Acts - అపొ. కార్యములు 4 | View All

1. వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును

యేసు లోకంలో ఉన్నప్పుడు ఆయన బద్ధ శత్రువులలో కొందరు దేవాలయానికి చెందిన యాజులే (మత్తయి 16:21; మత్తయి 20:18; మత్తయి 21:15, మత్తయి 21:23, మత్తయి 21:46; మత్తయి 27:1, మత్తయి 27:12, మత్తయి 27:41, మత్తయి 27:62). ఆయన రాయబారులు కూడా వారి విరోధ భావానికి గురి అయ్యారు. “సద్దూకయ్యులు”– మత్తయి 3:7 నోట్.

2. వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి

చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేవడం అనేది ఉందని సద్దూకయ్యులు నమ్మలేదు (అపో. కార్యములు 23:8).

3. వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.

ఆ రోజుల్లో ఇస్రాయేల్ జాతి ఎలాంటిదో దీన్నిబట్టి తెలుస్తున్నది – ఈ లోకంలో ఎప్పుడైనా వినబడ్డ వార్తలన్నిట్లో అతి శ్రేష్ఠమైన శుభవార్తను వినిపించినందుచేత మనుషులు జైలుపాలై మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది (అపో. కార్యములు 5:17-18; అపో. కార్యములు 12:1-4). ఇలాంటిది ఇప్పటికీ కొన్ని దేశాలలో జరుగుతూ ఉంది.

4. వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.

5. మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.

6. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.

7. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా

తమ ప్రశ్నకు జవాబు ఏమిటో వారికి తెలుసు. అయితే వారు క్రీస్తు రాయబారులమీద నేరం మోపడానికి అవకాశం కోసం చూస్తున్నారు.

8. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,

పేతురు ఈ ప్రశ్నను క్రీస్తును ప్రకటించే అవకాశంగా ఎంచాడు. మత్తయి 10:16-20 పోల్చి చూడండి.

9. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక

అతడు వారికి వారి గుణం ఎలాంటిదో చూపుతున్నాడు – వారు కుంటి మనిషిని దయ చూపినవారి మీద అలా చేసినందుకు నేరం మోపడానికి సిద్ధంగా ఉన్నారు!

10. మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.

అపో. కార్యములు 3:6, అపో. కార్యములు 3:12 యేసును చంపినప్పుడు దానితో ఆయన సంగతి అయిపోయిందని ఈ నాయకులు ఆశించారు (మత్తయి 27:65-66; మత్తయి 27:22-23, మత్తయి 27:62-64).

11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
కీర్తనల గ్రంథము 118:22-23, దానియేలు 2:34-35

12. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

యేసు ఈ సత్యం తమకు ఉపదేశించాడు గనుకనే వారు దీన్ని ఇతరులకు నేర్పారు (యోహాను 14:6; యోహాను 10:7-8; యోహాను 3:16-19, యోహాను 3:36). క్రొత్త ఒడంబడిక గ్రంథంలోని అతి శ్రేష్ఠమైన మాటల్లో “పాపవిముక్తి” ఒకటి. ఆ మాటలో పాపక్షమాపణ (లూకా 24:47), కొత్త జన్మం (యోహాను 1:12-13; యోహాను 3:3-8), పాపదాస్యం నుంచి విడుదల (యోహాను 8:32-36), దేవుని లెక్కలోకి న్యాయవంతులుగా రావడం (రోమీయులకు 1:16; రోమీయులకు 3:21-28), శాశ్వత జీవం (రోమీయులకు 3:16), దేవుని సన్నిధిలో నిరంతరం ఉండడం (యోహాను 14:3) మొదలైనవి ఇమిడి ఉన్నాయి.

13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

వారి ధైర్యానికి ఆధారం క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని వారికి తెలిసి ఉండడం, పవిత్రాత్మ సంపూర్ణతను వారు అనుభవించడం. దానికి సరిపోయిన వేరే వివరణ ఏదీ లేదు. క్రీస్తు చనిపోయిన తరువాత వారికి ధైర్యం లేదు (యోహాను 20:19). ఒకప్పుడు పేతురు ఒక పనిపిల్ల ఎదుట నిలబడలేకపోయాడు (మత్తయి 26:69-70). ఇప్పుడైతే అతడు ఇస్రాయేల్‌ప్రజల దుర్మార్గులైన నాయకులను, మరణాన్ని కూడా చాలా ధైర్యంతో ఎదుర్కోగలడు (వ 29; అపో. కార్యములు 5:29-33, అపో. కార్యములు 5:41-42). పేతురు వంటి సామాన్యమైనవారితో క్రీస్తు చేయగలిగేది ఇదే. ఈ రోజుల్లో కూడా ఆయన ఇలా చేస్తున్నాడు. ఆ నాయకులు వారి ధైర్యానికున్న మూలాధారం ఏమిటో గుర్తించారు – యేసుప్రభువని.

14. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.

15. అప్పుడు సభ వెలుపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి

16. ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయ బడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజ

ఈ మనుషుల హృదయం ఎంత కఠినంగా ఉందో చూడండి. ఆ అద్భుతం తప్పక జరిగిందని వారికి తెలుసు. అయినా ఆ అద్భుతాన్ని తన శిష్యుల ద్వారా జరిగించిన క్రీస్తుమీద నమ్మకం పెట్టడానికి నిరాకరించారు. యోహాను 15:24 పోల్చి చూడండి.

17. అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడ కూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.

18. అప్పుడు వారిని పిలిపించిమీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.

పవిత్రాత్మతో నిండిన శిష్యులకు ఇలా ఆజ్ఞ జారీ చేయడం ఎంత వ్యర్థం! చేయి ఎత్తి ఆగమంటే గాలి ఆగుతుందా?

19. అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

అపో. కార్యములు 5:29. పరిపాలకుల ఆజ్ఞలు దేవుని వాక్కుకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో తప్ప క్రైస్తవులు వారి ఆజ్ఞలకు లోబడాలి (రోమీయులకు 13:1-2). ఆ సందర్భంలో వారు దేవునికే విధేయులై దానివల్ల కలిగే ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి.

20. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

పవిత్రాత్మతో నిండిన యేసు శిష్యుడు ఊపిరి తీయడం ఎంత నిశ్చయమో యేసుకోసం మాట్లాడడం అంత నిశ్చయం. అలాంటివాడు మాట్లాడడం మానుకోలేదు. 2 కోరింథీయులకు 5:14; యిర్మియా 20:9 పోల్చి చూడండి.

21. ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.

22. స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

ఒకే ఒక సంఘటన కొందరు బెదిరించడానికీ మరికొందరు దేవుణ్ణి స్తుతించడానికీ కారణం అయింది. మనుషులు రెండు రకాలు గదా.

23. వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.

24. వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
నిర్గమకాండము 20:11, కీర్తనల గ్రంథము 146:6

వారి ప్రార్థన విశ్వాన్ని సృజించినవానికే (ఆది 1వ అధ్యాయం; యోహాను 1:1-3; హెబ్రీయులకు 1:1-2). ఆయనే ఉనికిలో ఉన్న ఏకైక దేవుడు.

25. అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
కీర్తనల గ్రంథము 2:1-2

దేవుని ఆత్మ దావీదు ద్వారా మాట్లాడాడని వారి గట్టి నమ్మకాన్ని గమనించండి. ఈ సంగతి యేసుప్రభువు వారికి ఉపదేశించాడు (మత్తయి 15:3, మత్తయి 15:6; మత్తయి 22:43; యోహాను 10:35; లూకా 24:45). వారు ఎత్తి చెప్పిన మాటలు కీర్తనల గ్రంథము 2:1-2 లో ఉన్నాయి. అక్కడి నోట్స్ చూడండి.

26. ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను3 భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
కీర్తనల గ్రంథము 2:1-2

27. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
కీర్తనల గ్రంథము 89:19, యెషయా 61:1

28. వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

అపో. కార్యములు 2:23. “ముందు నిర్ణయించావో”– ఇలా తర్జుమా చేసిన గ్రీకు పదం క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇంకా 5 సార్లు మాత్రమే కనిపిస్తున్నది. రోమీయులకు 8:29-30; 1 కోరింథీయులకు 2:7; ఎఫెసీయులకు 1:5, ఎఫెసీయులకు 1:11 చూడండి.

29. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి

వ 13.

30. రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము.
కీర్తనల గ్రంథము 89:19

దేవుడు తమద్వారా జరిగించిన చర్యలవల్ల తమకు అనేక కష్టాలు కలిగినా అలా జరిగిస్తూ ఉండాలని వారు దేవుణ్ణి ప్రార్థించారు. యేసు చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేచాడని వారు తెలుసుకొన్నారని, సమాధిలోనుంచి ఆయన శరీరాన్ని వారు తీసివేయలేదని ఇదంతా బలమైన రుజువు (మత్తయి 27:64; మత్తయి 28:6; మొ।।).

31. వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.

అపో. కార్యములు 2:2-4. మరో సారి వారు పవిత్రాత్మతో నిండిపోయారు. దేవుని ఆత్మతో నిండిపోవడం ఒకే సారి జరిగి ఊరుకునే విషయం కాదు.

32. విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.

అపో. కార్యములు 2:44-45. వారు “హృదయంలో, మనసులో ఏకంగా ఉన్నారు” గనుకనే ఇలా చేశారని గమనించండి. క్రీస్తు సేవను గురించి వారందరి ఆలోచనలు, ఉద్దేశాలు ఒకటే. తమను తాము ప్రేమించుకొన్నట్టే వారు సాటి విశ్వాసులను ప్రేమించారు.

33. ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

ఇస్రాయేల్‌ప్రజలు మత నాయకుల బెదిరింపులు పనికిమాలినవి. క్రీస్తు చనిపోయి లేచాడనే సంగతి శిష్యుల సందేశానికి కేంద్రంగా ఉందని మరోసారి గమనించండి – అపో. కార్యములు 1:22; అపో. కార్యములు 2:24, అపో. కార్యములు 2:32; అపో. కార్యములు 3:15, అపో. కార్యములు 3:26; అపో. కార్యములు 4:2, అపో. కార్యములు 4:10; అపో. కార్యములు 5:30; అపో. కార్యములు 10:40; అపో. కార్యములు 13:30; అపో. కార్యములు 17:18, అపో. కార్యములు 17:31; అపో. కార్యములు 23:6.

34. భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.

35. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.

36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి

అపో. కార్యములు 9:27; అపో. కార్యములు 11:22-25, అపో. కార్యములు 11:30; అపో. కార్యములు 12:25; అపో. కార్యములు 13:1-2. ఇస్రాయేల్‌లో లేవీగోత్రం దేవాలయం సేవకోసం ప్రత్యేకించబడింది (సంఖ్యాకాండము 3:5-10). సైప్రస్ ద్వీపం మధ్యధరా సముద్రంలో లెబానోను దేశానికి పశ్చిమంగా ఉంది.

37. దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |