Acts - అపొ. కార్యములు 23 | View All

1. పౌలు మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.

“అంతర్వాణి”– క్రొత్త ఒడంబడిక గ్రంథంలో రాసి ఉన్న పౌలు మాటల్లో ఈ పదం 23 సార్లు కనిపిస్తున్నది. ఇతరుల రచనల్లో ఇది 9 సార్లు మాత్రమే కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన రిఫరెన్సులు రోమీయులకు 2:15; 1 తిమోతికి 1:5, 1 తిమోతికి 1:19; 1 తిమోతికి 3:9; 1 తిమోతికి 4:2; 2 తిమోతికి 1:3; తీతుకు 1:15; హెబ్రీయులకు 9:9, హెబ్రీయులకు 9:14; హెబ్రీయులకు 10:22; 1 పేతురు 3:16. అంతర్వాణి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది దుర్మార్గమో ఏది సన్మార్గమో తెలియజేయగల మనశ్శక్తి, ఇలాంటివాటికి తీర్పు తీర్చే స్వరం లాంటిది. ఒక వ్యక్తి దాని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అది ఆ వ్యక్తిని ఖండిస్తుంది. దాని దృష్టిలో ఆ వ్యక్తి ప్రవర్తన సరిగా ఉంటే అది నిమ్మళంగా ప్రశాంతంగా ఉంటుంది. మనకు “మంచి” అంతర్వాణి ఉండడం ముఖ్య విషయమని పౌలు చెప్పాడు. మంచి అంతర్వాణి, అంటే మనం దాని నిర్ణయాల ప్రకారం ప్రవర్తించినందువల్ల, మనలను మందలించని అంతర్వాణి. అపో. కార్యములు 24:16; 2 కోరింథీయులకు 1:12 లో పౌలు తాను ఎప్పుడూ అనుసరించిన నియమాన్ని తెలియజేశాడు. క్రీస్తుసంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు కూడా తన అంతర్వాణిని మంచి స్థితిలో ఉంచాడు (26:9; ఫిలిప్పీ 3:6). అప్పుడు తాను చేస్తున్నది యుక్తమని భావించుకొన్నాడు (అపో. కార్యములు 26:9. యోహాను 16:2 పోల్చి చూడండి). అంతర్వాణి దేవుడు కాదు. అది పొరపాటుపడనిది కాదు. ముఖ్యమైన విషయాల్లో కూడా అది తప్పు నిర్ణయాలకు రావచ్చు. దేవుని వాక్కు దానికి ఉపదేశం ఇవ్వడం అవసరం.

2. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా

ఈ అననీయ అత్యాశగల దుర్మార్గుడు. అతడు దాదాపు క్రీ.శ. 48లో యూద ప్రముఖయాజి అయ్యాడు. పౌలు తాను ఏ తప్పిదమూ చేయలేదని చెప్పినందువల్ల అతనికి కోపం కలిగింది.

3. పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను.దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.
లేవీయకాండము 19:15, యెహెఙ్కేలు 13:10-15

“వెల్ల వేసిన గోడా”– మత్తయి 23:27; యెహెఙ్కేలు 13:10-12 పోల్చి చూడండి. ఆ తరువాత ఏదో సంవత్సరంలో అననీయ హత్యకు గురి అయ్యాడు. పౌలును కొట్టడం ధర్మశాస్త్రానికి విరుద్ధం ఎందుకంటే నేరారోపణ రుజువు కాక ముందు శిక్షించడానికి ధర్మశాస్త్రం అనుమతించదు.

4. దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి

5. అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను.
నిర్గమకాండము 22:28

అననీయ ప్రముఖయాజి అని పౌలు ఎందుకు గుర్తు పట్టలేదు? ఒకవేళ అననీయ తన ఉద్యోగాన్ని సూచించే వస్త్రాలు వేసుకోలేదేమో (ఆ సభ తొందరగా సమకూడింది – అపో. కార్యములు 22:30), లేక అప్పటికి అతడు సభ అధ్యక్షుడు మామూలుగా కూర్చుండే చోట కూచోలేదేమో, లేక పౌలు కండ్లు మసకబారాయేమో. పౌలు ఎత్తి చెప్పిన మాటలు నిర్గమకాండము 22:28 లో ఉన్నాయి.

6. వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.

ఇక్కడ పౌలు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి తన శత్రువుల మధ్య జగడాన్ని పుట్టించాడు. పౌలు పరిసయ్యుడు (ఫిలిప్పీయులకు 3:5; మత్తయి 3:7 నోట్ చూడండి). ప్రముఖయాజి, యూద సమాలోచన సభ సభ్యుల్లో కొందరు సద్దూకయ్యులు.

7. అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.

కొన్ని సార్లు మత సంబంధమైన జగడాలు అన్నిటికంటే తీవ్రమైనవి.

8. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.

9. అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవ దూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి.

10. కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.

11. ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్య మియ్యవలసియున్నదనిచెప్పెను.

“ధైర్యంగా”– అపో. కార్యములు 18:9-10. “రోమ్”– అపో. కార్యములు 19:21. ఏ కష్టమైనా ఏ ఆపదైనా యేసుప్రభువు మనదగ్గరికి వచ్చేలా చేస్తే అది మారువేషం వేసుకొన్న దీవెన.

12. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి.

పౌలు క్రీస్తును అనుసరించడం ఆరంభించినప్పటి నుంచి యూదులు అతణ్ణి చంపజూస్తూ ఉన్నారు (అపో. కార్యములు 9:23-25; అపో. కార్యములు 14:19; అపో. కార్యములు 17:5). వారతణ్ణి ఎన్నడూ చంపలేకపోయారు. తన సేవకులను తన దగ్గర చేర్చుకోవలసిన రోజువరకు వారినెలా కాపాడాలో దేవునికి తెలుసు. ఈ లోకంలో వారు చేయవలసిన పని ఇంకా ఉంటే ఏ శత్రువూ వారిలో ఎవరి ప్రాణం తీయడం అసాధ్యం. పౌలు భద్రతకోసం దేవుడు అతని మేనల్లుణ్ణి ఉపయోగించాడు (వ 16. అతని గురించి గానీ పౌలు సోదరి గురించి గానీ క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ ఒక ప్రస్తావన మాత్రమే ఉంది). అతణ్ణి గాక దేవుడు శతాధిపతిని (వ 17), పై అధికారిని (వ 18), 200 సైనికులనూ 70 రౌతులనూ 200 ఈటెలవారినీ (వ 23), యూదయ ప్రదేశానికి అధిపతిగా ఉన్న ఫేలిక్స్‌నూ (వ 34,35) ఉపయోగించాడు. ఒకవేళ అవసరమైతే దేవుడు దేవదూతల సైన్యాన్ని పరలోకంనుంచి పంపి ఉంటాడు. దేవుడు తన సేవకులను కాపాడాలనుకుంటే కాపాడతాడు, పరలోకంలో చేర్చుకొందామనుకుంటే చేర్చుకొంటాడు (అపో. కార్యములు 12:1-3).

13. ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.

14. వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.

15. కాబట్టి మీరు మహాసభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.

16. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.

16. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడు కొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.

18. శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి ఖైదీయైన పౌలు నన్ను పిలిచినీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.

19. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసి కొనిపోయి నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను.

20. అందుకతడు నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు.

21. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను.

22. అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.

23. తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధ పరచి

24. పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధ పరచుడని చెప్పెను.

25. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను

26. మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.

ఫేలిక్స్ క్రీ శ 52లో యూదయకు అధిపతి అయ్యాడు. అతడు దుర్మార్గుడు, క్రూరుడు, కాముకుడు.

27. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.

28. వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.

29. వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.

30. అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని.కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.

31. మరునాడు వారతనితో కూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి.

32. వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియెదుట నిలువ బెట్టిరి.

33. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని

34. నీమీద నేరము మోపు వారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి,

35. హేరోదు అధికారమందిరములో అతనిని కావలి యందుంచవలెనని ఆజ్ఞాపించెను.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |