or whether I speake of my selfe.

18. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.

18. He that speaketh of him selfe seketh his awne prayse. But he that seketh his prayse that sent him the same is true and no vnrightewesnes is in him.

19. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.

19. Dyd not Moses geve you a lawe and yet none of you kepeth ye lawe? Why goo ye aboute to kyll me?

20. అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా

20. The people answered and sayde: thou hast the devyll: who goeth aboute to kyll the?

21. యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.

21. Iesus answered and sayde to them: I have done one worke and ye all marvayle.

22. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు.
ఆదికాండము 17:10-13, లేవీయకాండము 12:3

22. Moses therfore gave vnto you circumcision: not because it is of Moses but of the fathers. And yet ye on the Saboth daye circumcise a man.

23. మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?

23. If a man on the Saboth daye receave circumcision without breakinge of the lawe of Moses: disdayne ye at me because I have made a man every whit whoale on the saboth daye?

24. వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
లేవీయకాండము 19:15, యెషయా 11:3, యెషయా 11:4

24. Iudge not after the vtter aperaunce: but iudge rightewes iudgement.

25. యెరూషలేమువారిలో కొందరు వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?

25. Then sayd some of them of Ierusalem: Is not this he who they goo aboute to kyll?

26. ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?

26. Beholde he speaketh boldly and they saye nothinge to him. Do the rulars knowe in dede that this is very Christ?

27. అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.

27. How be it we knowe this man whence he is: but when Christ cometh no man shall knowe whence he is.

28. కాగా యేసు దేవాలయములో బోధించుచుమీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.

28. Then cryed Iesus in ye temple as he taught sayinge: ye knowe me and whence I am ye knowe. And yet I am not come of my selfe but he yt sent me is true whom ye knowe not.

29. నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.

29. I knowe him: for I am of him and he hath sent me.

30. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.

30. Then they sought to take him: but no ma layde hondes on him because his tyme was not yet come.

31. మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.

31. Many of the people beleved on him and sayde: when Christ cometh will he do moo miracles then this man hath done?

32. జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.

32. The pharises hearde that the people murmured suche thinges about him. Wherfore ye pharises and hye prestes sent ministres forthe to take him.

33. యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;

33. Then sayde Iesus vnto the: Yet am I a lytell whyle with you and then goo I vnto him that sent me.

34. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.

34. Ye shall seke me and shall not fynde me: and where I am thyther can ye not come.

35. అందుకు యూదులుమనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా?

35. Then sayde the Iewes bitwene the selves: whyther will he goo that we shall not fynde him? Will he goo amonge the gentyls which are scattered all a broade and teache the gentyls?

36. నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.

36. What maner of sayinge is this that he sayde: ye shall seke me and shall not fynde me: and where I am thyther can ye not come?

37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
లేవీయకాండము 23:36, యెషయా 55:1

37. In the last daye that great daye of the feaste Iesus stode and cryed sayinge: If eny man thyrst let him come vnto me and drinke.

38. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
సామెతలు 18:4, యెషయా 58:11, జెకర్యా 14:8

38. He that beleveth on me as sayeth the scripture out of his belly shall flowe ryvers of water of lyfe.

39. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
యెషయా 44:3

39. This spak he of the sprete which they that beleved on him shuld receave. For the holy goost was not yet there because that Iesus was not yet glorifyed.

40. జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;
ద్వితీయోపదేశకాండము 18:15

40. Many of the people when they hearde this sayinge sayd: of a truth this is a prophet

41. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?

41. Other sayde: this is Christ. Some sayde: shall Christ come out of Galile?

42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.
2 సమూయేలు 7:12-13, కీర్తనల గ్రంథము 89:3-4, యెషయా 11:1, యిర్మియా 23:5-6, యిర్మియా 33:15, మీకా 5:2

42. Sayeth not the scripture that Christ shall come of the seed of David: and out of the toune of Bethleem where David was?

43. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.

43. So was ther dissencion amonge the people aboute him.

44. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.

44. And some of them wolde have taken him: but no man layed hondes on him.

45. ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా

45. Then came ye ministres to ye hye prestes and pharises. And they sayde vnto the: why have ye not brought him?

46. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి.
కీర్తనల గ్రంథము 45:2

46. The servautes answered never man spake as this man doeth.

47. అందుకు పరిసయ్యులు మీరుకూడ మోస పోతిరా?

47. Then answered the the pharises: are ye also disceaved?

48. అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?

48. Doth eny of the rulers or of the pharises beleve on him?

49. అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.

49. But the comen people whiche knowe not ye lawe are cursed.

50. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.

50. Nicodemus sayde vnto them: He that came to Iesus by nyght and was one of them.

51. అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
ద్వితీయోపదేశకాండము 1:16

51. Doth oure lawe iudge eny man before it heare him and knowe what he hath done?

52. వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.

52. They answered and sayde vnto him: arte thou also of Galile? Searche and loke for out of Galile aryseth no Prophet.

53. అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.

53. And every man went vnto his awne housse.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు గుడారాల పండుగకు వెళ్తాడు. (1-13) 
యేసు నుండి ప్రాపంచిక లాభాలు ఏమీ లేవని తెలుసుకున్నప్పుడు అతని బంధువులు అసంతృప్తి చెందారు. అప్పుడప్పుడు, మతం లేని వ్యక్తులు దేవుని పనిలో నిమగ్నమైన వారికి సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి సలహాలు ప్రస్తుత క్షణంలో ప్రయోజనకరంగా అనిపించే వాటిపై మాత్రమే దృష్టి పెడతాయి. అతని బోధనలు మరియు అద్భుతాల గురించి ప్రజలలో అభిప్రాయాలు విభజించబడ్డాయి మరియు అతనికి మద్దతు ఇచ్చే వారు తమ నమ్మకాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి వెనుకాడారు. మరోవైపు, సువార్త బోధకులను మోసగాళ్లుగా ముద్ర వేసే వారు వారి సందేహాల గురించి గళం విప్పారు, అయితే చాలా మంది మద్దతుదారులు నిందలకు భయపడి తమ విధేయతను ప్రకటించడానికి ఇష్టపడరు.

విందులో అతని ఉపన్యాసం. (14-39) 
14-24
ప్రతి భక్తుడైన మంత్రి క్రీస్తు మాటలను వినయంగా స్వీకరించగలరు. అతని బోధనలు వ్యక్తిగత ఆవిష్కరణ నుండి ఉద్భవించలేదు కానీ పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా దేవుని వాక్యం నుండి ఉద్భవించాయి. ప్రపంచాన్ని అశాంతికి గురిచేసే వివాదాల మధ్య, ఎవరైనా, ఏ దేశానికి చెందిన వారైనా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకునేవారు, ఆ సిద్ధాంతం దేవునికి సంబంధించినదా లేక కేవలం మానవుడిదేనా అని వివేచించుకుంటారు. సత్యం పట్ల ద్వేషాన్ని పెంచుకునే వారు విధ్వంసకర దోషాలకు లొంగిపోతారు. నిశ్చయంగా, బాధితులకు ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అనేది సబ్బాత్ యొక్క ఉద్దేశ్యంతో బాహ్య ఆచారాన్ని నిర్వహించడం వలె సమానంగా ఉంటుంది. దైవిక చట్టం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆధారంగా తన చర్యలను అంచనా వేయమని యేసు వారిని ప్రోత్సహించాడు. మనం ఇతరులను వారి బాహ్య రూపాన్ని బట్టి మాత్రమే తీర్పు చెప్పడం మానుకోవాలి మరియు బదులుగా వారి సద్గుణం మరియు వారిలోని దేవుని ఆత్మ యొక్క బహుమతులు మరియు దయల ద్వారా వారిని అంచనా వేయాలి.

25-30
క్రీస్తు తన మూలాన్ని గురించి వారి అవగాహన తప్పు అని ధైర్యంగా ప్రకటించాడు. తాను దేవునిచే పంపబడ్డానని, తన వాగ్దానాలకు నమ్మకంగా ఉన్నానని అతను నొక్కి చెప్పాడు. దేవుని గురించిన వారి జ్ఞానాన్ని సవాలు చేస్తూ, ఆయన విశిష్టమైన అంతర్దృష్టిని నొక్కి చెప్పే ఈ ప్రకటన శ్రోతలకు కోపం తెప్పించింది. వారు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి హృదయాలు మారకుండా ఉన్నప్పటికీ భౌతికంగా ప్రజలను నిరోధించే శక్తి దేవునికి ఉంది.

31-36
యేసు బోధలు ఆయన మెస్సీయ అని చాలా మంది వ్యక్తులను ఒప్పించాయి, అయినప్పటికీ చాలా మందికి దానిని బహిరంగంగా అంగీకరించే ధైర్యం లేదు. ప్రపంచంలో ఉనికిలో ఉండి, దాని విలువలతో పొత్తుపెట్టుకోని, తత్ఫలితంగా ఇష్టపడని మరియు అలసిపోయిన వారికి, దానిలో వారి సమయం శాశ్వతంగా ఉండదని తెలుసుకోవడంలో ఓదార్పు ఉంటుంది. చెడుతో కలుషితమైన ప్రపంచాన్ని నావిగేట్ చేసే వారికి ఇక్కడ వారి నివాసం క్లుప్తంగా ఉండటం ఒక వరం. జీవితం మరియు దయ రెండింటి యొక్క రోజులు నశ్వరమైనవి, మరియు అతిక్రమించినవారు, ప్రతికూలతను ఎదుర్కొన్నప్పుడు, వారు ఒకసారి విస్మరించిన సహాయాన్ని కోరుకుంటారు. ప్రజలు అలాంటి వ్యక్తీకరణలను చర్చించినప్పటికీ, ముగుస్తున్న సంఘటనలు చివరికి వాటి అర్థాన్ని స్పష్టం చేస్తాయి.

37-39
గుడారాల విందు యొక్క చివరి రోజున, యూదుల సంప్రదాయంలో నీటిని లాగడం మరియు ప్రభువు ముందు పోయడం వంటివి ఉన్నాయి, ఇది క్రీస్తుచే సూచించబడిందని నమ్ముతారు. ఎవరైనా నిజమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనుకుంటే, వారు క్రీస్తు వైపు మళ్లాలి మరియు అతని మార్గదర్శకత్వానికి లోబడి ఉండాలి. పేర్కొన్న దాహం ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం తీవ్రమైన కోరికలను సూచిస్తుంది, అది మరేదైనా సంతృప్తి చెందదు. ప్రవహించే జలాల వలె చిత్రీకరించబడిన పరిశుద్ధాత్మ యొక్క పవిత్రీకరణ మరియు ఓదార్పు ప్రభావాలను సూచిస్తూ, తన వద్దకు వచ్చి త్రాగమని యేసు ప్రజలను ఆహ్వానించాడు.
ఈ దైవిక సౌలభ్యం సమృద్ధిగా మరియు స్థిరంగా ఉంది, ఇది నదిని పోలి ఉంటుంది, సందేహాలు మరియు భయాలను అధిగమించేంత శక్తివంతమైనది. క్రీస్తులో, కృపపై కృప యొక్క సంపూర్ణత ఉంది. ఆత్మ, విశ్వాసులలో నివసిస్తుంది మరియు చురుకైనది, జీవన, ప్రవహించే నీటి ఫౌంటెన్‌గా పనిచేస్తుంది, దాని నుండి సమృద్ధిగా ప్రవాహాలు ఉద్భవించి, శీతలీకరణ మరియు ప్రక్షాళన ప్రభావాలను అందిస్తాయి. పరిశుద్ధాత్మ యొక్క అద్భుత బహుమతులను మనం ఊహించలేకపోయినా, మనం అతని మరింత సాధారణమైన ఇంకా అమూల్యమైన ప్రభావాలను పొందవచ్చు. ఈ ఆధ్యాత్మిక ప్రవాహాలు, మన మహిమాన్వితమైన విమోచకుని నుండి ఉద్భవించాయి, యుగాల ద్వారా ప్రవహించాయి మరియు భూమి యొక్క సుదూర మూలలకు చేరుకున్నాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి మనం ఉత్సాహం చూపుదాం.

ప్రజలు క్రీస్తును గూర్చి వివాదం చేస్తున్నారు. (40-53)
క్రీస్తు విరోధుల పట్ల నిర్దేశించిన శత్రుత్వం స్థిరంగా అహేతుకంగా ఉంటుంది మరియు కొన్ని సమయాల్లో, దాని నిలకడ వెనుక కారణాలు వివరించలేనివిగా ఉంటాయి. క్రీస్తు చేసినంత జ్ఞానం, శక్తి, దయ, బలవంతపు స్పష్టత మరియు మాధుర్యం యొక్క సమ్మేళనంతో ఏ వ్యక్తి కూడా కమ్యూనికేట్ చేయలేదు. చాలా మంది, మొదట్లో సంయమనం పాటించి, యేసు బోధలను బాహాటంగా ఆరాధించేవారు, తమ నమ్మకాలను త్వరగా విడిచిపెట్టి, తమ పాపపు మార్గాల్లో కొనసాగడం నిరుత్సాహపరుస్తుంది. దురదృష్టవశాత్తూ, ప్రజలు తరచుగా తమ నిర్ణయాలను శాశ్వతమైన ప్రాముఖ్యత కలిగిన విషయాలలో మార్గనిర్దేశం చేసేందుకు మిడిమిడి ప్రభావాలను అనుమతిస్తారు, సామాజిక పోకడల కోసం నిందను స్వీకరించడానికి సుముఖతను ప్రదర్శిస్తారు. మానవులు ఎగతాళి చేసేవాటిని దేవుని జ్ఞానము తరచుగా ఎంపిక చేసినట్లే, మానవ మూర్ఖత్వం సాధారణంగా దేవుడు ఎన్నుకున్న వారిని తొలగిస్తుంది. ప్రభువు తరచుగా తన వెనుకబడిన మరియు అకారణంగా శక్తిలేని శిష్యులను ముందుకు తీసుకువస్తాడు, తన శత్రువుల ప్రణాళికలను అడ్డుకోవడానికి వారిని ఉపయోగించుకుంటాడు.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |