Ephesians - ఎఫెసీయులకు 3 | View All

1. ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.

“ఈ కారణం చేత”– ఎఫెసీయులకు 2:20-22. “ఖైదు”– పౌలు ఈ ఉత్తరం రాసినప్పుడు జైల్లో ఉన్నాడు. క్రీస్తుపై అతని స్వామిభక్తి కారణంగా, ఇతర ప్రజల మధ్య అతడు జరిగించిన పరిచర్య కారణంగా అతడక్కడ ఉన్నాడు (అపొ కా 21—22 అధ్యాయాలు పోల్చి చూడండి). అందువల్ల క్రీస్తును బట్టి ఖైదులో ఉన్నానంటున్నాడు. తన విషయం క్రీస్తు సంకల్పం గనుక అలా లేకపోతే మనుషులెవరూ తనను బంధించి ఉంచలేరని అతనికి తెలుసు.

2. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు.

పౌలు ఇతర ప్రజలకు క్రీస్తురాయబారి – గలతియులకు 2:7-9; అపో. కార్యములు 9:15; అపో. కార్యములు 22:21.

3. ఎట్లనగాక్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని.

“రహస్య సత్యం”– మత్తయి 13:11; రోమీయులకు 11:25; రోమీయులకు 16:25; 1 కోరింథీయులకు 15:51. పౌలు చెప్తున్నది ఏ రహస్య సత్యం గురించి? వ 6 లో వివరిస్తున్నాడు. “గ్రహింపు”– గలతియులకు 1:11-12. “క్లుప్తంగా”– ఈ ఉత్తరంలో మొదటి రెండు అధ్యాయాల్లో రాసిన విషయాలై ఉండవచ్చు. ఉదాహరణకు ఎఫెసీయులకు 1:9; ఎఫెసీయులకు 2:19.

4. మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.

5. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.

రోమీయులకు 16:15, రోమీయులకు 16:26; కొలొస్సయులకు 1:26-27. ఈ ప్రవక్తలు, రాయబారుల ఉపదేశాలు కొత్త ఒడంబడిక గ్రంథంలో రాసి ఉన్నాయి. ఇవి దేవునినుండి కలిగినవే గాని మనుషులనుండి కాదు.

6. ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవ ములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.

ఎఫెసీయులకు 2:11-12 లో తాను చెప్పినదాన్ని పౌలు ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాడు. క్రీస్తు శుభవార్తవల్ల ఇతర ప్రజలకు కలిగిన లాభాలు మూడింటిని పేర్కొంటున్నాడు. యూద విశ్వాసులతో బాటు వారు కూడా వారసులే, క్రీస్తు శరీరం అయిన నిజ సంఘంలో సభ్యులే, దేవుని వాగ్దానాల్లో వారికీ భాగం ఉంది. ఇక్కడ “వాగ్దానాలు” అంటే పాపవిముక్తి, రక్షణ గురించినవి, మరింత ప్రత్యేకంగా పవిత్రాత్మను గురించినవి (ఎఫెసీయులకు 1:13).

7. దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

శుభవార్త పరిచర్యలో తన సేవను పౌలు ఏ విధంగా ఎంచుతున్నాడో చూడండి. అతని పాలిట అది దేవుని అద్భుత వరం. ఈ సంగతిని క్రైస్తవులందరూ ఈ విధంగానే చూస్తే క్రైస్తవ సంఘాలు ఎంత భిన్నంగా ఉంటాయి! “బలప్రభావాలు”– 2 కోరింథీయులకు 3:5-6; కొలొస్సయులకు 1:29; అపో. కార్యములు 1:8. దేవుని బలప్రభావాలు మాత్రమే ఎవరినైనా దేవుని మంచి సేవకులుగా చేయగలవు.

8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

“అత్యల్పుణ్ణి”– పౌలుకు తన గురించి ఉన్న అభిప్రాయం చూడండి. 1 కోరింథీయులకు 3:5-7; 1 కోరింథీయులకు 15:9 పోల్చి చూడండి. విశ్వాసులందరిలోకీ తక్కువవాడుగా, పాపుల్లో ప్రముఖ పాపిగా (1 తిమోతికి 1:15) తనను భావించుకొన్నాడు. కొందరికి తమ గురించి ఇందుకు వ్యతిరేకమైన ఊహ ఉంటుంది. విశ్వాసులందరిలో గొప్పవారమనీ, పాపం విషయంలో తక్కువ వారమనీ భావించుకొంటారు. ఇది చాలా విచారకరం. “అపార ఐశ్వర్యాన్ని”– వ 16; ఎఫెసీయులకు 1:7, ఎఫెసీయులకు 1:18; ఎఫెసీయులకు 2:7. కొందరు మనుషులు శుభవార్తను జ్ఞానం లేనిదిగా, పనికి రానిదిగా ఎంచి తృణీకారంతో చూస్తారు (1 కోరింథీయులకు 1:18, 1 కోరింథీయులకు 1:23). శుభవార్త అపార ఆధ్యాత్మిక ఐశ్వర్యాలను గురించి చెప్తున్నదని వారికి తెలియదు. ఈ భూమిపై ఏ మనిషి అయినా చేయగలిగిన గొప్ప పని క్రీస్తులోని ఈ అపార ఐశ్వర్యాన్ని గురించి ప్రకటించడం, ఉపదేశించడం.

9. పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,

గత కాలంలో దేవుడు ఇతర సత్యాలను మనుషులకు వెల్లడించాడు. ఈ సత్యాన్ని అయితే తగిన కాలం వచ్చేవరకు మూసి ఉంచాడు. అప్పుడు వెల్లడించేందుకు పౌలును ఎన్నుకున్నాడు.

10. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్య మును అన్యజనులలో ప్రకటించుటకును,

దేవుడు క్రీస్తుసంఘం ద్వారా (ఎఫెసీయులకు 1:22-23) మనుషులకే కాదు, పరలోక వాసులకు కూడా కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు (వారికి నేర్చుకోవాలని ఉంది – 1 పేతురు 1:12). యూదులపట్ల, ఇతరులపట్ల దేవుని వ్యవహారాలు, ఈ రెండు వర్గాల విశ్వాసులనూ క్రీస్తులో ఒక్క దేహంగా చెయ్యడం, దీన్ని సాధించేందుకు క్రీస్తు మరణించడం ఇవన్నీ దేవుని మహా జ్ఞానాన్ని వెల్లడించిన సంగతులు. “ప్రధానులకూ అధికారులకూ”– అదృశ్యమైన ఆత్మల లోకంలో దురాత్మలు (ఎఫెసీయులకు 6:12), మంచి ఆత్మలు (కొలొస్సయులకు 1:16; 1 పేతురు 3:22; దానియేలు 10:12-13) ఉన్నారు. పౌలు బహుశా మంచి ఆత్మల గురించి ఇక్కడ చెప్తున్నాడు. తన సంఘంలో దేవుని పనులను చూచి ఆ ఆత్మలు ఆశ్చర్యంతో ఆరాధనా భావంతో నిండిపోతారు.

11. సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరి కిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

దేవుడు ఈ భూమిపై చేసేదంతా ఆయన శాశ్వత ఉద్దేశాలను అనుసరించే – ఎఫెసీయులకు 1:11.

12. ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.

ఎఫెసీయులకు 2:18. “నమ్మకం”– రోమీయులకు 5:2. “ఆయనలో”– యోహాను 14:6. “ధైర్యం...నిర్భయమైన ప్రవేశం”– హెబ్రీయులకు 4:16; హెబ్రీయులకు 10:19-22.

13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి.

“బాధలకు”– వ 1. 2 కోరింథీయులకు 11:23-29 పోల్చి చూడండి. అతని కష్టాలు వారికోసమే – 2 కోరింథీయులకు 1:6; 2 తిమోతికి 2:9-10. “క్రుంగిపోవద్దని”– పౌలు దేవుని నిజ సేవకుడే అయితే అతనికి కష్టాలెందుకని వారు అనుకోవచ్చు. లేక అతనికే కష్టాలు వస్తున్నాయి. కాబట్టి తమకు కూడా వస్తాయనుకోవచ్చు. ఏది ఏమైనా వారు నిరుత్సాహపడకూడదని పౌలు చెప్తున్నాడు. ఇక తన విషయమైతే క్రీస్తు కోసం బాధలు అనుభవించడంలో తనకు ఆనందం ఉంది – కొలొస్సయులకు 1:24; 2 కోరింథీయులకు 12:10; రోమీయులకు 5:3. “మీకు ఘనతే”– వారి పట్ల దేవుని ప్రేమకు, (పౌలు ప్రేమకు కూడా) అతని కష్టాలు రుజువు. క్రీస్తు కోసం బాధలు అనుభవించడం ఆయనకూ ఆయన “శరీరానికి” కూడా ఘనతను తెస్తుంది.

14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

పౌలు వ 1లో వదిలేసిన తలంపును ఇక్కడినుంచి కొనసాగించాడు. “తండ్రి”– మత్తయి 5:16 నోట్. దేవుని కుటుంబమైన విశ్వాసులు (ఎఫెసీయులకు 2:19) ఆయన నిజమైన తండ్రి ప్రేమ, తండ్రి హృదయం గల తండ్రి కాబట్టే ఒక కుటుంబమై ఉన్నారు.

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,

“విశ్వాసం ద్వారా”– క్రైస్తవ జీవితం ఆది నుంచి అంతం వరకు విశ్వాస జీవితమే (ఎఫెసీయులకు 2:8; రోమీయులకు 1:17; కొలొస్సయులకు 2:6). క్రీస్తులో అలా నమ్మకం ఉంచుతూ ఉంటే ఆయన మన హృదయాన్ని తన ఇల్లుగా ఎంచి దానంతటిలో ఎలాంటి సంకోచం లేకుండా కాపురం ఉంటాడు. పాపవిముక్తి, రక్షణ విషయంలో మనం ఆయన్ను నమ్మినట్టయితే, మనలో పూర్తిగా నిండి, మన అంతరంగాలను పూర్తిగా ఆవరిస్తాడని కూడా నమ్మకం పెట్టుకోవాలి. అలా చేయడం తనకు ఇష్టమని ఆయన వెల్లడించాడు కాబట్టి ఆయన అలా చేస్తాడని నమ్మకం ఎందుకు ఉంచకూడదు? “నివాసముండేలా”– పౌలు విశ్వాసులకు రాస్తున్నాడు. విశ్వాసులందరిలోనూ క్రీస్తు ఉన్నాడు (రోమీయులకు 8:9-10; 2 కోరింథీయులకు 13:5; కొలొస్సయులకు 3:10. క్రీస్తు దేవుడు గనుకనే ఇది సాధ్యం). ఇక్కడ పౌలు అంతకన్నా వేరొకదాని గురించీ ఉత్తమమైనదాని గురించీ ప్రార్థిస్తున్నాడు. వారిలో, వారిద్వారా క్రీస్తు మరింత పరిపూర్ణంగా జీవిస్తూ ఉండాలనీ (గలతియులకు 2:20), వారు తమ హృదయాలను ఆయన నివాసంగా చేయాలనీ (యోహాను 14:23) పౌలు కోరిక. విచారకరమైన సంగతి ఏమిటంటే క్రీస్తు మనలో ఉన్నా మనం ఆయన్ను మన హృదయంలో ఒక మూలన చిన్న గదిలో అతిథిలాగా ఉంచెయ్యడం సాధ్యమే. ఇల్లంతటినీ మన అంతరంగంలోని ప్రతి భాగాన్నీ స్వాధీనం చేసుకోవడం క్రీస్తుకు ఇష్టం. ఇల్లంతా ఆయనదే అనీ మనది కాదనీ మనం గుర్తించాలని కోరుతున్నాడు. మన విధేయత, వినయం, ప్రేమపూర్వకమైన సహవాసం ఆయన కోరుతున్నాడు. మన హృదయాల్లో ప్రభువుగా ఉండి, మన పనులన్నిటినీ ఏలాలని కోరుతున్నాడు (రోమీయులకు 14:9). మన ఇంటికి (హృదయానికి) మనమే యజమానిగా ఉండే ప్రయత్నం చేయకూడదు. అక్కడ నివసిస్తున్న ప్రభువుకు సేవకులుగా ఉండాలి. ఆయనే రారాజు. మన హృదయాలను తన సింహాసనం ఉండే భవనంగా చేసుకోవాలని చూస్తున్నాడు. దేవుని ఆత్మ మనకు శక్తి ఇచ్చి బలపరిస్తేనే ఇది సాధ్యం (వ 16). ఆయన అలా చెయ్యకపోతే క్రీస్తును మన అంతరంగంలో ఓ మూలన నెట్టేసే విధంగా ప్రవర్తిస్తాం. “మహిమైశ్వర్యం”– వ 8; ఎఫెసీయులకు 1:7, ఎఫెసీయులకు 1:18; ఎఫెసీయులకు 2:7; ఫిలిప్పీయులకు 4:19. “ప్రార్థిస్తున్నాను”– ఎఫెసీయులకు 1:16. ఎఫెసీయులకు 1:17-19 లో ఉన్న తన ప్రార్థనలో పౌలు ఎఫెసువారికి జ్ఞానం కలగాలనీ, వారు దేవుని మహా బలప్రభావాల సహాయంతో బలపడి, క్రీస్తుకున్న గొప్ప ప్రేమను తెలుసుకోవాలని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. పవిత్రాత్మ వారి అంతరంగాల్లో ఉంటూ వారికి ఆధ్యాత్మిక బలప్రభావాలకు మూలాధారమై ఉన్నాడు.

17. తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు,

“ప్రేమలో”– యేసుప్రభువుకూ విశ్వాసికీ మధ్య సంబంధంలో ఇది అతి ప్రాముఖ్యమైన సంగతి (యోహాను 14:23-24; 1 కోరింథీయులకు 13:13). విశ్వాసులు వేరు తన్ని పాతుకుని ఎదగవలసిన మంచి నేలవంటిది ప్రేమ. తమ జీవితాలను కట్టుకోవలసిన బలమైన పునాది వంటిది.

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

క్రీస్తు ప్రేమను ఎరగడం విశ్వాసుల్లో ప్రేమను పుట్టిస్తుంది (1 యోహాను 3:16; 1 యోహాను 4:9-12, 1 యోహాను 4:19). అందువల్ల ఆయన ప్రేమలో పాతుకొని స్థిరపడేలా అది ఎంత గొప్పదో కొంతవరకైనా మనం గ్రహించాలి. క్రీస్తు ప్రేమ ఈ భూమికంటే వెడల్పయినది, కొలిచి చూడలేనంత పొడవైనది, ఆకాశాలకంటే ఎత్తుగా దేవుని శాశ్వత నివాసాన్ని అందుకొనేది, లోతుగా అందని దేవుని జ్ఞానం, సంకల్పం అంత లోతైనది.

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

జ్ఞానానికి మించినదాన్ని తెలుసుకోవడం ఎలా? మితం లేనిదాన్ని మనసులో ఇముడ్చుకోవడం ఎలా? దేవుని ఆత్మ దాని గురించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని మన అంతరాత్మకు ఇవ్వగలడు. సముద్రం గురించి పుస్తకాలు చదవడం వల్ల దాన్ని అర్థం చేసుకోలేము. దానిపై ప్రయాణిస్తే, దాని లోతుల్లోకి దిగితే అర్థం అవుతుంది. దేవుడు అపరిమితమైనవాడు, శాశ్వతుడు, మానవ జ్ఞానానికి అందనివాడు. అయినా విశ్వాసులకు ఆయన తెలుసు – మత్తయి 11:27; హెబ్రీయులకు 8:11; 1 యోహాను 5:20. క్రీస్తు ప్రేమ విషయంలో కూడా అంతే. “నిండిపోయినవారు”– ఎఫెసీయులకు 5:18. క్రీస్తు మనలో నిండిపోవడమంటే దేవునితో, పవిత్రాత్మతో నిండిపోవడమే. క్రీస్తు అన్ని ప్రదేశాల్లోని విశ్వాసులందరి హృదయాల్లో ఒకే సమయంలో ఉన్నాడనేది ఆయన దేవుడు అనడానికి రుజువు. ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్సులో రిఫరెన్సులు చూడండి. దేవుడు మనలో పూర్తిగా నిండిపోవాలని అడగడం కన్న గొప్ప ప్రార్థన మరేది ఉంటుంది? అయితే మన చిన్న హృదయాలు దేవుని సంపూర్ణతను పట్టగలవా? ఒక కప్పులో సముద్రాన్ని నింపగలమా? దానికి సాధ్యమైనదంత సముద్రాన్ని అది తనలో నింపుకుంటుంది. సముద్రంతో అంచుల వరకు అది నిండుతుంది. విశ్వాసుల హృదయంలో దేవుడు ఉండడం విషయం కూడా ఇంతే. విశ్వాసులు ఇంతకన్నా తక్కువదానిపై దృష్టి నిలుపుకోకూడదు.

20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

వ 16-19 లోని ఈ అద్భుతమైన విషయాలన్నీ నిజంగా మనకు సాధ్యమేనా? సాధ్యమే. దేవుడు మనలో వీటిని చెయ్యగలడు, మనం ఊహించలేనంత బ్రహ్మాండంగా చేయగలడు. అలాగైతే విశ్వాసులందరికీ మామూలుగా ఈ అనుభవం కలగదెందుకు? ఎందుకంటే మనం చేయవలసినవి చేయడం లేదు. మనం నిజంగా దాన్ని ఆశించాలి, దేవునికి పూర్తిగా లోబడాలి, అన్నిటిలోనూ విధేయత చూపాలి, ఆ అనుభవం కోసం ఆయనలో నమ్మకం ఉంచి ఆ నమ్మకంలోనే కొనసాగాలి. ఇదే దేవుడు కోరేది (వ 16; యోహాను 14:21; రోమీయులకు 12:1-2. యిర్మియా 29:13 పోల్చి చూడండి.).

21. క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

“మహిమ”– ఎఫెసీయులకు 1:6, ఎఫెసీయులకు 1:12, ఎఫెసీయులకు 1:14. విశ్వాసుల్లో, వారికోసం అన్నీ చేసేది దేవుడు కాబట్టి అవి చేసినందుకు ఆయనకే మహిమ కలగడం న్యాయం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ephesians - ఎఫెసీయులకు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలుడు తన కార్యాలయాన్ని, దాని కోసం తన అర్హతలను మరియు దానికి తన పిలుపును నిర్దేశిస్తాడు. (1-7)
సత్యం యొక్క సిద్ధాంతాన్ని ప్రకటించిన తరువాత, అపొస్తలుడు ఖైదీగా ఉన్నాడు-కేవలం సాంప్రదాయిక కోణంలో మాత్రమే కాకుండా యేసుక్రీస్తు బందీగా ఉన్నాడు, తన విశ్వాసాల కోసం బాధల మధ్య కూడా ప్రత్యేక రక్షణ మరియు సంరక్షణను పొందుతున్నాడు. సువార్త యొక్క దయతో కూడిన ఆఫర్లు, అది తెలియజేసే సంతోషకరమైన వార్తలతో పాటు, దేవుని యొక్క సమృద్ధిగా ఉన్న దయ నుండి ఉద్భవించి, వ్యక్తుల హృదయాలలో ఆత్మ దయను కలిగించే శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. క్రీస్తు ద్వారా రక్షణ పొందడం యొక్క రహస్యమైన, అంతర్లీన ఉద్దేశ్యంలో రహస్యం ఉంది, ఇది కొత్త నిబంధన ప్రవక్తలకు ఉన్నట్లుగా క్రీస్తుకు ముందు పూర్వ యుగాలలో పూర్తిగా వ్యక్తపరచబడలేదు. క్రీస్తుపై విశ్వాసం ద్వారా అన్యజనులకు రక్షణ కల్పించాలని దేవుడు ఉద్దేశించాడనే లోతైన సత్యంతో అపొస్తలుడికి జ్ఞానోదయం జరిగింది. దైవిక శక్తి దైవిక కృపను ప్రసాదించడంతో పాటుగా చురుకుగా ఉంటుంది మరియు దేవుడు పాల్‌ను తన పాత్రకు నియమించినట్లే, దానితో పాటు వచ్చిన బాధ్యతలకు కూడా అతను అతనిని సన్నద్ధం చేశాడు.

 దాని ద్వారా సమాధానమిచ్చిన గొప్ప ఉద్దేశ్యాలు కూడా. (8-12) 
దేవుడు ఎవరిని గౌరవప్రదమైన స్థానాలకు పెంచుతాడో, వారి స్వంత అంచనాలో ఆయన అణకువగా ఉంటాడు. దేవుడు వినయం యొక్క దయను ప్రసాదించే చోట, అతను అవసరమైన అన్ని ఇతర కృపలను అందిస్తాడు. యేసుక్రీస్తుకు అత్యున్నతమైన ప్రశంసలు ప్రతిధ్వనించాయి, ఆయనలో ఉన్న అపారమైన సంపదను నొక్కి చెబుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఐశ్వర్యంలో పాలుపంచుకోకపోయినప్పటికీ, వాటిని మన మధ్య ప్రకటించడం మరియు వాటిని స్వీకరించడానికి ఆహ్వానం పొందడం ప్రత్యేకత. మనం సుసంపన్నంగా ఉండకపోతే, అది మన స్వంత ఎంపికల పరిణామం. దేవుడు ఏమీ లేకుండా ప్రతిదానిని ఆకృతి చేసిన ప్రారంభ సృష్టి మరియు తదుపరి కొత్త సృష్టి, ఇందులో పాపులు కృపను మార్చడం ద్వారా కొత్త జీవులుగా రూపాంతరం చెందారు, రెండూ యేసుక్రీస్తు ద్వారా దేవుని నుండి ఉద్భవించాయి. అతని సంపదలు ఎప్పటిలాగే లోతైనవి మరియు ఖచ్చితంగా ఉన్నాయి, అయినప్పటికీ, దేవదూతలు అతని చర్చిని విమోచించడంలో దేవుని జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతారు, ఆత్మవిశ్వాసం మరియు ప్రాపంచిక వ్యక్తుల అజ్ఞానం అన్నింటినీ మూర్ఖత్వంగా గ్రహిస్తుంది.

అతను ఎఫెసీయుల కోసం ప్రార్థించాడు. (13-19) 
అపొస్తలుడు తన సొంత కష్టాల గురించి కంటే విశ్వాసులు తన కష్టాల కారణంగా నిరుత్సాహానికి మరియు అలసిపోయే అవకాశం ఉన్నవారి గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. అతను ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కోరుకుంటాడు, వాటిని అత్యంత విలువైనవిగా గుర్తిస్తాడు. ప్రత్యేకంగా, అతను దేవుని ఆత్మ నుండి అంతర్గత స్వీయ-ఆత్మలో బలం, ఒకరి విధులను నెరవేర్చడానికి మరియు దేవునికి సేవ చేయడానికి విశ్వాసం యొక్క బలం కోసం ప్రార్థిస్తాడు. క్రీస్తు ధర్మశాస్త్రం మన హృదయాలపై లిఖించబడినప్పుడు మరియు అతని ప్రేమ సమృద్ధిగా ఉన్నప్పుడు, క్రీస్తు మనలో నివాసం ఉంటాడు. అతని ఆత్మ యొక్క నివాసము అతని ఉనికిని సూచిస్తుంది. సద్గుణ అనురాగాలు మనలో దృఢంగా స్థిరపడాలని మన ఆకాంక్ష. మన ఆత్మల పట్ల క్రీస్తులో దేవుని ప్రేమను గూర్చిన స్థిరమైన అవగాహనను కొనసాగించడం ఎంత విలువైనది! క్రీస్తు ప్రేమ యొక్క పరిమాణాన్ని అపొస్తలుడు ఉద్వేగభరితంగా నొక్కిచెప్పాడు-అన్ని దేశాలను మరియు సామాజిక స్థితిగతులతో కూడిన దాని వెడల్పు, శాశ్వతత్వం నుండి శాశ్వతత్వం వరకు విస్తరించి ఉంది, దాని లోతు పాపం మరియు నిరాశ యొక్క అగాధంలో మునిగిపోయిన వారిని రక్షించడం మరియు దాని ఔన్నత్యాన్ని ఖగోళ ఆనందం మరియు కీర్తికి పెంచడం. . క్రీస్తు యొక్క సంపూర్ణత నుండి కృపపై కృపను పొందిన వారు దేవుని సంపూర్ణతతో నిండినట్లు వర్ణించవచ్చు. మానవత్వానికి ఇది సరిపోదా? అలాంటి అన్వేషణలు తమ ఆనందాన్ని పూర్తి చేస్తాయని తప్పుగా నమ్ముతూ, లెక్కలేనన్ని చిన్నవిషయాలతో తమను తాము నింపుకోవాలని ఎవరైనా పట్టుబట్టాలా?

మరియు థాంక్స్ గివింగ్ జతచేస్తుంది. (20,21)
స్తుతి వ్యక్తీకరణలతో ప్రార్థనలను స్థిరంగా ముగించడం సముచితం. మన ఆత్మల కోసం క్రీస్తు ఇప్పటికే సాధించిన దాని నుండి ప్రేరణ పొందడం ద్వారా మనం గొప్ప విషయాలను అంచనా వేద్దాం మరియు మరిన్నింటిని అభ్యర్థిద్దాము. పాపుల పరివర్తన మరియు విశ్వాసుల ఓదార్పు ఆయనకు శాశ్వతమైన మహిమను తెస్తుందని మనం నమ్మకంగా ఉండవచ్చు.



Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |