Acts - అపొ. కార్యములు 26 | View All

1. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను

2. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక

3. యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొను చున్నాను.

4. మొదటినుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.

5. వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.

6. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.

7. మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.

“ఈ వాగ్దానం”– న్యాయవంతులు చనిపోయాక సజీవంగా లేస్తారనే వాగ్దానం – దానియేలు 12:2; యోహాను 5:28-29.

8. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచు చున్నారు?

దేవుడు ప్రపంచాలను సృజించి భూమిమీద మానవుణ్ణి ఉంచాడు. చనిపోయినవారిని లేపడం అనేది ఆయనకు కష్టతరం అనిపించదు గదా. క్రీస్తు రాయబారులు ప్రకటించిన శుభవార్త సారాంశంలో చనిపోయినవారు తప్పక లేస్తారనే బోధన ఇమిడి ఉందని మరో సారి గమనించండి (అపో. కార్యములు 1:3).

9. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;

అపో. కార్యములు 22:3-5; 1 తిమోతికి 1:13. తాను క్రీస్తుసంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు అది తగిన పని అనీ ఆ విధంగా తాను నిజమైన విశ్వాస సత్యాలను కాపాడుతున్నాననీ అనుకొన్నాడు పౌలు. యోహాను 16:2 పోల్చి చూడండి.

10. యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;

11. అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.

దేవదూషణ గురించి మత్తయి 9:3 నోట్. తాను క్రైస్తవులచేత దేవదూషణ చేయించడానికి ప్రయత్నించానని ఈ ఒక్క చోట పౌలు చెప్పాడు. ఈ ప్రయత్నం సఫలమైందని మాత్రం చెప్పలేదు.

12. అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా

13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

14. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించు చున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

ఇక్కడ (ఇక్కడ మాత్రమే) పౌలు “ములుకోలలకు ఎదురు తన్నడం” గురించి రాసి ఉంది. బలమైన ఎద్దును అదుపులో ఉంచేందుకు దాని యజమాని ములుకోలతో గుచ్చుతుంటాడు. క్రైస్తవులను హింసించిన పౌలు ఇలాంటి పదునైన కొనతో గుచ్చడం అనుభవించే బలమైన ఎద్దులాంటివాడు. వేరే మాటలతో చెప్పాలంటే తాను మంచివారిపట్ల క్రూరంగా వ్యవహరించడంవల్ల పౌలు మనసులో కొంత కలత, హృదయంలో కొంత బాధ ఉండి ఉండాలి. అతని నిజ స్థితిని గురించీ, అతని పాపాల గురించీ పవిత్రాత్మ అతణ్ణి ఒప్పించడం ఆరంభించాడన్నమాట.

15. అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.

16. నీవు నన్ను చూచి యున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను.నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము;
యెహెఙ్కేలు 2:1

అపో. కార్యములు 9:6, అపో. కార్యములు 9:15; అపో. కార్యములు 22:14-15, అపో. కార్యములు 22:21 లో గాక ప్రభువు ఇంకా ఏ మాటలు చెప్పి పౌలును తన సేవకుడుగా నియమించాడో ఇక్కడ అతడు తెలియజేస్తున్నాడు.

17. నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;
1 దినవృత్తాంతములు 16:35, యిర్మియా 1:7-8

18. వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 33:3-4, యెషయా 35:5-6, యెషయా 42:7, యెషయా 42:16, యెషయా 61:1

శుభవార్తికుడుగా పౌలు పని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజలకు నిజ జ్ఞానప్రకాశాన్ని కలిగించేందుకు అతడు క్రీస్తు సాధనంగా ఉన్నాడు. వారిని సైతాను దాస్యం లోనుంచి విడిపించేందుకూ (యోహాను 8:33-35, యోహాను 8:44; ఎఫెసీయులకు 2:1-2; 2 తిమోతికి 2:26 పోల్చి చూడండి. సైతాను గురించి 1 దినవృత్తాంతములు 21:1 నోట్ చూడండి), వారికి పాపక్షమాపణ పొందే అవకాశాన్ని కలిగించేందుకూ (మత్తయి 26:28; లూకా 24:47), దేవుని ప్రజలుగా వారసత్వాన్ని అనుభవించేలా చేసేందుకూ (అపో. కార్యములు 20:32; ఎఫెసీయులకు 1:11; కొలొస్సయులకు 1:12; 1 పేతురు 1:4) అతడు క్రీస్తు సాధనంగా ఉన్నాడు. ప్రతి నిజ శుభవార్తికుడి పనీ ఇదే. పవిత్రం కావడం అనేది క్రీస్తుమీది నమ్మకంవల్ల కలుగుతుందని గమనించండి దేవుడు తన సొంత ప్రజగా ఉండేందుకు క్రీస్తు మీద విశ్వాసం పెట్టినవారిని ఇతరులనుంచి ప్రత్యేకించు కొంటాడన్నమాట.

19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

తాను క్రీస్తుమీద నమ్మకం పెట్టేందుకు గల కారణం తన సొంత ఆలోచనల ఫలితం కాదు, మనుషుల ఉపదేశం కాదు, గానీ దేవుడు పరలోకంనుంచి వెల్లడి చేసినది (గలతియులకు 1:11-12) అని పౌలు నొక్కి చెపుతున్నాడు. దేవుడు వెల్లడి చేసినదానికి అతడు విధేయుడుగా తన జీవిత కాలమంతా గడిపాడు.

20. మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారు మనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.

అపో. కార్యములు 9:20-22, అపో. కార్యములు 9:28. అతడు పశ్చాత్తాపం గురించి నొక్కి చెప్పడం మరో సారి గమనించండి. నిజమైన పశ్చాత్తాపం వల్ల జీవితం తీరు మారిపోవాలని కూడా గమనించండి. మత్తయి 3:2, మత్తయి 3:8; మత్తయి 4:17; లూకా 13:2-5 నోట్స్ చూడండి. ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రకటించని ఏ బోధకుడైనా నిజమైన క్రీస్తుశుభవార్తను ప్రకటించడం లేదన్నమాట.

21. ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి;

22. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని

అల్పులన్నా ఘనులన్నా పౌలుకు ఒకటే. ఎలాంటి వ్యక్తితో మాట్లాడినా అతడు శుభవార్తను ఉన్నది ఉన్నట్టుగానే బోధించాడు.

23. ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.
యెషయా 42:6, యెషయా 49:6

24. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు- పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.

ఫేస్తస్ రోమ్‌వాడు. మొత్తంమీద రోమ్‌ప్రజలు అనేకమంది దేవుళ్ళున్నారని నమ్మేవారు, అనేక విషయాల్లో మూఢ విశ్వాసం గలవారు. అయినా క్రీస్తు చనిపోయి సజీవంగా లేచాడనే రుజువైన విషయాన్ని పౌలు నమ్మినందుచేత అతనికి పిచ్చి పట్టిందని ఫేస్తస్ అనుకొన్నాడు. మార్కు 3:20-21 పోల్చి చూడండి. అయినప్పటికీ అతడు పౌలు పాండిత్యాన్ని గుర్తించాడు.

25. అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.

ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉన్నవారికి ఏది వెర్రితనంగా అనిపిస్తుందో అది దేవుని వెలుగులోకి వచ్చినవారికి సత్యంగా, బుద్ధికీ అనుగుణంగా ఉంది. నిజంగా వెర్రివారు ఎవరంటే ఈ లోకంలో తమ సొంత మార్గాల్లో సాగిపోతూ, నిజ దేవుణ్ణి వెదకకుండా దేవుడు క్రీస్తులో వెల్లడి చేసిన సత్యాన్ని శ్రద్ధగా ఆలోచించకుండా ఉన్నవారే. ప్రసంగి 9:3 చూడండి.

26. రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడు చున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.

ఫేస్తస్‌కు క్రీస్తును నమ్మే ఆశ లేదని పౌలు గుర్తించాడు. అగ్రిప్పనైనా క్రీస్తుకోసం సంపాదించుదామని ఆశతో అతనివైపు చూస్తూ మాట్లాడసాగాడు.

27. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.

28. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.

“నమ్మకం ఉందా”? అనే పౌలు ప్రశ్నకు అగ్రిప్ప “లేదు” అని చెప్పగోరలేదు. ఎందుకంటే తన గురించి యూదులకు మంచి అభిప్రాయం ఉండాలి అనుకొన్నాడు. “ఉంది” అని కూడా చెప్పనిష్టపడలేదు. ఎందుకంటే తాను పౌలు పక్షం వహిస్తున్నానని కనబడకుండా ఉండాలనుకొన్నాడు. కాబట్టి పౌలు ప్రశ్నకు మరో ప్రశ్న వేశాడు.

29. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.

“నమ్మకం ఉందా”? అనే పౌలు ప్రశ్నకు అగ్రిప్ప “లేదు” అని చెప్పగోరలేదు. ఎందుకంటే తన గురించి యూదులకు మంచి అభిప్రాయం ఉండాలి అనుకొన్నాడు. “ఉంది” అని కూడా చెప్పనిష్టపడలేదు. ఎందుకంటే తాను పౌలు పక్షం వహిస్తున్నానని కనబడకుండా ఉండాలనుకొన్నాడు. కాబట్టి పౌలు ప్రశ్నకు మరో ప్రశ్న వేశాడు.

30. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి

31. ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.

32. అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |