Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.
దేవుడు క్రీస్తు సంఘానికిచ్చిన గొప్ప ఉచిత వరాల్లో, సామర్థ్యాల్లో ఉపదేశించడం, దేవునిమూలంగా పలకడం ఉన్నాయి – రోమీయులకు 12:6-7; 1 కోరింథీయులకు 12:28; 1 కోరింథీయులకు 14:1; ఎఫెసీయులకు 4:11-13. “రాష్ట్రాధికారి హేరోదు”– మత్తయి 14:1.
2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.
“ఉపవాసం”– నోట్స్ మత్తయి 9:14-15; మొ।।. పవిత్రాత్మ వ్యక్తిత్వాన్ని మరో సారి గుర్తించండి. అపో. కార్యములు 8:29; అపో. కార్యములు 10:19; యోహాను 14:16-17 చూడండి. ఆయన దేవుని రాజ్యంలో ప్రత్యేకమైన పనులకోసం మనుషులను పిలుస్తాడు. ఇతర దేశాలకు శుభవార్త ప్రచారకులుగా వెళ్ళడానికి అంతియొకయలో ఆయన పిలిచిన ఇద్దరూ ప్రకటించడంలోనూ ఉపదేశించడం లోను అందరికంటే సామర్థ్యం గలవారు. తమను ఏ పనికి పవిత్రాత్మ నియమించాడో ఆ పనిని ఏమిటో తెలుసుకుని చేసేవారు ధన్యులు. పవిత్రాత్మ ఎన్నుకొన్న వ్యక్తుల్ని గుర్తించి ఆ పనికోసం వారిని ప్రత్యేకించడం మూలంగా సంఘం ఆయనతో కలిసి పని చేసిందని గమనించండి.
3. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
వారు చేతులుంచడం పౌలు బర్నబాలకు వచ్చిన పిలుపును తాము గుర్తించి సమ్మతిస్తున్న విషయాన్నీ ఆ ఇద్దరితో తమ ఐకమత్యాన్నీ సూచించింది.
4. కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.
పవిత్రాత్మ వారిని పంపకపోతే సంఘం మనుషులను సేవకోసం పంపడం వ్యర్థం. “సైప్రస్”– అపో. కార్యములు 11:19.
5. వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.
సలమీ ఆ ద్వీపంలో ముఖ్య నగరం. వారి అలవాటు ప్రకారం వారు మొదట యూదుల దగ్గరకు వెళ్ళారు – వ 46; రోమీయులకు 1:16. “సమాజ కేంద్రం”– మత్తయి 4:23 నోట్. “యోహాను”– మార్కుకు మరో పేరు (అపో. కార్యములు 12:12).
6. వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.
“పాఫు”– ఆ ద్వీపానికి రాజధాని. “బర్యేసు”– యెహోషువ కుమారుడని అర్థం (యెహోషువ అనే హీబ్రూ పేరు గ్రీకులోకి వచ్చినప్పుడు అది ‘యేసు’ అయింది). ఈ బర్యేసు సొంత మత ధర్మాన్ని తిరస్కరించి నిజ దేవుని ఉపదేశాలను విడిచిపెట్టినవాడు. మంత్రవిద్యకు దూరంగా ఉండాలని దేవుడు యూదులకు ఆజ్ఞ జారీ చేశాడు. ద్వితీయోపదేశకాండము 18:10-13 నోట్స్ చూడండి.
7. ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
“ప్రాంతీయాధికారి”– రోమ్ చక్రవర్తి ఆ ద్వీపానికి నియమించిన అధికారి. అతనిలాగే తెలివైనవారంతా దేవుని వాక్కు వినడానికి ఇష్టపడాలి.
8. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.
ఇతరులు యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టకుండేలా ప్రయత్నం చేయడం చాలా ఘోర పాపాలలో ఒకటి. మత్తయి 23:13 చూడండి.
9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై
ఇక్కడ సౌలుకు పెట్టిన మరో పేరు ‘పౌలు’ మొదటిసారిగా కనిపిస్తున్నది. ఈ పేరే అతనికి స్థిరపడింది. “పవిత్రాత్మతో నిండిన”– అపో. కార్యములు 2:4; అపో. కార్యములు 4:31; అపో. కార్యములు 6:3, అపో. కార్యములు 6:5; అపో. కార్యములు 11:24.
10. అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? సామెతలు 10:9, హోషేయ 14:9
కొన్ని సార్లు తన సేవకులు ఒక వ్యక్తి గుణాన్ని కనిపెట్టి కఠినమైన సత్యాన్ని ధైర్యంతో పలికేలా పవిత్రాత్మ చేస్తాడు. “పిశాచం కొడుకా”– మత్తయి 13:38; యోహాను 8:44. బర్యేసు (ఎలుమ) చాలా కాలంగా మంత్రవిద్య ప్రయోగంద్వారా దేవుని మార్గాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
11. ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
దేవుడే గనుక మనకు విరోధి అయితే మన పక్షాన ఎవరు ఉండగలరు? దీనికి వ్యతిరేకమైనది రోమీయులకు 8:31 లో చూడండి.
12. అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
అపో. కార్యములు 2:43; అపో. కార్యములు 5:12-14; అపో. కార్యములు 8:6, అపో. కార్యములు 8:13; అపో. కార్యములు 9:34-35, అపో. కార్యములు 9:41-42.
13. తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.
“పంఫులియా”– ప్రస్తుతం టర్కీ అనే దేశంలో దక్షిణాన ఓ ప్రాంతం. పెర్గె సముద్ర తీరంనుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరాన ఉంది. మార్కు వారిని ఎందుకు విడిచివెళ్ళాడో తెలియదు. దానికి కారణం రాసి లేదు. సరైన కారణం ఏమీ లేదని పౌలు అనుకొన్నాడు (అపో. కార్యములు 15:38-39). వారిని విడిచిపెట్టడంవల్ల, పౌలు మొదటి శుభవార్త ప్రచార ప్రయాణంలో కొన్ని గొప్ప విషయాల్లో అనుభవాల్లో మార్కు పాల్గొనలేకపోయాడు.
14. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.
ఈ అంతియొకయ పెర్గేకు ఉత్తరాన దాదాపు 160 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక ముఖ్యమైన పట్టణం. “సమాజ కేంద్రం”– మత్తయి 4:23. ఇది అంతియొకయలో కొందరు యూదులున్నారని సూచిస్తున్నది.
15. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులుసహోదరు లారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్న యెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.
లూకా 4:16-17; లూకా 14:1 చూడండి. సమాజ కేంద్రం వారు కొత్తగా వచ్చిన యూదులను సందేశం లేక ప్రసంగం ఇమ్మని అడగడం మామూలే.
16. అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను
17. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చినిర్గమకాండము 6:1, నిర్గమకాండము 6:6, నిర్గమకాండము 12:51
పాత ఒడంబడిక గ్రంథంలోని ఆరు పుస్తకాల్లో (ఆదికాండంనుంచి యెహోషువ వరకు) రాసి ఉన్న 450 సంవత్సరాల చరిత్ర గురించి పౌలు మూడు వచనాలలో మాట్లాడాడు.
18. యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.నిర్గమకాండము 16:35, సంఖ్యాకాండము 14:34, ద్వితీయోపదేశకాండము 1:31
19. మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.ద్వితీయోపదేశకాండము 7:1, యెహోషువ 14:1
20. ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.న్యాయాధిపతులు 2:16, 1 సమూయేలు 3:20
సమూయేలు న్యాయాధిపతుల్లో చివరివాడు, మోషే తరువాత ప్రవక్త అనబడ్డవారిలో మొదటివాడు.
21. ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను. 1 సమూయేలు 8:5, 1 సమూయేలు 8:19, 1 సమూయేలు 10:20-21, 1 సమూయేలు 10:24, 1 సమూయేలు 11:15
1 సమూయేలు 8:5; 1 సమూయేలు 9:1-2; 1 సమూయేలు 10:1.
22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.1 సమూయేలు 13:14, 1 సమూయేలు 16:12-13, కీర్తనల గ్రంథము 89:20, యెషయా 44:28
1 సమూయేలు 16:1, 1 సమూయేలు 16:13; 2 సమూయేలు 2:4; 2 సమూయేలు 5:1-5. “నా హృదయానికి అనుగుణంగా”– 1 సమూయేలు 13:14 నోట్ చూడండి.
23. అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను.2 సమూయేలు 7:12-13, యెషయా 11:1
ఇస్రాయేల్ చరిత్ర గురించి మాట్లాడడంలో పౌలు ఉద్దేశమేమంటే దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథం పట్ల తన నమ్మకాన్ని చూపాలని, తన మాటలు విన్నవారు యేసుప్రభువును తలపోయాలని. చాలా కాలం నుంచి ఇస్రాయేల్ ఏ అభిషిక్తుని కోసం, రక్షకుని కోసం ఎదురుచూశారో ఆ అభిషిక్తుడు, ఆ రక్షకుడు యేసే అని ఇక్కడ సూచిస్తున్నాడు. ఆయనను గురించి దేవుడు చేసిన వాగ్దానాలు ఆదికాండము 3:15 మొదలుకొని మలాకీ వరకు ఉన్నాయి.
24. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.
మత్తయి 3:1-6; యోహాను 1:19-27.
25. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.
26. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.కీర్తనల గ్రంథము 107:20
అబ్రాహాము ఆ జాతికి మూలపురుషుడు. యూదులంతా అతని సంతానం. “భయభక్తులు”– అపో. కార్యములు 10:2 చూడండి.
27. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచన ములను నెరవేర్చిరి.
అపో. కార్యములు 2:23; అపో. కార్యములు 3:17-18. పాత ఒడంబడిక గ్రంథంలో భవిష్యత్తు గురించి రాసి ఉన్న విషయాలను యూదులలో గ్రహించినవారు ఆ రోజుల్లో చాలా కొద్దిమంది మాత్రమే. అయితే తన వాక్కును నెరవేర్చేందుకు యూద నాయకుల పాపంతో కూడిన అజ్ఞానాన్ని దేవుడు వాడుకొన్నాడు. ఆదికాండము 50:20 పోల్చి చూడండి.
28. ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి.
మత్తయి 27:1-2, మత్తయి 27:11-26.
29. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.
లూకా 23:53; లూకా 24:26-27, లూకా 24:46.
30. అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
మత్తయి 28:6.
31. ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.
అపో. కార్యములు 1:3-8; 1 కోరింథీయులకు 15:3-8.
32. దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.
33. ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.కీర్తనల గ్రంథము 2:7
34. మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.యెషయా 55:3
35. కాబట్టి వేరొక కీర్తనయందునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యౌవని చెప్పుచున్నాడు.కీర్తనల గ్రంథము 16:10
36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,న్యాయాధిపతులు 2:10, 1 రాజులు 2:10
అపో. కార్యములు 2:25-32.
37. తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.
38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
అపో. కార్యములు 2:38; అపో. కార్యములు 26:18; లూకా 24:47. “పాపక్షమాపణ”– అపో. కార్యములు 10:43 నోట్లో రిఫరెన్సులు చూడండి.
39. మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.
నిర్దోషుల లెక్కలోకి రావడం పాపక్షమాపణతో సంబంధం గలది. పాపవిముక్తి, రక్షణలో అది ఒక పక్క, ఇది మరో పక్క, దేవుడు తనను నమ్మినవారు న్యాయవంతులనీ సమస్తమైన పాపం విషయంలో నిరపరాధులనీ ఎంచుతాడు. తరువాత పౌలు రోమ్వారికి, గలతీయవారికి రాసిన లేఖలలో వర్ణించిన ఆశ్చర్యమైన సత్యాలలో ఇది ఒకటి (రోమీయులకు 3:20, రోమీయులకు 3:24, రోమీయులకు 3:28; రోమీయులకు 5:1, రోమీయులకు 5:9; రోమీయులకు 8:30; గలతియులకు 2:16; గలతియులకు 3:11, గలతియులకు 3:24). నిర్దోషుల లెక్కలోకి రావడం అనేది యేసుప్రభువు మీది నమ్మకంద్వారా మాత్రమే కలుగుతుందని పౌలు ఎప్పుడూ నొక్కి చెప్పేవాడు. మోషే ధర్మశాస్త్రం ఏ మనిషినీ నిర్దోషిగా ఎంచదు. ధర్మశాస్త్రం నేరాలు మోపి శిక్ష విధిస్తుంది అంతే (నిర్గమకాండము 19:21-25; రోమీయులకు 3:19-20; గలతియులకు 3:10).
40. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా
శుభవార్త దాన్ని నమ్మేవారికే శుభవార్త కాబట్టి పౌలు తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నాడు. అపో. కార్యములు 2:40 పోల్చి చూడండి. హబక్కూకు 1:5 రాయబడిన రోజుల్లోని ప్రజల్లాగా వారు అపనమ్మకం చూపకూడదని పౌలు హెచ్చరిక.
41. ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.హబక్కూకు 1:5
42. వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.
43. సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరువారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.
“దేవుని అనుగ్రహం”– పౌలు అధికంగా నొక్కి చెప్పిన మరో విషయం – అపో. కార్యములు 20:24, అపో. కార్యములు 20:32; రోమీయులకు 3:24; రోమీయులకు 5:2, రోమీయులకు 5:15, రోమీయులకు 5:20-21; రోమీయులకు 6:14; ఎఫెసీయులకు 3:2; తీతుకు 2:11-15; తీతుకు 3:7.
44. మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.
“పట్టణం అంతా”– ఆ జన సమూహంలో అధిక భాగం యూదులు కానివారన్నమాట.
45. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.
అపో. కార్యములు 5:17; అపో. కార్యములు 7:9; మత్తయి 27:18; సామెతలు 27:4. ఆ యూదులలో ఎవరూ అంత పెద్ద సమూహాన్ని ఎప్పుడూ ఆకర్షించలేకపోయారు. ప్రజలు వారి మాటలు అంత కుతూహలంగా ఎన్నడూ వినలేదు. గనుక పౌలు బర్నబాలను చూచి వారు అసూయపడ్డారు.
46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరిదేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము
అపో. కార్యములు 3:26; రోమీయులకు 1:16. శాశ్వత జీవం గురించి యోహాను 3:16 నోట్ చూడండి.
47. ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.యెషయా 49:6
48. అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
దేవుడు మనుషులను శాశ్వత జీవానికి నియమించేది విశ్వాసంద్వారా. ఈ యూదేతరులు క్రీస్తుమీద నమ్మకం పెట్టడంద్వారా, దేవుడు వారిని ఎన్నుకొన్నాడని చూపారు. యోహాను 6:37, యోహాను 6:44; యోహాను 17:2; ఎఫెసీయులకు 1:4 చూడండి.
49. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను
50. గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.
మతస్థులనూ భక్తిపరులనూ దుర్మార్గులైన వారు తేలికగా నిజ దేవుని సేవకులను హింసించడానికి పురికొల్పగలరు. యోహాను 16:2-3 చూడండి.
51. వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.
మత్తయి 10:14 పోల్చి చూడండి. ఈకొనియ వారున్న చోటుకు ఆగ్నేయ దిక్కున దాదాపు 130 కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక ముఖ్య పట్టణం.
52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.
క్రీస్తు శుభవార్త నిజంగా నమ్మడం వల్ల తప్పనిసరిగా కలిగే ఫలితం ఆనందం (అపో. కార్యములు 8:8; అపో. కార్యములు 16:34; లూకా 2:10; లూకా 24:52; రోమీయులకు 14:17; రోమీయులకు 15:13; 1 పేతురు 1:8). నమ్మడం దేవుని ఆత్మతో నిండిపోవడానికి కూడా దారి తీస్తుంది (అపో. కార్యములు 2:4; ఎఫెసీయులకు 5:18).