Acts - అపొ. కార్యములు 3 | View All

1. పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,

మధ్యాహ్నం మూడు గంటలకు దేవాలయంలో యూద యాజులు సాయంకాల అర్పణలు, ప్రార్థనలు చేయడం ఆరంభించారు.

2. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.

3. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా

4. పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి.

వారు ఆ మనిషిని అసాధారణమైనదాని కోసం సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

5. వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.

6. అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి

యేసుక్రీస్తు రాయబారులు పేదలని ఇక్కడ చూస్తున్నాం. మత్తయి 4:18-22; మత్తయి 19:27; లూకా 6:20 పోల్చి చూడండి. ఈ విషయంలో వారు వారి ప్రభువులాగే ఉన్నారు – మత్తయి 8:20. అయితే ఆధ్యాత్మిక బలప్రభావాలలో వారు ఐశ్వర్యవంతులు. తరచుగా విశ్వాసుల ఆస్తి, ధనం ఎక్కువవుతూ ఉంటే వారి ఆధ్యాత్మిక బలప్రభావాలు తక్కువవుతాయి అని కనిపిస్తుంది. యేసుప్రభువు మత్తయి 6:19-21 లో అతి శ్రేష్ఠమైన ఆదేశాలిచ్చాడు. “క్రీస్తు పేర” అంటే క్రీస్తు అధికారం, బలప్రభావాలను బట్టి అని అర్థం. పేతురు క్రీస్తు ప్రతినిధిగా ఈ పని జరిగిస్తున్నాడు. యోహాను 14:13-14; యోహాను 20:21 చూడండి.

7. వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.

పేతురు చేసినది, చెప్పినది కలిసి ఈ మనిషిలో నమ్మకాన్ని, స్వస్థతను కలిగించాయి.

8. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.

ఆది శిష్యులు చాలామందిని బాగు చేశారు (అపో. కార్యములు 5:15-16; అపో. కార్యములు 8:7; అపో. కార్యములు 14:8-10; అపో. కార్యములు 19:11-12; అపో. కార్యములు 28:8-9). అయితే రోగులను బాగు చేయడం కోసం ప్రత్యేకమైన సభలను పెట్టారని ఎక్కడా రాసిలేదు. వారు పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్కు ప్రకటిస్తూ, ఉపదేశిస్తూ ఉన్నప్పుడు తాము కలుసుకొన్నవారిని, తమ దగ్గరికి వచ్చినవారిని కొన్ని సార్లు బాగు చేశారు. ఇక్కడ బాగైన ఈ మనిషి స్తుతించినది పేతురును కాదు, దేవుణ్ణే అని గమనించండి. తనను బాగు చేసినది పేతురు కాదు, దేవుడే అని అతనికి తెలుసు.

9. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి

10. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి,వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

అపో. కార్యములు 2:7, అపో. కార్యములు 2:12; అపో. కార్యములు 10:45; అపో. కార్యములు 12:16; అపో. కార్యములు 13:12; మత్తయి 8:27; మత్తయి 9:8, మత్తయి 9:23; మత్తయి 12:23. ప్రజలు మనలో పని చేస్తున్న దేవుని ఆత్మ బలప్రభావాలను చూచి మనం చేసేదానికి, చెప్పేదానికి దేనికైనా ఆశ్చర్యపడతారా?

11. వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.

“సొలొమోను మంటపం”దేవాలయం బయట ఆవరణానికి తూర్పు దిక్కున ఉంది.

12. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?

పేతురు దేవుని సత్యాన్ని ప్రకటించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ అద్భుతం ద్వారా అతడు మనుషులను తన వైపుకు మళ్ళించుకుని తన పేరు ప్రతిష్ఠలను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ అద్భుతం చేసేలా శక్తి ఇచ్చినది దేవుడని అందరికీ తెలిసి ఘనత, మహిమ అంతా దేవునికే కలగాలని కోరాడు. అపో. కార్యములు 14:8-15 కూడా చూడండి.

13. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.
నిర్గమకాండము 3:6, యెషయా 52:13

ఇస్రాయేల్‌లో “అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు” ఏకైక నిజ దేవుని పేర్లలో ఒకటి (నిర్గమకాండము 3:6). దానికి కారణం ఆది 12–50 అధ్యాయాలలో కనిపిస్తున్నది. “తన సేవకుడైన యేసు”– యెషయా 42:1-4; యెషయా 52:13-15; యెషయా 53:11; మత్తయి 20:28; రోమీయులకు 15:8; ఫిలిప్పీయులకు 2:5-7 చూడండి. దేవుడు ఆయనను మరణం నుంచి సజీవంగా లేపడం, పరలోకానికి కొనిపోవడం మూలంగా యేసును గౌరవించాడు. ఈ యూదులు యేసుపట్ల ఎలా ప్రవర్తించారో తమకు తెలుసు (యోహాను 19:14-16).

14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
కీర్తనల గ్రంథము 89:19

“పవిత్రుడూ న్యాయవంతుడూ” అయినవాడు – ఇది అభిషిక్తుని బిరుదులలో ఒకటి (అపో. కార్యములు 7:52; అపో. కార్యములు 22:14; అపో. కార్యములు 4:27, అపో. కార్యములు 4:30; మార్కు 1:24; యాకోబు 5:6; 1 యోహాను 2:20). ఈ బిరుదు క్రీస్తు దేవత్వాన్ని సూచిస్తుంది (ప్రకటన గ్రంథం 15:3-4. స్వభావసిద్ధంగా పవిత్రుడు దేవుడు మాత్రమే). యేసు దేవుని సేవకుడు, అంతేకాకుండా అవతారమెత్తిన దేవుడే (రిఫరెన్సుల కోసం ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్ చూడండి.)

15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

“జీవానికి కర్త” అన్న మాటలు కూడా క్రీస్తు దేవత్వాన్ని సూచిస్తాయి. యోహాను 5:19-27 చూడండి. జీవాన్ని సృజించగలది దేవుడు తప్ప మరింకెవరు ఉన్నారు? “సాక్షులం”– అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:32.

16. ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.

వారు నొక్కి చెప్పినదంతా యేసును గురించే – ఆయన పేరు, బలప్రభావాల గురించే. వారి తలంపులకు, సాక్ష్యానికి, క్రియలకు ఆయనే కేంద్రం.

17. సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.

18. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయ ములను ఈలాగు నెరవేర్చెను.

19. ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును

“పశ్చాత్తాపపడి”– అపో. కార్యములు 2:38; మత్తయి 3:2; లూకా 13:3-5; అపో. కార్యములు 17:30. తమ “పాపాలు నిర్మూలం” కావాలని కోరినవారికి పశ్చాత్తాపం తప్పనిసరి.

20. మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.

“అభిషిక్తుడు”– దేవుడు యేసును ఇస్రాయేల్‌ప్రజలకు అభిషిక్తుడుగా, రాజుగా నియమించాడు (అపో. కార్యములు 2:36). ఈ వచనాలను బట్టి చూస్తే ఇస్రాయేల్ ప్రజలు పశ్చాత్తాపపడి ఆయనను స్వీకరించేవరకు యేసు వారి రాజుగా ఉండడానికి తిరిగి రాడని అనుకోవచ్చు.

21. అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.

జరగవలసిన ప్రతిదానికీ దేవుడు ఒక కాలం నియమించాడు. ఆ కాలం వచ్చేవరకు అది జరగదు (అపో. కార్యములు 1:7). “కుదురుబాటు కాలాలు”– అపో. కార్యములు 1:6; మత్తయి 19:28; రోమీయులకు 8:18-23; యెషయా 11:1-16; యెహెఙ్కేలు 37:1-28; మొ।।.

22. మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.
ద్వితీయోపదేశకాండము 18:15-18

ద్వితీయోపదేశకాండము 18:15, ద్వితీయోపదేశకాండము 18:18-19. దేవుడు వాగ్దానం చేసిన ఈ ప్రవక్త యేసుప్రభువని పేతురు సూచిస్తున్నాడు.

23. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
లేవీయకాండము 23:29, ద్వితీయోపదేశకాండము 18:19

24. మరియసమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.

గతంలో క్రీస్తులాగా పేతురు కూడా ఇక్కడ నొక్కి చెప్పేది క్రీస్తు రాకడ పాత ఒడంబడిక గ్రంథంలోని దేవుని వాగ్దానాల ప్రకారమే అని (మత్తయి 5:17; లూకా 24:25-27, లూకా 24:44-47; యోహాను 5:39, యోహాను 5:46).

25. ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.
ఆదికాండము 12:3, ఆదికాండము 18:18, ఆదికాండము 22:18, ఆదికాండము 26:4

“మీరు”– యూదులని పేతురు భావం. రోమీయులకు 9:4-5 పోల్చి చూడండి. దేవుడు దీవెన గురించిన వాగ్దానం అబ్రాహాముకు చేశాడు (ఆదికాండము 12:3). శరీర సంబంధంగా అబ్రాహాము సంతానం యూదులే.

26. దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

దేవుడు అబ్రాహాము ద్వారా రావాలని వాగ్దానం చేసిన దీవెనను యేసుప్రభువు మనుషులకు తెచ్చాడని పేతురు చెపుతున్నాడు. గలతియులకు 3:6-9, గలతియులకు 3:14 కూడా చూడండి. దేవుడు యేసును మరణంనుంచి సజీవంగా లేపడం మూలంగా ఈ సత్యాన్ని నిరూపించాడు. అప్పుడు తాను ఎన్నుకొన్న తన ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి మొదట పంపాడు. ఆయనను పంపిన విధానం తన ఆత్మను పంపి తన రాయబారుల చేత మాట్లాడించడం. దేవుని దీవెన ఏమిటో ఇక్కడ రాసి ఉంది, చూశారా – “దుర్మార్గాలనుంచి మళ్ళించడం”. మత్తయి 1:21; గలతియులకు 1:3-4; తీతుకు 2:13-14; 1 పేతురు 2:24 పోల్చి చూడండి. దేవుడిచ్చే దీవెనలన్నిటిలో ఇది ముఖ్యమైనది. అసలు ఇది లేకుండా శాశ్వతమైన వేరే దీవెనలు ఉండవు. దీవెన, ధన్యత గురించిన నోట్స్ ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-12; లూకా 11:28; గలతియులకు 3:9, గలతియులకు 3:14; ఎఫెసీయులకు 1:3.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |