Romans - రోమీయులకు 11 | View All

1. ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
1 సమూయేలు 12:22, కీర్తనల గ్రంథము 94:14

9,10,11 అధ్యాయాలు ఒక ప్రత్యేక భాగం. ఇందులోని విషయం ఇస్రాయేల్‌జనం పతనం. 10వ అధ్యాయంలో వారలా పడిపోవడం వారి తప్పే గాని దేవుని తప్పు కాదని పౌలు చూపించాడు. వారికి అపనమ్మకం, హృదయ కాఠిన్యం ఉన్నా కూడా దేవునికి వారిపట్ల ఇంకా కృప గల ఉద్దేశం ఉందనీ, ఆ జాతిని చివరికి తన చెంతకు తెచ్చుకుంటాడనీ ఈ 11వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ఈ మొదటి వచనంలో అడిగిన ప్రశ్నకు ఈ అధ్యాయమంతా జవాబు. “దేవుడు తన ప్రజను త్రోసివేశాడా?” “కాదు” అంటున్నాడు పౌలు. పౌలు యూదుడు. దేవుడు యూదులను త్రోసివేయలేదనడానికి పౌలే రుజువు. ప్రథమ రాయబారులందరూ, జెరుసలంలో ఆది సంఘంలో ఉన్నవారందరూ యూదులేనని కూడా పౌలు చెప్పి ఉండవచ్చు. మొత్తంగా యూద జాతి బండబారిపోయిన హృదయంతో అవిధేయతతో ఉండిపోయినప్పటికీ రోమ్ సామ్రాజ్యమంతా ఉన్న క్రీస్తుసంఘాల్లో క్రీస్తును నమ్మిన యూదులు ఉన్నారు. దేవుణ్ణి నమ్మి ఆయనకు లోబడిన యూదులు కొందరు ఉన్నారన్నమాట. ఈ పరిస్థితి ఏలీయా దినాలను పోలి ఉంది (850 సంవత్సరాల క్రితం నాటి కాలం). 1 రాజులు 19:14-18.

2. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?
1 సమూయేలు 12:22, కీర్తనల గ్రంథము 94:14

3. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.
1 రాజులు 19:10, 1 రాజులు 19:14

4. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
1 రాజులు 19:18

5. ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.

కృప పునాదిపై ఆధారపడి దేవుడు ఆ జాతి మొత్తంలోనుంచి నమ్మకం ఉంచినవారిని ఎన్నుకొన్నాడు. వారి యోగ్యతపై, లేక యోగ్యత లేకపోవడంపై ఆయన ఎన్నిక ఆధారపడలేదు – రోమీయులకు 3:24.

6. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

రోమీయులకు 4:5.

7. ఆలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.

రోమీయులకు 9:30-32. ఇస్రాయేల్‌లో అనేకమంది కఠినులై పోయారు. మొదట దేవునికి వ్యతిరేకంగా తమను తాము కఠినం చేసుకున్నారు. తరువాత వారినింకా కఠినం చెయ్యడం ద్వారా దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు కఠినపరచడం గురించి నిర్గమకాండము 4:21; యెషయా 6:9-10.

8. ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
ద్వితీయోపదేశకాండము 29:4, యెషయా 6:9-10, యెషయా 29:10, యెహెఙ్కేలు 12:2

ద్వితీయోపదేశకాండము 29:4; యెషయా 29:10. యెషయా 6:9-10; మత్తయి 13:13-15 పోల్చి చూడండి.

9. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.
కీర్తనల గ్రంథము 35:8, కీర్తనల గ్రంథము 69:22-23

కీర్తనల గ్రంథము 69:22-23.

10. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.
కీర్తనల గ్రంథము 35:8, కీర్తనల గ్రంథము 69:22-23

11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు.
ద్వితీయోపదేశకాండము 32:21

ఇక్కడినుంచి 32వ వచనం వరకు ఇస్రాయేల్‌జాతిలో కఠినమైపోయి, తొట్రుపడి, కూలిపోయిన అధిక భాగం గురించి పౌలు మాట్లాడుతున్నాడు (రోమీయులకు 9:32-33). ఆ జాతి అలాగే కూలిపోయి ఉంటుందా, తిరిగి లేవదా? క్రొత్త ఒడంబడిక సంఘంతో, సంఘంలో ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి ఇక ఒక జనంగా ఇస్రాయేల్ విషయంలో చేతులు కడిగేసుకున్నాడా? దేవుడు ఇస్రాయేల్‌జాతిని అలా విడిచి పెట్టెయ్యలేదని పౌలు అతి స్పష్టంగా చెప్తున్నాడు. దాని పట్ల ఆయనకింకా కృప గల ఉద్దేశాలున్నాయి. తిరిగి దాన్ని తన చెంత చేర్చుకునేందుకే ఆయన చూస్తున్నాడు (అపో. కార్యములు 1:6-7 పోల్చి చూడండి). వారు పతనం కావడంలో కూడా దేవునికి మంచి ఉద్దేశం ఉందని చెప్పడంతో ఈ వివరణ ఆరంభిస్తున్నాడు. వారు అవిధేయులై కఠినమైపోయి, దేవుని కుమారుణ్ణి తిరస్కరించి సిలువ వేశారు. కానీ ఇదంతా లోకమంతటి మేలుకే పని చేసింది (అపో. కార్యములు 2:22-24). దేవుడు వారి దుర్మార్గ క్రియల ద్వారా పని చేసి అందరికీ శుభవార్తను తయారు చేశాడు. వారు తరువాతి కాలంలో శుభవార్తను తిరస్కరించినప్పుడు దేవుడు ఇతర జనాలవైపుకు తిరిగాడు (రోమీయులకు 1:16; అపో. కార్యములు 13:46; మత్తయి 21:42-43).

12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

పౌలు మాటల్లోని తర్కం స్పష్టంగానే ఉంది. యూదుల పాపంవల్ల శుభవార్తలోని ఐశ్వర్యాలు లోకమంతటికీ అందుబాటులోకి వచ్చాయి. వారి “సమృద్ధి” తప్పకుండా మరింత ఐశ్వర్యవంతమే అవుతుంది. వారికి సమృద్ధి గనుక కలిగితే ఇంకా ఎక్కువ ఐశ్వర్యం అనడం లేదు పౌలు. వారికి భవిష్యత్తులో సమృద్ధి చేకూరుతుందన్న సత్యాన్ని మాత్రమే చెప్తున్నాడు. వారి సమృద్ధి అంటే ఒక జాతిగా వారు పూర్తిగా దేవునివైపుకు తిరగడం, దేవుడు వారిపట్ల తన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చడం అన్నమాట (యెషయా 2:1-5; యెషయా 11:1-9; యిర్మియా 23:5-8; యెహెఙ్కేలు 37:21-28; జెకర్యా 14:9, జెకర్యా 14:16, జెకర్యా 14:21). “ఐశ్వర్యం” గురించి రోమీయులకు 2:4; రోమీయులకు 10:12; 2 కోరింథీయులకు 8:9; ఎఫెసీయులకు 1:7, ఎఫెసీయులకు 1:18; ఎఫెసీయులకు 2:7; ఎఫెసీయులకు 3:8, ఎఫెసీయులకు 3:16; ఫిలిప్పీయులకు 4:19; కొలొస్సయులకు 1:27.

13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,

గలతియులకు 2:7.

14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.

వ 11; రోమీయులకు 10:1, రోమీయులకు 10:19.

15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

దేవుడు భవిష్యత్తులో యూదజాతిని మొత్తంగా తిరిగి స్వీకరించినప్పటి పరిస్థితి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అది చనిపోయినవారు సజీవంగా కావడం వంటిది. ఇది అక్షరాలా చనిపోయినవారు బ్రతికి లేవడం గురించి చెప్తున్నదని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు (యోహాను 5:28-29 చూడండి). మరికొందరేమో ఇస్రాయేల్‌వారు ఇలా మార్పు చెందడం లోకం మొత్తానికీ అద్భుతమైన ఆధ్యాత్మిక జీవానికీ దీవెనలకూ కారణమౌతుందని అభిప్రాయపడ్డారు.

16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.
సంఖ్యాకాండము 15:17-21, Neh-h 10 37:1, యెహెఙ్కేలు 44:30

యూదులు క్రీస్తును తిరస్కరించకముందు ఆలీవ్‌చెట్టు అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనే “వేరు”లో నుంచి పెరిగిన ఇస్రాయేల్ జాతి. ఆ జాతిలోని కొన్ని కొమ్మలు (నిజానికి ఆ జాతిలో ఎక్కువ భాగం) అపనమ్మకం మూలంగా విరిగిపోయాయి (వ 17,20). వారి స్థానంలో ఇతర ప్రజల్లోని క్రైస్తవులను అంటుకట్టడం జరిగింది (వ 17,19; మత్తయి 21:43). ఇతర ప్రజలు అడవి ఆలీవ్ చెట్టులాంటి వారు (వ 24). సహజంగా వారికి అబ్రాహాము, ఇస్సాకు యాకోబులతో, లేక వారినుంచి వచ్చిన ఆలీవ్‌చెట్టుతో ఎలాంటి సంబంధమూ లేదు. ఇప్పుడు క్రీస్తు మూలంగా అబ్రాహాముతో వారికి సంబంధం కలిగింది (“మంచి ఆలీవ్ చెట్టులో” అసహజంగా అంటు కట్టడం జరిగింది – వ 24). ఈ ఇతర ప్రజల్లోని క్రైస్తవులకు పౌలు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు (వ 13). పతనమైన ఇస్రాయేల్‌జాతిని చూచి వారు తమ గొప్పతనాన్ని చెప్పుకోకూడదు (వ 18), గర్వంగా కాదు, భయంతో ఉండాలి (వ 20). దేవుడు ఇస్రాయేల్ కొమ్మల్ని విరిచేసి ఇతర జనాల కొమ్మల్ని అంటుకట్టాడంటే, ఇతర జనాల కొమ్మల్ని విరిచి ఇస్రాయేల్ కొమ్మల్ని కూడా అంటుకట్టగలడు. ఇలా విరిచెయ్యడం అన్నది రక్షణ పొందిన వ్యక్తులు తమ రక్షణను కోల్పోయే అవకాశాన్ని సూచిస్తున్నదా? కాదు. పౌలు ఇక్కడ మాట్లాడుతున్న విషయం అది అసలు కాదు. ఆలీవ్ చెట్టు అంటే క్రీస్తుయొక్క అధ్యాత్మిక శరీరం కాదు. పాత ఒడంబడికలోను, క్రీస్తు ఈ లోకంలో ఉన్న దినాల్లోనూ ఆలీవ్‌చెట్టు అంటే విశ్వాసులు అవిశ్వాసులతో కూడిన ఇస్రాయేల్‌జాతి అంతటికీ సూచన. అవిశ్వాసులను మాత్రమే విరిచివేయడం జరిగింది. జాతి మొత్తంగా ఇప్పటివరకు ఆ స్థితిలో నిలిచి ఉంటుంది. దేవుడు ఈ యుగం కోసం దాన్ని అలా పక్కన పెట్టి ఉంచాడు, తన చెట్టులోకి ఇతర ప్రజలను అంటుకట్టాడు, లోకంలో తన ఉద్దేశాలను వారిద్వారా నెరవేర్చుకుంటున్నాడు. కానీ యూదుల్లాగానే ఇతర ప్రజలతో ఉన్న క్రైస్తవ సంఘాలు కూడా అహంకారంలోను, అవిశ్వాసంలోను పడిపోయే అవకాశం లేకపోలేదు. పడిపోయిన ఇస్రాయేల్‌వారి దారిలోనే తామూ పడిపోతామేమోనన్న భయంతో వారు ఉండాలి ఇస్రాయేల్‌జాతి నమ్మకంతో క్రీస్తువైపు తిరిగితే దాని సొంత ఆలీవ్‌చెట్టుకు తిరిగి అంటుకట్టబడతారు (వ 24. అపో. కార్యములు 1:6 నోట్ చూడండి).

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము.

యూదులు క్రీస్తును తిరస్కరించకముందు ఆలీవ్‌చెట్టు అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనే “వేరు”లో నుంచి పెరిగిన ఇస్రాయేల్ జాతి. ఆ జాతిలోని కొన్ని కొమ్మలు (నిజానికి ఆ జాతిలో ఎక్కువ భాగం) అపనమ్మకం మూలంగా విరిగిపోయాయి (వ 17,20). వారి స్థానంలో ఇతర ప్రజల్లోని క్రైస్తవులను అంటుకట్టడం జరిగింది (వ 17,19; మత్తయి 21:43). ఇతర ప్రజలు అడవి ఆలీవ్ చెట్టులాంటి వారు (వ 24). సహజంగా వారికి అబ్రాహాము, ఇస్సాకు యాకోబులతో, లేక వారినుంచి వచ్చిన ఆలీవ్‌చెట్టుతో ఎలాంటి సంబంధమూ లేదు. ఇప్పుడు క్రీస్తు మూలంగా అబ్రాహాముతో వారికి సంబంధం కలిగింది (“మంచి ఆలీవ్ చెట్టులో” అసహజంగా అంటు కట్టడం జరిగింది – వ 24). ఈ ఇతర ప్రజల్లోని క్రైస్తవులకు పౌలు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు (వ 13). పతనమైన ఇస్రాయేల్‌జాతిని చూచి వారు తమ గొప్పతనాన్ని చెప్పుకోకూడదు (వ 18), గర్వంగా కాదు, భయంతో ఉండాలి (వ 20). దేవుడు ఇస్రాయేల్ కొమ్మల్ని విరిచేసి ఇతర జనాల కొమ్మల్ని అంటుకట్టాడంటే, ఇతర జనాల కొమ్మల్ని విరిచి ఇస్రాయేల్ కొమ్మల్ని కూడా అంటుకట్టగలడు. ఇలా విరిచెయ్యడం అన్నది రక్షణ పొందిన వ్యక్తులు తమ రక్షణను కోల్పోయే అవకాశాన్ని సూచిస్తున్నదా? కాదు. పౌలు ఇక్కడ మాట్లాడుతున్న విషయం అది అసలు కాదు. ఆలీవ్ చెట్టు అంటే క్రీస్తుయొక్క అధ్యాత్మిక శరీరం కాదు. పాత ఒడంబడికలోను, క్రీస్తు ఈ లోకంలో ఉన్న దినాల్లోనూ ఆలీవ్‌చెట్టు అంటే విశ్వాసులు అవిశ్వాసులతో కూడిన ఇస్రాయేల్‌జాతి అంతటికీ సూచన. అవిశ్వాసులను మాత్రమే విరిచివేయడం జరిగింది. జాతి మొత్తంగా ఇప్పటివరకు ఆ స్థితిలో నిలిచి ఉంటుంది. దేవుడు ఈ యుగం కోసం దాన్ని అలా పక్కన పెట్టి ఉంచాడు, తన చెట్టులోకి ఇతర ప్రజలను అంటుకట్టాడు, లోకంలో తన ఉద్దేశాలను వారిద్వారా నెరవేర్చుకుంటున్నాడు. కానీ యూదుల్లాగానే ఇతర ప్రజలతో ఉన్న క్రైస్తవ సంఘాలు కూడా అహంకారంలోను, అవిశ్వాసంలోను పడిపోయే అవకాశం లేకపోలేదు. పడిపోయిన ఇస్రాయేల్‌వారి దారిలోనే తామూ పడిపోతామేమోనన్న భయంతో వారు ఉండాలి ఇస్రాయేల్‌జాతి నమ్మకంతో క్రీస్తువైపు తిరిగితే దాని సొంత ఆలీవ్‌చెట్టుకు తిరిగి అంటుకట్టబడతారు (వ 24. అపో. కార్యములు 1:6 నోట్ చూడండి).

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

20. మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా?

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

ఇతర ప్రజలైన క్రైస్తవులు అజ్ఞానంలో, దురహంకారంలో ఉండడం పౌలుకు ఇష్టం లేదు. దేవుడు ఇక ఇస్రాయేల్‌జాతిని పూర్తిగా వదిలేసి చేతులు దులిపేసుకున్నాడనీ, ఇస్రాయేల్‌కు ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఇప్పుడు క్రొత్త ఒడంబడిక సంఘానికి చెందుతాయనీ వారు గనుక తమను తాము నమ్మించుకుంటే అలా అయిపోగలరని పౌలుకు తెలుసు. ఇస్రాయేల్ గురించి కొన్ని స్పష్టమైన మాటలు చెప్పడంద్వారా ఇలాంటి అవకాశం లేకుండా చెయ్యాలని పౌలు ప్రయత్నిస్తున్నాడు. ఈ ఉపదేశానికి అతడు పెట్టిన పేరు “రహస్య సత్యం”– అంటే దేవుడు తానే వెల్లడి చేయకపోతే గనుక మనుషులు తెలుసుకోలేనిది. “ఇతర ప్రజల సంఖ్య పూర్తి అయ్యేవరకు” మాత్రమే ఇస్రాయేల్‌జాతికి మొద్దుబారిపోయిన హృదయం ఉంటుంది. ఆ తరువాత వారి హృదయ కాఠిన్యం తొలగిపోతుందని పౌలు సూచిస్తున్నాడు.

26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
కీర్తనల గ్రంథము 14:7, యెషయా 59:20, యెషయా 59:20, యిర్మియా 31:33-34

“ఇస్రాయేల్‌ప్రజ అంతటికీ”– ఇతర ప్రజల సంఖ్య అంతా వచ్చేసిన తరువాత ఉనికిలో ఉన్న ఇస్రాయేల్‌జాతి మొత్తం పాపవిముక్తి పొందుతుందని పౌలు ఉపదేశిస్తున్నాడు (ఈ సమయం ఇంకా రాలేదు). ఈ మాటలకు రుజువుగా పౌలు యెషయా 59:20-21; యెషయా 27:9 చూపుతున్నాడు. సీయోను అంటే జెరుసలం. యాకోబు అంటే ఇస్రాయేల్‌ప్రజ. ఒడంబడిక అంటే తాను ఇస్రాయేల్‌జాతితో చేస్తానని దేవుడు చెప్పిన క్రొత్త ఒడంబడిక – యిర్మియా 31:31-34.

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
యెషయా 27:9, యెషయా 59:21, కీర్తనల గ్రంథము 14:7, కీర్తనల గ్రంథము 14:7, యిర్మియా 31:33-34

28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.

“విరోధులు”– అవిశ్వాసులైన యూదులు శుభవార్త ప్రచారానికి విరోధంగా తమ శక్తికొలది పోరాడారు. ఇతర ప్రజలు క్రీస్తు చెంతకు రాకుండా శాయశక్తులా అడ్డుకున్నారు (1 థెస్సలొనీకయులకు 2:14-16). “ప్రియులు”– ఇస్రాయేల్ జాతి అపనమ్మకంలో ఉన్నా, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నా దేవుడు దానిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. వారి పూర్వీకులను (అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు) బట్టే ఆయన అలా ప్రేమిస్తున్నాడు.

29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

మలాకీ 3:6 పోల్చి చూడండి. ఈ యుగంలో దేవుడు ఇస్రాయేల్‌వారిని పక్కన పెట్టినప్పటికీ ఆ ప్రజ గురించి తన మనస్సు మాత్రం మార్చుకోలేదు. ఆ జాతినింకా తన ప్రజగానే పరిగణిస్తున్నాడు. ఆయన వారికిచ్చిన ఉచిత వరాల్లో కొన్నిటిని రోమీయులకు 9:4-5లో చూడండి.

30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.

ప్రస్తుతం యూదుల్లాగానే ఒకప్పుడు ఇతర ప్రజలు నమ్మకం లేకుండా నశించిన స్థితిలో ఉన్నవారే. వారిపట్ల దేవుడు కృప చూపినట్టుగానే, పడిపోయిన తన సొంత ప్రజల పట్ల కూడా ఆయన కృప చూపుతాడు.

31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు

32. అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.

గలతియులకు 3:23-24 పోల్చి చూడండి. దేవుడు తన న్యాయమైన తీర్పు ప్రకారం ఇతర జనాలను వారి సొంత హృదయాల్లోని దుష్టత్వానికి వదిలిపెట్టాడు (రోమీయులకు 1:24-32). యూదులను కఠినుల్ని చేయడం ద్వారా శిక్షించాడు (రోమీయులకు 11:7-8). దానికి ఫలితంగా వారు దేవుని కుమారుణ్ణి సిలువ వేశారు. మనుషులంతా పాపం, అవిధేయతల్లో బందీలైపోయారు. ఈ విధంగా యూదుడైనా ఇతర జాతీయుడైనా ఎవరికైనా తన కృపే ఆశాభావానికి ఆధారమని ఆయన వెల్లడి చేశాడు. యూదజాతి విషయంలో దేవుడు చేసిన నిగూఢమైన పనులన్నిటి వెనుకా ప్రేమ, కృప గల ఉద్దేశం ఆయనకు ఉన్నదని ఈ వచనంలో చూస్తున్నాం. అదేమిటంటే అందరిపట్లా కరుణ చూపాలని. మనుషులను కఠినపరచి శిక్షించడంలో ఆనందించే దేవుడు కాడాయన. కరుణ చూపడమే ఆయనకు ఆనందం. కానీ ఈ వచనాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. మనుషులందరికీ చివరికి పాపవిముక్తి లభిస్తుందని బైబిలు ఎక్కడా చెప్పడం లేదు. క్రీస్తును నిరాకరించి వారి పాపాల్లో చనిపోయినవారు శాశ్వతంగా నశించిపోతారు (రోమీయులకు 2:5-6; రోమీయులకు 6:23; యోహాను 3:36; ప్రకటన గ్రంథం 21:6). ఇక్కడ “అందరిమీదా” అంటే యూదులు, ఇతరులని తేడా లేకుండా జాతులన్నిటిమీదా అని అర్థం కావచ్చు. కరుణ చూపడంలో దేవుడు వారి మధ్య ఏమీ తేడా చూపడన్నమాట; యూదులు, ఇతరులు ఇద్దరి విముక్తీ దేవుని ఏర్పాటు ముడిపడివుంది.

33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
యెషయా 45:15, యెషయా 55:8

పౌలు శుభవార్త అంటే అర్థాన్నీ, యూదులతో, ఇతరులతో దేవుడు వ్యవహరించే తీరునూ వివరించి ముగించాడు. అంతా వివరంగా తాను చెప్పలేదని అతనికి బాగా తెలుసు. తన ఊహకు కూడా అందని రహస్య సత్యాలు, మానవ మేధస్సు గుర్తించలేని దేవుని జ్ఞానం లోతులు ఉన్నాయి. ఇప్పుడు దేవుణ్ణి దేవుడుగా ఉంచి ఆయన్ను స్తుతిస్తున్నాడు. దేవుని వాక్కును ఎంతగా నేర్చుకుంటే, ఆయన తన గురించి వెల్లడించిన సత్యాలను ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా ఆయన జ్ఞానంలోను, మిగతా అన్నింటిలోనూ మనందరికన్నా ఎంత ఉన్నతుడో అర్థం అవుతుంది. లోకంలో తాను చేస్తున్నదంతా ఆయనకు తెలుసు. ఆయన వెల్లడించిన కొంచెమే మనం తెలుసుకోగలం. ఆయన మార్గాలను విమర్శిస్తూ, ఆయన మనకు, ఇతరులకు చేస్తున్న వాటిని గురించి సణుక్కుంటూ ఉండడం అవివేకం (అనేకులు అలా చేస్తారు గదా). ఆయన మీద నమ్మకం ఉంచుతూ ఆయన్ను స్తుతిస్తూ మన అల్పమైన మనస్సులను ఆయన అనంత జ్ఞానానికి అప్పగించడం మనం నేర్చుకోవాలి. యోబు 40:3-5; యోబు 42:1-6 పోల్చి చూడండి.

34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
యోబు 15:8, యెషయా 40:13-14, యెషయా 40:13-14, యిర్మియా 23:18

యెషయా 40:13. ఈ వచనం సందర్భాన్ని గమనించండి (యెషయా 40:12-26). దేవుని గొప్పతనం గురించిన అద్భుతమైన చిత్రాన్ని ఇది మన కళ్ళముందు ఉంచుతున్నది. సృష్టిలోను, ఈ ప్రపంచాన్ని నిర్వహించడంలోను దేవునికి ఏ మనిషి సలహా అవసరం లేదు.

35. ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?
యోబు 41:11, యెషయా 40:13-14

యోబు 41:11. దేవుడు మనుషులకు రుణస్థుడు కాదు. ఎవరికీ పాపవిముక్తి, రక్షణ గానీ మరేదైనా గానీ ఆయన బాకీ పడలేదు. మనుషులతో ఆయన చేసే వ్యవహారాలన్నిటికీ ఆధారం ఆయన కరుణ, కృప మాత్రమే. అందరూ ఆయనపట్ల అవిధేయులే కాబట్టి ఆయన ఎవరికీ కూడా జీవితావసరాలు అందకుండా చేసినా, అందరినీ నరకానికి పంపినా అది న్యాయమే.

36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

“ఆయననుంచి”– దేవుడు సృష్టికర్త. “ఆయన ద్వారా”– దేవుడు ఈ ప్రపంచాన్ని పోషిస్తూ పాలిస్తూ ఉన్నాడు. “ఆయనకే”– ఈ ప్రపంచంలోనివన్నీ ఆయన ఉద్దేశాలనే నెరవేరుస్తున్నాయి. అవన్నీ తమకోసం కాక ఆయనకోసమే ఉన్నాయి. పౌలుతో కలిసి మహిమంతా దేవునికి మాత్రమే ఆపాదించడం నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన మాత్రమే అందుకు అర్హుడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Romans - రోమీయులకు 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదుల తిరస్కరణ సార్వత్రికమైనది కాదు. (1-10) 
యూదులలో ఎన్నుకోబడిన శేషం యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా నీతిని మరియు జీవితాన్ని స్వీకరించారు, ఎన్నికల దయ ద్వారా సంరక్షించబడ్డారు. ఈ ఎన్నికలు, దయతో పాతుకుపోయినందున, సాధించబడినా లేదా ఊహించిన పనులపై ఆధారపడటాన్ని మినహాయించింది. మానవత్వం యొక్క పతన స్థితిలో, ఏదైనా నిజమైన సద్గుణ ప్రవృత్తి దేవుని ప్రసాదించిన దయ యొక్క పర్యవసానమే, కారణం కాదు. మొదటి నుండి చివరి వరకు, మోక్షం అనేది దయ లేదా బాధ్యత యొక్క ఉత్పత్తి, మరియు ఈ భావనలు అంతర్గతంగా విరుద్ధంగా ఉంటాయి.
తిరుగుబాటుదారుల హృదయాలను మరియు వైఖరులను మార్చడం ద్వారా దేవుడు తన దయను వ్యక్తపరుస్తాడు, విస్మయాన్ని మరియు ప్రశంసలను రేకెత్తించాడు. అయితే, యూదు దేశం తమ ఆపదను పట్టించుకోకుండా, గాఢమైన నిద్రలో ఉండి, రక్షకుని కోసం వారి తీరని ఆవశ్యకత గురించి మరియు శాశ్వతమైన నాశనానికి సంబంధించిన ఆసన్న ముప్పు గురించి అవగాహన లేదు. డేవిడ్, ఆత్మచే ప్రేరేపించబడ్డాడు, తన సొంత ప్రజలైన యూదుల చేతుల్లో క్రీస్తు బాధలను గురించి ప్రవచించడమే కాకుండా, వారిపై దేవుని తీవ్రమైన తీర్పులను కూడా ముందే చెప్పాడు (కీర్తన 69 చూడండి). ఈ అంతర్దృష్టి దావీదు తన శత్రువులకు వ్యతిరేకంగా చేసిన ఇతర ప్రార్థనలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది-అవి దైవిక తీర్పుల యొక్క ప్రవచనాత్మక ప్రకటనలు, కేవలం వ్యక్తిగత కోపం యొక్క వ్యక్తీకరణలు కాదు. దైవిక శాపాలు శాశ్వతమైన ప్రభావాలను కలిగి ఉంటాయి మరియు ప్రాపంచిక విషయాలపై నిమగ్నత ఈ వాస్తవాలకు మనలను అంధుడిని చేస్తుంది.

అన్యజనులను సువార్త అధికారాలలో భాగస్వాములను చేసినందుకు దేవుడు వారి అవిశ్వాసాన్ని తోసిపుచ్చాడు. (11-21) 
సువార్త అది చేరుకునే ఏ ప్రదేశంలోనైనా గొప్ప సంపదను సూచిస్తుంది. కాబట్టి, అవిశ్వాసులైన యూదుల నీతియుక్తమైన తిరస్కరణ అనేకమంది అన్యజనులు దేవునితో సమాధానపడేందుకు మరియు శాంతిగా ఉండటానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. భవిష్యత్తులో యూదులను చర్చిలో చేర్చుకోవడం అనేది ఒక పరివర్తనాత్మక మార్పును తీసుకువస్తుంది, ఇది పాపం యొక్క స్థితి నుండి నీతిగా ఉండే సార్వత్రిక పునరుత్థానానికి సమానంగా ఉంటుంది.
అబ్రహం చర్చి యొక్క పునాది మూలంగా పనిచేశాడు, యూదులు ప్రారంభంలో ఈ చెట్టు యొక్క కొమ్మలుగా ఉన్నారు, ఒక దేశంగా, వారు మెస్సీయను తిరస్కరించారు. తదనంతరం, అబ్రహం మరియు దేవునితో వారి సంబంధం తెగిపోయినట్లు అనిపించింది. వారి స్థానంలో, అన్యజనులు ఈ చెట్టులో అంటుకట్టబడ్డారు, దేవుని చర్చిలో ప్రవేశం పొందారు. చాలామంది అబ్రాహాము విశ్వాసం, పవిత్రత మరియు ఆశీర్వాదాలకు వారసులు అయ్యారు.
సహజంగానే, మనలో ప్రతి ఒక్కరూ మొదట్లో ప్రకృతిలో అడవిగా ఉంటారు మరియు అడవి కొమ్మలను మంచి ఆలివ్ చెట్టుగా మార్చడాన్ని పోలి ఉంటుంది. వ్యవసాయ ఆచరణలో, అడవి ఆలివ్‌ను ఫలవంతమైనదిగా అంటుకట్టడం, ప్రత్యేకించి రెండోది క్షీణించడం ప్రారంభించినప్పుడు, ఫలించడమే కాకుండా, విఫలమవుతున్న ఆలివ్‌ను పునరుద్ధరించి, వృద్ధి చెందింది. అన్యజనులు, ఉచిత దయ ద్వారా, ఈ ప్రయోజనాలను పంచుకోవడానికి అంటుకట్టబడ్డారు. పర్యవసానంగా, వారు ఆత్మవిశ్వాసం, అహంకారం లేదా ఆశయం నుండి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు జీవం లేని విశ్వాసం మరియు బోలు వృత్తిని కలిగి ఉంటారు, వారు దేవునికి దూరంగా ఉంటారు మరియు వారి అధికారాలను కోల్పోతారు.
మన స్థితి పూర్తిగా విశ్వాసం ద్వారా, మన అపరాధాన్ని మరియు నిస్సహాయతను గుర్తించి, వినయంతో, అప్రమత్తంగా మరియు స్వీయ-వంచనకు గురికాకుండా లేదా ప్రలోభాలకు లొంగిపోయేలా మనల్ని ప్రేరేపిస్తుంది. జస్టిఫికేషన్ ప్రారంభంలో విశ్వాసం ద్వారా వస్తుంది మరియు అది విశ్వాసం ద్వారా మాత్రమే చివరి వరకు నిర్వహించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఇది ఏకాంత విశ్వాసం కాదు, దేవుడు మరియు మానవత్వం పట్ల ప్రేమతో పనిచేసే చురుకైన విశ్వాసం.

అహంకారం మరియు అవిశ్వాసానికి వ్యతిరేకంగా అన్యజనులు హెచ్చరించారు, యూదులు ఒక జాతిగా పిలువబడతారు మరియు మళ్లీ దేవుని కనిపించే ఒడంబడికలోకి తీసుకురాబడతారు. (22-32) 
అన్ని తీర్పులలో, ఆధ్యాత్మిక తీర్పులు అత్యంత తీవ్రమైనవి, మరియు అపొస్తలుడు ఈ భాగంలో వీటిని ప్రస్తావించాడు. యూదుల పునరుద్ధరణ, సహజమైన సంఘటనలలో, అబ్రాహాము పిల్లలు కావడానికి అన్యజనుల పిలుపు కంటే తక్కువ అవకాశం ఉంది. ప్రస్తుతం ఇతరులు ఈ అధికారాలను అనుభవిస్తున్నప్పటికీ, అది యూదులను తిరిగి చేర్చుకోకుండా నిరోధించదు. సువార్తను తిరస్కరించడం ద్వారా మరియు అన్యజనులకు దాని ప్రకటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ద్వారా దేవునికి శత్రువులుగా మారినప్పటికీ, వారు తమ పవిత్రమైన పూర్వీకుల కోసం ఇప్పటికీ అనుకూలంగా ఉంటారు. అన్యుల పట్ల వారికున్న శత్రుత్వం కారణంగా వారు ప్రస్తుతం సువార్తను వ్యతిరేకిస్తున్నప్పటికీ, దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు ఈ శత్రుత్వం ఆగిపోతుంది మరియు వారి పూర్వీకుల పట్ల ఆయనకున్న ప్రేమ జ్ఞాపకం చేయబడుతుంది.
నిజమైన దయ దేవుని అనుగ్రహాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించదు. కరుణను స్వయంగా అనుభవించిన వారు ఇతరులకు దయను అందించడానికి ప్రయత్నించాలి. ఇది యూదుల పూర్వపు ఆచారాలైన యాజకత్వం, దేవాలయం మరియు వేడుకలు ముగిసినందున వాటిని పునరుద్ధరించడాన్ని సూచించదు. బదులుగా, వారు క్రీస్తును విశ్వసిస్తారు, గొప్ప కాపరి అయిన క్రీస్తు క్రింద అన్యజనులతో కలిసి ఒక మందగా మారతారు.
ఇజ్రాయెల్ యొక్క బందీలు, వారి చెదరగొట్టడం మరియు చర్చి నుండి వారిని మినహాయించడం తప్పు కోసం విశ్వాసి యొక్క దిద్దుబాట్లకు చిహ్నాలుగా పనిచేస్తాయి. యూదు ప్రజల పట్ల ప్రభువు యొక్క కొనసాగుతున్న శ్రద్ధ మరియు వారి కోసం ప్రణాళిక చేయబడిన దయగల మరియు ఆశీర్వాద పునరుద్ధరణ దేవుని సహనాన్ని మరియు ప్రేమను వెల్లడిస్తుంది.

దేవుని జ్ఞానం, మంచితనం మరియు న్యాయం యొక్క గంభీరమైన ఆరాధన. (33-36)
అపొస్తలుడైన పౌలు దేవుని రాజ్యం యొక్క రహస్యాల గురించిన లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, చాలా మందిని అధిగమించాడు. అయినప్పటికీ, అతను వారి లోతులను అర్థం చేసుకోవడంలో తన అసమర్థతను బహిరంగంగా అంగీకరిస్తాడు. అట్టడుగు స్థాయికి చేరుకోవాలనే తపనతో పట్టుదలతో ఉండకుండా, వినయపూర్వకంగా అంచున కూర్చుని, అర్థం చేసుకోలేని లోతును చూసి ఆశ్చర్యపోతాడు. ఈ అసంపూర్ణ స్థితిలో గొప్ప అవగాహనను పొందిన వారు తరచుగా తమ స్వంత పరిమితుల బరువును అనుభవిస్తారు.
దైవిక సలహాలు లోతును మాత్రమే కాకుండా గొప్పతనాన్ని కూడా ప్రదర్శిస్తాయి—అమూల్యమైన మరియు విలువైన అంశాల సమృద్ధి. ఈ సలహాలు ఎఫెసీయులకు 3:18లో పేర్కొన్న విధంగా లోతు మరియు ఎత్తు మాత్రమే కాకుండా వెడల్పు మరియు పొడవు కూడా కలిగి, మానవ జ్ఞానాన్ని మించిన సమగ్రమైనవి. దేవుడు మరియు మానవత్వం మధ్య, సృష్టికర్త మరియు జీవి మధ్య ఉన్న విస్తారమైన దూరం మరియు అసమానత, ఆయన మార్గాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎప్పటికీ నిరోధిస్తుంది. ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలో దేవునికి ఎవరు ఉపదేశించగలరు? అపొస్తలుడు దైవిక సలహాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాడు.
స్వర్గం మరియు భూమిపై ఉన్న ప్రతిదీ, ముఖ్యంగా మన మోక్షానికి మరియు శాంతికి సంబంధించిన విషయాలు, సృష్టి పరంగా దేవుని నుండి ఉద్భవించాయి, ప్రొవిడెన్స్ ద్వారా అతని ద్వారా కొనసాగుతాయి మరియు చివరికి అతని కోసం ఉనికిలో ఉన్నాయి. దేవుడు అన్నింటికీ మూలం మరియు మూలం, మరియు క్రీస్తు ద్వారా, ప్రతిదీ అంతిమ ముగింపుగా దేవుని వైపు మళ్లించబడిందని కనుగొంటుంది. ఇది అతని జీవులతో దేవునికి గల సంబంధాలన్నింటిని కలిగి ఉంటుంది. ప్రతిదీ అతని నుండి మరియు అతని ద్వారా వచ్చినట్లయితే, ప్రతిదీ అతనికి మరియు అతని కోసం మళ్ళించబడాలి. ప్రతి ప్రారంభంలో, ముగింపు దేవుని మహిమగా ఉండనివ్వండి. దైవిక సలహాలు మరియు చర్యల గురించి చర్చించేటప్పుడు, ముఖ్యంగా, మనం ఆయనను ఆరాధిద్దాం మరియు ఆరాధిద్దాం. స్వర్గంలో, సాధువులు వివాదాలలో పాల్గొనరు, కానీ నిరంతరం ప్రశంసలు అందిస్తారు.



Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |