Romans - రోమీయులకు 1 | View All

1. యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును,

“ప్రియులందరికీ”– విశ్వాసులందరినీ దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు (యోహాను 13:1; యోహాను 14:21, యోహాను 14:23; 1 యోహాను 3:1). క్రీస్తు విశ్వాసులందరూ పవిత్రులే. యోహాను 17:17-19 చూడండి. బైబిలు ప్రకారం పవిత్రులు అంటే క్రైస్తవంలో ఏదో అసాధారణమైన విశేష పవిత్రత కలిగి, దేవుడంటే మితిలేని శ్రద్ధ కలిగిన విజయవంతమైన కొద్దిమంది విశ్వాసులని అర్థం కాదు. ఏ తేడా లేకుండా విశ్వాసులంతా పవిత్రులే. వారు పవిత్రులు కాబట్టి, పవిత్రుడైన యేసుప్రభువుకు చెందినవారు కాబట్టి వారు పవిత్రంగా జీవించాలి. “పౌలు”– అపో. కార్యములు 7:58; అపో. కార్యములు 8:1-3; అపో. కార్యములు 9:1-19; అపో. కార్యములు 13:9.

2. దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.

“కృప, శాంతి”– ఇవి రెండూ క్రీస్తు శుభవార్తలోని రెండు గొప్ప మాటలు. కొత్త ఒడంబడిక గ్రంథంలో పౌలు రాసిన ప్రతి లేఖలోనూ వందనాలు చెప్పడానికి ఈ మాటలనే అతడు ఉపయోగించాడు. కృప లేక అనుగ్రహం విశ్వాసులకు పాపవిముక్తి ఇచ్చి వారిని భద్రంగా ఉంచుతూ పవిత్ర జీవనానికి అవసరమైన వాటన్నిటినీ ఉచితంగా ఇస్తూ ఉంటుంది, ఇతరులకు ప్రయోజనకరంగా, భక్తిభావంతో జీవించడానికి అవసరమైనవాటన్నిటినీ ఇస్తూ ఉంటుంది. యోహాను 1:14 నోట్ చూడండి. దేవుని అనుగ్రహానికి మనకు మనం అర్హులం కాలేము. అసలు అనుగ్రహం లేక కృప అంటే దానికి అర్హులు కానివారికీ తమ స్వంత ప్రయత్నాలవల్ల దాన్ని సంపాదించు కోలేని వారికీ దేవుడు చూపే దయ. ఇక్కడ శాంతి అంటే హృదయంలో నెమ్మది, మనశ్శాంతి. వీటిని ఇచ్చేది క్రీస్తే (మత్తయి 11:28-30; యోహాను 14:27; యోహాను 16:33). దేవునితో సరైన సంబంధం కలగడం మూలాన వచ్చే ఫలితం ఇది. తండ్రి అయిన దేవునిలాగానే యేసుప్రభువే అనుగ్రహానికీ శాంతికీ మూలాధారం అన్న విషయం గమనించండి. దేవుని స్వభావంలో ఆయన కూడా భాగస్థుడు గనుక ఇది సాధ్యం. ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 రిఫరెన్సులు చూడండి.

3. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక,

“దాసుణ్ణి”– ఈ గ్రీకు పదాన్ని “బానిస” అని తర్జుమా చేయవచ్చు. అంటే మరో వ్యక్తికి పూర్తిగా చెంది ఉండేవాడు. ఇలా చూస్తే విశ్వాసులంతా క్రీస్తు దాసులు, బానిసలే. పాప దాస్యంనుంచి ఆయన వారినందరినీ కొనుక్కుని తన సొత్తుగా తన ప్రజలుగా చేసుకున్నాడు (రోమీయులకు 6:16-18, రోమీయులకు 6:22; మత్తయి 20:28; 1 కోరింథీయులకు 6:19-20). క్రీస్తుతో ఈ సంబంధాన్ని పౌలు ఆనందంగా, పూర్తి సమ్మతితో అంగీకరించాడు. విశ్వాసులందరి ధర్మమూ ఇదే. “రాయబారి”– (పాత అనువాదంలో “అపొస్తలుడు”) – 1 కోరింథీయులకు 1:1; గలతియులకు 1:1. గ్రీకు భాషలో ఈ పదానికి అర్థం ఒక పనిమీద పంపబడినవాడు, లేక ఒకరి పక్షంగా ఒక కార్యాన్ని సాధించేందుకు వెళ్ళినవాడు. మత్తయి 10:2 చూడండి. “ప్రత్యేకించబడ్డవాణ్ణి”– పౌలుకు దేవుడొక ప్రత్యేకమైన పనిని నియమించాడు. క్రీస్తు శుభవార్తను ప్రకటించడం, వివరించడం, దాని పక్షంగా వాదించడం. ఈ శుభవార్త “దేవుని”ది అన్న సంగతి గమనించండి. ఒకే నిజ దేవుడు దానికి రూపకల్పన చేశాడు. ముందుగా దాని గురించి ఏర్పాటు చేసి, మార్గం సిద్ధం చేసి దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు అంతటా ఉన్న ప్రజలకు దాన్ని ఇవ్వజూపుతున్నాడు.

4. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను.

క్రీస్తు శుభవార్త పూర్తిగా కొత్తదేమీ కాదు. పాత ఒడంబడిక గ్రంథంలో (“పవిత్ర లేఖనాల్లో”) ఆ శుభవార్త గురించిన వాగ్దానాలూ, భవిష్యద్వాక్కులు, నీడలు, సాదృశ్యాలు ఉన్నాయి. లూకా 24:25-27, లూకా 24:46-47; మత్తయి 5:17; హెబ్రీయులకు 8:5; హెబ్రీయులకు 10:1 చూడండి.

5. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.

క్రీస్తు రెండు స్వభావాలున్న ఒక వ్యక్తి – దేవుని స్వభావం, మానవ స్వభావం. ఆయన దావీదు సంతానం (మత్తయి 1:1), దేవుని కుమారుడు కూడా (మత్తయి 1:1; మత్తయి 3:17; హెబ్రీయులకు 2:14, హెబ్రీయులకు 2:17).

6. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితివిు.

“పవిత్రమైన ఆత్మ”– అంటే పవిత్రాత్మ (యోహాను 14:16-17). లేవీయకాండము 20:7; యోహాను 17:17-19 దగ్గర పవిత్రత గురించి నోట్స్ చూడండి. క్రీస్తు దేవుని కుమారుడనడానికి చివరి రుజువు ఆయన చనిపోయి సజీవంగా లేవడమే. మత్తయి 28:6 చూడండి. ఆయన కనిపించి, తన గురించి చాలా గొప్పలు చెప్పుకొని, చనిపోయి సమాధిలో ఉండిపోలేదు. తాను చెప్పిన వాటికి ఆధారంగా తన చర్యలను చూపించాడు. ఆయన దేవుని కుమారుడనేందుకు ఇతర ఆధారాల కోసం యోహాను 5:31-47 చూడండి.

7. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
సంఖ్యాకాండము 6:25-26

తనకు కలిగిన పాపవిముక్తి, రక్షణ, క్రీస్తును సేవించడానికి తనకు కలిగిన అవకాశం కేవలం దేవుడు ఉచితంగా ఇచ్చినవే అని పౌలు చక్కగా అర్థం చేసుకున్నాడు (ఎఫెసీయులకు 2:3-10; ఎఫెసీయులకు 3:7-8; 1 తిమోతికి 1:13-17; 2 తిమోతికి 1:9; తీతుకు 3:3-8). ముఖ్యంగా యూదేతర ప్రజలమధ్య పరిచర్య చేసేందుకు దేవుడతణ్ణి నియమించాడు. యూదులకు కూడా అతడు ప్రకటించక పోలేదు – అపో. కార్యములు 13:45-47; అపో. కార్యములు 22:21; అపో. కార్యములు 26:17-18; గలతియులకు 1:16; గలతియులకు 2:7-8. “అన్ని జనాల్లో” నుంచీ మనుషులను దేవుడు పిలిచాడు – అపో. కార్యములు 15:14 పోల్చి చూడండి. విశ్వాసానికీ విధేయతకూ ఉన్న పొత్తు చూడండి. యోహాను 3:36 మొదలైన చోట్ల నోట్స్ చూడండి. “దేవుని పిలుపు అందినవారు”– రోమీయులకు 8:28-30 కూడా చూడండి. పౌలు రచనల్లో దీనికి కేవలం ఆహ్వానించబడడమనే అర్థం మాత్రమే కాదు. విశ్వాసులందరూ దేవుడు తన కుమారునికి ఇచ్చిన బహుమానం. వారంతా ఆయన స్వంతం. యోహాను 6:37; యోహాను 17:6 చూడండి. వారు నమ్మకముందే వారెవరో దేవునికి తెలుసు. క్రీస్తు చెంతకు రమ్మని శుభవార్త ప్రచారం మూలంగా దేవుడు వారిని పిలుస్తాడు, వారు వస్తారు.

8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.

క్రైస్తవులకోసం పౌలు తరచుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు – 1 కోరింథీయులకు 1:4; ఫిలిప్పీయులకు 1:3; కొలొస్సయులకు 1:3; 1 థెస్సలొనీకయులకు 2:13; 2 తిమోతికి 1:3. వారెక్కడ ఉన్నప్పటికీ వారి గురించి నమ్మకంగా హృదయపూర్వకంగా ప్రార్థించాడు – ఎఫెసీయులకు 1:16; ఎఫెసీయులకు 3:16; ఫిలిప్పీయులకు 1:4, ఫిలిప్పీయులకు 1:9; కొలొస్సయులకు 1:3, కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 2:1; 1 థెస్సలొనీకయులకు 1:2; 1 థెస్సలొనీకయులకు 3:10; 1 థెస్సలొనీకయులకు 5:23; 2 తిమోతికి 1:3. సంఘాలన్నిటి భారాన్ని పౌలు తనలో భరించాడు (2 కోరింథీయులకు 11:28-29). ప్రార్థన ప్రాముఖ్యత, దానిలోని శక్తి అతనికి తెలుసు (లూకా 18:1; యాకోబు 5:16 పోల్చి చూడండి).

9. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగునేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,

“మీ దగ్గరకు వచ్చే”– రోమీయులకు 15:23-24; అపో. కార్యములు 19:21.

10. మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.

“ఆత్మ పూర్వకంగా”– లేక “నా ఆత్మలో”. తనకున్నదంతా దేవునిదే అని పౌలు గుర్తించి దాని ప్రకారం ప్రవర్తించాడు. పౌలు తన పరిచర్యలో అంత విజయం సాధించడంలోని రహస్యం ఇదే.

11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని

“ఆధ్యాత్మిక కృపావరం”– రోమీయులకు 12:6-8; 1 కోరింథీయులకు 12:4-11.

12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.

పౌలు గొప్ప రాయబారి అయినప్పటికీ వారివల్ల తనకు ప్రోత్సాహం, అభివృద్ధి చెందడం ఎలా జరుగుతుందిలే అని గర్వంగా భావించలేదు.

13. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు

14. గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.

అన్ని రకాల ప్రజలకు తాను అప్పున్నట్టుగా పౌలు భావించుకున్నాడు. అంటే శుభవార్త వినే అవకాశం విషయంలో తాను వారికి బాకీ పడినట్టు ఎంచుకున్నాడు. అపో. కార్యములు 20:26-27 చూడండి. ఇతర శిష్యులందరిమీదా, సంఘమంతటి మీదా పెట్టినట్టుగానే (మత్తయి 28:18-20; మార్కు 16:15) ఈ బాధ్యతను క్రీస్తు అతనిమీద పెట్టాడు (అపో. కార్యములు 26:16-18; 1 కోరింథీయులకు 9:16-17)

15. కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.

మనుషులందరిపట్ల పౌలు తన బాధ్యత గురించి తీవ్రంగా అలోచించడమే గాక, దాన్ని పూర్తి చెయ్యాలని చాలా ఆత్రుత పడ్డాడు. ఎలాంటి హింసలు, బాధలు, మరణం గురించిన బెదిరింపులు అతణ్ణి ఆపలేకపోయాయి (అపో. కార్యములు 20:24; అపో. కార్యములు 21:13).

16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
కీర్తనల గ్రంథము 119:46

శుభవార్త ప్రకటించడానికి అతనికున్న ఆత్రుతకు కారణం ఇక్కడ కనిపిస్తున్నది. శుభవార్త ఏదో నీరసమైన, నిరుపయోగమైన విషయం అయినట్టుగా దాని గురించి అతడు సిగ్గుపడలేదు. అది మనుషుల పాపవిముక్తికి ఏకైక మార్గం అనీ, మనుషులను క్షమించి, వారిని మార్చి, చివరికి వారిని పరలోకం చేర్చే సాధనమైన ఏకైక శక్తి అనీ అతనికి తెలుసు. అపో. కార్యములు 4:12 కూడా చూడండి. పౌలు రాసిన మరి ఏ ఇతర లేఖకంటే కూడా వివరంగా ఈ లేఖలో పాపవిముక్తి అంటే ఏమిటో పౌలు చూపిస్తున్నాడు. అందులో నిర్దోషిగా ఎంచబడడం (రోమీయులకు 3:24), దేవునితో సఖ్యపడడం (రోమీయులకు 5:1), నూతనమైన పవిత్ర జీవితం (6–8 అధ్యాయాలు), మహిమ పరచబడడం (అంటే చివరికి యేసుప్రభువు రూపానికి మారడం – రోమీయులకు 8:29-30). ఇతర రాయబారులూ, యేసుప్రభువూ చేసినట్టుగానే ఇక్కడ పౌలు పాపవిముక్తి నమ్మకం ద్వారానే కలుగుతుందని నొక్కి చెప్తున్నాడు – రోమీయులకు 3:22, రోమీయులకు 3:25, రోమీయులకు 3:28; రోమీయులకు 4:5; రోమీయులకు 5:1; రోమీయులకు 10:9-10; గలతియులకు 2:16; ఎఫెసీయులకు 2:8-9; యోహాను 1:12; యోహాను 3:16, యోహాను 3:36 మొ।।.

17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
హబక్కూకు 2:4

“న్యాయం”ఈ లేఖలో కనిపించే ముఖ్య పదాల్లో ఒకటి. ‘న్యాయ’ 39 సార్లు కనిపిస్తుంది. “వెల్లడి అయింది”– దేవుడు వెల్లడి చేయనిదే మనుషులు ఈ సత్యాన్ని తెలుసుకోలేరు. మనుషులు దేవుని దృష్టికి న్యాయవంతులుగా ఎలా అవుతారో, వారిని ఆయన న్యాయవంతులుగా ఎలా పరిగణిస్తాడో, తనతో వారినెలా సఖ్యపరచుకొంటాడో దేవుడు తన శుభవార్తలో వెల్లడి చేశాడని పౌలు మాటలకు అర్థం. ఇదంతా కేవలం నమ్మకం మూలంగానే. పౌలు రాస్తున్న వచనం హబక్కూకు 2:4. ఈ వచనం క్రొత్త ఒడంబడిక గ్రంథంలో మూడు సార్లు ఎత్తి రాయబడింది. ఇక్కడ, గలతియులకు 3:11; హెబ్రీయులకు 10:38. పాపవిముక్తి, రక్షణ కేవలం నమ్మకం మూలంగానే కలుగుతుందనడంలో పశ్చాత్తాపంతో ఏమీ పని లేదని చెప్పడం లేదు పౌలు. పశ్చాత్తాపం నమ్మకంలో ఒక భాగమే (మత్తయి 3:2; మార్కు 1:15; లూకా 13:3-5; అపో. కార్యములు 17:30). పశ్చాత్తాపం లేకుండా నిజమైన నమ్మకం అసాధ్యం.

18. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

“అణచివేసే”– పాపాలు చేసే పని ఇదే. దేవుని సత్యం అంటే ఇష్టం లేదు గనుక ఆ సత్యాన్ని రుజువు చేసేవాటిని త్రోసిపుచ్చుతారు. ఇదే వారి ఘోర పాపం, ఘోర ప్రమాదం. యోహాను 3:18-21; 2 థెస్సలొనీకయులకు 2:10-12 పోల్చి చూడండి. ఇక్కడి నుంచి 3:20 వరకు పౌలు ఒక ప్రాముఖ్యమైన సంగతిని వివరిస్తున్నాడు. మనుషులందరూ పాపం చెయ్యడం, వారందరికీ క్రీస్తు శుభవార్త అవసరత. అందరూ పాపులే, వారి పాపాలకు అడ్డు తగిలిన సత్యాన్ని అందరూ అణచివేసినవారే, అందరూ దేవుని కోపానికి పాత్రులే – రోమీయులకు 3:9, రోమీయులకు 3:19, రోమీయులకు 3:23; ఎఫెసీయులకు 2:3 పోల్చి చూడండి. “కోపం”– దేవుడు వెల్లడించిన మరో విషయం. దేవుని కోపం గురించి నోట్స్ సంఖ్యాకాండము 25:3; ద్వితీయోపదేశకాండము 4:25; కీర్తనల గ్రంథము 90:7-11; మత్తయి 3:7; యోహాను 3:36; ఎఫెసీయులకు 5:6 చూడండి. “పరలోకం నుంచి వెల్లడి అయింది”– ఈ ఉపదేశం మనుషులు కల్పించినది కాదు. దేవుని ప్రేమ వెల్లడి అయిందన్నది ఎంత నిశ్చయమో (రోమీయులకు 5:8) ఆయన కోపం కూడా అంతే. నిజానికి దేవుని కోపం వచ్చేది ఆయన ప్రేమ మూలంగానే, మానవాళి అంతటినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందువల్ల వారిని పాడు చేసే చెడుగంటే ఆయనకు కోపం. నీతి న్యాయాలంటే ఆయనకు ఇష్టం. అందుకని దానికి వ్యతిరేకమైన దానంతటినీ ఆయన ఉగ్రతతో చూస్తాడు.

19. ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపర చెను.

మనుషులు కేవలం తెలియక పాపం చేస్తూ ఉంటారనేది నిజం కాదు. సృష్టిని చేసిన ఒక ఆశ్చర్యకరుడైన పరమ వ్యక్తి ఒకాయన ఉన్నాడని స్పష్టంగా వెల్లడిస్తున్నది. కీర్తనల గ్రంథము 19:1-4; యెషయా 40:21, యెషయా 40:26; అపో. కార్యములు 14:15-17 చూడండి. కానీ మనుషులు ఈ సత్యాన్ని గమనించకుండా కళ్ళు మూసుకుని, ఉద్దేశ పూర్వకంగా పాపం చేస్తుంటారు. అందుకే వారికి ఏ సాకూ లేదు. దేవుడొక వేళ మరింకేదీ వెల్లడించక పోయినా, బైబిలు అసలు లేకపోయినా, క్రీస్తు వచ్చి ఉండక పోయినా తమ పాపాల విషయం మనుషులు ఏ సాకూ చెప్పలేరు. ఒక్క సృష్టిని తీసుకుంటే చాలు దేవుని ఉనికీ ఆయన ప్రభావమూ స్పష్టంగా తేటతెల్లం అవుతున్నాయి. మనుషులు తమ సృష్టికర్తను వెతికి, ఆయన్ను ఆరాధించి, సేవించాలి (అపో. కార్యములు 17:26-27). కానీ అది వారికి ఇష్టం లేదు కాబట్టి అలా చెయ్యరు.

20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
యోబు 12:7-9, కీర్తనల గ్రంథము 19:1

21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

పౌలు ఇక్కడ మానవజాతి చరిత్రను తీసుకుని విగ్రహపూజ ఎలా ఆరంభమైందో చెప్తున్నాడు. మొదట్లో మనుషులకు ఏకైక నిజ దేవుడు, సృష్టికర్త తెలుసు. అలా తెలిసినందుకు వారు దేవునికి కృతజ్ఞత చూపలేదు. తమను సృష్టించడంలో దేవుని ముఖ్యోద్దేశం ప్రకారం నడుచుకోలేదు. దేవునికి మహిమ, పేరుప్రతిష్ఠలు తేవడమే వారి విషయంలో దేవుని ఉద్దేశం (యెషయా 43:7; 1 కోరింథీయులకు 10:31; ప్రకటన గ్రంథం 4:11). దేవుణ్ణి తెలుసుకోవడం (వ 28) అనే అతి శ్రేష్ఠమయిన అవకాశాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞత అర్పించలేదు (“కృతజ్ఞత” గురించి లేవీయకాండము 7:12-13; కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; మొ।। చూడండి). దానికి బదులు వారు ఊహాగానాలను మొదలు పెట్టి ఏవేవో వేదాంతాలు, మత వ్యవస్థలు కల్పించుకోవడం ప్రారంభించారు. ఇదంతా చీకటిలో మొదలై వారి మనసులను ఇంకా చీకటిమయం చేసేసింది (ఎఫెసీయులకు 4:18). అది గర్వానికీ విగ్రహపూజకూ దారితీసింది. వ 23,25 విగ్రహపూజ అంటే ఏమిటో తెలియజేస్తున్నాయి. కీర్తనల గ్రంథము 115:2-8; యెషయా 40:18-26; యెషయా 44:12-26 కూడా చూడండి.

22. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
యిర్మియా 10:14

మనుషులు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాం అనుకునేదంతా, జ్ఞానం గురించి వారి ఊహాగానాలంతా దేవునికి వెర్రితనం. 1 కోరింథీయులకు 1:18-25; 1 కోరింథీయులకు 2:7-8 పోల్చి చూడండి. ముక్తికి నడిపిస్తుందని కొందరు భ్రమపడే జ్ఞానమార్గం విశ్వానికి సృష్టికర్త దృష్టిలో కేవలం తెలివితక్కువతనమే.

23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
ద్వితీయోపదేశకాండము 4:15-19, కీర్తనల గ్రంథము 106:20

24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

వ 26,28. దేవుడు మానవజాతిని దాని పాపం కోసం శిక్షించిన విధానాల్లో ఒకటి దాన్ని మరింత పాపానికీ పాపమంతటిమీదా చివరికి జరిగే తీర్పుకూ వదిలేయడం. మనుషులు కోరుకునే పాపాలకు వారిని వదిలివేయడం చాలా ఘోరమైన శిక్షల్లో ఒకటి. ఇది చాలా న్యాయమైన శిక్ష కూడా. ద్వితీయోపదేశకాండము 32:19-22; న్యాయాధిపతులు 2:10-15 పోల్చి చూడండి.

25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌.
యిర్మియా 13:25, యిర్మియా 16:19

దేవుని సత్యం గురించి ఎరిగి ఉండడం వారి పాపాలకు అడ్డుబండ. అందువల్ల దాన్ని వదిలించుకుని అబద్ధ తలంపులనూ, ఉపదేశాలనూ తమకు మార్గదర్శకులుగా వారు ఎన్నుకున్నారు. వారు నమ్మడానికి ఎంచుకున్న ఘోరమైన అబద్ధాల్లో ఒకటి దేవుడు ఆయన చేసిన సృష్టిలాగా లేక తాము చేసిన విగ్రహాల మాదిరిగా ఉంటాడన్నది. దేవుని సృష్టిని (అంటే సూర్య చంద్ర నక్షత్రాలు, జంతువులు మొదలైనవాటిని), లేక విగ్రహాలను పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టేనన్నది మరో ఘోర అబద్ధం. నిజ దేవుడు అలాంటి ఆరాధనను ఎన్నటికీ అంగీకరించడు – నిర్గమకాండము 20:3-6; 2 రాజులు 17:14-18; కీర్తనల గ్రంథము 78:56-59; సామెతలు 1:29-31. అందులో పాలు పొందే వారికి అది గొప్ప హాని చేస్తుంది – యిర్మియా 7:5-6.

26. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.

స్వలింగ సంపర్కం నీచమైన పాపం. దీన్ని దేవుడు తన వాక్కులో ప్రతి చోటా ఖండించాడు. ఆదికాండము 19:3-4; లేవీయకాండము 18:22; లేవీయకాండము 22:13; 1 కోరింథీయులకు 6:9; 1 తిమోతికి 1:10; యూదా 1:7 చూడండి. మనుషుల పాపాలకు శిక్షగా దేవుడు వారిని వారి హృదయాల్లోని అతి హీనమైన కామవికారాలకు వదిలివేసి నందువల్లే ఇలా జరిగిందని పౌలు ఇక్కడ చెప్తున్నాడు.

27. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.
లేవీయకాండము 18:22, లేవీయకాండము 20:13

28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.

భయం కొలిపే (అయితే సత్యమైన) ఈ మాటలు చూడండి. దేవుడు మనుషులకు ఇచ్చే గొప్ప నిధి దేవుణ్ణి గురించిన జ్ఞానమే. అది లోకమంతటికన్నా ఎంతో విలువైనది (కీర్తనల గ్రంథము 19:10; కీర్తనల గ్రంథము 119:72; సామెతలు 2:1-5; యిర్మియా 9:23-24 పోల్చి చూడండి). మనుషులు ఈ జ్ఞానాన్ని చెత్తతో సమానంగా ఎంచారు. అందుకు తగిన శిక్ష అనుభవించారు. వారు కోరుకున్న, ఇష్టపడిన భ్రష్టతకు దేవుడు వారిని వదిలివేశాడు.

29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

ఇప్పుడు మానవజాతి ప్రస్తుత స్థితి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మనుషుల దుష్టస్థితిని గురించిన ఈ వర్ణన అతిశయోక్తి అని ఎవరూ అనుకోకూడదు. ఇక్కడున్న ప్రతి పాపాన్ని ప్రతి మనిషీ జరిగించడు గాని ఈ పాపాలన్నిటి బీజాలూ మనందరిలోనూ ఉన్నాయి. సాధారణంగా మనుషులు ఈ వచనాల్లో రాసి ఉన్న రీతిలో ప్రవర్తిస్తుంటారు రోమీయులకు 3:9-19; ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; యిర్మియా 17:9; మత్తయి 7:11; మత్తయి 15:19-20; ఎఫెసీయులకు 2:1-3; ఎఫెసీయులకు 4:17-19.

30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును

31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.

32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

మనుషుల భ్రష్ట స్థితికి ఇది అన్నిటికన్నా ఖచ్చితమైన రుజువు. మంచి చెడుల గురించి వారికి కొంత తెలిసినప్పటికీ, పాపానికి న్యాయమైన శిక్షగా దేవుడు మరణాన్ని నియమించాడని తెలిసినప్పటికీ (రోమీయులకు 5:12; ఆదికాండము 2:17; నిర్గమకాండము 21:36; హెబ్రీయులకు 2:15) ఇది వారిని పాపం చెయ్యకుండా ఆపదు. తమ పాపాల్లోనే కొనసాగడంతో బాటు ఇతరుల భ్రష్టత్వాన్ని చూచి ఆనందిస్తారు. స్వభావ సిద్ధంగా అలాంటివారికంటే మనమేమన్నా మంచివారమా? కాదు (రోమీయులకు 3:9). ఇలాంటివారిని శుభవార్త మార్చగలదా? మార్చగలదు (వ 16).Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |