Ephesians - ఎఫెసీయులకు 1 | View All

1. దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది

“ఎఫెసు”– అపో. కార్యములు 18:19; అపో. కార్యములు 19:1-41. “పవిత్రులు”– రోమీయులకు 1:1. “క్రీస్తు యేసులో”, లేక “ఆయనలో” అనేది ఈ లేఖలోని మూల పదం – వ 3,7,12,13; ఎఫెసీయులకు 2:6-7, ఎఫెసీయులకు 7:10, ఎఫెసీయులకు 7:13; ఎఫెసీయులకు 3:6, ఎఫెసీయులకు 3:11, ఎఫెసీయులకు 3:21; ఎఫెసీయులకు 4:32; ఎఫెసీయులకు 6:10. ఈ మాట క్రీస్తులో మన ఐక్యతను సూచిస్తున్నది. యోహాను 17:20-23; రోమీయులకు 6:3-8. విశ్వాసులు “క్రీస్తులో” ఉన్నారు గనుకనే వారికి ప్రతి ఆధ్యాత్మికమైన దీవెనా లభించింది. ఆయనకు వేరుగా వారికి ఏమీ లేదు, వారు ఏమీ కాదు. “నమ్మకస్థులు”– అంటే క్రీస్తులో నమ్మకం మూలంగా జీవించడం కొనసాగిస్తూ ఉన్నవారు అని అర్థం. “రాయబారి”– రోమీయులకు 1:3; 1 కోరింథీయులకు 1:1; గలతియులకు 1:1.

2. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

3. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

“దేవుడు”– భూమిపై మానవుడుగా జన్మనెత్తాక యేసు తండ్రియైన దేవుణ్ణి తన దేవుడుగా పిలిచాడు – మత్తయి 27:46; యోహాను 20:17. అలా చెయ్యడంలో తాను దేవుణ్ణి కానని ఆయన సూచించడం లేదు. యోహాను 8:24, యోహాను 8:58; యోహాను 20:28-29; మత్తయి 11:27 పోల్చి చూడండి. ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ ఎఫెసీయులకు 2:6; లూకా 2:11 దగ్గర చూడండి. “స్తుతులు”– కీర్తనల గ్రంథము 33:1 నోట్. “పరమ స్థలాలలో”– ఈ మాట ఈ లేఖలోని మరో మూల పదం – ఎఫెసీయులకు 1:20; ఎఫెసీయులకు 2:6; ఎఫెసీయులకు 3:10; ఎఫెసీయులకు 6:12. ఇది పరలోకంలో దేవుడు నివసించే స్థలం అన్నది స్పష్టమే (ఎఫెసీయులకు 1:20), కానీ దీనికింకా అర్థం ఉంది (ఎఫెసీయులకు 6:12). దేవుడు పరిపాలించే అదృశ్యమైన ఆత్మల లోకం, సైతాను ఆయన పాలనను వ్యతిరేకిస్తూ ఉన్న లోకం అని కూడా దీనికి అర్థం. అక్కడ దేవుడు అత్యున్నతమైన పరలోకంలో ఉన్నాడు; ఆ ఆత్మల లోకంలో సైతాను, పిశాచాలు అట్టడుగున ఉంటూ విశ్వాసులతో పోరాడుతున్నారు. దేవుని దృష్టిలో భూమి మీద ఉన్న విశ్వాసులు ఇప్పుడే పరమ స్థలాల్లో కూడా ఉన్నారు (ఎఫెసీయులకు 2:6), ఎందుకంటే వారి నాయకుడు, ప్రతినిధి అక్కడ ఉన్నాడు (ఎఫెసీయులకు 1:22), వారు “ఆయనలో” ఉన్నారు. అదే సమయంలో శరీరంలోనైతే ఇంకా భూమి మీదే ఉండి అదృశ్య లోకంలో ఉన్న దురాత్మలతో పోరాడుతున్నారు. “ఆధ్యాత్మిక ఆశీస్సులతో”– ఇవి ఆధ్యాత్మిక లోకం దీవెనలు. అంటే మనకు పాపవిముక్తి ఇచ్చి, మనల్ని సంరక్షిస్తూ, ఆధ్యాత్మికమైనవారుగా చేస్తూ, క్రీస్తుకోసం జీవించేలా సామర్థ్యం ఇస్తూ, చివరికి ఆయనతో శాశ్వతంగా ఉండేలా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే దేవుని కృప సంబంధమైన దీవెనలు. దేవుడు విశ్వాసులను ఇతర విధాలుగా – అంటే శారీరికంగా, మానసికంగా, ఆర్థికంగా – దీవించడని పౌలు ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఇక్కడ అతడు నొక్కి చెప్పేది ఆ సంగతుల గురించి కాదు. ఈ ఉత్తరంలో దేవుడు విశ్వాసులకు ఇచ్చే కొన్ని ఆధ్యాత్మికమైన దీవెనల గురించి చెప్పాడు – ఎఫెసీయులకు 2:5-6, ఎఫెసీయులకు 2:10, ఎఫెసీయులకు 2:13-19, ఎఫెసీయులకు 2:22; ఎఫెసీయులకు 3:16-17, ఎఫెసీయులకు 3:20; ఎఫెసీయులకు 4:7, ఎఫెసీయులకు 4:13, ఎఫెసీయులకు 4:24; ఎఫెసీయులకు 5:8, ఎఫెసీయులకు 5:18, ఎఫెసీయులకు 5:25-27; ఎఫెసీయులకు 6:10-13. “మనలను” అంటే ఎవరో కొద్దిమంది మహనీయుల్ని అని కాదు, విశ్వాసులందరినీ అని అర్థం. “దీవించాడు”– ఈ మాట భూతకాలంలో ఉంది. దేవుడు ఇంతకుముందే విశ్వాసులకు ఆధ్యాత్మిక దీవెనలన్నీ ఇచ్చాడు. ఇవి క్రీస్తులో ఉన్నాయి. ఇవెక్కడ ఉన్నాయో ఆ క్రీస్తులోనే విశ్వాసులు కూడా ఉన్నారు. దీవెనల గురించి నోట్స్ ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-12; అపో. కార్యములు 3:26; గలతియులకు 3:9, గలతియులకు 3:14.

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు,

“ఎన్నుకొన్నాడు”– మార్కు 13:20; యోహాను 15:16, యోహాను 15:19; రోమీయులకు 8:33; 2 థెస్సలొనీకయులకు 2:13; 1 పేతురు 2:9. యోహాను 6:37; యోహాను 17:6 పోల్చి చూడండి. విశ్వాసులు పుట్టకముందే, లోకం ఉనికిలోకి రాకముందే దేవుడు భవిష్యత్తులోకి దృష్టి సారించి ప్రతి విశ్వాసినీ చూచి క్రీస్తులో ఎన్నుకున్నాడు. వారిలో ప్రతి ఒక్కరినీ ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేలా పూర్వ నిర్ణయం చేశాడు. రోమీయులకు 8:29-30, ఆ నోట్స్ చూడండి. ఇక్కడ వ 4-6లో దేవుడు విశ్వాసులను ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి మూడు కారణాలు చెప్తున్నాడు పౌలు. ఒకటి, మనం “పవిత్రంగా, నిర్దోషంగా” ఉండాలని దేవుని కోరిక – వ 4; ఎఫెసీయులకు 5:22-27; ఎఫెసీయులకు 17:17-19; ఫిలిప్పీయులకు 2:15; తీతుకు 2:14. రెండు, మనం ఆయన సంతానంగా ఉండాలని ఆయన కోరిక (వ 5). యోహాను 1:12-13; రోమీయులకు 8:15; 2 కోరింథీయులకు 6:17-18; 1 యోహాను 3:1-2 పోల్చి చూడండి.

5. తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

“స్వీకరించడానికి”– రోమీయులకు 8:23; ఆ నోట్స్ చూడండి. ఆధ్యాత్మిక జన్మమూలంగా విశ్వాసులు దేవుని సంతానం (యోహాను 3:3-8). వారు చనిపోయి సజీవంగా లేచినప్పుడు ఆయన కుమారులుగా స్వీకరించడం జరుగుతుంది. అంటే ఆ విధంగా వారు తన సంతానమని బహిరంగంగా ప్రకటిస్తాడు. మూడు, తన “దివ్య కృపకు కీర్తి కలగాలని” దేవుని ఉద్దేశం – ఎఫెసీయులకు 2:8-9; 1 కోరింథీయులకు 1:29-31; గలతియులకు 6:14. మనుషులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా పాపవిముక్తి సంపాదించుకోగలిగితే దానికోసం వారికే స్తుతులు కలగాలి. మనుషులను విమోచించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గంలో అలాంటి అతిశయానికి కారణాలేవీ లేకుండా చేశాడు. దేవుని దివ్య కృప మాత్రమే విశ్వాసులకు పాపవిముక్తి, రక్షణ ఇస్తుంది. అందువల్ల స్తుతులన్నీ దేవునికే చెందాలి, విశ్వాసులకు కాదు. కృప అంటే ఉచితంగా ప్రసాదించేది (వ 6), మన ప్రయత్నాల వల్ల, మనం యోగ్యత అని ఎంచే పనుల వల్ల కాదు (రోమీయులకు 4:4-5; రోమీయులకు 6:23; రోమీయులకు 11:5-6). ఆ కృప “క్రీస్తులో” ప్రసాదించాడు దేవుడు. అది మరెక్కడా దొరకదు. దేవుని కృపకు క్రీస్తు యేసు ఒక్కడే దారి (యోహాను 1:14, యోహాను 1:16; యోహాను 14:6; లూకా 23:43). “కృప”ను గురించి యోహాను 1:14; రోమీయులకు 1:2 చూడండి. వ 5లో “ప్రేమ భావం” అనే మాట చూడండి. దేవుడు విశ్వాసులను ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి కారణం ఇదే – ఎఫెసీయులకు 2:4; యిర్మియా 31:3; రోమీయులకు 5:8; రోమీయులకు 8:39; 1 యోహాను 3:1, 1 యోహాను 3:16; 1 యోహాను 4:8.

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

“తాను ప్రేమించినవానిలో”– అంటే క్రీస్తులో అని అర్థం – మత్తయి 3:17; యోహాను 17:24. విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు కాబట్టి పరిపూర్ణంగా దేవుని ప్రేమను చూరగొన్నవారు.

7. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

“కృపాసమృద్ధి”– అనే పదాన్ని గమనించండి. ఎఫెసీయులకు 2:4, ఎఫెసీయులకు 2:7; రోమీయులకు 2:4; రోమీయులకు 10:12 పోల్చి చూడండి. ఇవి ఈ విశ్వమంతటిలో నిజమైన సంపదలు. విశ్వాసులను ఇవి భాగ్యవంతులుగా చేస్తాయి – వ 3; 2 కోరింథీయులకు 8:9; 1 కోరింథీయులకు 3:21-23. “విముక్తి”– లూకా 2:28; రోమీయులకు 3:24; 1 కోరింథీయులకు 1:30; గలతియులకు 3:13; కొలొస్సయులకు 1:14; హెబ్రీయులకు 9:12, హెబ్రీయులకు 9:15. కీర్తనల గ్రంథము 78:35; మత్తయి 20:28 నోట్స్ చూడండి. మనల్ని దాస్యంలో ఉంచింది పాపం గనుక విముక్తి అంటే పాపక్షమాపణ కూడా. మనలను విడిపించేందుకు క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ధార పోశాడు. “క్షమాపణ”– ఎఫెసీయులకు 4:32; మత్తయి 6:12; మత్తయి 9:6; మత్తయి 12:31; మార్కు 2:7; లూకా 24:47; అపో. కార్యములు 13:38; అపో. కార్యములు 26:18; రోమీయులకు 4:7; కొలొస్సయులకు 2:13; 1 యోహాను 1:9. మంచి ప్రవర్తన ద్వారా పాపక్షమాపణను సంపాదించుకోలేము. అది క్రీస్తు విశ్వాసులకు దేవుడు ఉచితంగా ఇచ్చినది.

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

“విరివిగా”– మనుషులకు దీవెనలు ఇవ్వడంలో దేవుడు అయిష్టంగా, పిసినారితనంగా ఉండడు. ఈ సమృద్ధి మనకిమ్మని ఆయన్ను బలవంతం చేయనవసరం లేదు. వాటిని మనం పొందాలంటే పరలోకంలో ఉన్న ఏ పునీతులూ పవిత్రులూ మన పక్షాన ఆయన్ను వేడుకోనవసరం లేదు. మనపై ఆయన తన కృపను కుమ్మరించడం సాధ్యమయ్యేలా దేవుడు తన కుమారుణ్ణి మన పాపాలకోసం చనిపోయేందుకు పంపాడు. రోమీయులకు 8:32. దేవుడు దేవుడుగా ఉండడం ఎలా మానుకోలేడో, ఇవ్వడం కూడా మానుకోలేడు. శాశ్వత యుగాలన్నిటిలోనూ విశ్వాసులపై తన కృపను కుమ్మరిస్తూనే ఉంటాడు – ఎఫెసీయులకు 2:7.

9. మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.

విముక్తి, క్షమాపణ ఇంకా దేవుడిచ్చే ఇలాంటి దీవెనలన్నీ సమస్త జ్ఞాన వివేకాలతో కూడినవి. మనపట్ల దేవుడు కృపతో వ్యవహరించిన సందర్భాలన్నిటిలోనూ ఆయన లోపం లేని జ్ఞానంతో ప్రవర్తిస్తాడని దీని అర్థం కావచ్చు. ఇది వాస్తవమే. కానీ క్రీస్తు ద్వారా దేవుడు విశ్వాసులకు సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞాన వివేకాలను అందుబాటులో ఉంచాడని కూడా దీని అర్థం కావచ్చు. కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 2:2-3; 1 కోరింథీయులకు 2:7-10. “రహస్య సత్యాన్ని”– ఎఫెసీయులకు 3:3-4, ఎఫెసీయులకు 3:9; ఎఫెసీయులకు 5:32; ఎఫెసీయులకు 6:19. మత్తయి 13:11; రోమీయులకు 16:25-26 నోట్స్. దేవుడు పౌలుకు వెల్లడి చేసిన ఈ రహస్య సత్యం ఇదే: భవిష్యత్తులో కాలం పరిపక్వం అయినప్పుడు దేవుడొక నూతన క్రమాన్ని ఏర్పరచి యేసు క్రీస్తును దానిపై సర్వాధికారిగా నియమిస్తాడు. రోమీయులకు 8:21; మత్తయి 19:28; 1 కోరింథీయులకు 15:25; ఫిలిప్పీయులకు 2:9-11; ప్రకటన గ్రంథం 20:4-6.

10. ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

11. మరియక్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయవలెనని,

వ 4,5. “ఉద్దేశం”– లోకంలో సంఘటనలు గందరగోళంగా అస్తవ్యస్తంగా జరుగుతున్నట్టు తరచుగా కనిపిస్తాయి. అప్పుడప్పుడూ జరుగుతున్నవాటికి ఒక దారీ తెన్నూ, ఎలాంటి అర్థమూ ఉన్నట్టు అనిపించదు. అయితే ఇలా అనిపించడం మన అల్ప దృష్టి మూలంగానే. దేవునికి ఒక చక్కటి ఉద్దేశం ఉంది. దాన్ని ఆయన లోపం లేని విధంగా నెరవేరుస్తున్నాడు. రోమీయులకు 8:28; రోమీయులకు 11:33-36; యెషయా 46:10 పోల్చి చూడండి. దేవుని ఏర్పాటు ముఖ్యంగా విశ్వాసులకూ ఆయన వారి కోసం ఏర్పరచిన గమ్యానికీ చెందినది. ఆయన మహిమకు కీర్తి కలగాలనే వారు ఉన్నారు – వ 14; ఎఫెసీయులకు 3:21; రోమీయులకు 16:27; గలతియులకు 1:5; ఫిలిప్పీయులకు 1:11; హెబ్రీయులకు 13:21; 1 పేతురు 2:9; ప్రకటన గ్రంథం 4:11; 1 కోరింథీయులకు 10:31.

12. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.

13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

“మీరు కూడా”– అంటే యూదులు కాని విశ్వాసులు. వ 12లో క్రీస్తులో మొట్టమొదటగా నమ్మకం పెట్టుకున్న వారి గురించి రాశాడు. అంటే యూదులైన విశ్వాసులన్నమాట. పాత ఒడంబడిక కాలంలో ఇతర ప్రజలకు ఎంత మాత్రం వంతులేని దీవెనలను యూదులు అనుభవించారు. ఇప్పుడైతే ఇతర జాతులకు చెందిన విశ్వాసులు కూడా యూద విశ్వాసుల్లాగా క్రీస్తులో చేర్చబడ్డారు. ఈ లేఖలో కనిపించే ముఖ్యాంశాల్లో ఇది కూడా ఒకటి – ఎఫెసీయులకు 2:11-22; ఎఫెసీయులకు 3:6. క్రీస్తు శుభవార్తను “సత్యవాక్కు” అంటున్నాడు పౌలు. కొలొస్సయులకు 1:5; 2 తిమోతికి 2:15; యాకోబు 1:18 కూడా చూడండి. దీన్ని వెల్లడి చేసినది సత్య దేవుడు. ఇది మొదటినుంచి చివరివరకు సత్యమే – యోహాను 17:17; యోహాను 12:49-50; యోహాను 8:40; యోహాను 7:16-17. ఇది “రక్షణ శుభవార్త” (రోమీయులకు 1:16 దగ్గర నోట్ చూడండి). ఎఫెసు క్రైస్తవులు సత్యవాక్కును కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని నమ్మారు. వినడం ఒక్కటే మంచి ఫలితాలను ఇవ్వదు. మత్తయి 13:14-15 పోల్చి చూడండి. “వాగ్దానం చేసిన”– లూకా 24:48; అపో. కార్యములు 1:4-5. క్రీస్తును నమ్మడం వల్ల పవిత్రాత్మ “ముద్ర” పడుతుంది. అసలు పవిత్రాత్మ తానే ఆ ముద్ర – ఎఫెసీయులకు 4:30. ముద్ర అంటే యజమానత్వాన్ని సూచిస్తుంది – వ 14; 2 తిమోతికి 2:19; రోమీయులకు 8:9. దేవునికి చెందినవారికి ఆయన పవిత్రాత్మను ఇస్తాడు. పవిత్రాత్మ వారికి ఉండడం మరి దేనికంటే కూడా వారు ఆయనకు చెందినవారని స్పష్టంగా సూచిస్తుంది. విశ్వాసులు క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు పవిత్రాత్మ వారిలో నివసించేందుకు వస్తాడు. గలతియులకు 3:2, గలతియులకు 3:5, గలతియులకు 3:14. పవిత్రాత్మను గురించి నోట్స్ ఎఫెసీయులకు 5:18; మత్తయి 3:16-17; మత్తయి 28:19; యోహాను 14:16-17; అపో. కార్యములు 1:4.

14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

తండ్రి అయిన దేవుడు తన ఆత్మను విశ్వాసులకు “హామీగా”, కొనుక్కున్నట్టు స్థిరపరిచే అడ్వాన్సుగా ఇస్తాడు. 2 కోరింథీయులకు 5:5 పోల్చి చూడండి. అంటే మనలో తాను ఆరంభించిన పనిని కొనసాగిస్తూ ముగిస్తానని హామీ ఇస్తున్నాడన్నమాట (ఫిలిప్పీయులకు 1:6). ఆయన వాగ్దానం చేసిన వారసత్వాన్ని మనకు ఇస్తాడు (రోమీయులకు 8:17; కొలొస్సయులకు 1:12; హెబ్రీయులకు 6:12; హెబ్రీయులకు 9:15; 1 పేతురు 1:4). ఆయన మన దేహాలను విమోచించేవరకు (రోమీయులకు 8:23), తన సొత్తుగా భద్రంగా ఉంచుతాడు, శాశ్వతంగా ఉంచుతాడు (యోహాను 14:16). విశ్వాసులు దేవుని సొత్తు (1 కోరింథీయులకు 6:19-20). కాబట్టి ఆయన వారిని అతి జాగ్రత్తగా సంరక్షిస్తాడు. వారిలో ఎవరినీ పోగొట్టుకోడు. యోహాను 6:39-40; యోహాను 10:27-28; యోహాను 17:11-12. ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడని మనకు తెలియడమే ఇదంతా సత్యమన్న నిశ్చయతను మనకివ్వాలి. “దేవుని మహిమకు కీర్తి”– వ 6,12.

15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి

“నమ్మకాన్ని...ప్రేమభావాన్ని”– కొలొస్సయులకు 1:4; గలతియులకు 5:6; 1 థెస్సలొనీకయులకు 1:3. నిజ విశ్వాసుల్లో ఈ రెండు లక్షణాలూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇతర విశ్వాసుల పట్ల ప్రేమ కలిగించని నమ్మకం నిజమైన నమ్మకం కాదు – 1 యోహాను 3:14; 1 కోరింథీయులకు 13:2.

16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

“ప్రార్థనలలో”– రోమీయులకు 1:9; 1 థెస్సలొనీకయులకు 1:2; 2 తిమోతికి 1:3. “కృతజ్ఞతలు”– పౌలు దీన్ని అలవాటుగా పెట్టుకున్నాడు (రోమీయులకు 1:8; 1 కోరింథీయులకు 1:4; ఫిలిప్పీయులకు 1:3; కొలొస్సయులకు 1:3; 1 థెస్సలొనీకయులకు 1:2; 2 థెస్సలొనీకయులకు 1:3). ఆ విశ్వాసులు పౌలుకు వ్యక్తిగతంగా తెలిసినా తెలియకపోయినా, వారు క్రీస్తు చెంతకు తన పరిచర్య ద్వారా వచ్చినా ఇతరుల పరిచర్య ద్వారా వచ్చినా పౌలుకు సంతోషమే, వారి విషయం కృతజ్ఞత అర్పించేవాడు. విశ్వాసులు దేవునికి, ఆయన కృపకు కీర్తి కారకులు (వ 6,12,14). పౌలు అన్నిటికంటే ముఖ్యంగా కోరినది మనుషుల విశ్వాసం వల్ల దేవునికి మహిమ కలగడం.

17. మరియు మీ మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
యెషయా 11:2

“దేవుడు”– వ 3. “మనసు”– వారిలో ఉన్న పవిత్రాత్మ వారికి జ్ఞానయుక్తమైన మనసును ఇవ్వాలని ప్రార్థిస్తున్నాడు. అంటే వారి ఆత్మలను జ్ఞానవంతంగా చేసి, దేవుని వాక్కులోని లోతైన సత్యాలను అర్థం చేసుకోగలిగే మనసును ఇవ్వాలి. వారు దేవుణ్ణి మరింత బాగా తెలుసుకోవాలని కోరాడు కాబట్టి ఇలా ప్రార్థన చేశాడు. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండడం విశ్వాసులకున్న గొప్ప పెన్నిధుల్లో ఒకటి. వారి ఆధ్యాత్మిక జీవితాలు దానితోనే ఆరంభమౌతాయి, దానితోనే అభివృద్ధి చెందుతాయి – యోహాను 17:3; 2 కోరింథీయులకు 4:6; ఎఫెసీయులకు 4:13; ఫిలిప్పీయులకు 3:8, ఫిలిప్పీయులకు 3:10; కొలొస్సయులకు 1:10; 2 పేతురు 3:18. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఆయన్ను మరింత బాగా తెలుసుకోవడం ఆయన మనకు బయలుపరచే దాన్ని బట్టి ఉంటుందని పౌలుకు తెలుసు. దేవుడు తనను తానే మనకు బయలుపరచుకోవాలి, లేకపోతే మనం ఆయన్ను తెలుసుకోలేము. మత్తయి 11:27; 1 కోరింథీయులకు 2:10-11 చూడండి. “ప్రార్థిస్తున్నాను”– పౌలు ఇక్కడ చేస్తున్న ప్రార్థన పవిత్రాత్మ చేయించాడు. అంతటా విశ్వాసులందరికీ కలగవలసిన వాటిని కొన్ని ఈ ప్రార్థనలో కనిపిస్తున్నాయి. మనం నిబ్బరంగా వేటిని గురించి ప్రార్థన చేయవచ్చో ఇందులో చూడవచ్చు.

18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
ద్వితీయోపదేశకాండము 33:3, ద్వితీయోపదేశకాండము 33:27-29

దేవుడు మనల్ని కోరుతున్నది మనం ఆయన్ను ఎరగడం మాత్రమే కాదు. విశ్వాసులమైన మనకోసం ఆయన సిద్ధం చేసిన వాటిని మనం తెలుసుకోవాలి. “ఆశాభావం”– రోమీయులకు 5:2; రోమీయులకు 8:23-25. విశ్వాసుల ఆశాభావం ఏమంటే క్రీస్తు పోలికలోకి మారి ఆయనతో శాశ్వత కాలం జీవించగలగడం – రోమీయులకు 8:29; 2 కోరింథీయులకు 3:18; 1 యోహాను 3:2-3; యోహాను 17:24. “మనో నేత్రాలు”– ఆధ్యాత్మిక నేత్రాలు మాత్రమే అదృశ్యమైన ఆధ్యాత్మిక విషయాలను చూడగలుగుతాయి (2 కోరింథీయులకు 4:18; హెబ్రీయులకు 11:13; యోహాను 4:35). అవిశ్వాసుల అంతరంగానికున్న నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి – మత్తయి 13:15; 2 కోరింథీయులకు 4:4; 1 యోహాను 2:11; ప్రకటన గ్రంథం 3:18. విశ్వాసులకైతే దేవుడు వారి ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచాడు – అపో. కార్యములు 26:18; యోహాను 9:39; 2 కోరింథీయులకు 4:4-5. ఇది జరిగినప్పుడు మరి ఏ విధంగానూ వారు అర్థం చేసుకోలేని వాటిని వారు అర్థం చేసుకోసాగుతారు. తాము ఏమిటో, దేవుడు ఏమిటో, పాపవిముక్తి, రక్షణ ఏమిటో కొంతవరకు గ్రహించగలుగుతారు. కానీ విశ్వాసులు క్షణమాత్రంలో అన్నిటినీ అర్థం చేసుకోలేరు. మొదట్లో వారి నేత్రాలు తెరిచిన దేవుడు క్రమక్రమంగా వారికి మరింత జ్ఞానప్రకాశాలు కలిగిస్తూ ఉంటాడు. అందువల్ల పౌలు ఈ ప్రార్థన చేశాడు. మన కోసం, ఇతరుల కోసం మనందరం చేయవలసిన ప్రార్థన ఇది. ఇలాంటి ఆధ్యాత్మికమైన చూపు లేకుండా మనుషులు బైబిలును పదే పదే చదువుతూ పోవచ్చు గాని వారి ప్రయత్నాల వల్ల వారికి ఎక్కువ జ్ఞానాభివృద్ధి కలగదు. 2 కోరింథీయులకు 3:15 పోల్చి చూడండి. విశ్వాసులు మూడు సంగతులు అర్థం చేసుకోవాలని పౌలు ప్రార్థించాడు. వారి ఆశాభావం, దేవుని వారసత్వం, ఆయన బలప్రభావాలు. “వారసత్వం”– విశ్వాసులకు క్రీస్తులో వారసత్వం ఉంది (వ 14); దేవునికి వారిలో వారసత్వం ఉంది. వారు ఆయనకు అపురూపమైన ఆస్తి, ఆయన పెన్నిధి, ఆయన సొమ్ము. తన కుమారుని ప్రాణాన్ని చెల్లించినంతగా ఆయన వారు తనకు చెందాలని కోరాడు (వ 7). వారు మరణం నుంచి సజీవంగా తిరిగి లేచే రోజున ఆయన తన వారసత్వాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు – 1 థెస్సలొనీకయులకు 4:16-18.

19. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

“బలప్రభావాలు”– మనలో, మన కోసం పని చేస్తున్న దేవుని బలప్రభావాలు మన ఆశాభావం నేరవేర్పును నిశ్చయమైనదిగా చేస్తాయి. ఆయన తన వారసత్వాన్ని స్వాధీనం చేసుకుంటాడనే సత్యాన్ని నిశ్చయం చేస్తాయి. ఆయన బలప్రభావాలు మరి దేనితోనూ పోల్చరానంత గొప్పవి, అమోఘమైనవి. కాబట్టి ఆయన తన ప్రజలను క్షేమంగా ఉంచగల సామర్థ్యం గలవాడే – యోహాను 10:29. తరువాతి వచనంలో దేవుని బలప్రభావాలు మన కోసం ఏమి చేయగలవో మనం నిశ్చయంగా తెలుసుకోగలిగేలా, అవి ఇంతకుముందు చేసినదాని గురించి చెప్తున్నాడు.

20. ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే
కీర్తనల గ్రంథము 110:1

క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచాడు, శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో మానవ చరిత్ర అంతటిలోకెల్లా దేవుని బలప్రభావాలు అమోఘంగా వెల్లడి అయ్యాయి – మత్తయి 28:6; మార్కు 16:6, మార్కు 16:19; లూకా 24:6-7, లూకా 24:51; అపో. కార్యములు 1:3, అపో. కార్యములు 1:9; అపో. కార్యములు 2:32-33; రోమీయులకు 1:4; ఫిలిప్పీయులకు 2:9-11; హెబ్రీయులకు 1:3. దేవుడు సృష్టించిన విశ్వమంతటి కంటే, దాని శక్తులు, ప్రభుత్వాలన్నిటి కంటే అత్యున్నతంగా క్రీస్తు ఉన్నత స్థలానికి వెళ్ళి తన తండ్రి సింహాసనంపై కూర్చున్నాడు – కొలొస్సయులకు 2:10; ప్రకటన గ్రంథం 1:5. ఏ మనిషి గానీ దేవదూత గానీ ఒకప్పుడు జీవించి ఉన్నవారూ ఇప్పుడు జీవిస్తున్నవారూ ఎవరూ కూడా బలప్రభావాలలో, అధికారంలో, మహిమలో, ఘనతలో యేసు కాలిగోటికి కూడా సాటిరారు. ఆయన్ను సజీవంగా లేపిన దేవుని బలప్రభావాలే ఇప్పుడు మనకోసం, మనలో పని చేస్తున్నాయి – వ 19. ఈ విధంగా మనం అత్యధిక విజయం పొందగలుగుతాం – రోమీయులకు 8:37. ఈ విధంగా మాత్రమే ఈ శత్రు లోకంలో నిజంగా క్రీస్తును సేవించగలం, లోకాన్ని, శరీర స్వభావాన్ని, సైతానును ఓడించగలం, ఈ భూమి పై మన జీవితాన్ని ఆనందంగా ముగించగలం. అలా కాకపోతే మనకు అందుబాటులో ఉన్న బలప్రభావాలను మనం ఉపయోగించు కోలేదు అన్నమాట.

21. గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.

22. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
కీర్తనల గ్రంథము 8:6

“ఆయన పాదాల కింద”– అపో. కార్యములు 2:34-36; హెబ్రీయులకు 1:13; హెబ్రీయులకు 2:8-9; హెబ్రీయులకు 10:13. “శిరస్సు”– ఎఫెసీయులకు 4:15; ఎఫెసీయులకు 5:23; కొలొస్సయులకు 1:18; కొలొస్సయులకు 2:19. నిజ సంఘానికి ఉన్న, ఉండగలిగే ఏకైక శిరస్సు క్రీస్తే. శిరస్సు అంటే అధికారికి, నడిపించేవానికి సూచనగా ఉంది. శరీరం ఏమి చెయ్యాలో ఆలోచించి, నిర్ణయించి ఆజ్ఞలు ఇచ్చే మెదడు, లేక మనస్సు శిరస్సు అంతే. క్రీస్తు కేవలం సంఘంపై అధికారి మాత్రమే కాదు. దేవుని ఆత్మ మూలంగా దానితో ఏకంగా ఉన్నవాడు. ఆయనలో ఉన్న జీవమే, ఆయనలో ఉన్న ఆత్మే తన సంఘంలో కూడా ఉన్నాడు. ఇక్కడ “సంఘం” అంటే ఆయన ఆధ్యాత్మిక శరీరం. అందులో ఆయనలోని నిజ విశ్వాసులు మాత్రమే ఉన్నారు – యోహాను 17:20-23; 1 కోరింథీయులకు 12:12-13. మత్తయి 16:18 నోట్ చూడండి.

23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.

“సంపూర్ణత”– క్రీస్తు విశ్వమంతా నిండివున్నవాడు – ఎఫెసీయులకు 4:10; కొలొస్సయులకు 1:17. ఆయన సంఘమే ఆయన సంపూర్ణత. శరీరం లేకుండా ఒక్క తలనే సంపూర్ణమైనదిగా భావించలేము. వ 23కు ఇదొక వివరణ. మరో వివరణేమిటంటే క్రీస్తే దేవుని సంపూర్ణత. కొలొస్సయులకు 2:9-10 పోల్చి చూడండి.Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |