Romans - రోమీయులకు 11 | View All

1. ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
1 సమూయేలు 12:22, కీర్తనల గ్రంథము 94:14

1. -”మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు.

2. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?
1 సమూయేలు 12:22, కీర్తనల గ్రంథము 94:14

2. తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు :

3. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.
1 రాజులు 19:10, 1 రాజులు 19:14

3. “ప్రభూ! వాళ్ళు నీ ప్రవక్తల్ని చంపి వేసారు. నీ బలిపీఠాన్ని నేలమట్టం చేసారు. మిగిలిన వాణ్ణి నేనొక్కణ్ణే. నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు.”

4. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
1 రాజులు 19:18

4. అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”

5. ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.

5. అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు.

6. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

6. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.

7. ఆలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.

7.

8. ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
ద్వితీయోపదేశకాండము 29:4, యెషయా 6:9-10, యెషయా 29:10, యెహెఙ్కేలు 12:2

8.

9. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.
కీర్తనల గ్రంథము 35:8, కీర్తనల గ్రంథము 69:22-23

9. ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు: “వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక! వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!

10. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.
కీర్తనల గ్రంథము 35:8, కీర్తనల గ్రంథము 69:22-23

10. వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ళ దృష్టి నశించుగాక! వాళ్ళ నడుములు కష్టాలతో వంగిపోయి వాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!” కీర్తన 69:22-23

11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు.
ద్వితీయోపదేశకాండము 32:21

11. నేను ఇంకొక ప్రశ్న వేస్తాను: యూదులు లేవలేనంత క్రిందపడి పొయ్యారా? లేదు. వాళ్ళు పాపాలు చేయటం వల్ల యూదులు కాని వాళ్ళకు రక్షణ లభించింది. యూదుల్లో ఈర్ష్య కలగాలని ఇలా జరిగింది.

12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

12. వాళ్ళు పాపాలు చెయ్యటం వల్ల ప్రపంచానికి ఐశ్వర్యం కలిగింది. వాళ్ళకు నష్టం కలగటం వల్ల యూదులు కానివాళ్ళు భాగ్యవంతులయ్యారు. అలాగైతే వాళ్ళు సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించియుంటే ఇంకెంత లాభం కలుగుతుందో గ్రహించండి.

13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,

13. యూదులుకాని ప్రజలారా! ఇప్పుడిక నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీ కోసం క్రీస్తు అపొస్తలునిగా పని చేస్తున్నాను కనుక, నేను చేస్తున్న పనిపట్ల నాకు ఎంతో గౌరవం ఉంది.

14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.

14. ఈ విధంగానైనా నా వాళ్ళలో ఈర్ష్య కలుగచేసి, వాళ్ళలో కొందర్నైనా రక్షించ కలుగుతానని ఆశిస్తున్నాను.

15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

15. వాళ్ళు నిరాకరించటం వల్ల ప్రపంచానికి దేవునితో స్నేహం కలిగింది. అలాంటప్పుడు వాళ్ళు అంగీకరించియుంటే మరణంనుండి జీవానికి వచ్చినట్లే. పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా సమర్పిస్తే అది పవిత్రమైతే

16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.
సంఖ్యాకాండము 15:17-21, Neh-h 10 37:1, యెహెఙ్కేలు 44:30

16. దేవునికి పవిత్రమైనట్లే కదా! వేర్లు పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనట్లే కదా!

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము.

17. చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి ఒలీవ చెట్ల కొమ్మలవలెనున్న మిమ్మల్ని దేవుడు అంటుకట్టాడు. తద్వారా వేరులోనున్న బలాన్ని మీరు పంచుకొంటున్నారు.

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.

18. కాని ఆ కొమ్మలపైగా గర్వించకండి. మీ వల్ల వేరు పోషింపబటలేదు. వేరు వల్ల మీరు పోషింపబడుతున్నారు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

19. మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు.

20. మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

20. నిజమే! విశ్వాసం లేనందువల్ల అవి కొట్టి వేయబడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టునంటుకొని ఉన్నారు. అలా అని గర్వించకండి. భయంతో ఉండండి.

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

21. ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

22. అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికి వేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

23. వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్ళను అంటు కడతాడు. వాళ్ళను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి ఉంది.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా?

24. స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల చెట్లనుండి కొట్టిన కొమ్మలవలెనున్న మిమ్మల్ని మేలురకపు చెట్టుకు అంటు వేయగలిగితే, మేలు రకపు ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి.

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

25. సోదరులారా! మీరు తెలుసుకోవాలని మీకీ రహస్యం చెప్పాలనుకొంటున్నాను. మీరు అజ్ఞానులుగా ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకొంటున్న యూదులుకాని ప్రజలు నాటబడే వరకు ఈ మూర్ఖత్వం వీళ్ళలో ఉంటుంది.

26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
కీర్తనల గ్రంథము 14:7, యెషయా 59:20, యెషయా 59:20, యిర్మియా 31:33-34

26. శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు: “రక్షకుడు సీయోను నుండి వస్తాడు; అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
యెషయా 27:9, యెషయా 59:21, కీర్తనల గ్రంథము 14:7, కీర్తనల గ్రంథము 14:7, యిర్మియా 31:33-34

27. నేను వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు, వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.” యెషయా 59:20-21; 27:9

28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.

28. ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు కనుక, వాళ్ళ మూల పురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు.

29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

29. ఎందుకంటే, దేవుడు ‘వరాల’ విషయంలో, ‘పిలుపు’ విషయంలో మనస్సు మార్చుకోడు.

30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.

30. యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది.

31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు

31. అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది.

32. అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.

32. ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు?

33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
యెషయా 45:15, యెషయా 55:8

33. దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.

34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
యోబు 15:8, యెషయా 40:13-14, యెషయా 40:13-14, యిర్మియా 23:18

34. “ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు? ఆయనకు సలహా చెప్పేవాడెవరు?” యెషయా 40:13

35. ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?
యోబు 41:11, యెషయా 40:13-14

35. 'దేవునికి ఎవరు అప్పిచ్చారు? ఆయన ఎవరికీ ఋణపడలేదు.' యోబు 41:11

36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

36. అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Romans - రోమీయులకు 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదుల తిరస్కరణ సార్వత్రికమైనది కాదు. (1-10) 
యూదులలో ఎన్నుకోబడిన శేషం యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా నీతిని మరియు జీవితాన్ని స్వీకరించారు, ఎన్నికల దయ ద్వారా సంరక్షించబడ్డారు. ఈ ఎన్నికలు, దయతో పాతుకుపోయినందున, సాధించబడినా లేదా ఊహించిన పనులపై ఆధారపడటాన్ని మినహాయించింది. మానవత్వం యొక్క పతన స్థితిలో, ఏదైనా నిజమైన సద్గుణ ప్రవృత్తి దేవుని ప్రసాదించిన దయ యొక్క పర్యవసానమే, కారణం కాదు. మొదటి నుండి చివరి వరకు, మోక్షం అనేది దయ లేదా బాధ్యత యొక్క ఉత్పత్తి, మరియు ఈ భావనలు అంతర్గతంగా విరుద్ధంగా ఉంటాయి.
తిరుగుబాటుదారుల హృదయాలను మరియు వైఖరులను మార్చడం ద్వారా దేవుడు తన దయను వ్యక్తపరుస్తాడు, విస్మయాన్ని మరియు ప్రశంసలను రేకెత్తించాడు. అయితే, యూదు దేశం తమ ఆపదను పట్టించుకోకుండా, గాఢమైన నిద్రలో ఉండి, రక్షకుని కోసం వారి తీరని ఆవశ్యకత గురించి మరియు శాశ్వతమైన నాశనానికి సంబంధించిన ఆసన్న ముప్పు గురించి అవగాహన లేదు. డేవిడ్, ఆత్మచే ప్రేరేపించబడ్డాడు, తన సొంత ప్రజలైన యూదుల చేతుల్లో క్రీస్తు బాధలను గురించి ప్రవచించడమే కాకుండా, వారిపై దేవుని తీవ్రమైన తీర్పులను కూడా ముందే చెప్పాడు (కీర్తన 69 చూడండి). ఈ అంతర్దృష్టి దావీదు తన శత్రువులకు వ్యతిరేకంగా చేసిన ఇతర ప్రార్థనలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది-అవి దైవిక తీర్పుల యొక్క ప్రవచనాత్మక ప్రకటనలు, కేవలం వ్యక్తిగత కోపం యొక్క వ్యక్తీకరణలు కాదు. దైవిక శాపాలు శాశ్వతమైన ప్రభావాలను కలిగి ఉంటాయి మరియు ప్రాపంచిక విషయాలపై నిమగ్నత ఈ వాస్తవాలకు మనలను అంధుడిని చేస్తుంది.

అన్యజనులను సువార్త అధికారాలలో భాగస్వాములను చేసినందుకు దేవుడు వారి అవిశ్వాసాన్ని తోసిపుచ్చాడు. (11-21) 
సువార్త అది చేరుకునే ఏ ప్రదేశంలోనైనా గొప్ప సంపదను సూచిస్తుంది. కాబట్టి, అవిశ్వాసులైన యూదుల నీతియుక్తమైన తిరస్కరణ అనేకమంది అన్యజనులు దేవునితో సమాధానపడేందుకు మరియు శాంతిగా ఉండటానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. భవిష్యత్తులో యూదులను చర్చిలో చేర్చుకోవడం అనేది ఒక పరివర్తనాత్మక మార్పును తీసుకువస్తుంది, ఇది పాపం యొక్క స్థితి నుండి నీతిగా ఉండే సార్వత్రిక పునరుత్థానానికి సమానంగా ఉంటుంది.
అబ్రహం చర్చి యొక్క పునాది మూలంగా పనిచేశాడు, యూదులు ప్రారంభంలో ఈ చెట్టు యొక్క కొమ్మలుగా ఉన్నారు, ఒక దేశంగా, వారు మెస్సీయను తిరస్కరించారు. తదనంతరం, అబ్రహం మరియు దేవునితో వారి సంబంధం తెగిపోయినట్లు అనిపించింది. వారి స్థానంలో, అన్యజనులు ఈ చెట్టులో అంటుకట్టబడ్డారు, దేవుని చర్చిలో ప్రవేశం పొందారు. చాలామంది అబ్రాహాము విశ్వాసం, పవిత్రత మరియు ఆశీర్వాదాలకు వారసులు అయ్యారు.
సహజంగానే, మనలో ప్రతి ఒక్కరూ మొదట్లో ప్రకృతిలో అడవిగా ఉంటారు మరియు అడవి కొమ్మలను మంచి ఆలివ్ చెట్టుగా మార్చడాన్ని పోలి ఉంటుంది. వ్యవసాయ ఆచరణలో, అడవి ఆలివ్‌ను ఫలవంతమైనదిగా అంటుకట్టడం, ప్రత్యేకించి రెండోది క్షీణించడం ప్రారంభించినప్పుడు, ఫలించడమే కాకుండా, విఫలమవుతున్న ఆలివ్‌ను పునరుద్ధరించి, వృద్ధి చెందింది. అన్యజనులు, ఉచిత దయ ద్వారా, ఈ ప్రయోజనాలను పంచుకోవడానికి అంటుకట్టబడ్డారు. పర్యవసానంగా, వారు ఆత్మవిశ్వాసం, అహంకారం లేదా ఆశయం నుండి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు జీవం లేని విశ్వాసం మరియు బోలు వృత్తిని కలిగి ఉంటారు, వారు దేవునికి దూరంగా ఉంటారు మరియు వారి అధికారాలను కోల్పోతారు.
మన స్థితి పూర్తిగా విశ్వాసం ద్వారా, మన అపరాధాన్ని మరియు నిస్సహాయతను గుర్తించి, వినయంతో, అప్రమత్తంగా మరియు స్వీయ-వంచనకు గురికాకుండా లేదా ప్రలోభాలకు లొంగిపోయేలా మనల్ని ప్రేరేపిస్తుంది. జస్టిఫికేషన్ ప్రారంభంలో విశ్వాసం ద్వారా వస్తుంది మరియు అది విశ్వాసం ద్వారా మాత్రమే చివరి వరకు నిర్వహించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఇది ఏకాంత విశ్వాసం కాదు, దేవుడు మరియు మానవత్వం పట్ల ప్రేమతో పనిచేసే చురుకైన విశ్వాసం.

అహంకారం మరియు అవిశ్వాసానికి వ్యతిరేకంగా అన్యజనులు హెచ్చరించారు, యూదులు ఒక జాతిగా పిలువబడతారు మరియు మళ్లీ దేవుని కనిపించే ఒడంబడికలోకి తీసుకురాబడతారు. (22-32) 
అన్ని తీర్పులలో, ఆధ్యాత్మిక తీర్పులు అత్యంత తీవ్రమైనవి, మరియు అపొస్తలుడు ఈ భాగంలో వీటిని ప్రస్తావించాడు. యూదుల పునరుద్ధరణ, సహజమైన సంఘటనలలో, అబ్రాహాము పిల్లలు కావడానికి అన్యజనుల పిలుపు కంటే తక్కువ అవకాశం ఉంది. ప్రస్తుతం ఇతరులు ఈ అధికారాలను అనుభవిస్తున్నప్పటికీ, అది యూదులను తిరిగి చేర్చుకోకుండా నిరోధించదు. సువార్తను తిరస్కరించడం ద్వారా మరియు అన్యజనులకు దాని ప్రకటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ద్వారా దేవునికి శత్రువులుగా మారినప్పటికీ, వారు తమ పవిత్రమైన పూర్వీకుల కోసం ఇప్పటికీ అనుకూలంగా ఉంటారు. అన్యుల పట్ల వారికున్న శత్రుత్వం కారణంగా వారు ప్రస్తుతం సువార్తను వ్యతిరేకిస్తున్నప్పటికీ, దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు ఈ శత్రుత్వం ఆగిపోతుంది మరియు వారి పూర్వీకుల పట్ల ఆయనకున్న ప్రేమ జ్ఞాపకం చేయబడుతుంది.
నిజమైన దయ దేవుని అనుగ్రహాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించదు. కరుణను స్వయంగా అనుభవించిన వారు ఇతరులకు దయను అందించడానికి ప్రయత్నించాలి. ఇది యూదుల పూర్వపు ఆచారాలైన యాజకత్వం, దేవాలయం మరియు వేడుకలు ముగిసినందున వాటిని పునరుద్ధరించడాన్ని సూచించదు. బదులుగా, వారు క్రీస్తును విశ్వసిస్తారు, గొప్ప కాపరి అయిన క్రీస్తు క్రింద అన్యజనులతో కలిసి ఒక మందగా మారతారు.
ఇజ్రాయెల్ యొక్క బందీలు, వారి చెదరగొట్టడం మరియు చర్చి నుండి వారిని మినహాయించడం తప్పు కోసం విశ్వాసి యొక్క దిద్దుబాట్లకు చిహ్నాలుగా పనిచేస్తాయి. యూదు ప్రజల పట్ల ప్రభువు యొక్క కొనసాగుతున్న శ్రద్ధ మరియు వారి కోసం ప్రణాళిక చేయబడిన దయగల మరియు ఆశీర్వాద పునరుద్ధరణ దేవుని సహనాన్ని మరియు ప్రేమను వెల్లడిస్తుంది.

దేవుని జ్ఞానం, మంచితనం మరియు న్యాయం యొక్క గంభీరమైన ఆరాధన. (33-36)
అపొస్తలుడైన పౌలు దేవుని రాజ్యం యొక్క రహస్యాల గురించిన లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, చాలా మందిని అధిగమించాడు. అయినప్పటికీ, అతను వారి లోతులను అర్థం చేసుకోవడంలో తన అసమర్థతను బహిరంగంగా అంగీకరిస్తాడు. అట్టడుగు స్థాయికి చేరుకోవాలనే తపనతో పట్టుదలతో ఉండకుండా, వినయపూర్వకంగా అంచున కూర్చుని, అర్థం చేసుకోలేని లోతును చూసి ఆశ్చర్యపోతాడు. ఈ అసంపూర్ణ స్థితిలో గొప్ప అవగాహనను పొందిన వారు తరచుగా తమ స్వంత పరిమితుల బరువును అనుభవిస్తారు.
దైవిక సలహాలు లోతును మాత్రమే కాకుండా గొప్పతనాన్ని కూడా ప్రదర్శిస్తాయి—అమూల్యమైన మరియు విలువైన అంశాల సమృద్ధి. ఈ సలహాలు ఎఫెసీయులకు 3:18లో పేర్కొన్న విధంగా లోతు మరియు ఎత్తు మాత్రమే కాకుండా వెడల్పు మరియు పొడవు కూడా కలిగి, మానవ జ్ఞానాన్ని మించిన సమగ్రమైనవి. దేవుడు మరియు మానవత్వం మధ్య, సృష్టికర్త మరియు జీవి మధ్య ఉన్న విస్తారమైన దూరం మరియు అసమానత, ఆయన మార్గాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎప్పటికీ నిరోధిస్తుంది. ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలో దేవునికి ఎవరు ఉపదేశించగలరు? అపొస్తలుడు దైవిక సలహాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాడు.
స్వర్గం మరియు భూమిపై ఉన్న ప్రతిదీ, ముఖ్యంగా మన మోక్షానికి మరియు శాంతికి సంబంధించిన విషయాలు, సృష్టి పరంగా దేవుని నుండి ఉద్భవించాయి, ప్రొవిడెన్స్ ద్వారా అతని ద్వారా కొనసాగుతాయి మరియు చివరికి అతని కోసం ఉనికిలో ఉన్నాయి. దేవుడు అన్నింటికీ మూలం మరియు మూలం, మరియు క్రీస్తు ద్వారా, ప్రతిదీ అంతిమ ముగింపుగా దేవుని వైపు మళ్లించబడిందని కనుగొంటుంది. ఇది అతని జీవులతో దేవునికి గల సంబంధాలన్నింటిని కలిగి ఉంటుంది. ప్రతిదీ అతని నుండి మరియు అతని ద్వారా వచ్చినట్లయితే, ప్రతిదీ అతనికి మరియు అతని కోసం మళ్ళించబడాలి. ప్రతి ప్రారంభంలో, ముగింపు దేవుని మహిమగా ఉండనివ్వండి. దైవిక సలహాలు మరియు చర్యల గురించి చర్చించేటప్పుడు, ముఖ్యంగా, మనం ఆయనను ఆరాధిద్దాం మరియు ఆరాధిద్దాం. స్వర్గంలో, సాధువులు వివాదాలలో పాల్గొనరు, కానీ నిరంతరం ప్రశంసలు అందిస్తారు.



Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |