Corinthians II - 2 కొరింథీయులకు 10 | View All

1. మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.

2 కోరింథీయులకు 11:10. 10–13 అధ్యాయాల్లో పౌలు కొరింతులో అబద్ధ బోధకుల మాటలు వింటున్న వారి గురించి, ఆ దుర్బోధకుల గురించి రాస్తున్నాడు. ఈ దుర్బోధకులు “వేరే శుభవార్తను” ప్రకటిస్తున్నారు (2 కోరింథీయులకు 11:4). వారు సైతాను సేవకులు. విశ్వాసులను తప్పుదారి పట్టించేందుకు సైతాను వారిని అక్కడికి పంపించాడు (2 కోరింథీయులకు 11:13-14). తాము నిజమైన క్రీస్తురాయబారులమని వారు గొప్పలు చెప్పుకొంటున్నారు (2 కోరింథీయులకు 1:5, 2 కోరింథీయులకు 1:12). పౌలు పైనా అతడు ప్రకటించిన శుభవార్తపైనా దాడి చేశారు. అందువల్ల పౌలు తన రాయబారి పదవి పక్షంగా వాదిస్తున్నాడు. ఇది తనకోసం కాదు గాని కొరింతు సంఘం వారికోసమే (2 కోరింథీయులకు 12:19). వారి ఆధ్యాత్మిక స్థితి గురించి అతనికి ఆందోళనగా ఉంది (2 కోరింథీయులకు 11:3; 2 కోరింథీయులకు 12:20-21). వారు తనను తిరస్కరించి, దేవుడెన్నుకున్న రాయబారిగా తన ద్వారా దేవుడు ఉపదేశించిన దాన్ని వారు త్రోసిపుచ్చితే వారి పరిస్థితి మరింత విషమిస్తుందని అతడు గ్రహించాడు. “క్రీస్తు సాత్వికం, శాంతం”– మత్తయి 11:29; మత్తయి 12:20; యెషయా 40:11. యేసుప్రభువు ప్రవర్తించినట్టు పౌలు కూడా ప్రవర్తించాలని కోరాడు. రాయబారిగా తనకున్న అధికారాన్ని వినియోగించుకోకుండా (2 కోరింథీయులకు 13:10), ప్రేమతో వారికి విన్నవించుకుంటున్నాడు. “ధైర్యశాలి”– తమతో ఉన్నప్పుడు పౌలు పిరికివాడనీ, ఉత్తరాల్లో మాత్రమే ధైర్యంగా రాయగలడనీ అతని గురించి కొరింతులో కొందరు చెప్పుకుంటున్నారు.

2. శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

కొరింతులో పౌలు ధైర్యంగా ప్రవర్తించగలడు, వారిని సరి దిద్దేందుకు కఠినమైన చర్యలు కూడా తీసుకోగలడు. అయితే అతడు అలా చేయకుండేలా వారు తమను తాము దిద్దుకోవాలని ఆశిస్తున్నాడు. “శరీరానుసారంగా”– పౌలు పై కొందరు మోపిన మరో నేరం ఇది.

3. మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.

సత్యానికీ అసత్యానికీ, అంటే దేవుడు వెల్లడించిన దానికీ మనుషులు కల్పించిన దానికీ మధ్య జరిగే యుద్ధాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు సత్యాన్ని నాశనం చేయడమే లోకానికి ఉన్న ఉద్దేశం. దేవుని నిజ సేవకుల ఉద్దేశం మాత్రం అసత్యాలనూ అబద్ధాలనూ నాశనం చేసి మనుషుల తలంపులను క్రీస్తుకు విధేయమయ్యేలా చేయడమే. క్రీస్తు సేవకుల ఆయుధాలు లోకం ఉపయోగించే ఆయుధాల లాంటివి కావు. విశ్వాసులు లోకంలో ఉన్నారు. కానీ సత్యం పక్షంగా వారు సలిపే పోరాటంలో లోకం ఉపయోగించే ఆయుధాలను ఉపయోగించ కూడదు. అవి హింస, బలాత్కారం, టక్కరితనం, శరీరసంబంధమైన ఆకర్షణ, తప్పుల ప్రచారం, మానవ తర్కం, ఇంకా మనిషి భ్రష్ట స్వభావంలోనుంచి వచ్చేదేదైనా. విశ్వాసులకు కూడా ఆయుధాలున్నాయి (2 కోరింథీయులకు 6:7; ఎఫెసీయులకు 6:17). అవి ఆధ్యాత్మికమైన ఆయుధాలు. సత్యం, న్యాయంతో కలిసి పనిచేసే దేవుని బలప్రభావాలపై పౌలు ఆధారపడ్డాడు. దేవుని ఆత్మ సంపూర్ణత, యథార్థత, నిజాయితీ, ప్రేమతో సత్యం చెప్పడం ఇవే ఆ గొప్ప యోధుడి ఆయుధాలు. ఈ ఆయుధాలకు దేవుని “బలప్రభావాలు” ఉన్నాయి. వాటి మూలంగా అతడు “కోటలను” నేలమట్టం చేయగలిగాడు – “కోట” అంటే సైతానుకు, చెడుతనం, అపనమ్మకం, అబద్ధ మతం, వేదాంతం మొదలైనవాటికి చెందే తంత్రాలూ ఆలోచనలూ వివాదాలూ ఉనికిపట్టు. దేవుని యోధుడు శత్రువులను “చెరపట్ట” గలిగాడు కూడా. లోకంలో చెలరేగుతున్న మహా యుద్ధం సత్యానికీ అసత్యానికీ మధ్య. పౌలు మనుషుల వేదాంతాలన్నిటినీ, తత్వశాస్త్రాన్నంతటినీ, మత సంబంధమైన తలంపులన్నిటినీ, జ్ఞానంగా చెలామణి అవుతున్న దానంతటినీ పట్టుకుని దానిపై క్రీస్తు తీర్పు కోసం ఆయన పాదాల చెంతకు తీసుకువచ్చాడు. పౌలు తన మనసు, తలంపులు మాత్రమే గాక, అందరి మనసులూ తలంపులూ దేవుని కుమారుని ప్రభావంకిందికి రావాలని కోరాడు. క్రీస్తుకు లోబడేందుకు సిద్ధమైన మనసులు, ఆయన మెప్పు, ఆమోదం చూరగొన్న తలంపులే మనుషుల్లో ఉండాలి. ఇది ఖాయం. 1 కోరింథీయులకు 1:17-31; 2 కోరింథీయులకు 3:18-20; కొలొస్సయులకు 2:8 లో పౌలు దేవుని జ్ఞానాన్నీ మానవ జ్ఞానాన్నీ పోల్చిన సందర్భాలన్ని కూడా చూడండి.

4. మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి.

5. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి

6. మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.

సత్యాన్ని అంగీకరించి దానికి విధేయులయ్యే ప్రతి అవకాశమూ వారికివ్వాలని పౌలు ఉద్దేశం. అవిధేయతను శిక్షించే అధికారం అతనికున్నదని చిట్టచివరికి వారు గ్రహిస్తారు. 2 కోరింథీయులకు 13:10; 1 కోరింథీయులకు 4:21; 1 కోరింథీయులకు 5:3-5 చూడండి.

7. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
నిర్గమకాండము 32:6

8. పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.

“అతిశయంగా”– 2 కోరింథీయులకు 1:12 నోట్.

9. నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను.

10. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.

వ 1. పౌలుకు వాక్చాతుర్యం, వాగ్దాటి, మానవ జ్ఞానం లేవని కొందరు అనుకుంటున్నట్టుంది (2 కోరింథీయులకు 11:6). సత్యాన్ని అందించడంలో అతడు మరీ మెతకగా, సున్నితంగా, సాత్వికంగా ప్రవర్తిస్తాడని కూడా అనుకుంటున్నారు. అతని ఉత్తరాలు మాత్రం “గంబీరమైనవి, తీవ్రమైనవి” అనడంలోనైనా కనీసం వారు నిజం మాట్లాడుతున్నారు.

11. మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.

12. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరి చూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు.

మనుషులు తమను కేవలం తమ సాటి వారిలో కొందరితో మాత్రమే పోల్చుకుంటే (అలాంటి పోలికల్లో ఎవరికి వారే మంచివారుగా అనిపించాలనే ప్రయత్నం తప్పక జరుగుతుంది గదా) తమను తాము పొగడుకునేందుకు వారికి కారణం దొరకవచ్చు. అయితే పౌలు ఇలాంటిదానిలో తలదూర్చదలచుకోలేదు. పోల్చుకునేందుకు సాటి మనుషుల కంటే మరెంతో ఉన్నతమైన ప్రమాణం ఉందని అతనికి తెలుసు. మనం అనుసరించవలసిన ఆదర్శం క్రీస్తే. బుద్ధి ఉన్న ఎవరూ కూడా ఆయనతో పోల్చుకుంటే తమను గురించి తాము గొప్పగా అనుకోలేరు.

13. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.

“గొప్పగా చెప్పుకోము”– 2 కోరింథీయులకు 1:12. “సరిహద్దులు”– అంటే రాయబారిగా, శుభవార్త ప్రచారకుడుగా, ఉపదేశకుడుగా తన పని గురించి పౌలు చెప్తున్నమాట ఇది. అతని సరిహద్దు కొరింతు వరకు వ్యాపించింది. శుభవార్తను అక్కడికి మొదట తీసుకువెళ్ళి ఆ సంఘాన్ని స్థాపించినది అతడే (1 కోరింథీయులకు 4:14-15; 1 కోరింథీయులకు 9:2).

14. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్న వారము కాము.

15. మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయ పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,

కొరింతుకు వచ్చిన కపట రాయబారులు (వ 13) ఆ సంఘాన్ని హస్తగతం చేసుకుని ఆ పని అంతా తమదేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అబద్ధ ఉపదేశకులూ బోధకులూ సాధారణంగా చేసేది ఇదే. పౌలు కొరింతులో తన పని గురించి “గొప్పలు చెప్పుకోవడంలో” ఇలా చేయడం లేదు.

16. మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.

తాను ఇతర ప్రదేశాలకు వెళ్ళి తన సమయాన్ని, శక్తిని ఉపయోగించగలిగేందుకు వీలుగా కొరింతు సంఘం సత్యంలో మరింత స్థిరపడాలని పౌలు ఆశిస్తున్నాడు. రోమీయులకు 15:20-22 పోల్చి చూడండి.

17. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.
యిర్మియా 9:24

18. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.

వ 12. ఆ అబద్ధ బోధకులు తమను తాము మెచ్చుకుంటూ ఇతరుల మెప్పును కోరారు (2 కోరింథీయులకు 3:1). యోహాను 5:44 పోల్చి చూడండి. దేవునినుంచి మాత్రమే వచ్చే మెప్పును పౌలు ఆశించాడు (1 కోరింథీయులకు 4:3-5; గలతియులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:4).Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |