Corinthians I - 1 కొరింథీయులకు 13 | View All

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.

ప్రేమ “ఆగాపే” అనే గ్రీకు పదానికి తర్జుమా. క్రొత్త ఒడంబడిక గ్రంథం ఉనికిలోకి రాక ముందు ఈ మాట పెద్దగా వాడుకలో లేదు. వాడుకలో ఉన్న “ప్రేమ” అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదాలన్నిటి కంటే, గ్రీకు మాట్లాడేవారు (లేక లోకంలో ఎవరైనా సరే) అంతకుముందు అర్థం చేసుకున్న ప్రేమలన్నిటికంటే ఒక ఉన్నత స్థాయి ప్రేమను ఈ పదం “ఆగాపే” తెలియజేస్తున్నది. ఆగాపే గ్రీకు క్రొత్త ఒడంబడికలో 116 సార్లు కనిపిస్తున్నది. ఈ పదానికి సంబంధించిన క్రియా వాచకం 137 సార్లు కనిపిస్తుంది. దేవుని ప్రేమనూ, విశ్వాసులు ఒకరిపట్ల ఒకరు పరస్పరం, దేవునిపట్ల కూడా చూపవలసిన ప్రేమనూ సూచించేందుకు ఈ మాటను వాడారు. ఇది స్వార్థం లేని ప్రేమ, ఎప్పుడూ ఇతరుల మేలు కోరే ప్రేమ. కామం, స్వార్థపరమైన కోరికలు, స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమతో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో కనిపించే ఈ పదం అర్థాన్ని కొంతవరకు గ్రహించేందుకు ఈ రిఫరెన్సులు తోడ్పడతాయి – మత్తయి 5:44; మత్తయి 22:37; యోహాను 3:16; యోహాను 13:1, యోహాను 13:34; యోహాను 14:15; యోహాను 17:24, యోహాను 17:26; రోమీయులకు 5:5-8; ఎఫెసీయులకు 5:25; 1 పేతురు 1:22; 1 యోహాను 3:16-18; 1 యోహాను 4:8-9. “ఆగాపే” దేవుని దివ్య ప్రేమ. ఈ గొప్ప అధ్యాయంలో పౌలు ప్రేమ అవసరతను గురించి (వ 1-3), ప్రేమ తత్వాన్ని గురించి (వ 4-7), ప్రేమ శాశ్వతత్వం గురించి (వ 8-13) మాట్లాడుతున్నాడు. భూమిపైనా, పరలోకంలోనూ ఉన్న ఎలాంటి భాష కంటే కూడా ప్రేమ గొప్పది అని చెప్పడంతో ఆరంభిస్తున్నాడు. ప్రేమ లేనిదే నానా భాషల్లో మాట్లాడ్డం, ఏ విధంగా మాట్లాడ్డమైనా కేవలం శబ్దమే గాని ప్రయోజనం లేదంటున్నాడు.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

నానా భాషలలో మాట్లాడ్డం కన్న గొప్ప సామర్థ్యాల గురించి పౌలు చెప్తున్నాడు. విశ్వాసులు వీటిని ఆశించాలనీ అతడు కోరాడు (1 కోరింథీయులకు 12:31). కానీ ప్రేమ లేకపోతే అవన్నీ ఉన్నా ఒక మనిషికి ఏమీ యోగ్యత ఉండదు. మనం దేవుని ప్రజలమనడానికి, మనకు పవిత్రాత్మ బాప్తిసం ఉందనడానికి ప్రేమే గొప్ప రుజువు.

3. బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

ప్రేమ లేకుండా ఆస్తిపాస్తులన్నీ ఇచ్చివేయడం, తనను తాను సమర్పించుకోవడం సాధ్యమేనా? సాధ్యమే. పుణ్యం, లేక దేవుని మెప్పు సంపాదించుకోవాలన్న ప్రయత్నంలో, లేక నరకంలో పడతానన్న భయం వల్ల, లేక తన మతం, ఆదర్శం కోసం అలా చేయవచ్చు. చాలమంది ఈ విషయంలో మోసపోయారు. వారు ఈ మంచి పనులు, యోగ్యమైన పనులు, పుణ్య కార్యాల వల్ల దేవుని అనుగ్రహాన్ని, లేక ముక్తిని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ అదంతా వ్యర్థం. ఈ దైవిక ప్రేమ, దేవుని పట్లా మనుషుల పట్లా స్వార్థం లేని ఈ ప్రేమ లేకుండా చేసే మంచి పనులన్నీ దేవుని దృష్టిలో మంచి పనులే కాదు. అసలు అవి చెడ్డ పనులే కావచ్చు. యెషయా 64:6 చూడండి.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

పౌలు ఇక్కడ మాటల్లో చెప్తున్న ఈ ప్రేమ గుణం యేసుప్రభు జీవితంలో లోప రహితంగా ఆచరణలో ఉన్నట్లు మనం చూడగలం. దేవుడు ప్రేమ స్వరూపి (1 యోహాను 4:8). క్రీస్తు దేవుని అవతారం, అంటే ప్రేమావతారమన్నమాట. ప్రేమ నిండిన తన జీవితంలో ఆయన విశ్వాసులందరికీ గొప్ప ఆదర్శం. “దీర్ఘ శాంతం”– ఇతరులు మనపట్ల చేసిన తప్పులను, గాయాలను, ద్రోహాలను, కఠినమైన మాటలనూ చర్యలనూ చూచి ఎలాంటి ద్వేష భావం లేకుండా ప్రతీకారం చేయకుండా ఉండగలిగే మనసును, సామర్థ్యాన్ని ఇది సూచిస్తున్నది. ఇది క్రీస్తు జీవితమంతటా కనిపించింది – ఆయన తీర్పు, మరణం సమయంలో మరింత స్పష్టంగా కనిపించింది. యెషయా 53:7; మత్తయి 27:14; లూకా 23:34; 1 పేతురు 2:21-23. ఆయన్ను అనుసరించినవారికి కూడా ఉండవలసిన గుణం ఇది. మత్తయి 18:22; గలతియులకు 5:22; ఎఫెసీయులకు 4:2; కొలొస్సయులకు 1:11; కొలొస్సయులకు 3:12 పోల్చి చూడండి. “దయ”– ఇతరులెవరైనా అందుకు యోగ్యులు కాకపోయినా కూడా క్రియాశీలంగా వారికి సహాయం చేసే గుణాన్ని ఇది సూచిస్తున్నది. ఈ గుణం మనల్ని ప్రయోజనకరమైన సేవతో నిండిన జీవితానికి ప్రోత్సహిస్తుంది. క్రీస్తు జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించిన మంచి గుణం ఇది. మత్తయి 4:23-24; మత్తయి 20:28; అపో. కార్యములు 10:38. తనను అనుసరించే వారిలో కూడా ఈ గుణం ఉండాలని క్రీస్తు కోరుతున్నాడు – మత్తయి 25:31-40; లూకా 6:35; ఎఫెసీయులకు 4:32; కొలొస్సయులకు 3:12. “అసూయ”– ఈ భయంకరమైన పాపం గురించి సామెతలు 14:30; సామెతలు 27:4; మత్తయి 27:18; అపో. కార్యములు 7:9; అపో. కార్యములు 13:45; అపో. కార్యములు 17:5 చూడండి. అసూయ అంటే ఇతరుల విజయాలు, పేరుప్రతిష్ఠలు, ఆస్తిపాస్తులను చూచి బాధ, నిరసన చెందడం. ఇది ప్రేమకు పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకం. అందువల్ల క్రైస్తవులకు కూడా వ్యతిరేకమే – రోమీయులకు 13:13; యాకోబు 3:14-16. “గర్వంతో”– ప్రేమ ఇతరుల పొగడ్తలను ఎన్నడూ ఆశించదు. దానికి దురహంకారం లేదు. వినయంగా తగ్గి ఉంటుంది. దీన్ని క్రీస్తు జీవితంలో పరిపూర్ణంగా చూడవచ్చు. ఆయన విశ్వాసులు ఇందులో కూడా ఆయన్ను అనుసరించాలి (మత్తయి 11:29). ప్రేమ తనను త్యాగం చేసుకుంటుంది గానీ తన హక్కుల కోసం పోరాడదు (మత్తయి 10:38-39; లూకా 9:23).

5. అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
జెకర్యా 8:17

“అయోగ్యంగా”– 1 కోరింథీయులకు 7:36. “సిగ్గుకరంగా” అని కూడా అనువదించవచ్చు. ఎవరికీ అవమానం, అమర్యాద కలిగే విధంగా ప్రేమ ఎన్నడూ ప్రవర్తించదు. తనకు సిగ్గు కలిగే విధంగా కూడా ఎప్పుడూ ప్రవర్తించదు. “సొంత ప్రయోజనం”– లోకం దృష్టిలో విలువైన వాటిని, అంటే డబ్బు, ఆస్తులు, ప్రఖ్యాతి, పదవి, పొగడ్త, లేక అధికారం మొదలైనవాటిని ఎప్పుడూ ప్రేమ కోరుకోదు. దానికి పేరాశ లేదు. అది ఇతరుల మేలును మాత్రమే కోరుతుంది. క్రీస్తులో దీన్ని చూస్తాం. ఆయన్ను అనుసరించేవారిలో కూడా ఇది కనిపించాలి (1 కోరింథీయులకు 10:24; రోమీయులకు 15:1-2). “కోపానికి రేకెత్తించబడదు”– అంటే తొందరపడి తనకు అవమానం జరిగినట్టు ఇతరులపై కోపగించుకోదు. దానికి ముక్కోపం లేదు. అంటే పాపానికి వ్యతిరేకంగా బీకరమైన తీవ్రమైన కోపం ఉండడం ప్రేమకు విరుద్ధమని అర్థం కాదు (ప్రేమస్వరూపి అయిన దేవుడు మనుషుల చెడుతనంపై ఎప్పుడూ కోపం చూపుతూనే ఉంటాడు – రోమీయులకు 1:18; యోహాను 3:36; కీర్తనల గ్రంథము 7:11). కానీ అది వేరే విషయం. గ్రీకులో అందుకు వేరే పదం వాడబడింది. “లెక్క చేయదు”– ప్రేమ తప్పులను కప్పుతుంది, క్షమిస్తుంది. పగ సాధించేందుకు కుట్ర పన్నదు (మత్తయి 5:38-48; లూకా 23:34; అపో. కార్యములు 7:59-60; 1 పేతురు 4:8). ఇతరులు చెడు ఉద్దేశాలతో ప్రవర్తిస్తున్నారనుకోదు అని ఇక్కడున్న గ్రీకు పదానికి అర్థం కావచ్చు. సాధ్యమైతే వారికి పాపం అంటగట్టకుండా ఉండాలని అది ఎప్పుడూ చూస్తుంటుంది. ప్రేమించవలసిన రీతిగా ప్రేమించే క్రైస్తవులు ఇతరుల్ని తమకంటే యోగ్యులుగా ఎంచుతూ ఉంటారు (ఫిలిప్పీయులకు 2:3). ఎవరికీ తీర్పు తీర్చడం, నేరం మోపడం వారికి ఇష్టం ఉండదు (రోమీయులకు 14:4, రోమీయులకు 14:10, రోమీయులకు 14:13).

6. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

ప్రేమ వెన్నెముక లేనిది కాదు. అటు ఇటు కొట్టుకుపోయేది కాదు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఊహాలోకాల్లో తేలియాడేది కాదు. భావోద్రేకాలకు లోనయ్యేది కాదు. దుష్టత్వంతో అది రాజీపడదు. దుర్మార్గత కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వదు. “సంతోషించదు” అంటే దుర్మార్గం విషయమంతటిలో ప్రేమకు విచారం ఉంటుంది. సత్యం గెలిచినప్పుడు అన్నిటికీ మించిన ఆనందం దానికి కలుగుతుంది. ప్రేమ, సత్యం ప్రాణ స్నేహితులు. ఈ వచనంలో దుర్మార్గానికి వ్యతిరేకంగా సత్యం ఉంది. దుర్మార్గానికి చీకటి, అబద్ధాలు, మోసం దేవుని సత్యాన్ని అణచివేయడంతో సంబంధం ఉంది (యోహాను 3:19-20; రోమీయులకు 1:18; 2 థెస్సలొనీకయులకు 2:10, 2 థెస్సలొనీకయులకు 2:12). పౌలు ఇక్కడ చెప్తున్న సత్యానికి వెలుగుతో, వాస్తవికతతో, దేవునితో సంబంధం ఉంది. ఈ సత్యానికి క్రీస్తే స్వరూపం (యోహాను 14:6). ఈ సత్యంలో మనకు సంతోషం లేకపోతే ఇక్కడ పౌలు వర్ణిస్తున్న ప్రేమ మనకు ఉన్నదని మనం ఊహించుకోవడం వ్యర్థం.

7. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
సామెతలు 10:12

“భరిస్తుంది”– లేక సహిస్తుంది (1 కోరింథీయులకు 9:12; 1 థెస్సలొనీకయులకు 3:1, 1 థెస్సలొనీకయులకు 3:5). ఈ గ్రీకు పదానికి మరో అర్థం “సంరక్షిస్తుంది”. “నమ్ముతుంది”– ఇక్కడి గ్రీకు అన్నిటినీ నమ్ముతుంది అని కూడా అనువదించవచ్చు. మనుషులు చెప్పే ప్రతి అబద్ధాన్నీ, కట్టు కథనూ నమ్ముతుందని మాత్రం కాదు. కపట ఉపదేశకుల దుర్భోధలను ప్రేమ నమ్మదు. దీని అర్థం ఇలా కానే కాదు. ప్రేమ సత్యం విషయంలోనే సంతోషిస్తుంది (వ 6), కాబట్టి సత్యాన్ని గుర్తించగలదు. అది తెలివిమాలినది కాదు. అమాయకమైనది కాదు, గుడ్డిది కాదు. అయితే దానిది ఇతరులను నమ్మే స్వభావం. అనుమానాలు పెట్టుకుని విరక్తిగా ఎప్పుడూ కీడును ఎంచే స్వభావం కాదు. ఇతరులు చెప్పినది నిజమో కాదో సందేహించే అవకాశం ఉంటే అది నిజమేనని నమ్మేందుకు ప్రేమ సిద్ధమే. చెప్పే వ్యక్తి అబద్ధికుడని అనవసరంగా అనుకోవడం దానికి ఇష్టం లేదు. “ఆశాభావం”– ఇది అన్నిటినీ ఆశాభావంతో చూస్తుంది అని కూడా అనువదించవచ్చు. ప్రేమ తేలికగా నిరుత్సాహపడదు. వైఫల్యం దాన్ని అణగదొక్కదు. ఆశాభావానికి ఆస్కారమే లేనప్పుడు కూడా ఆశాభావం వదలదు (రోమీయులకు 4:18). దేవుని కృప ఏ వ్యక్తికైనా చేరగలదనీ ఎలాంటి పరిస్థితినైనా మార్చెయ్యగలదనీ అది నమ్ముతుంది. “ఓర్చుకుంటుంది”– ఈ గ్రీకు పదాన్ని సైనిక పదజాలం నుంచి తీసుకున్నారు. శత్రు దాడులన్నిటినీ ఓర్చుకుని నిలవడమనీ దీని అర్థం (ఎఫెసీయులకు 6:10-17). “ఆగాపే”, దేవునిపట్ల, మనిషిపట్ల ఉన్న ఈ స్వార్థం లేని దివ్య ప్రేమ అన్ని కష్టాలనూ బాధలనూ హింసలనూ సైతాను, మనుషులు చేసే దాడులనూ ఎదుర్కొని ముందుకు సాగిపోతుంది. అది విశ్వాసులకు అత్యధిక విజయాన్ని ఇస్తుంది.

8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

“ఆగాపే” ప్రేమ శాశ్వతంగా ఉంటుందని అర్థం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ గలవారే శాశ్వత యుగాల్లో ఆయనతో ఉంటారు. పౌలు రాస్తున్న కాలంలో మంచివిగా, ప్రయోజనకరమైనవిగా ఉన్న కొన్ని విషయాలు కూడా గతించిపోతాయి. భాషలు, దేవుని మూలంగా పలకడం, తెలివి – ఇవి పౌలు 1 కోరింథీయులకు 12:8-10 లో చెప్పిన ఆధ్యాత్మిక సామర్థ్యాలు. కానీ బహుశా మరింత విస్తారమైన అర్థం ఈ మాటల్లో ఉండవచ్చు. క్రొత్త ఒడంబడిక గ్రంథ రచన పూర్తి అయినప్పుడు (“పరిపూర్ణమైనది”) ఈ సామర్థ్యాలన్నీ గతించిపోతాయని పౌలు భావమని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. అప్పటివరకు ఈ సామర్థ్యాలు (“కొంత భాగంగా ఉండేది”) అవసరం. ఎందుకంటే దేవుని సంపూర్ణ సత్యం ఇంకా సంఘానికి వెల్లడి కాలేదు. ఆ తరువాత ఈ సామర్థ్యాల అవసరం ఉండదు. అవి లేకుండా పోయాయి. సంఘం బాల్యదశలో ఉన్నప్పుడు (వ 11) మాత్రమే ఈ సామర్థ్యాలు అవసరమనీ దానికి వయసు వచ్చాక వాటి అవసరం లేదనీ ఆ పండితులు అనుకున్నారు. ఈ అభిప్రాయం ఈ నోట్స్ రచయితకు సరియైనదిగా కనిపించడం లేదు. “పరిపూర్ణమైనది” వచ్చే సమయం క్రొత్త ఒడంబడిక గ్రంథం పూర్తి అయినప్పుడు కాదనీ, విశ్వాసులు పరలోకంలో క్రీస్తుతో ముఖాముఖిగా ఉన్నప్పుడనీ, లేదా ఈ యుగాంతంలోననీ వ 12 సూచిస్తున్నట్టుంది. క్రీస్తుకు విశ్వాసులు పూర్తిగా తెలిసినట్టే వారికి ఆయన పూర్తిగా తెలిసే సమయం అది. క్రొత్త ఒడంబడిక గ్రంథం రచన పూర్తి అయినప్పుడు ఇలా జరగలేదు. “తెలివి...కాలగతి అవుతుంది”– అంటే పరిపూర్ణం కాని తెలివి లేక తెలివైన మాట చెప్పే సామర్థ్యం (1 కోరింథీయులకు 12:8). లేదా, తర్కం ద్వారా ప్రయోగాల ద్వారా మనుషులు సంపాదించుకునే సాధారణమైన తెలివి అని కూడా అర్థం కావచ్చు. లోపం లేని తెలివి, జ్ఞానం వచ్చినప్పుడు అదంతా అనవసరమవుతుంది (వ 12).

9. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని

10. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థక మగును.

11. నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

బహుశా భూమిపై విశ్వాసుల జీవితమంతా బాల్యదశ వంటిదని అతని భావం కావచ్చు. క్రీస్తు వచ్చినప్పుడే వారికి సరైన వయసు వస్తుంది. అయితే ఇప్పుడు కూడా మనం ప్రేమ, ఆధ్యాత్మిక సామర్థ్యాల విషయంలో చిన్నపిల్లల్లాగా ప్రవర్తించ కూడదన్న కనీసం ఒక సూచన ఇక్కడ కనిపిస్తున్నట్టుంది.

12. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.

“అద్దంలో చూస్తున్నట్టు”– ఆ రోజుల్లో అద్దాలు ఇప్పటి అద్దాలంత మంచివి కావు. వాటిలో కనిపించే ప్రతిబింబం మసకగా ఉండేది. ఇప్పుడూ మన తెలివి విషయం కూడా ఇదే.

13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

ఈ మూడూ క్రైస్తవ సంఘ జీవితానికీ, వ్యక్తిగతంగా విశ్వాసికీ ప్రాముఖ్యమైనవి. ఏ ఆధ్యాత్మిక సామర్థ్యంకన్నా కూడా ముఖ్యమైనవి. విశ్వాసం, ఆశాభావం కన్నా ప్రేమ గొప్పదని పౌలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందా? విశ్వాసం మన పాపవిముక్తి రక్షణలేక అత్యవసరం గదా (యోహాను 3:36). దేవుడు తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడని ఎదురు చూడడమే ఆశాభావం. అది క్రైస్తవ జీవితంలో ప్రధానమైన విషయం (రోమీయులకు 8:24-25). ఈ రెంటి కన్నా ప్రేమ ఎలా గొప్పది? నమ్మకం తీసుకుంటుంది. ప్రేమ ఇస్తుంది. పుచ్చుకోవడం కన్న ఇవ్వడం ఎక్కువ ధన్యకరం (అపో. కార్యములు 20:35). ఇస్తున్న దాన్ని అందుకునే హస్తం నమ్మకం. అది అందుకుంటున్న గొప్ప విషయం ప్రేమ. ఆశాభావం కూడా విశ్వాసం వంటిదే. తనకు మేలు జరగాలని అది ఎదురు చూస్తుంది. ప్రేమ ఇతరుల మంచిని కోరుతుంది. ఒక గమ్యాన్ని చేర్చే సాధనాలు విశ్వాసం, ఆశాభావం. ప్రేమే ఆ గమ్యం. అందరి శ్రేయస్సు కోసం ఎక్కువ చేసేది అన్నిటికన్నా గొప్పది, ప్రేమే ఇలా చేస్తుంది (1 కోరింథీయులకు 8:1). 1 కోరింథీయులకు 10:24 లో విశ్వాసులు ఏమి చెయ్యాలని పౌలు చెప్పాడో వారిచేత అలా చేయించగలిగేది ప్రేమ ఒక్కటే. ఈ అధ్యాయం చదివాక ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఈ “ఆగాపే”, దేవుని పట్లా మనుషులపట్లా ఈ స్వార్థం లేని ప్రేమ మనకెలా కలుగుతుంది? గలతియులకు 5:22; 1 యోహాను 4:7, 1 యోహాను 4:19; రోమీయులకు 5:5 లో జవాబు ఉంది. ఈ ప్రేమ దేవుని నుంచి వస్తుంది గానీ విశ్వాసులు దానికి లొంగి విధేయులై దాన్ని ఆచరణలో పెట్టాలి (1 కోరింథీయులకు 14:1).



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians I - 1 కొరింథీయులకు 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రేమ యొక్క దయ యొక్క అవసరం మరియు ప్రయోజనం. (1-3) 
మునుపటి అధ్యాయం చివరిలో చర్చించబడిన ప్రశంసనీయమైన విధానం దాతృత్వాన్ని కేవలం భిక్షగా భావించే సాధారణ అవగాహన నుండి భిన్నంగా ఉంటుంది. బదులుగా, అది ప్రేమను దాని విస్తృత అర్థంలో సూచిస్తుంది-దేవుడు మరియు మానవత్వం రెండింటిపై నిజమైన ప్రేమ. ఈ ప్రగాఢమైన ప్రేమ లేకుండా, అత్యంత అద్భుతమైన బహుమతులు కూడా మనకు ఎటువంటి విలువను కలిగి ఉండవు మరియు దేవుని దృష్టిలో గౌరవాన్ని కలిగి ఉండవు. దయ మరియు దాతృత్వ హృదయం లేకుండా పదునైన తెలివి మరియు లోతైన అవగాహన చాలా తక్కువ. ఒక వ్యక్తి బహిరంగ మరియు విలాసవంతమైన చేతితో ఔదార్యాన్ని ప్రదర్శించవచ్చు, అయినప్పటికీ నిజమైన దయగల మరియు దాతృత్వ స్ఫూర్తిని కలిగి ఉండకపోవచ్చు. దేవుని పట్ల హృదయపూర్వకమైన ప్రేమ మరియు తోటి మానవుల పట్ల సద్భావనతో నడిచే వరకు ఇతరుల పట్ల దయతో కూడిన చర్యలు మనకు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు. హృదయాన్ని దేవుడికి అప్పగించకుండా అన్ని ఆస్తులను ఇవ్వడం వల్ల లాభం లేదు. ఇది చాలా కష్టమైన బాధలకు కూడా వర్తిస్తుంది. తమ అసంపూర్ణమైన, చెడిపోయిన మరియు స్వీయ-కేంద్రీకృతమైన మంచి పనులకు ఆమోదం మరియు ప్రతిఫలాన్ని ఆశించేవారు మోసపోతారు.

దాని శ్రేష్ఠత దాని లక్షణాలు మరియు ప్రభావాల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది; (4-7) 
దాతృత్వం యొక్క కొన్ని ప్రభావాలు మనకు ఈ అనుగ్రహాన్ని కలిగి ఉన్నాయో లేదో అంచనా వేయడంలో సహాయపడటానికి మరియు మనం చేయకపోతే దానిని వెతకమని ప్రోత్సహించడానికి వివరించబడ్డాయి. ఈ ప్రేమ పునరుత్పత్తికి స్పష్టమైన సూచికగా పనిచేస్తుంది మరియు క్రీస్తుపై మనకున్న విశ్వాసానికి లిట్మస్ పరీక్షగా పనిచేస్తుంది. ప్రేమ యొక్క స్వభావం మరియు పర్యవసానాల యొక్క అనర్గళంగా చిత్రీకరించడం కొరింథియన్లకు వారి ప్రవర్తన తరచుగా ఈ ఆదర్శాలకు విరుద్ధంగా ఉందని బహిర్గతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దాతృత్వం స్వార్థానికి ప్రత్యక్ష వ్యతిరేకం; ఇది వ్యక్తిగత ప్రశంసలు, గౌరవం, లాభం లేదా ఆనందాన్ని కోరుకోదు. దానర్థం తన గురించిన అన్ని ఆందోళనలను నిర్మూలిస్తుందని దీని అర్థం కాదు, లేదా స్వచ్ఛంద వ్యక్తి వ్యక్తిగత శ్రేయస్సు మరియు ఆసక్తులను నిర్లక్ష్యం చేయాలని సూచించదు. బదులుగా, దాతృత్వం ఇతరుల ఖర్చుతో తన స్వంత ప్రయోజనాన్ని కోరుకోవడం లేదా ఇతరుల అవసరాలను విస్మరించడాన్ని నివారిస్తుంది. ఇది వ్యక్తిగత లాభం కంటే ఇతరుల సంక్షేమానికి స్థిరంగా ప్రాధాన్యతనిస్తుంది. క్రైస్తవ దాతృత్వం దాని మంచి స్వభావం మరియు స్నేహపూర్వక స్వభావం ద్వారా వర్గీకరించబడుతుంది. క్రైస్తవ మతం దాని అనుచరులు ఈ దైవిక సూత్రం ద్వారా మరింత స్థిరంగా మార్గనిర్దేశం చేయబడితే మరియు దాని ఆశీర్వాద రచయిత నొక్కిచెప్పిన ఆజ్ఞకు తగిన గౌరవం ఇస్తే, ప్రపంచ దృష్టిలో క్రైస్తవం నిజంగా అద్భుతమైనదిగా భావించబడుతుంది. ఈ దివ్యమైన ప్రేమ మన హృదయాలలో నివసిస్తుందో లేదో ఆత్మపరిశీలన చేసుకొని విచారిద్దాం. ఈ సూత్రం అన్ని వ్యక్తుల పట్ల మన ప్రవర్తనలో శ్రద్ధగా ఉండేలా మనల్ని నడిపించిందా? స్వార్థపూరిత లక్ష్యాలు మరియు సాధనలను పక్కన పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నారా? ఇది అప్రమత్తత, శ్రద్ధ మరియు ప్రార్థనకు పిలుపుగా పనిచేస్తుంది.

మరియు దాని స్థిరత్వం మరియు దాని ఆధిపత్యం ద్వారా. (8-13)
దాతృత్వం దాని శాశ్వత స్వభావం కారణంగా కొరింథియన్ల ప్రగల్భాలు పలికిన బహుమతులను అధిగమిస్తుంది, శాశ్వతత్వం అంతటా ఉంటుంది. ప్రస్తుత స్థితి బాల్యంతో సమానంగా ఉంటుంది, అయితే భవిష్యత్ స్థితి పరిపక్వతతో ఉంటుంది-భూమి మరియు స్వర్గం మధ్య వ్యత్యాసం వలె ఉంటుంది. పిల్లలు వారి స్వర్గపు సారాంశంతో పోల్చితే ప్రాపంచిక బహుమతుల గురించి మన ప్రస్తుత అవగాహన వలె పెద్దలతో పోలిస్తే పరిమిత మరియు గందరగోళ దృక్పథాలను కలిగి ఉంటారు. ప్రస్తుతం, మన గ్రహణశక్తి అద్దంలో ప్రతిబింబాలను చూడటం లేదా చిక్కును అర్థంచేసుకోవడం వంటిది, కానీ భవిష్యత్తులో, జ్ఞానం అస్పష్టత మరియు లోపం నుండి విముక్తి పొందుతుంది. స్వర్గపు కాంతి మాత్రమే అన్ని మేఘాలను మరియు చీకటిని తొలగిస్తుంది, దేవుని ముఖాన్ని బహిర్గతం చేస్తుంది.
దాతృత్వం యొక్క సద్గుణాలను హైలైట్ చేయడంలో, ఇది బహుమతులను మాత్రమే కాకుండా విశ్వాసం మరియు ఆశ వంటి ఇతర దయలను కూడా అధిగమిస్తుంది. విశ్వాసం దైవిక ద్యోతకంపై ఆధారపడుతుంది మరియు దైవిక విమోచకుడిని ఆలింగనం చేసుకుంటుంది, అయితే ఆశ భవిష్యత్తు ఆనందాన్ని ఆత్రంగా ఎదురుచూస్తుంది. అయినప్పటికీ, పరలోకంలో, విశ్వాసం వాస్తవ దృష్టిగా, మరియు నిరీక్షణ ప్రత్యక్షమైన ఆనందంగా రూపాంతరం చెందుతుంది. ఆ రాజ్యంలో, ప్రత్యక్ష దృష్టి మరియు ఆనందాన్ని ఎదుర్కొన్నప్పుడు నమ్మకం మరియు ఆశ అవసరం లేదు. అయితే ప్రేమ అక్కడ పరాకాష్టకు చేరుకుంటుంది—అది దేవుని వైపు మరియు ఒకరి వైపు సంపూర్ణంగా నిర్దేశించబడుతుంది. ఈ ఆశీర్వాద స్థితి క్రింద అనుభవించిన వాటి కంటే చాలా ఎక్కువ, ఎందుకంటే దేవుడు ప్రేమ 1 యోహాను 4:8 1 యోహాను 4:16. దేవుని సన్నిధిలో, అతను ముఖాముఖిగా కనిపించే చోట, దాతృత్వం దాని అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది, పరిపూర్ణతను సాధిస్తుంది.



Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |