Acts - అపొ. కార్యములు 13 | View All

1. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.

1. And profetis and doctouris weren in the chirche that was at Antioche, in which Barnabas, and Symount, that was clepid Blac, and Lucius Cironense, and Manaen, that was the soukynge fere of Eroude tetrarke, and Saul weren.

2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.

2. And whanne thei mynystriden to the Lord, and fastiden, the Hooli Goost seide to hem, Departe ye to me Saul and Barnabas, in to the werk to which Y haue takun hem.

3. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.

3. Thanne thei fastiden, and preieden, and leiden hondis on hem, and leten hem go.

4. కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.

4. But thei weren sent of the Hooli Goost, and wenten forth to Seleucia, and fro thennus thei wenten bi boot to Cipre.

5. వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.

5. And whanne thei camen to Salamyne, thei prechiden the word of God in the synagogis of Jewis; and thei hadden also Joon in mynystrie.

6. వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్‌ యేసు అను ఒక యూదుని చూచిరి.

6. And whanne thei hadden walkid bi al the ile to Pafum, thei founden a man, a witche, a false profete, a Jewe, to whom the name was Bariesu,

7. ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.

7. that was with the proconsul Sergius Paule, a prudent man. This clepide Barnabas and Poul, and desiride to here the word of God.

8. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.

8. But Elymas witche withstoode hem; for his name is expowned so; and he souyte to turne awei the proconsul fro bileue.

9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై

9. But Saul, which is seid also Paul, was fillid with the Hooli Goost, and bihelde in to hym, and seide, A!

10. అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
సామెతలు 10:9, హోషేయ 14:9

10. thou ful of al gile, and al falsnesse, thou sone of the deuel, thou enemye of al riytwisnesse, thou leeuest not to turne vpsodoun the riytful weies of the Lord.

11. ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.

11. And now lo! the hoond of the Lord is on thee, and thou schalt be blynde, and not seynge the sunne in to a tyme. And anoon myste and derknesse felden doun on hym; and he yede aboute, and souyte hym that schulde yyue hoond to hym.

12. అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.

12. Thanne the proconsul, whanne he hadde seyn the dede, bileuede, wondringe on the techyng of the Lord.

13. తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.

13. And whanne fro Pafum Poul hadde go bi a boot, and thei that weren with hym, thei camen to Pergen of Pamfilie; but Joon departide fro hem, and turnede ayen to Jerusalem.

14. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.

14. And thei yeden to Pergen, and camen to Antioche of Persidie; and thei entriden in to the synagoge in the dai of sabatis, and saten.

15. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులుసహోదరు లారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్న యెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.

15. And after the redyng of the lawe and of the prophetis, the princis of the synagoge senten to hem, and seiden, Britheren, if ony word of exortacioun to the puple is in you, seie ye.

16. అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను

16. And Poul roos, and with hoond baad silence, and seide, Men of Israel, and ye that dreden God, here ye.

17. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి
నిర్గమకాండము 6:1, నిర్గమకాండము 6:6, నిర్గమకాండము 12:51

17. God of the puple of Israel chees oure fadris, and enhaunside the puple, whanne thei weren comelingis in the loond of Egipt, and in an hiy arme he ledde hem out of it;

18. యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.
నిర్గమకాండము 16:35, సంఖ్యాకాండము 14:34, ద్వితీయోపదేశకాండము 1:31

18. and bi the tyme of fourti yeeris he suffride her maneres in desert.

19. మరియకనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.
ద్వితీయోపదేశకాండము 7:1, యెహోషువ 14:1

19. And he destriede seuene folkis in the loond of Canaan, and bi sort departide to hem her lond,

20. ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.
న్యాయాధిపతులు 2:16, 1 సమూయేలు 3:20

20. as aftir foure hundrid and fifti yeeris. And aftir these thingis he yaf domesmen, to Samuel, the profete.

21. ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను.
1 సమూయేలు 8:5, 1 సమూయేలు 8:19, 1 సమూయేలు 10:20-21, 1 సమూయేలు 10:24, 1 సమూయేలు 11:15

21. And fro that tyme thei axiden a kyng, and God yaf to hem Saul, the sone of Cis, a man of the lynage of Beniamyn, bi fourti yeeris.

22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
1 సమూయేలు 13:14, 1 సమూయేలు 16:12-13, కీర్తనల గ్రంథము 89:20, యెషయా 44:28

22. And whanne he was don awei, he reiside to hem Dauid king, to whom he bar witnessing, and seide, Y haue foundun Dauid, the sone of Jesse, a man aftir myn herte, which schal do alle my willis.

23. అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను.
2 సమూయేలు 7:12-13, యెషయా 11:1

23. Of whos seed bi the biheest God hath led out to Israel a sauyoure Jhesu,

24. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.

24. whanne Joon prechide bifor the face of his comyng the baptym of penaunce to al the puple of Israel.

25. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.

25. But whanne Joon fillide his cours, he seide, Y am not he, whom ye demen me to be; but lo! he cometh aftir me, and Y am not worthi to doon of the schoon of hise feet.

26. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.
కీర్తనల గ్రంథము 107:20

26. Britheren, and sones of the kynde of Abraham, and whiche that in you dreden God, to you the word of helthe is sent.

27. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచన ములను నెరవేర్చిరి.

27. For thei that dwelliden at Jerusalem, and princis of it, that knewen not this Jhesu, and the voicis of prophetis, that by euery sabat ben red, demyden, and filliden;

28. ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి.

28. and thei founden in hym no cause of deth, and axiden of Pilat, that thei schulden sle hym.

29. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.

29. And whanne thei hadden endid alle thingis that weren writun of hym, thei token hym doun of the tre, and leiden hym in a graue.

30. అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.

30. And God reiside hym fro deth in the thridde dai; which was seyn bi mony daies to

31. ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.

31. hem that wenten vp togidere with hym fro Galilee in to Jerusalem, which ben til now his witnessis to the puple.

32. దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.

32. And we schewen to you the biheest that was maad to oure fadris;

33. ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.
కీర్తనల గ్రంథము 2:7

33. for God hath fulfillid this to her sones, and ayenreisid Jhesu; as in the secounde salm it is writun, Thou art my sone, to dai Y bigat thee.

34. మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.
యెషయా 55:3

34. And he ayenreiside hym fro deth, that he schulde not turne ayen in to corrupcioun, seide thus, For Y schal yyue to you the hooli trewe thingis of Dauid.

35. కాబట్టి వేరొక కీర్తనయందునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యౌవని చెప్పుచున్నాడు.
కీర్తనల గ్రంథము 16:10

35. And therfor and on an othere stide he seith, Thou schalt not yyue thin hooli to se corrupcioun.

36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
న్యాయాధిపతులు 2:10, 1 రాజులు 2:10

36. But Dauid in his generacioun, whanne he hadde mynstrid to the wille of God, diede, and was leid with hise fadris, and say corrupcioun;

37. తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.

37. but he whom God reiside fro deth, say not corrupcioun.

38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,

38. Therfor, britheren, be it knowun to you, that bi hym remyssioun of synnes is teld to you, fro alle synnes, of whiche ye myyten not be iustified in the lawe of Moises.

39. మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.

39. In this ech man that bileueth, is iustified.

40. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా

40. Therfor se ye, that it come not to you, that is biforeseid in the profetis,

41. ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.
హబక్కూకు 1:5

41. Ye dispiseris, se ye, and wondre ye, and be ye scaterid abrood; for Y worche a werk in youre daies, a werk that ye schulen not bileue, if ony man schal telle it to you.

42. వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.

42. And whanne thei yeden out, thei preieden, that in the sabat suynge thei schulden speke to hem these wordis.

43. సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరువారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.

43. And whanne the synagoge was left, manye of Jewis and of comelingis worschypynge God supeden Poul and Barnabas; that spaken, and counseliden hem, that thei schulden dwelle in the grace of God.

44. మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.

44. And in the sabat suynge almest al the citee cam togidir, to here the word of God.

45. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.

45. And Jewis sien the puple, and weren fillid with enuye, and ayenseiden these thingis that weren seyd of Poul, and blasfemyden.

46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరిదేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము

46. Thanne Poul and Barnabas stidfastli seiden, To you it bihofte first to speke the word of God; but for ye putten it awei, and han demyd you vnworthi to euerlastinge lijf, lo! we turnen to hethen men.

47. ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
యెషయా 49:6

47. For so the Lord comaundide vs, Y haue set thee in to liyt to hethen men, that thou be in to helthe to the vtmest of erthe.

48. అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

48. And hethen men herden, `and ioieden, and glorifieden the word of the Lord; and bileueden, as manye as weren bifore ordeyned to euerlastinge lijf.

49. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను

49. And the word of the Lord was sowun bi al the cuntre.

50. గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

50. But the Jewis stiriden religiouse wymmen, and onest, and the worthiest men of the citee, and stireden persecucioun ayens Poul and Barnabas, and dryuen hem out of her cuntreis.

51. వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.

51. And thei schoken awei in to hem the duste of her feet, and camen to Yconye.

52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.

52. And the disciplis weren fillid with ioye and the Hooli Goost.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పాల్ మరియు బర్నబాస్ యొక్క మిషన్. (1-3) 
ఇక్కడ మనకు ఎంత అసెంబ్లీ ఉంది! ఈ పేర్లలో, ప్రభువు వ్యక్తులను తన పనికి సాధనంగా పెంచడం, విభిన్న నేపథ్యాలు మరియు జీవన స్టేషన్ల నుండి వారిని ఆకర్షించడం మనం చూస్తాము. అతని మహిమ పట్ల ఉన్న ఆవేశం, అతని కారణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆకర్షణీయమైన కనెక్షన్‌లను మరియు అవకాశాలను వదులుకోవడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది. క్రీస్తు ఆత్మ ద్వారానే ఆయన సేవకులు సమర్థులుగానూ మరియు ఆయన సేవకు సిద్ధపడతారు, దానికి ఆటంకం కలిగించే ఇతర బాధ్యతల నుండి వేరు చేయబడతారు. క్రీస్తు సేవకులు క్రీస్తు పని కోసం నియమించబడ్డారు మరియు ఆత్మచే మార్గనిర్దేశం చేయబడి, తండ్రి అయిన దేవుని మహిమ కొరకు పని చేయాలి. వారు హోదా కోసం కాకుండా కృషి చేయడానికి అంకితం చేయబడ్డారు. వారి ప్రస్తుత పనిలో బర్నబాస్ మరియు సౌలు వారి శ్రమలో పరిశుద్ధాత్మతో నింపబడాలనే కోరికతో వారిపై ఆశీర్వాదాలు కోరబడ్డాయి. ఉపయోగించే పద్ధతులు లేదా అనుసరించిన మార్గదర్శకాలతో సంబంధం లేకుండా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పరిచారకులు తమ కీలకమైన పనికి తగినంతగా సిద్ధం చేయబడతారు మరియు దానికి పిలవబడతారు.

ఎలిమాస్ మాంత్రికుడు. (4-13) 
సాతాను ముఖ్యంగా ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన వ్యక్తులతో నిమగ్నమై ఉన్నాడు, వారి ప్రవర్తన చాలా మందిపై ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి వారిని మతపరమైన విషయాల నుండి మళ్లించాలనే లక్ష్యంతో ఉన్నాడు. సౌలు ఇక్కడ మొదటిసారిగా పాల్‌గా ప్రస్తావించబడ్డాడు మరియు తరువాత, అతను ఎల్లప్పుడూ పాల్ అని పిలవబడతాడు. "సాల్" అనేది అతని హీబ్రూ పేరు, అయితే "పాల్" అనేది రోమన్ పౌరుడిగా అతని పేరు. పరిశుద్ధాత్మ యొక్క తక్షణ ప్రభావంతో, అతను కోపానికి లొంగకుండా ఎలిమాస్ పాత్రను ఖచ్చితంగా అంచనా వేసాడు. మోసం మరియు అల్లర్ల కలయిక ఒక వ్యక్తిని నిజంగా డెవిల్‌తో జతకట్టినట్లు సూచిస్తుంది. యేసు బోధలను వ్యతిరేకించే వారు, సారాంశంలో, పూర్తి నైతిక మంచితనాన్ని కలిగి ఉన్నందున, అన్ని నీతికి వ్యతిరేకులు. మోక్షానికి మరియు ఆనందానికి ఏకైక సరైన మార్గాలు యేసు ప్రభువు యొక్క మార్గాలు. కొందరు ఈ మార్గాల నుండి తప్పుకోవడమే కాకుండా వాటికి వ్యతిరేకంగా కూడా పని చేస్తారు, తరచుగా తప్పు చేయడంలో పట్టుదలతో ఉంటారు. తన స్వంత హృదయం మరియు మనస్సాక్షిపై సిద్ధాంతం యొక్క ప్రభావాన్ని చూసి ప్రోకాన్సుల్ ఆశ్చర్యపోయాడు, దానిని ధృవీకరించిన దైవిక శక్తిని గుర్తించాడు. క్రీస్తు బోధలు ఆశ్చర్యపరిచేవి, మనం వాటిని ఎంత ఎక్కువగా గ్రహిస్తామో, అంతగా మనం ఆశ్చర్యానికి గల కారణాలను కనుగొంటాము. నిబద్ధత ప్రారంభించి వెనుకకు తిరిగి చూసే వారు దేవుని రాజ్యానికి అనర్హులు. అదేవిధంగా, వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మరియు కష్టాలను భరించడానికి సిద్ధంగా లేని వ్యక్తులు మంత్రిత్వ బాధ్యతలకు సరిపోరు.

ఆంటియోక్‌లో పాల్ ప్రసంగం. (14-41) 
14-31
మనం దేవుని ఆరాధన కోసం సమావేశమైనప్పుడు, ప్రార్థన మరియు స్తుతించడంలో మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని చదవడం మరియు శ్రద్ధగా వినడం కూడా అవసరం. బహిరంగ సభలలో కేవలం లేఖనాలను చదవడం సరిపోదు; వారు వివరించబడాలి మరియు వారి నుండి ఆచరణాత్మక అంతర్దృష్టులను పొందేందుకు సంఘం ప్రోత్సహించబడింది. పదాన్ని అర్ధవంతం చేయడం మరియు దానిని వారి స్వంత జీవితాలకు అన్వయించడం వంటి అవసరమైన పనిలో ఇది ప్రజలకు సహాయపడుతుంది. ఈ ఉపన్యాసం క్రీస్తును వాగ్దానం చేయబడిన మెస్సీయగా అంగీకరించడానికి మరియు స్వీకరించడానికి యూదులను అత్యంత ప్రభావవంతంగా ఒప్పించే వివిధ అంశాలను ప్రస్తావిస్తుంది.
ఈ ఉపన్యాసంలోని ప్రతి అంశం ప్రభువు తన చర్చితో వ్యవహరించిన తీరును గుర్తుచేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను స్పృశిస్తుంది, మానవ కృతఘ్నత మరియు అవిధేయతతో విభేదించే ఆయన దయ మరియు సహనానికి రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. పాల్ డేవిడ్‌ను డేవిడ్ కుమారునికి చర్చిస్తూ, యేసు వాగ్దానం చేయబడిన సంతానం అని వివరిస్తాడు-ప్రాచీన న్యాయమూర్తులు చేయలేని వాటిని నెరవేర్చడానికి ఉద్దేశించిన రక్షకుడు: పాపాల నుండి విముక్తి, మానవత్వం యొక్క అత్యంత బలీయమైన విరోధులు. అపొస్తలులు క్రీస్తును రక్షకునిగా బోధించినప్పుడు, వారు అతని మరణాన్ని బయలుపరచడమే కాకుండా సిలువ వేయబడిన క్రీస్తును స్థిరంగా నొక్కిచెప్పారు. పాపం నుండి మనము పూర్తిగా విడిపోవడాన్ని క్రీస్తుతో సమాధి చేయడం ద్వారా సూచించబడుతుంది, అయినప్పటికీ అతను అవినీతి లేకుండా మృతులలో నుండి లేచాడు-ఇది వారి బోధనలో ప్రధానమైన కీలకమైన సత్యం.

32-37
మనం దేవుని ఆరాధన కోసం సమావేశమైనప్పుడు, ప్రార్థన మరియు స్తుతించడంలో మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని చదవడం మరియు శ్రద్ధగా వినడం కూడా అవసరం. బహిరంగ సభలలో కేవలం లేఖనాలను చదవడం సరిపోదు; వారు వివరించబడాలి మరియు వారి నుండి ఆచరణాత్మక అంతర్దృష్టులను పొందేందుకు సంఘం ప్రోత్సహించబడింది. పదాన్ని అర్ధవంతం చేయడం మరియు దానిని వారి స్వంత జీవితాలకు అన్వయించడం వంటి అవసరమైన పనిలో ఇది ప్రజలకు సహాయపడుతుంది. ఈ ఉపన్యాసం క్రీస్తును వాగ్దానం చేయబడిన మెస్సీయగా అంగీకరించడానికి మరియు స్వీకరించడానికి యూదులను అత్యంత ప్రభావవంతంగా ఒప్పించే వివిధ అంశాలను ప్రస్తావిస్తుంది.
ఈ ఉపన్యాసంలోని ప్రతి అంశం ప్రభువు తన చర్చితో వ్యవహరించిన తీరును గుర్తుచేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను స్పృశిస్తుంది, మానవ కృతఘ్నత మరియు అవిధేయతతో విభేదించే ఆయన దయ మరియు సహనానికి రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. పాల్ డేవిడ్‌ను డేవిడ్ కుమారునికి చర్చిస్తూ, యేసు వాగ్దానం చేయబడిన సంతానం అని వివరిస్తాడు-ప్రాచీన న్యాయమూర్తులు చేయలేని వాటిని నెరవేర్చడానికి ఉద్దేశించిన రక్షకుడు: పాపాల నుండి విముక్తి, మానవత్వం యొక్క అత్యంత బలీయమైన విరోధులు. అపొస్తలులు క్రీస్తును రక్షకునిగా బోధించినప్పుడు, వారు అతని మరణాన్ని బయలుపరచడమే కాకుండా సిలువ వేయబడిన క్రీస్తును స్థిరంగా నొక్కిచెప్పారు. పాపం నుండి మనము పూర్తిగా విడిపోవడాన్ని క్రీస్తుతో సమాధి చేయడం ద్వారా సూచించబడుతుంది, అయినప్పటికీ అతను అవినీతి లేకుండా మృతులలో నుండి లేచాడు-ఇది వారి బోధనలో ప్రధానమైన కీలకమైన సత్యం.

38-41
క్రీస్తు సువార్తను వినే వారందరికీ, రెండు ప్రాథమిక సత్యాలను గ్రహించడం చాలా ముఖ్యం:
1. ఈ మనిషి మరణం మరియు పునరుత్థానం ద్వారా, పాప క్షమాపణ మీకు ప్రకటించబడింది. మీ పాపాల సంఖ్య మరియు తీవ్రతతో సంబంధం లేకుండా, వారు దేవుని గౌరవాన్ని రాజీ పడకుండా క్షమించగలరు.
2. పాపం యొక్క అపరాధం మరియు మరకతో సహా అన్ని విషయాల నుండి సమర్థించబడడం, ఆయనను విశ్వసించే వారికి ప్రత్యేకంగా క్రీస్తు ద్వారా మాత్రమే - ఈ సమర్థనను మరెవరూ అందించలేరు. మోషే ధర్మశాస్త్రం దీనిని సాధించలేదు. దోషులుగా నిర్ధారించబడిన పాపులు న్యాయబద్ధంగా పరిగణించబడటం, అన్ని అపరాధాలను తొలగించడం మరియు దేవుని దృష్టిలో నీతిమంతులుగా అంగీకరించబడటం పట్ల తీవ్ర ఆందోళన కలిగి ఉంటారు. పాపిపై మిగిలి ఉన్న ఏదైనా ఆరోపణ వారి నాశనానికి దారి తీస్తుంది. యేసుక్రీస్తు ద్వారా, ఆయన పాపానికి పూర్తి ప్రాయశ్చిత్తం చేసినందున మనం పూర్తి సమర్థనను పొందుతాము. అతను మన న్యాయాధిపతిగా మాత్రమే కాకుండా మన నీతి ప్రభువుగా కూడా సేవ చేస్తాడు.
ధర్మశాస్త్రం దాని బలహీనత కారణంగా ఏమి సాధించలేకపోయింది, క్రీస్తు సువార్త సాధిస్తుంది. ఈ ఆశీర్వాదం అందరినీ కలుపుకొని అత్యంత ఆవశ్యకం. బెదిరింపుల రూపంలో హెచ్చరికలు మనల్ని అప్రమత్తం చేయడమే. పశ్చాత్తాపపడని పాపులు హెచ్చరించిన పరిణామాలు, ఆ పరిణామాలు మనపై పడకుండా మనలో జాగ్రత్తగా ఉండేందుకు ఉద్దేశించబడ్డాయి. మతాన్ని విస్మరించడం చాలా మంది పతనం. ఆశ్చర్యపడి రక్షింపబడుటకు నిరాకరించిన వారు తమను తాము ఆశ్చర్యపరచుకొని నష్టపోతారు.

అతను అన్యజనులకు బోధిస్తాడు మరియు యూదులచే హింసించబడ్డాడు. (42-52)
అపొస్తలుల బోధనలు యూదుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి, వారు అభ్యంతరాలను కనుగొనలేకపోయినప్పుడు, క్రీస్తును మరియు ఆయన సువార్తను దూషించడాన్ని ఆశ్రయించారు. మొదట్లో పరస్పర విరుద్ధమైన వ్యక్తులు దైవదూషణకు దిగడం సాధారణ పద్ధతి. అయితే, క్రీస్తు కారణానికి విరోధులు ధైర్యాన్ని ప్రదర్శించినప్పుడు, దాని న్యాయవాదులు మరింత ధైర్యంగా ప్రతిస్పందించాలి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అనేకులు తమను తాము నిత్యజీవానికి అనర్హులని భావిస్తుండగా, ఇతరులు రక్షణ సందేశం గురించి మరింత తెలుసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది పాత నిబంధనలోని అంచనాలకు అనుగుణంగా ఉంటుంది.
సువార్త అద్భుతమైన కాంతి, శక్తి మరియు నిధిని కలిగి ఉంది. దాని సత్యాలు, సూత్రాలు మరియు వాగ్దానాలు నిజంగా అద్భుతమైనవి. క్రీస్తు వద్దకు వచ్చిన వారు తండ్రిచే ఆకర్షించబడ్డారు మరియు ఆత్మ ద్వారా ప్రభావవంతంగా చేయబడిన సువార్త పిలుపుకు ప్రతిస్పందించారు (రోమన్లు ​​8:30). నిత్యజీవానికి ఉద్దేశించినవారు, తమ నిత్య స్థితి గురించి శ్రద్ధ వహించి, దాని యొక్క హామీని వెదకేవారు, క్రీస్తును విశ్వసించారు-ఆ జీవాన్ని దేవుడు ఎవరిలో భద్రపరిచాడో, దానికి ఏకైక మార్గం. దేవుని దయ వారి విశ్వాసానికి చోదక శక్తి.
గౌరవప్రదమైన స్త్రీలను చూడటం అభినందనీయం, ప్రత్యేకించి వారు తమ ఆత్మలు మరియు ఇతరుల ఆత్మల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు, ఎందుకంటే వారికి ప్రాపంచిక వ్యవహారాలలో తక్కువ ప్రమేయం ఉంటుంది. అయినప్పటికీ, దేవుని పట్ల భక్తి ముసుగులో, వారు క్రీస్తు పట్ల శత్రుత్వాన్ని వ్యక్తం చేసినప్పుడు అది నిరుత్సాహపరుస్తుంది. దైవభక్తి యొక్క శక్తిలో లభించే సౌకర్యాలు మరియు ప్రోత్సాహాలను మనం ఎంత ఎక్కువగా ఆస్వాదిస్తామో, మరియు మన హృదయాలు వాటితో ఎంత నిండుగా ఉంటే, దైవభక్తిని ప్రకటించడంలో సవాళ్లను ఎదుర్కోవడానికి మనం అంత బాగా సన్నద్ధమవుతాము.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |