Acts - అపొ. కార్యములు 24 | View All

1. అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.

2. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరము మోప నారంభించి యిట్లనెను

3. మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.

4. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొను చున్నాను.

5. ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,

“చీడ పురుగులాంటివాడు”– అపో. కార్యములు 16:20; అపో. కార్యములు 17:6. అసలు, చీడ పురుగులాంటివారు వారే, పౌలు కాదు. అల్లరి కలిగించినది వారే. “నజరేయుల మత శాఖ”– నజరేతువాడైన యేసును అనుసరించినవారని అర్థం (అపో. కార్యములు 2:22; మత్తయి 2:23).

6. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.

7. తమరు విమర్శించిన యెడల

8. మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.

9. యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.

10. అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.

11. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.

12. దేవాలయములో నేమి, సమాజమందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.

13. మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.

14. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,

“ఈ మార్గం”– అపో. కార్యములు 9:2; అపో. కార్యములు 22:4. “ధర్మశాస్త్రంలో, ప్రవక్తల లేఖనాలలో” పాత ఒడంబడిక గ్రంథమంతా అన్నమాట (మత్తయి 5:17; లూకా 24:27). తాను దాన్నంతటినీ నమ్ముతున్నానని పౌలు చెప్పాడని గమనించండి. 2 తిమోతికి 3:16-17 పోల్చి చూడండి.

15. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.
దానియేలు 12:2

“లేస్తారని”– దానియేలు 12:2; యోహాను 5:28-29. “వీరికి”– చనిపోయినవారు లేస్తారని వారు నమ్మినవారైతే కనీసం వారిలో కొందరు పరిసయ్యులై ఉండాలి (అపో. కార్యములు 23:8).

16. ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.

17. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.

18. నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;

19. నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.

20. లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని

21. వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.

22. ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.

23. మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను.

24. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.

ద్రుసిల్ల ఫేలిక్స్‌కు మూడో భార్య. ఫేలిక్స్ ఆ ప్రదేశంలో అందరికన్నా ఎక్కువ అధికారం గలవాడైనా క్రీస్తును గురించి అతనికి తెలియజేయడానికి పౌలు సంకోచించలేదు. అపో. కార్యములు 20:24; అపో. కార్యములు 26:22; మత్తయి 10:18 పోల్చి చూడండి.

25. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.

ఫేలిక్స్‌కు నీతిన్యాయాలు, ఆశానిగ్రహం అంటూ బొత్తిగా లేవు (నీతిన్యాయాల గురించి మత్తయి 5:6, మత్తయి 5:20 నోట్స్ చూడండి). అతడు దేవుని తీర్పుకు గురి కాబోతున్నాడు (అపో. కార్యములు 17:31). ఖైదీగా ఉన్న పౌలు ఈ అధికారి పాపాన్ని గురించి, అతనికున్న అవసరత గురించి మాట్లాడడానికి తెగించాడు. అయినా ఫేలిక్స్ అన్ని కాలాల్లో ఉన్న చాలామంది లాంటివాడు. నిర్ణయం చేసుకునే దినాన్ని వాయిదా వేయగోరాడు. ఇలాంటి వారికి వీలైన దినం ఎప్పుడైనా వస్తుందా?

26. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.

ఫేలిక్స్‌కు పరలోక ధనం అందుబాటులో ఉంది, గాని అతడు ఆశించినది ఈ లోకంలో లంచాలు. లంచాల గురించి నిర్గమకాండము 23:8; 1 సమూయేలు 8:3; 1 సమూయేలు 12:3; కీర్తనల గ్రంథము 15:5; కీర్తనల గ్రంథము 26:10; యెషయా 33:15 చూడండి.

27. రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.

క్రీస్తు రాయబారులందరిలో గొప్పవాణ్ణి రెండు సంవత్సరాలుగా చెరసాలలో ఉంచిన సంగతికి దేవుడు అనుమతించడం విపరీతం అనిపిస్తుందా? రోమీయులకు 11:33-34 చూడండి. పౌలు ఆ కాలాన్ని దుర్వినియోగపరచలేదన్నది ఖాయం. ప్రార్థన చేయడం కోసం, సాటి ఖైదీలకు శుభవార్త చెప్పడంకోసం, లేఖలు సంఘాలకు రాయడం కోసం అతనికి ఎక్కువ సమయం దొరికింది.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |