Ephesians - ఎఫెసీయులకు 4 | View All

1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

మనం క్రీస్తులో ఏమై ఉండేందుకు దేవుడు మనల్ని పిలచాడో క్రితం అధ్యాయాల్లో పౌలు వివరించాడు – దేవుని పిల్లలుగా, ఆయన వారసత్వంగా, ఆయన ఆలయంగా, క్రీస్తు శరీరంగా, ఇల్లుగా ఉండేందుకు పిలిచాడు. ఈ పిలుపుకు తగిన రీతిలో జీవించాలని ఇప్పుడు పౌలు మనలను ప్రోత్సహిస్తున్నాడు. దేవుని ప్రత్యేకమైన స్వంత సంతానం లాగా ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉండాలి. మనం క్రీస్తులో ఏమిటో ఆ ఘన సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని దాని వెలుగులో జీవిస్తూ ఉండాలి. “తగినట్టుగా”– కొలొస్సయులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:12. దేవునిపట్ల, మనిషిపట్ల ప్రేమ చూపేదే “తగిన” జీవితం. ప్రేమ లేని జీవితం అదెంత ఖచ్చితంగా, నైతికంగా, త్యాగ భరితంగా, నమ్మకంగా ఉన్నప్పటికీ మన పిలుపుకు తగిన జీవితం కాదు.

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

“పూర్ణ వినయం, సాత్వికంతో”– మత్తయి 5:3, మత్తయి 5:5; మత్తయి 11:29; కొలొస్సయులకు 3:12; 1 పేతురు 5:5-6. “సహనం”– క్రైస్తవ సహనంలోని ఒక లక్షణాన్ని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. అది ప్రేమతో ఒకరినొకరు సహించుకోవడం. ఒకరితో ఒకరి సంబంధాల్లో మనం ఎదుటి వారిలో సహించలేని వాటిని కూడా సహించగలిగేలా చేసేది ప్రేమే (1 కోరింథీయులకు 13:4).

3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

“ఆత్మ...సమైక్యతను”– అంటే విశ్వాసులందరినీ క్రీస్తులో ఒకే శరీరంగా చేసేందుకు దేవుని ఆత్మ సృష్టించిన ఐక్యత (1 కోరింథీయులకు 12:12-13). ఇది సంస్థ సంబంధమైన ఐక్యత కాదు. విశ్వాసులు దాన్ని సృష్టించుకోలేరు (యోహాను 17:20-23 చూడండి). కానీ విశ్వాసులు ఒకరితో ఒకరు సమాధానంగా మెలగగలరు. పౌలు ఇక్కడ చెప్తున్నది ఇదే (రోమీయులకు 12:16, రోమీయులకు 12:18; 2 కోరింథీయులకు 13:11; 1 పేతురు 3:11). ఇలా చేసేందుకు చాలా ప్రయత్నం అవసరం – “శ్రద్ధ వహిస్తూ ఉండండి”. అది దానంతట అదే జరిగిపోదు. తరువాతి వచనాల్లో పౌలు ఇలాంటి ఐక్యతకు ఆధారమేమిటో, విశ్వాసులు ఒకరితో ఒకరు సమాధానంగా ఎందుకు మెలగాలో చెప్తున్నాడు.

4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

“శరీరం”– ఎఫెసీయులకు 1:22-23; ఎఫెసీయులకు 3:6. “ఆత్మ”– ఎఫెసీయులకు 1:13; ఎఫెసీయులకు 2:22. “ఆశాభావం”– ఎఫెసీయులకు 1:18.

5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,

“ప్రభువు”– ఎఫెసీయులకు 1:2; 1 కోరింథీయులకు 8:6 (లూకా 2:11 నోట్‌). “విశ్వాసం”– ఎఫెసీయులకు 1:13, ఎఫెసీయులకు 1:15; ఎఫెసీయులకు 2:8. “బాప్తిసం”– ఈ లేఖలో బాప్తిసం ఇక్కడ ఒక్క చోటే కనిపిస్తున్నది. నీటి బాప్తిసం గురించి రాశాడో, పవిత్రాత్మ బాప్తిసం గురించి రాశాడో పౌలు ఇక్కడ చెప్పలేదు. గ్రీకు పదాన్ని నేరుగా అనువదిస్తే క్రీస్తు శరీరమై ఉన్న సంఘంలోకి ఒకే ప్రవేశం అని అర్థం చెప్పుకోవచ్చు. రోమీయులకు 6:3-4 నోట్స్ చూడండి. మత్తయి 3:2; మార్కు 16:16; అపో. కార్యములు 2:38; 1 కోరింథీయులకు 1:14-17 దగ్గర నీటి బాప్తిసం గురించి నోట్స్ చూడండి. పవిత్రాత్మ బాప్తిసం గురించి అపో. కార్యములు 1:5; 1 కోరింథీయులకు 12:13 నోట్స్.

6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.

“తండ్రి అయిన దేవుడు”– ఎఫెసీయులకు 1:2-3, ఎఫెసీయులకు 1:17; ఎఫెసీయులకు 3:14. “అందరిలో”– అంటే విశ్వాసులందరిలో (2:22). మనుషులందరిలో దేవుడు లేడు (ఎఫెసీయులకు 2:12; ఎఫెసీయులకు 4:18). వ 4-6లో ఒక్కటే (లేక ఒక్కడే) అనే పదం ఏడు సార్లు కనిపిస్తున్నది. ఈ ఏడు విషయాల్లోనూ విశ్వాసులంతా ఒక్కటే కాబట్టి వారు ఈ ఏకత్వాన్ని శాంతి బంధంలో కాపాడుకుంటూ ఉండాలి (వ 3). ఈ వచనాల్లోని త్రిత్వాన్ని గమనించండి. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ముగ్గురు వ్యక్తులు, ఒక్కడే దేవుడు. మత్తయి 3:16-17; మత్తయి 28:19; 2 కోరింథీయులకు 13:14.

7. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.

కొన్ని విషయాల్లో మాత్రం విశ్వాసులంతా ఒకటే (ఇలాంటి విషయాలు ఏడింటిని పౌలు ఇప్పుడే ఇచ్చాడు). కానీ ఇతర విషయాల్లో తేడాలున్నాయి. వారి ఆధ్యాత్మిక సామర్థ్యాలు, పని విషయంలో తేడాలున్నాయి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వాటిని మాత్రం ఇక్కడ పౌలు ఉదహరిస్తున్నాడు. రోమీయులకు 12:4-8; 1 కోరింథీయులకు 12:4-11.

8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
కీర్తనల గ్రంథము 68:18

కీర్తనల గ్రంథము 68:18.

9. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా.
కీర్తనల గ్రంథము 47:5

“క్రింది భాగాలలోకి”– అంటే చనిపోయినవారు ఉండే అదృశ్య లోకానికి అని పౌలు భావం కావచ్చు.

10. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.

“సర్వాన్ని నింపేలా”– యిర్మియా 23:24 లో యెహోవాదేవుడు దీన్ని చేసినట్టు రాసి ఉంది. ఇక్కడ క్రీస్తు దీన్ని చేసినట్లు చూస్తున్నాం. క్రీస్తు యెహోవాదేవుని అవతారం అనడానికి ఇది మరో సూచన. లూకా 2:11 నోట్స్ రిఫరెన్సులు చూడండి. “ఎక్కిపోయాడు”– ఎఫెసీయులకు 1:20-21; అపో. కార్యములు 2:31-35.

11. మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,

1 కోరింథీయులకు 12:28 పోల్చి చూడండి. “రాయబారులను”– మత్తయి 10:2. “ప్రవక్తలను”– ఎఫెసీయులకు 2:20; ఎఫెసీయులకు 3:5. ఆదికాండము 20:7; 1 కోరింథీయులకు 12:10, 1 కోరింథీయులకు 12:28 నోట్స్ చూడండి. “శుభవార్త ప్రచారకులు”– అంటే క్రీస్తు శుభవార్తను ప్రకటిస్తూ వివరించి చెప్పే ప్రత్యేక సామర్థ్యం గల వారన్నమాట. “సంఘ కాపరులు, ఉపదేశకులు”– ఈ రెండు మాటలు ఒకే రకమైనవారిని సూచిస్తున్నాయి. సంఘ కాపరులందరికీ ఉపదేశించే సామర్థ్యం ఉండాలి. దేవుని వాక్కును ఉపదేశించే వారందరికీ కాపరి హృదయం ఉండాలి. దేవుడు ఎవరిని ఈ పరిచర్యకు పిలిచాడో, వారు దీన్ని చక్కగా జరిగించేందుకు దేవుడు తమకు సామర్థ్యాన్ని ఇస్తాడని నిశ్చయతతో ఆయన వైపు చూడాలి.

12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

వ్యక్తులకు ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఇవ్వడంలో ఆ వ్యక్తులను తన సంఘానికి ఇవ్వడంలో క్రీస్తుకు ఉన్న ఉత్తమ ఆశయం ఇది. 1 కోరింథీయులకు 12:7 పోల్చి చూడండి. “సేవ”– విశ్వాసులంతా మంచి పనులు చేయాలనీ ఒకరినొకరు సేవ చేసుకోవాలనీ దేవుని కోరిక (ఎఫెసీయులకు 2:10; గలతియులకు 5:13). వారికోసం మంచి పనులను ఆయన సిద్ధం చేసి ఉంచాడు, సంఘ నాయకులు వారిని ఆ మంచి పనులకోసం సిద్ధం చెయ్యాలి. “పెంపొందాలి”– రోమీయులకు 14:19; 1 కోరింథీయులకు 14:12, 1 కోరింథీయులకు 14:26; 1 థెస్సలొనీకయులకు 5:11.

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

ఆధ్యాత్మిక పరిపక్వతలోకి మనం ఎదగాలని మన విషయంలో దేవుని ఇష్టం. 1 కోరింథీయులకు 3:1-3; హెబ్రీయులకు 5:11-14; 1 పేతురు 2:1-3; 2 పేతురు 3:18. వ 13లో ఈ పరిపక్వత క్రీస్తులో ఒకటే విశ్వాసంలోను, క్రీస్తును గురించిన జ్ఞానంలోను ఉంది. వ 15లో అన్ని ఆధ్యాత్మిక విషయాల్లో ఎదిగిపోవాలని ఉంది. మనం క్రమేణా క్రీస్తులో మరింత లోతుగా వెళ్తూ, చివరికి అందరం కలిసి ఆయన సంపూర్ణతను అందుకునే దాకా ఎదగాలి. తన సంఘం మొత్తం విషయంలో దేవుని ఉద్దేశం ఇదే. ఆయన ఈ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. వ్యక్తిగతంగానైతే ప్రేమతో సత్యం చెపుతూ ఉండడం మూలంగా ఆయనతో కలిసి పని చేయాలి (వ 15). ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇది ఎంతో ప్రాముఖ్యం. ఎదగాలని మనకు ఉంటే బైబిల్లో వెల్లడైన దేవుని సత్యాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ, మన మధ్య జరుగుతుండే వాటన్నిటిలోనూ సత్యం పలుకుతూ ఉండాలి (వ 2,25; ఎఫెసీయులకు 6:14; కీర్తనల గ్రంథము 15:2; కీర్తనల గ్రంథము 25:5; కీర్తనల గ్రంథము 31:5; కీర్తనల గ్రంథము 51:6; సామెతలు 6:16-17; సామెతలు 12:22; 1 కోరింథీయులకు 5:8; కొలొస్సయులకు 3:9; 1 యోహాను 2:21). క్రీస్తు తన సంఘాన్ని నాటిన నేల సత్యం. అది తినవలసిన ఆహారం, పీల్చుకోవలసిన గాలి సత్యమే. సత్యం పాడైపోతే అన్నీ పోయినట్టే. మనం సత్యమంటే ప్రీతి కలిగి ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమభావం మూలంగా సత్యం పలకడం నేర్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో సంఘాల్లోకి దూరి వ 14లో దేవుడు ఖండించిన వాటిని చేస్తూ ఉండే అనేకమంది దీనికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు.

14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక

రోమీయులకు 16:17-18; 2 కోరింథీయులకు 11:13-15; కొలొస్సయులకు 2:8; 1 తిమోతికి 4:2. “అటూ ఇటూ...ఎగిరిపోయే”– దేవుని వాక్కును అర్థం చేసుకొని ఆచరించకుండా క్రీస్తులో ఎదగకుండా ఉండేవారికి ఇది సంభవించవచ్చు. గలతియులకు 1:6-7; గలతియులకు 3:1 పోల్చి చూడండి.

15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

16. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.

“అమర్చబడి”– శరీరం అందులోని నరాలు, కండరాలు, ఎముకలు మొదలైన వాటితో కూర్చబడి ఒకటిగా ఉంది. క్రీస్తు శరీరం అయిన సంఘం దేవుని ఆత్మ సృష్టించిన ఆధ్యాత్మిక బంధాలతో ఒకటిగా అమర్చి ఉంది (1 కోరింథీయులకు 12:12-27). ప్రతి అవయవానికీ దేహం అంతటి విషయంలో బాధ్యత ఉంది – “ప్రతి భాగమూ సరిగా పని చేయడంవల్ల శరీరం...వర్ధిల్లుతూ ఉంటుంది”.

17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

“ప్రవర్తించకూడదని”– ఎఫెసీయులకు 4:1. లోకుల్లాగా మనం జీవిస్తే క్రీస్తుకు తగినట్టు జీవించడం లేదన్నమట (ఎఫెసీయులకు 2:2-3). ఇతరులు అలా ప్రవర్తిస్తున్నారు అనేది మనం కూడా అలానే జీవించేందుకు కారణం కారాదు.

18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

“వ్యర్థమైన”– రోమీయులకు 1:21; అపో. కార్యములు 14:15; 1 పేతురు 1:18. లోకంలో అనేకమంది బుద్ధికి అనుగుణంగా, హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు గల సామర్థ్యం గురించి గర్వపడుతుంటారు. కానీ దేవుని దృష్టిలో వారి ఆలోచనలు, ముఖ్యంగా మత, వేదాంత సంబంధమైన ఆలోచనలు శూన్యమైనవి, పనికి రానివి. క్రీస్తులేని ప్రజల స్థితిని పౌలు నాలుగు మాటల్లో వివరించాడు. “చీకటి మయం”– ఎఫెసీయులకు 6:12; కీర్తనల గ్రంథము 82:5; యోహాను 1:5; యోహాను 3:19; అపో. కార్యములు 26:18; 2 కోరింథీయులకు 4:4; 1 పేతురు 2:9; 1 యోహాను 2:11. “బండబారి”– దేవుణ్ణి సంతోషపెట్టేదాన్ని లెక్కచేయకుండా తమను సంతోషపెట్టుకునే పనులు చెయ్యాలని నిశ్చయించు కోవడం ద్వారా, పాపం చేయడం ద్వారా మనుషులు దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను కఠినం చేసుకుంటారు (హెబ్రీయులకు 3:13; నిర్గమకాండము 8:15; 2 రాజులు 17:14; కీర్తనల గ్రంథము 95:8). “అజ్ఞానం”– వారికి అనేక సంగతులు తెలిసి ఉండవచ్చు గాని నిజ దేవుడు వారికి తెలియదు (యోహాను 15:21; యోహాను 16:3; రోమీయులకు 1:22; 1 కోరింథీయులకు 1:21; 1 యోహాను 2:4). “దేవుని జీవం నుంచి పరాయివారుగా వేరై”– ఎఫెసీయులకు 2:12; యోహాను 14:17; రోమీయులకు 8:9, రోమీయులకు 8:16; యూదా 1:19.

19. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

ఎఫెసీయులకు 2:3. బండబారిపోయిన హృదయాల వల్ల కలిగే ఫలితం ఇది – మనుషుల్లో నీతి సంబంధమైన గ్రహింపు, మనోభావం నశిస్తుంది. పాపం పాపంలాగా అనిపించదు. అది పాపమే కాదనడం మొదలు పెడతారు. ఇక లైంగిక అవినీతిలో, ఇతర దుర్మార్గతల్లో తమను తాము మరచిపోవడమే తరువాతి దశ. అప్పుడు ఏమి జరుగుతుందో రోమీయులకు 1:24-32 లో వాస్తవమైన, భయంకరమైన వర్ణన ఉంది. “కామ వికారాలకు”– కామవికారానికి ఎప్పుడూ తృప్తి ఉండదు. దాన్ని ఎంత తృప్తి పరచుకుందామని మనుషులు ప్రయత్నిస్తే అది అంతగా కోరుతుంది, అంతగా చెలరేగుతుంది, ఇంకా కావాలంటుంది.

20. అయితే మీరు యేసునుగూర్చి విని,

క్రైస్తవులు అనిపించుకునేవారు కొందరు కూడా వ 19లో ఉన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ క్రీస్తును గురించి వారు నేర్చుకున్న వాటన్నిటికీ వారి ప్రవర్తన భిన్నంగా వ్యతిరేకంగా ఉంటుంది.

21. ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.

“ఆయనలో ఉన్న సత్యం”– యోహాను 1:17; యోహాను 14:6. ఆయన నుంచి నేర్చుకోవడం వ 17-19లో కనిపించే దానంతటినుంచీ మనల్ని విడిపిస్తుంది.

22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని

“పాత మానవుణ్ణి”– రోమీయులకు 6:6. క్రీస్తు మనల్ని పిలిచి రక్షించకముందు మనమేమిటో అదే పాత స్వభావం. అంటే గతంలో మన జీవిత విధానం అంతా (ఎఫెసీయులకు 2:1-3). ఈ స్వభావం క్రీస్తుతోబాటు సిలువ వేయబడింది. విశ్వాసులు నమ్మకముంచి నప్పుడు దీన్ని వదిలించుకున్నారు (కొలొస్సయులకు 3:9). అయితే దాన్ని విడిచిపెట్టాలని పౌలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే పాత ఆలోచనలు, ప్రవర్తన, కోరికలు కొన్ని మనకు అంటుకునే ఉంటాయి. మనం వాటి సంగతి చూడాలి.

23. మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,

రోమీయులకు 12:2. మన ప్రవర్తనలో ఇది ఎంత మార్పునైనా తెస్తుంది.

24. నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
ఆదికాండము 1:26

“దేవుని అనుగుణంగా”– ఎఫెసీయులకు 5:1; మత్తయి 5:48; 1 పేతురు 1:15. “కొత్త మానవుణ్ణి”– అంటే క్రీస్తులో కొత్త జీవిత విధానం. మనం జీవించవలసిన పద్ధతిని యేసే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చూపించాడు. పవిత్రంగా, నీతిన్యాయ సమ్మతంగా మనం జీవించగలిగేలా ఆయన మనలో కొత్త ఆధ్యాత్మిక స్వభావాన్ని సృష్టించాడు (ఎఫెసీయులకు 2:5, ఎఫెసీయులకు 2:10; రోమీయులకు 8:4). “ధరించుకోవాలి”– కొలొస్సయులకు 3:10; రోమీయులకు 13:14; 1 యోహాను 2:6. ధరించుకోవడం అంటే ప్రవర్తనను సూచిస్తున్నది. ఒక విశ్వాసి క్రీస్తులో ఏమిటో దాన్ని బట్టి అతని ప్రవర్తన ఉండాలి. అతడు కొత్త సృష్టి (2 కోరింథీయులకు 5:17), ఆ విధంగా ప్రవర్తించాలి. కపట భక్తులైతే లోపల ఒకటి ఉంచుకుని బయటికి వేరే విధంగా కనిపిస్తారు. విశ్వాసుల అంతరంగాల్లో ఆధ్యాత్మికమైనది, వాస్తవమైనది, అద్భుతమైనది ఒకటి ఉంది, వారు జీవించే పద్ధతుల ద్వారా దాన్ని బయటికి ప్రదర్శించాలి.

25. మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
జెకర్యా 8:16

“విడిచిపెట్టాలి”, “ధరించుకోవాలి” అనే మాటలు వాడడంలో తన ఉద్దేశం ఏమిటో పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. సత్యానికీ పవిత్రతకూ మంచితనానికీ వ్యతిరేకమైన ప్రతిదాన్నీ విశ్వాసులు తీసివేసుకోవాలి, వాటికి అనుగుణమైన ప్రతిదాన్నీ ఆచరణలో పెట్టడం ఆరంభించాలి. వ 15. సత్యం అభివృద్ధి కలిగిస్తుంది. అసత్యం నాశనం చేస్తుంది. క్రైస్తవులు అబద్ధాలాడితే ఒకరితో ఒకరికి నెమ్మది ఉండదు. సత్య స్వరూపి అయిన దేవునితో సమాధానం ఉండదు (కీర్తనల గ్రంథము 31:5). విశ్వాసుల్లో ఉండే అబద్ధాలు, మోసం అంతా క్రీస్తుకూ ఆయన సంఘానికీ వ్యతిరేకమైన పాపం.

26. కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.
కీర్తనల గ్రంథము 4:4

కీర్తనల గ్రంథము 4:4; మత్తయి 5:22. కోపం వ 31లో చెప్పిన పాపాల్లో మనల్ని పడెయ్యగలదు. విశ్వాసుల హృదయాల్లో ఇది మొలకెత్తిన దినాన్నే దాన్ని పెరికివేయాలి.

27. అపవాదికి చోటియ్యకుడి;

అబద్ధాలు, కోపం, ఇవి రెండూ క్రైస్తవుల మధ్య తగవులు పెట్టేందుకు సైతానుకు సహాయం చేస్తాయి. ఇలాంటి అవకాశాల కోసం సైతాను ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు (2 కోరింథీయులకు 2:11; 1 పేతురు 5:8).

28. దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

“దొంగతనం”– ఇతరులు మన దగ్గర ఉంచిన డబ్బును వాడుకోవడం, అందులోనికి కొంత “అప్పు” తీసుకుని తిరిగి జమ చేయకపోవడం, లేక స్వంత లాభం కోసం దొంగ లెక్కలు రాయడం మొదలైనవన్నీ దొంగతనం కిందకే వస్తాయి. యోహాను 12:6 పోల్చి చూడండి. కొన్ని రకాల వ్యక్తులకు ఇది బలీయమైన చెడు ప్రేరణ. ఇలాంటి విషయాల్లో క్రైస్తవుల్లో కనిపించే అనేక లోపాలూ దోషాలూ ఆధ్యాత్మిక వ్యక్తులను ఏడ్చేలా చేస్తాయి. నిజంగా క్రీస్తును ఏడ్చేలా చేస్తాయి. “పంచిపెట్టడానికి”– అపో. కార్యములు 20:34-35; 2 థెస్సలొనీకయులకు 3:6-10. విశ్వాసి కష్టపడి సంపాదించిన ధనాన్ని ఇతరులతో పంచిపెట్టడం దేవునికి మహిమ కలిగిస్తుంది. కపటంగా సంపాదించడం, స్వార్థం కోసం అంతా ఉంచుకోవడం దేవునికి అపఖ్యాతి కలిగిస్తుంది.

29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.

“చెడ్డ మాటలు”– ఎఫెసీయులకు 5:4; కొలొస్సయులకు 3:8; మత్తయి 12:36. క్రీస్తు మన హృదయాల్లో ఉంటే బూతులు మాట్లాడేందుకు మనమెలా తెగించగలం? “వినేవారికి ప్రయోజనం” – మనం చెప్పేది, చేసేది ప్రతిదానికీ ఇదే ఉద్దేశమై ఉండాలి.

30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
యెషయా 63:10

“దుఃఖపెట్టకండి”– పవిత్రాత్మ ఎలాంటి చలనం, అనుభూతి, చైతన్యం లేని ప్రభావం కాదు. ఆయన ఒక వ్యక్తి (యోహాను 14:16-17). విశ్వాసులు ఆయన్ను ఎలా దుఃఖపెడతారు? పౌలు ఇంతవరకూ చెప్తున్న పాపాల ద్వారా – అబద్ధాలు, కోపం, దొంగతనం, స్వార్థం, బూతులు మొదలైన వాటి మూలంగా దుఃఖపెడతారు. అశుద్ధమైనదేదైనా సరే ఆ మహా పవిత్రుణ్ణి దుఃఖపెడుతుంది. మనం దేవుని ప్రజల్లో ఎవరినైనా అనవసరంగా దుఃఖపెడితే అది కూడా ఆయన్ను దుఃఖపెడుతుంది. యెహెఙ్కేలు 6:9 కూడా చూడండి. “ముద్ర”– ఎఫెసీయులకు 1:13-14. విశ్వాసులు పవిత్రాత్మను దుఃఖ పెట్టినప్పటికీ ఆయన వారిని విడిచిపోడు – కానీ వారి హృదయాల్లో బాధ, అశాంతి ఉంటాయి.

31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

దేవుని ఆత్మను దుఃఖపెట్టే మరి కొన్ని పాపాలు. వీటిని మనం విసర్జించాలి. మన జీవితాల్లో ఉండేందుకు వాటికి ఎలాంటి హక్కూ లేదు.

32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

వ 2; రోమీయులకు 12:10, రోమీయులకు 12:17, రోమీయులకు 12:19; కొలొస్సయులకు 3:12-13. దేవుడు విశ్వాసులను ఉచితంగా, పూర్తిగా క్షమించాడు. అందువల్ల తమను నొప్పించిన వారిని విశ్వాసులు క్షమించాలి. వారలా చెయ్యకపోతే దేవునినుండి వారికి సమస్య వస్తుంది. వారు ఇతరుల పట్ల చేసినట్టే ఆయన వారికి చేస్తాడు. మత్తయి 6:12, మత్తయి 6:14-15; మత్తయి 18:21-35 చూడండి. మనల్ని నొప్పించిన వారిని క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకుంటున్నాం, క్రీస్తును దుఃఖపెడుతున్నాం, సంఘంలో సమస్యలు సృష్టిస్తున్నాం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ephesians - ఎఫెసీయులకు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పరస్పర సహనం మరియు ఐక్యతకు ప్రబోధాలు. (1-6) 
క్రీస్తు రాజ్యానికి, మహిమకు పిలవబడిన వారికి తగిన విధంగా ప్రవర్తించవలసిన అవసరాన్ని లేఖనాలు ఎక్కువగా నొక్కిచెప్పడం లేదు. అణకువ అంటే వినయం అని అర్థం చేసుకోవాలి, అహంకారానికి పూర్తిగా వ్యతిరేకం. సౌమ్యత అనేది ఆత్మ యొక్క మెచ్చుకోదగిన స్వభావాన్ని సూచిస్తుంది, ఇది వ్యక్తులను రెచ్చగొట్టడానికి ఇష్టపడదు మరియు సులభంగా రెచ్చగొట్టడానికి లేదా మనస్తాపం చెందడానికి నిరోధకతను కలిగిస్తుంది. క్షమించడం కష్టతరమైన మనలోని లోపాలను గుర్తించడం, ఇతరులలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు. విశ్వాసులందరూ ఒకే క్రీస్తులో ఒక సాధారణ నిరీక్షణను పంచుకుంటారు మరియు ఏక స్వర్గం కోసం ఎదురు చూస్తారు, హృదయంలో ఒకటిగా ఏకం కావాలని వారిని కోరారు. వారు దాని వస్తువు, రచయిత, స్వభావం మరియు శక్తి పరంగా ఏకీకృత విశ్వాసాన్ని ప్రకటించారు. వారి భాగస్వామ్య నమ్మకాలు మతం యొక్క ప్రాథమిక సత్యాలను కలిగి ఉంటాయి మరియు వారందరూ ఒకే విధమైన బాప్టిజంను చర్చిలో పొందారు, నీటితో గుర్తించబడి తండ్రి, కుమారుడు మరియు పవిత్రాత్మ పేరిట నిర్వహించబడతారు, ఇది పునరుత్పత్తికి చిహ్నంగా పనిచేస్తుంది. ప్రతి విశ్వాసిలో, తండ్రి అయిన దేవుడు తన పవిత్ర ఆలయంలో వలె, అతని ఆత్మ మరియు ప్రత్యేక దయ ద్వారా నివసిస్తాడు.

ఆధ్యాత్మిక బహుమతులు మరియు దయలను తగిన విధంగా ఉపయోగించడం. (7-16) 
ప్రతి విశ్వాసి పరస్పర సహాయం కోసం ఉద్దేశించిన దయ యొక్క బహుమతిని కలిగి ఉంటాడు. క్రీస్తు, తన జ్ఞానంలో, ప్రతి వ్యక్తికి తగినట్లుగా భావించే విధంగా ఈ బహుమతులను అందజేస్తాడు. అతను విశ్వాసుల తరపున బహుమతులు మరియు కృపలను పొందాడు, ప్రత్యేకించి పరిశుద్ధాత్మ యొక్క బహుమతి, వారు తదనుగుణంగా పంపిణీ చేయబడాలనే ఉద్దేశ్యంతో. ఈ బహుమతి కేవలం మేధో జ్ఞానానికి లేదా క్రీస్తును దేవుని కుమారునిగా మిడిమిడి అంగీకారానికి మాత్రమే పరిమితం చేయలేదు; బదులుగా, ఇది నమ్మదగిన మరియు విధేయతతో కూడిన ప్రతిస్పందనను కలిగి ఉంటుంది. క్రీస్తులో సంపూర్ణత ఉన్నప్పటికీ, దేవుని ప్రణాళిక ప్రకారం ప్రతి విశ్వాసికి ఆ సంపూర్ణత యొక్క కొలమానం ఇవ్వబడినప్పటికీ, పూర్తి పరిపూర్ణత పరలోకంలో మాత్రమే పొందబడుతుంది. దేవుని పిల్లలు ఈ లోకంలో నివసించినంత కాలం నిరంతర వృద్ధిని అనుభవిస్తారు మరియు ఈ పెరుగుదల క్రీస్తు మహిమకు దోహదపడుతుంది. ఒక వ్యక్తి తన పాత్రలో ముందుకు సాగాలనే నిజమైన కోరికను గ్రహించినప్పుడు మరియు వారి సామర్థ్యాలకు అనుగుణంగా, ఇతరుల ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం వారు అందుకున్న వాటిని ఉపయోగించినప్పుడు, వారు హృదయపూర్వక ప్రేమ మరియు దాతృత్వం యొక్క దయను కలిగి ఉన్నారని వారు మరింత నమ్మకంగా విశ్వసిస్తారు. వారి హృదయాలు.

స్వచ్ఛత మరియు పవిత్రతకు. (17-24) 
అపొస్తలుడు, ప్రభువైన జీసస్ యొక్క పేరు మరియు అధికారాన్ని ప్రార్థిస్తూ, సువార్తను ప్రకటించిన తర్వాత మారని అన్యజనుల జీవనశైలిని అనుకరించవద్దని ఎఫెసీయులను హెచ్చరించాడు. ప్రతిచోటా ప్రజలు తరచుగా తమ మనస్సు యొక్క వ్యర్థతతో నడుస్తారని స్పష్టంగా తెలుస్తుంది. తత్ఫలితంగా, నిజమైన మరియు నామమాత్రపు క్రైస్తవుల మధ్య వ్యత్యాసాన్ని నొక్కి చెప్పడం చాలా కీలకం. పరివర్తన చెందని అన్యజనులకు అవసరమైన జ్ఞానం లేదు మరియు చీకటిలో నివసించారు, కాంతి కంటే దానిని ఇష్టపడతారు. వారు పవిత్ర జీవితం పట్ల విరక్తిని కలిగి ఉన్నారు, ఇది దేవుని అవసరాలు మరియు ఆమోదంతో సరిపోలడమే కాకుండా దేవుని స్వచ్ఛత, నీతి, సత్యం మరియు మంచితనం యొక్క కొంత పోలికను ప్రతిబింబిస్తుంది.
క్రీస్తు సత్యం యొక్క అందం మరియు శక్తి యేసు జీవితంలో మూర్తీభవించినప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. అవినీతి స్వభావం ఒక వ్యక్తితో పోల్చబడింది, ఒకదానికొకటి మద్దతునిచ్చే మరియు బలపరిచే విభిన్న భాగాలతో మానవ శరీరంతో సమానంగా ఉంటుంది. పాపభరితమైన కోరికలు మోసపూరితమైనవి, సంతోషాన్ని వాగ్దానం చేస్తాయి, కానీ అంతిమంగా అణచివేయబడకపోతే మరియు అణచివేయబడకపోతే దుఃఖం మరియు వినాశనానికి దారి తీస్తుంది. అందువల్ల, ఈ కోరికలు పాత, మురికిగా ఉన్న వస్త్రం వలె విసర్జించబడాలి మరియు చురుకుగా అణచివేయబడాలి.
అయినప్పటికీ, కేవలం అవినీతి సూత్రాలను విస్మరించడం సరిపోదు; దయగలవాటిని ఆదరించాలి. "కొత్త మనిషి" అనే పదం కొత్త స్వభావాన్ని సూచిస్తుంది, కొత్త సూత్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన పునరుత్పత్తి జీవి-పునరుత్పత్తి దయ-ఇది వ్యక్తులు నీతి మరియు పవిత్రతతో కూడిన కొత్త జీవితాన్ని గడపడానికి శక్తినిస్తుంది. ఈ కొత్త సృష్టి దేవుని సర్వశక్తితో ఉద్భవించింది.

మరియు అన్యజనుల మధ్య ఆచరించే పాపాల గురించి జాగ్రత్త వహించడం. (25-32)
25-28
మన క్రైస్తవ వృత్తిని మనం అలంకరించుకోవాల్సిన నిర్దిష్ట లక్షణాలను జాగ్రత్తగా గమనించండి. సత్యానికి విరుద్ధమైన వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి; ముఖస్తుతి మరియు మోసాన్ని నివారించండి. దేవుని ప్రజలుగా, మనం అబద్ధం చెప్పడానికి ఇష్టపడని, అబద్ధం చెప్పే ధైర్యం లేని మరియు అసత్యాన్ని అసహ్యించుకునే పిల్లలలా ఉంటాము. కోపం మరియు అనియంత్రిత కోరికల నుండి రక్షించండి. అసంతృప్తిని వ్యక్తం చేయడానికి లేదా తప్పును ఖండించడానికి న్యాయమైన కారణం ఉంటే, అది పాపం లేకుండా జరుగుతుందని నిర్ధారించుకోండి. పాపం యొక్క మొదటి ప్రేరేపణలకు లొంగిపోవడం, వాటికి సమ్మతించడం లేదా పాపపు చర్యలను పునరావృతం చేయడం దెయ్యానికి తలుపులు తెరుస్తుంది. ఇది పాపాన్ని ప్రతిఘటించడం మరియు చెడు యొక్క ఏదైనా సారూప్యత నుండి దూరంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
పనిలేకుండా ఉండడం దొంగతనాలకు నిలయంగా మారుతుంది. పని చేయడానికి నిరాకరించే వారు దొంగిలించడానికి ప్రలోభాలకు గురిచేస్తారు. వ్యక్తులు తమ శ్రేయస్సు కోసమే కాకుండా ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు కూడా కష్టపడి పనిచేయడం చాలా అవసరం. వారు నిజాయితీగా జీవించడానికి మాత్రమే కాకుండా అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేయడానికి కూడా పని చేయాలి. క్రైస్తవులుగా గుర్తించబడి మోసం, అణచివేత మరియు మోసపూరిత పద్ధతుల ద్వారా సంపదను కూడబెట్టుకునే వారి గురించి మనం ఏమి చేయాలో పరిశీలించండి. భిక్ష, దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలంటే, అధర్మం మరియు దోపిడీ ద్వారా కాకుండా నీతి మరియు నిజాయితీతో కూడిన శ్రమ ద్వారా సంపాదించాలి. నిజాయితీ లేని మార్గాల ద్వారా పొందిన అర్పణలను దేవుడు అసహ్యించుకుంటాడని గుర్తించడం చాలా ముఖ్యం.

29-32
అసభ్యకరమైన భాష మాట్లాడేవారిలోని అవినీతి నుండి వెలువడుతుంది మరియు అది వినేవారి మనస్సులు మరియు ప్రవర్తనపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. క్రైస్తవులు అలాంటి ప్రసంగంలో పాల్గొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం సహాయంతో, విషయాలను తీవ్రంగా ఆలోచించేలా వ్యక్తులను ప్రేరేపించడం మరియు వారి సంభాషణల ద్వారా తోటి విశ్వాసులకు మద్దతు ఇవ్వడం మరియు హెచ్చరించడం క్రైస్తవుల బాధ్యత. హృదయంలో ప్రేమ యొక్క సూత్రాన్ని మరియు వినయపూర్వకమైన మరియు మర్యాదపూర్వక ప్రవర్తన ద్వారా దాని బాహ్య వ్యక్తీకరణను ప్రతిబింబిస్తూ ఒకరి పట్ల మరొకరు దయను ప్రదర్శించండి.
దేవుని క్షమాపణ మన స్వంత క్షమాపణకు ఒక నమూనాగా ఎలా పనిచేస్తుందో గమనించండి. మనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు ఎటువంటి సమర్థన లేనప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు మరియు మనం ఇతరులను అదే పద్ధతిలో క్షమించమని పిలువబడతాము. అనైతిక కోరికలు మరియు కోరికలను ప్రేరేపించే ఏ విధమైన అబద్ధం మరియు అవినీతి సంభాషణ దేవుని ఆత్మను విచారిస్తుంది. ద్వేషం, కోపం, కోపం, కోలాహలం, చెడు మాట్లాడటం మరియు దుర్మార్గం వంటి అవినీతి భావోద్వేగాలు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయి. దేవుని యొక్క పవిత్రమైన మరియు ఆశీర్వదించబడిన ఆత్మను రెచ్చగొట్టకుండా ఉండటం చాలా ముఖ్యం, అతని ఉనికిని మరియు దయగల ప్రభావాలను ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది.
పునరుత్థానం రోజున సమాధి యొక్క శక్తి నుండి శరీరం విముక్తి పొందుతుంది. ఆశీర్వదించబడిన ఆత్మ పరిశుద్ధుడుగా నివసించే చోట, ఆ విమోచన దినం యొక్క అన్ని ఆనందాలు మరియు మహిమలకు హామీ ఇచ్చే హృదయపూర్వకంగా ఆయన సేవచేస్తాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను మన నుండి తీసివేస్తే మనం పూర్తిగా నష్టపోతాం.



Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |