Corinthians II - 2 కొరింథీయులకు 12 | View All

1. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసివచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.

తన బలహీనతల గురించి అతిశయంగా చెప్పుకోవడం కూడా పౌలుకు ఇష్టం లేదు కానీ చెప్పుకోక తప్పదు – వ 11,19. “ప్రయోజనం”– తనకు కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతల గురించి చెప్పుకోవడం తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనమూ లేదు. అది వారికేమీ సహాయం కూడా చెయ్యదు. అయితే కొరింతులో ఉన్న అబద్ధ బోధకులు అలాంటి వాటిగురించి అతిశయంగా చెప్పుకుంటుంటే (బహుశా వారలా చేస్తూ ఉండి ఉండవచ్చు), ఈ విషయంలో కూడా తాను ఏ మాత్రం వారికి తీసిపోనని చూపడం అవసరమని పౌలుకు అనిపించింది. దర్శనాల గురించి ఆదికాండము 15:1; సంఖ్యాకాండము 12:6 నోట్స్.

2. క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

పౌలు ఇక్కడ తన గురించే చెప్పుకుంటున్నాడా? అవును, వ 7 చూడండి. అలాగైతే అది తాను కాదన్నట్టు “ఒక మనిషి” అంటూ ఎందుకు చెప్పాడు? ఇది అతని “బలహీనతల్లో” ఒకటి కాదు గనుక, వాటిల్లోనే తాను అతిశయించాలి గనుక ఇలా చెప్పి ఉండవచ్చు. లేక ఇది అతనికి జరిగినది ఒక వింత అనుభవంలాగా ఉండడంచేత ఏమి జరుగుతున్నదో తనకే ఎక్కువ అర్థం కానట్టు దాదాపుగా ఒక ప్రేక్షకుడుగా అతడు మిగిలి పోయినట్టుండడం వల్ల అలా చెప్పాడేమో.

3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.

“పరమానంద నివాసం”– ఇది “మూడో ఆకాశం” (వ 2) అనిపిస్తున్నది. ఆకాశాలు ఏడు ఉన్నాయని కొందరు యూదులు బోధించారు. అయితే బైబిల్లో దేవుడు వెల్లడించిన సత్యంలో ఇలాంటిదానికి తావు లేదు. “మూడో ఆకాశం” అనడంలో పౌలు భావం అత్యున్నత ఆకాశం, ఆధ్యాత్మిక లోకం, దేవుడు నివసించే ప్రదేశం, పరమానంద నివాసం. పరమానంద నివాసం అనే పదం క్రొత్త ఒడంబడిక గ్రంథంలో మూడు చోట్ల మాత్రమే కనిపిస్తుంది – ఇక్కడ, లూకా 23:43; ప్రకటన గ్రంథం 2:7. చెప్పడానికి అనుమతి లేని విషయాలను పౌలు ఇక్కడ విన్నాడు. ద్వితీయోపదేశకాండము 29:29; ప్రకటన గ్రంథం 10:3-4 పోల్చి చూడండి.

4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

5. అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.

6. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను

మనుషులు వినగలిగిన, చూడగలిగిన వాటి మూలంగానే తన గురించి అభిప్రాయాలు ఏర్పరచుకోవాలని పౌలు కోరాడు గాని నిజమని వారు నిరూపించలేని వాటి మూలంగా కాదు.

7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
యోబు 2:6

వ 2-5లో పౌలు తన గురించే చెప్పుకుంటున్నట్టు ఇది రుజువు చేస్తున్నది. పౌలు చూచిన దర్శనాలకంటే అతి తక్కువ స్థాయి దర్శనాలు, ప్రత్యక్షతలు చూశామని అనుకున్న మనుషులు కొందరు గర్వంతో దురహంకారంతో నిండిపోయారు. దేవుడు పౌలుకు చూపించిన ప్రత్యక్షతలను బట్టి అతనిలో గర్వం ఏర్పడే అవకాశం ఉందని ఆయనకు తెలుసు. తన రాయబారిని, తన ప్రజల్లో ఎవరినైనా తనకు అసహ్యమైన గర్వంలో పడకుండా ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. పౌలు శరీరంలోని “ముల్లు” ఏమిటి? దీని గురించి మనకు తెలిసినదల్లా ఇక్కడ అతడు చెప్పినదే. ఈ భాష కూడా గూఢంగా కష్టంగా ఉంది. గ్రీకులో “శరీరం” అని తర్జుమా చేసిన మాటకు అర్థం భౌతిక దేహం కావచ్చు. అలాగైతే “ముల్లు” అంటే ఏదైనా వ్యాధి కావచ్చు. కానీ మనుషులందరిలోనూ ఉండే భ్రష్ట స్వభావం అని కూడా ఈ గ్రీకు పదానికి అర్థం కావచ్చు. ఈ పదం (సార్క్స్ – రోమీయులకు 7:5, రోమీయులకు 7:18 చూడండి) “శరీర స్వభావం” అని కూడా అనువదించవచ్చు. అలాగైతే “ముల్లు” అంటే అతని భ్రష్ట స్వభావానికి సంబంధించినదేదో అయి ఉండాలి. బహుశా బలమైన ఒక విషమ పరీక్ష, లేక దుష్‌ప్రేరేపణ, సైతాను పదే పదే అతని మనసులో చొప్పించడానికి ప్రయత్నిస్తున్న ఒక చెడు తలంపు లేక ఇలాంటిది మరేదైనా కావచ్చు. ఈ విధంగా ఇది పౌలుకు తన భ్రష్ట స్వభావాన్నీ బలహీనమైన స్థితినీ అస్తమానం జ్ఞాపకం చేస్తూ ఉండేది కావచ్చు. ఈ ముల్లేమిటో మనకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. అయితే దాని గురించిన విషయాలు మాత్రం కొన్ని తెలుసు. అది అతని శరీరంలో “ఉంచడం జరిగింది”. అంటే అది తాను అనుభవించేలా దేవుడు ఏర్పాటు చేశాడని పౌలు భావం. కానీ అది “సైతాను దూత”. అంటే పౌలును అంతగా పీడించినది, అది శారీరకమైనా ఆధ్యాత్మికమైనా, సైతాను పంపినదే అని అర్థం. లేక అది సైతాను పంపిన దయ్యం కావచ్చు – అడుగడుక్కూ అతణ్ణి వేధిస్తూ, అస్తమానం అతణ్ణి అణచివేస్తూ, ఎదిరిస్తూ ఉన్న పిశాచం. ఏది ఏమైనా ఈ “ముల్లు” వల్ల పౌలుకు చాలా బాధ కలిగింది. అది ఎలాంటి బాధో, అది శారీరికంగానా, మానసికంగానా, ఆధ్యాత్మికంగానా లేక ఈ మూడు రకాలుగానా అనేది ఇక్కడ అతడు చెప్పలేదు. పౌలు అనుభవంతో యోబు 1:6-22 ను పోల్చి చూడండి.

8. అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

ఆ బాధ ఎంత అధికమైనదంటే ఆ “ముల్లు”ను తీసివేయాలని అతడు దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. “ముమ్మారు”– మత్తయి 26:44; యోహాను 13:38; యోహాను 21:17; అపో. కార్యములు 10:16 పోల్చి చూడండి.

9. అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును

పౌలు అడిగినదానిని ప్రభువు దయ చేయలేదు. అంతకన్నా శ్రేష్ఠమైన దాన్ని ఇచ్చాడు. ఒక వివరణనూ గొప్ప వాగ్దానాన్నీ ఇచ్చాడు. వివరణ ఇది – పౌలు క్రీస్తుమూలంగా ఆధ్యాత్మికంగా బలపడదలచుకుంటే అతడు తనలో బలహీనుడై ఉండాలి. తన బలహీనతను గ్రహించాలి. వాగ్దానం ఏమిటంటే పౌలు ఆ “ముల్లు”ను భరించగలిగేలా, తద్వారా ఆధ్యాత్మిక లాభం పొందేలా క్రీస్తు చేస్తాడని. దాన్ని భరించే శక్తి ఇవ్వకుండా ఏ బాధనైనా, కష్టాన్నైనా, ఆపదనైనా ఎదుర్కోవాలని గానీ ఏమైనా పని చేయాలని గానీ బాధ్యత నెత్తిన వేసుకోవాలని గానీ దేవుడు చెప్పడన్న విషయం మనకు సందేహం అక్కర లేదు. తన వారందరికీ, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని తరాల్లోనూ ఆయన కృప చాలు. “అందుచేత”– మానవ బలహీనతల్లో క్రీస్తుయొక్క ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణం అవుతుంది అన్న ప్రాముఖ్యమైన పాఠాన్ని పౌలు నేర్చుకున్నాడు. క్రీస్తు బలప్రభావాలు తనలో నిలిచి ఉండాలన్నది అతనికున్న తీవ్రమైన కోరికల్లో ఒకటి (ఫిలిప్పీయులకు 3:10). కాబట్టి తన బలహీనతలను తనకు తెలియజేసే దేన్నైనా అతడు భరించడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. మనం కూడా అంతేనా?

10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.

“క్రీస్తు కోసం” అనే మాటలు గమనించండి. అతని జీవితం, పరిచర్య అంతా క్రీస్తు కోసమే. తనకోసం గాక క్రీస్తుకోసమే ఆయన బలప్రభావాలు తనలో నిలిచి ఉండాలని కోరుతున్నాడు. అదే కారణాన్ని బట్టి ఆనందంగా బాధలను కూడా ఎదుర్కొన్నాడు. “ఆనందిస్తాను”– బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, కడగండ్లు వీటన్నిటినీ భరించగలిగితే, పండ్ల బిగువున వాటిని భరిస్తే చాలనుకుంటారు చాలామంది విశ్వాసులు. అయితే అలాంటివాటి మూలంగా కలిగే గొప్ప ఆధ్యాత్మిక లాభాల గురించి ఒక విశ్వాసి తెలుసుకుంటే వాటిలో ఆనందించగలుగుతాడు. దేవుని విధానాలను తెలుసుకుంటే బాధ ఆనందాన్ని కలుగజేయగలదు (మత్తయి 5:11-12; అపో. కార్యములు 5:40-41; అపో. కార్యములు 16:22-25; 1 పేతురు 5:12-14 పోల్చి చూడండి). పౌలు ఆధ్యాత్మిక శక్తిని గురించి, అంటే తనను సమర్థుడైన క్రీస్తు కోసం సేవకుడుగా తీర్చిదిద్దే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. పౌలు బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడు ఎందుచేత? ఎందుకంటే తన బలహీనతను గుర్తించి ఇక తనపై, తన బలంపై, తెలివితేటలపై, సమర్థతపై ఆధారపడడం మానుకున్నాడు. కేవలం దేవునిపైనే ఆధారపడ్డాడు. 2 కోరింథీయులకు 1:8-9; 1 కోరింథీయులకు 2:1-5 చూడండి. దేవుని శక్తిని పొందడానికి మార్గం తన బలాన్ని పరిత్యజించి ఆయనలో నమ్మకం ఉంచడమే. యెషయా 40:28-31 పోల్చి చూడండి. సాధారణంగా మనుషుల ఆలోచనలకు ఇది సరిగ్గా వ్యతిరేకం.

11. నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.

“తెలివితక్కువ”– 2 కోరింథీయులకు 11:1, 2 కోరింథీయులకు 11:16, 2 కోరింథీయులకు 11:21. “మెచ్చుకోవలసి ఉంది”– 2 కోరింథీయులకు 3:1-3; 1 కోరింథీయులకు 9:1-3. “వట్టివాణ్ణి”– 2 కోరింథీయులకు 3:5. 1 కోరింథీయులకు 3:7; ఎఫెసీయులకు 3:8.

12. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.

దేవుడు ఆధ్యాత్మిక సత్యాలను నేర్పేందుకు క్రీస్తుద్వారా ఆయన రాయబారుల ద్వారా “సూచనలు” చూపించాడు (యోహాను 2:11 నోట్‌). “వింతలు”– అంటే ఆశ్చర్యం గొలిపే క్రియలు (మత్తయి 12:22-23; మత్తయి 15:31; అపో. కార్యములు 2:12; అపో. కార్యములు 3:10). “అద్భుతాలు”– అంటే అమానుషమైన మానవాతీతమైన శక్తితో క్రీస్తురాయబారులు చేసిన కార్యాలు. ఇవి “క్రీస్తు రాయబారుల సూచనలు”. దేవుడు వారిని ఎన్నుకుని పంపించాడనీ వారు దేవుని సత్యాన్ని నేర్పించారనీ ఇవి సూచిస్తాయి (అపో. కార్యములు 5:12; అపో. కార్యములు 14:3; హెబ్రీయులకు 2:4). రాయబారుల కాలం అయిపోయింది. ఎప్పటికీ ఒకే సారి సత్యాన్ని స్థాపించడం, మన కోసం దాన్ని క్రొత్త ఒడంబడిక గ్రంథంలో రాసి పెట్టడం జరిగిపోయింది. ఇప్పుడిక అప్పుడున్నట్టుగా సూచనలు, అద్భుతాలు, వింతలతో అంత పని లేదు. దేవునికి ఇష్టమైతే కొన్ని చోట్ల, కొన్ని సమయాల్లో ఆయన వీటిని ఇవ్వవచ్చు, అది వేరే విషయం. అపో. కార్యములు 8:15-17 నోట్ చూడండి. ఇప్పుడైతే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుని పంపించాడో లేదో మనం తెలుసు కోవాలంటే అతడు అద్భుతాలు చేస్తున్నట్టుండడం మూలంగా కాదు గాని అతని ఉపదేశం, నమ్మకం, జీవన విధానం కొత్త ఒడంబడిక ఉపదేశాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నదాన్నిబట్టే తెలుసుకోవచ్చు (మత్తయి 7:15-23 చూడండి).

13. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి.

2 కోరింథీయులకు 11:7-12; 1 కోరింథీయులకు 9:12-18. “క్షమించండి” అంటూ పౌలు వ్యంగ్యంగా అంటున్నట్టున్నాడు. వారినుంచి సహాయమేమీ తీసుకోక పోవడంలో అతడు ఏ తప్పూ చేయలేదని అతనికి తెలుసు (2 కోరింథీయులకు 7:2).

14. ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలి దండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా

వారు ఇవ్వగలిగిన ధనం కన్నా వారి ప్రేమ, సహవాసం అతనికి ఎంతో ముఖ్యం – 2 కోరింథీయులకు 6:11-13. అతడా సంఘానికి తండ్రి వంటివాడు (1 కోరింథీయులకు 4:15). తమ పిల్లలపట్ల తండ్రుల బాధ్యతలు అతడు గుర్తించాడు. తన సమయం, బలం, సమర్థతలతో సహా (2 కోరింథీయులకు 7:3) తనకున్నదంతా వారికోసం వెచ్చించేందుకు అతడు సిద్ధమే. తన సేవకులందరిలోనూ దేవుడు చూడాలని ఆశించేది ఇదే. దేవుని ప్రజలకు తాము ఏమివ్వగలమా అన్నదే వారి ఆశయమై ఉండాలి, వారినుంచి ఏమి పొందగలనూ అన్నది కాదు.

15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?

16. అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.

కొందరు ఈ విధంగా చెప్తున్నట్టున్నారు – “పౌలు సంఘం నుంచి డబ్బేమీ పుచ్చుకోలేదు. నిజమే. అయితే జెరుసలంలో ఉన్న క్రైస్తవులకోసం వారిని చందాలెత్తి పంపించమనడంలో అతని ఉద్దేశమంతా కొంత డబ్బు చేజిక్కించుకుని తనకోసమే వాడుకోవడం; తీతు, వేరొక సోదరుడు ఇందులో అతనిలో లాలూచీ పడ్డారు”. పౌలు వారిని ప్రశ్నిస్తున్నాడు – ఈ అపనింద నిజమనేందుకు ఏమైనా ఆధారం ఉందా? పౌలు ఈ చందా విషయంలో ఇంత జాగ్రత్తగా ఇంత జ్ఞానయుక్తంగా ఉన్నది ఇందువల్లనే (2 కోరింథీయులకు 8:16-21; 1 కోరింథీయులకు 16:1-4).

17. నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా?

18. మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా?

19. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.

ఈ ఉత్తరంలో పౌలు “అతిశయంగా” మాట్లాడ్డానికీ, తాను రాయబారిని చూపించ బూనుకోవడానికీ కారణం ఇదే. వారు తనను అపార్థం చేసుకోకూడదు. వారేదో న్యాయాధికారులైనట్టు పౌలు వారిముందు తన వాదం వినిపించలేదు (1 కోరింథీయులకు 4:1-5). వారితో చెప్పవలసి వచ్చిన మాటలన్నీ, ఈ అతిశయం మాటలతో సహా (2 కోరింథీయులకు 1:12), వారి మేలుకోసమే, తన కోసం కాదు. అతణ్ణి అతడుగా – అంటే క్రీస్తురాయబారిగా – స్వీకరించడం ద్వారా, అతడు నేర్పించిన సత్యాన్ని పాటించడం ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు బలపడతారు.

20. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండు నేమో అనియు,

అక్కడి సంఘం కొన్ని విషయాల్లో బలహీనమైనదనీ, చీలికల విషయంలో లైంగిక పాపాల విషయంలో దోషి అనీ పౌలుకు బాగా తెలుసు (1 కోరింథీయులకు 1:11-12; 1 కోరింథీయులకు 3:3; 1 కోరింథీయులకు 4:18; 1 కోరింథీయులకు 5:2, 1 కోరింథీయులకు 5:11; 1 కోరింథీయులకు 6:15-16; 1 కోరింథీయులకు 8:1; 1 కోరింథీయులకు 11:18, 1 కోరింథీయులకు 11:22). వారు గనుక తననూ, తాను నేర్పిన సత్యాన్నీ తిరస్కరిస్తే పరిస్థితి మరింత చెడ్డదవుతుందని, తాను వారిని సందర్శించే సమయం అది తనకు, వారికి కూడా విచార కారణం అవుతుందని అతని భయం.

21. నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians II - 2 కొరింథీయులకు 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలుని వెల్లడి. (1-6) 
అపొస్తలుడు తనను తాను సూచిస్తున్నాడని అనిశ్చితి లేదు. ప్రాచీన ప్రవక్తల అనుభవాల మాదిరిగానే ట్రాన్స్ సమయంలో అతనికి ఖగోళ ద్యోతకాలు తెలియజేశారా లేదా అతని ఆత్మ తాత్కాలికంగా అతని శరీరం నుండి బయలుదేరి స్వర్గానికి చేరుకుందా లేదా అతను ఎత్తబడి, శరీరం మరియు ఆత్మ ఏకమయ్యాడా అనేది తెలియదు. ఆ అద్భుతమైన రాజ్యం మరియు స్థితి వివరాలు మన ప్రస్తుత సామర్థ్యం మరియు ఔచిత్యానికి మించినవి. అతను ఆ ఖగోళ రాజ్యంలో తాను విన్నదాని యొక్క ప్రత్యేకతలను బహిర్గతం చేయకుండా, క్రీస్తు బోధనలను వివరించడంపై దృష్టి సారించాడు. చర్చి ఈ పునాదిపై నిలుస్తుంది మరియు ఈ పునాదిపైనే మనం మన విశ్వాసాన్ని మరియు నిరీక్షణను నిర్మించుకోవాలి. ఇది రాబోయే మహిమ గురించి మన నిరీక్షణను విస్తృతం చేయమని ప్రోత్సహిస్తున్నప్పటికీ, సత్యాన్ని మరియు దైవిక సంకల్పాన్ని కనుగొనే సంప్రదాయ మార్గాలలో సంతృప్తిని కనుగొనడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఇది నొక్కి చెబుతుంది.

ఇవి అతని ఆధ్యాత్మిక ప్రయోజనానికి మెరుగుపర్చబడ్డాయి. (7-10) 
అపొస్తలుడు తన వినయాన్ని కాపాడుకోవడానికి మరియు అతను పొందిన దర్శనాలు మరియు వెల్లడి కారణంగా అతిగా గర్వించకుండా నిరోధించడానికి దేవుడు ఉపయోగించిన వ్యూహాన్ని వివరించాడు. "మాంసంలో ముల్లు" యొక్క స్వభావం పేర్కొనబడలేదు, ఇది ఒక ముఖ్యమైన విచారణ లేదా బలీయమైన టెంప్టేషన్. అహంకారం నుండి మనలను రక్షించడానికి విరోధుల నిందలను ఉపయోగించి దేవుడు తరచుగా ప్రతికూలతను మంచిగా మారుస్తాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నట్లయితే, మనం అధిక స్థాయికి ఎదగకుండా ఉండేలా ఆయన నిర్ధారిస్తాడు మరియు ఆధ్యాత్మిక భారాలు ఆధ్యాత్మిక అహంకారానికి నివారణగా పనిచేస్తాయి. హాని కోసం పంపబడిన సాతాను దూతగా పేర్కొనబడినప్పటికీ, దేవుడు దానిని మంచి కోసం ఉద్దేశించి, దానిని పునర్నిర్మించాడు.
ప్రార్థన ప్రతి బాధకు వైద్యం చేసే ఔషధంగా మరియు ప్రతి వ్యాధికి నివారణగా ఉద్భవిస్తుంది. శరీరంలోని ముళ్లను ఎదుర్కొన్నప్పుడు, మనల్ని మనం ప్రార్థనకు అంకితం చేయాలి. ప్రారంభ లేదా తదుపరి ప్రార్థనలకు సమాధానం లభించకపోతే, ప్రార్థనలో పట్టుదల ప్రోత్సహించబడుతుంది. ప్రార్థించడం మరియు ప్రార్థనలో పట్టుదలతో ఉండడం నేర్పడానికి ఇబ్బందులు వస్తాయి. దేవుడు ఎల్లప్పుడూ అడిగిన వాటిని మంజూరు చేయకపోయినా, అతని నిరాకరణ ప్రేమ యొక్క వ్యక్తీకరణ కావచ్చు, అతని మంజూరులు కోపంలో ఉండవచ్చు. కష్టాలు మరియు ప్రలోభాల మధ్య కూడా దేవుడు తగినంత దయను అందిస్తే, ఫిర్యాదుకు కారణం లేదు.
దయ మన పట్ల దేవుని చిత్తాన్ని సూచిస్తుంది మరియు అన్ని బాధలలో మనలను ప్రకాశవంతం చేయడానికి, ఉత్తేజపరచడానికి, బలపరచడానికి మరియు ఓదార్పునిచ్చేందుకు సరిపోతుంది. దేవుని బలం మన బలహీనతలో పరిపూర్ణతను పొందుతుంది, ఆయన దయను గొప్పగా చూపుతుంది. మన స్వాభావిక బలహీనతను మనం గుర్తించినప్పుడు, మనం క్రీస్తు వైపు తిరుగుతాము, ఆయన నుండి బలాన్ని పొందుతాము మరియు దైవిక బలం మరియు దయ యొక్క పూర్తి కొలతను అనుభవిస్తాము.

ఒక అపొస్తలుడి సంకేతాలు అతనిలో ఉన్నాయి, వాటిని సందర్శించడం అతని ఉద్దేశ్యం; కానీ అతను కొందరితో కఠినంగా ఉండవలసి వస్తుందేమోనని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. (11-21)
సద్గురువుల ఖ్యాతిని, ప్రత్యేకించి మనకు ప్రయోజనం చేకూర్చిన వారి, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. దేవుడు మనకు చేసిన మంచితనానికి వాటిని సాధనాలుగా గుర్తించడం చాలా అవసరం. అపొస్తలుడి ప్రవర్తన మరియు దయగల ఉద్దేశాలు నమ్మకమైన సువార్త పరిచారకుని లక్షణాలను ఉదాహరిస్తాయి. మంచితనాన్ని ప్రోత్సహించడమే అతని ప్రధాన లక్ష్యం. ఈ ప్రకరణం మతపరమైన అనుచరులలో సాధారణంగా గమనించిన వివిధ పాపాలను కూడా హైలైట్ చేస్తుంది. ఒక మంత్రి యొక్క పొరపాట్లు మరియు దుశ్చర్యలు అణకువగా ఉంటాయి మరియు కొన్నిసార్లు, గర్వానికి లోనయ్యే వారిని తగ్గించడానికి దేవుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తాడు. తప్పుడు బోధకులు తమ తప్పుదారి పట్టించిన అనుచరులను ఏ మేరకు దారి తీశారో ఈ సుదీర్ఘమైన శ్లోకాలు వివరిస్తాయి. సువార్త ప్రొఫెసర్లలో ఇటువంటి అతిక్రమణలను కనుగొనడం చాలా నిరుత్సాహపరుస్తుంది, అయినప్పటికీ ఈ విచారకరమైన వాస్తవం అపొస్తలుల కాలంలో కూడా కొనసాగింది.



Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |