Ephesians - ఎఫెసీయులకు 6 | View All

1. పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.

“ప్రభువులో”– పౌలు ఇంకా విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కుకు వ్యతిరేకమైన సూచనలు ఆజ్ఞలు తల్లిదండ్రులు ఇస్తే వారికి లోబడవలసిన అవసరం పిల్లలకు లేదు. కానీ మిగతా అన్ని విషయాల్లోనూ వారు లోబడాలి. తల్లిదండ్రులపట్ల అవిధేయత పిల్లల తిరుగుబాటు గల భ్రష్టమైన స్వభావానికి గుర్తు. తల్లిదండ్రులకు అవిధేయత చూపగల చిన్నపిల్లలు దేవునికి అవిధేయత చూపగలగడం కూడా సులభం అవుతుంది (రోమీయులకు 1:30).

2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
నిర్గమకాండము 20:12, ద్వితీయోపదేశకాండము 5:16, ద్వితీయోపదేశకాండము 15:16

నిర్గమకాండము 20:12; ద్వితీయోపదేశకాండము 5:16. విశ్వాసులు ధర్మశాస్త్రం కింద లేరు (రోమీయులకు 6:14-15; రోమీయులకు 7:4; గలతియులకు 3:25). అయినప్పటికీ ధర్మశాస్త్ర నీతిన్యాయాలు వారిలో నెరవేరవలసి ఉంది (రోమీయులకు 8:4). తల్లిదండ్రులకు లోబడడం న్యాయమే (వ 1). క్రైస్తవ పిల్లలు అలా లోబడకపోతే వారికి అంతా మేలు జరుగుతుందనీ లేక భూమిపై తాము ఎక్కువ కాలం బ్రతుకుతామనీ వారు అనుకోవడానికి ఆధారం లేదు.

3. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.
నిర్గమకాండము 20:12, ద్వితీయోపదేశకాండము 5:16, ద్వితీయోపదేశకాండము 15:16

4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
ద్వితీయోపదేశకాండము 6:7, ద్వితీయోపదేశకాండము 6:20-25, కీర్తనల గ్రంథము 78:4, సామెతలు 2:2, సామెతలు 3:11-12, సామెతలు 19:18, సామెతలు 22:6

పిల్లలపట్ల అన్యాయంగా లేక కఠినంగా, సానుభూతి, వాత్సల్యం అనేది లేకుండా ప్రవర్తించడం వారి కోపాన్ని రేపుతుంది. క్రమశిక్షణ ఎంతైనా అవసరం (సామెతలు 13:24; సామెతలు 19:16; సామెతలు 22:15; సామెతలు 23:13-14; హెబ్రీయులకు 12:7-8). అయితే అది ప్రేమ పూర్వకమైన క్రమశిక్షణ అయి ఉండాలి. పిల్లలకు అది అర్థం అయ్యేలా చూడాలి. దేవుడు పిల్లలను వారి తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. వారు దేవునికి చెందినవారే (యెహెఙ్కేలు 18:4). ఆయన తనకోసం పిల్లల్ని పెంచవలసిన ధర్మాన్నీ, హక్కునూ ఆధిక్యతనూ తల్లిదండ్రులకు ఇచ్చాడు. మాటల ద్వారా చర్యల ద్వారా దేవునికి ఇష్టమైన రీతిలో పిల్లలను తయారు చేయాలి. ద్వితీయోపదేశకాండము 6:6-7; కీర్తనల గ్రంథము 34:11; కీర్తనల గ్రంథము 78:4-8 ఈ ముఖ్య బాధ్యతను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారి పిల్లలు పెరిగి దుర్మార్గులుగా తయారై తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెస్తే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

5. దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి.

“దాసులారా”– పూరాతన ప్రపంచంలో బానిసత్వం సాధారణ విషయమే. రోమ్ సామ్రాజ్యంలో (ఎఫెసు పట్టణం ఆ సామ్రాజ్యంలో భాగమే) మనుషులను పశువుల్లాగా అమ్మడం, కొనడం జరిగేది. ఈ బానిసల్లో చాలామంది యుద్ధాల్లో పట్టుబడ్డవారు, లేక అలాంటివారి సంతానం. కొన్ని నగరాల్లో అయితే స్వతంత్రులకంటే బానిసలే ఎక్కువమంది ఉండేవారు. వీరిలో అనేకమంది క్రైస్తవులయ్యారు. వారేం చెయ్యాలి? తిరగబడి తమ యజమానులనుంచి తప్పించుకోవాలా? కొత్త ఒడంబడిక గ్రంథం అలా చెప్పడం లేదు (1 కోరింథీయులకు 7:20-24; కొలొస్సయులకు 3:22; కొలొస్సయులకు 4:1; 1 తిమోతికి 6:1-2; తీతుకు 2:9-10; 1 పేతురు 2:18-25). బానిసత్వం మంచిదని కొత్త ఒడంబడిక గ్రంథం నేర్పడం లేదు. అప్పట్లో ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే బానిసలకూ యజమానులకూ ఒకరిపట్ల ఒకరు నెరవేర్చవలసిన విధులు ఉన్నాయని చూపుతూ వారి ప్రవర్తనకు తగిన నియమాలను ఇస్తున్నది. ప్రేమ సూత్రానికి బానిసత్వం వ్యతిరేకమనే (రోమీయులకు 12:10; రోమీయులకు 13:8-10; మొ।।), కనుక అది మంచిది కాదనీ క్రైస్తవులు కాలక్రమేణా అర్థం చేసుకుని తమకు వీలైనన్ని దేశాల్లో బానిసత్వాన్ని రద్దు చేశారు. క్రీస్తు శుభవార్త యధేచ్ఛగా వ్యాపించిన చోట బానిసత్వం ఎంతో కాలం నిలవడం అసాధ్యం. బానిసత్వం గురించిన నోట్ నిర్గమకాండము 21:3.

6. మను ష్యులను సంతోషపెట్టువారు చేయు నట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరి గించుచు,

వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని పౌలు ఉద్దేశం. క్రీస్తుకు లోబడడం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం, పాపదాస్యంనుంచి విడుదల కావడం, మనం ఉన్న పరిస్థితుల్లో సరైన మనస్తత్వం మనకు ఉండడం – ఇవన్నీ ఒక వ్యక్తి బానిస అయినా స్వతంత్రుడైనా సరే ముఖ్య విషయాలే. “క్రీస్తు దాసులమని”– రోమీయులకు 6:16-18, రోమీయులకు 6:22; 1 కోరింథీయులకు 9:19.

7. మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.

8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.

“బహుమానం”– మత్తయి 5:12; మత్తయి 10:41-42; మత్తయి 16:27; 1 కోరింథీయులకు 3:8, 1 కోరింథీయులకు 3:14; హెబ్రీయులకు 10:35; ప్రకటన గ్రంథం 11:18; ప్రకటన గ్రంథం 22:12.

9. యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోక మందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
ద్వితీయోపదేశకాండము 10:17, 2 దినవృత్తాంతములు 19:7

విశ్వాసులైన యజమానులతో సమానంగా విశ్వాసులైన బానిసలు కూడా క్రీస్తు శరీరమైన సంఘంలో సభ్యులే. వారిద్దరికీ ఒకడే శిరస్సు, ప్రభువు, యజమాని. కాబట్టి యజమానులు దీన్ని గుర్తించి దీని ప్రకారం నడుచుకుంటే మంచిది. ఈ కాలంలో జీతానికీ ఉండే సేవకులు, వారి యజమానుల విషయంలో కూడా ఇదే సత్యం. “పక్షపాతమేమీ లేదని”– రోమీయులకు 2:11; కొలొస్సయులకు 3:25; 1 పేతురు 1:17. క్రీస్తు మనల్ని తీర్పు తీర్చేది సమాజంలో మన స్థితి, స్థానాలను బట్టి కాదు గాని మనం ఎలాంటి పనులు చేశాం, మన మాటలు, ఉద్దేశాలు ఏమిటి అన్నదాన్ని బట్టే.

10. తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.

“ప్రభువులో...బలాఢ్యులై ఉండండి”– ఎఫెసీయులకు 1:19-21; ఎఫెసీయులకు 3:16; 1 కోరింథీయులకు 16:13; 2 కోరింథీయులకు 12:10; ఫిలిప్పీయులకు 4:13; కొలొస్సయులకు 1:29; 1 తిమోతికి 1:12; 2 తిమోతికి 2:1; హెబ్రీయులకు 11:34; యెహోషువ 1:6-7, యెహోషువ 1:9, యెహోషువ 1:18; కీర్తనల గ్రంథము 18:32-36; యెషయా 40:30-31; రోమీయులకు 8:37. విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు. వారు దేవుని సైనికులు (1 తిమోతికి 6:11; 2 తిమోతికి 2:3-4; 2 తిమోతికి 4:7). కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా తగిన సాధన సంపత్తి వారికి ఉండాలి. ఇందుకు వారి శక్తి, చిత్తం, సంకల్ప బలం చాలవు. వారికి దేవుని బలప్రభావాలు అవసరం. వాటికోసం వారు ఆయనవైపే చూడాలి. వాటినిస్తాడని ఆయన్ను నమ్ముకోవాలి (1 యోహాను 5:14-15). ఆయన వాక్కును నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పోరాటంలో మనం బలవంతులమై ఉండేలా సహాయపడేందుకు బైబిలు మొత్తం మనకు అందుబాటులో ఉంది.

11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

“కుతంత్రాలు”– 2 కోరింథీయులకు 2:11. విశ్వాసులను ఓడించాలన్న గట్టి పట్టుదల గలిగిన బహు టక్కరి శత్రువు వారికి ఉన్నాడు. వాడు వారిని పడద్రోయాలని ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. “కవచమంతా”– పౌలు గొప్ప దీవెనలు (ఎఫెసీయులకు 1:3), గొప్ప విముక్తి (ఎఫెసీయులకు 1:13-14), గొప్ప జ్ఞానం, గొప్ప శక్తి, గొప్ప ప్రేమ (ఎఫెసీయులకు 1:18-19; ఎఫెసీయులకు 3:17-19) గురించి మాట్లాడాడు. అయితే క్రైస్తవ జీవితం తేలికైనదన్న తలంపు మనలో కలగకూడదు. సైతాను మనపై దాడి చేస్తే ఆశ్చర్యపోనక్కర లేదు. అసలు వాడు దాడి చెయ్యకపోతేనే ఆశ్చర్యపోవాలి (1 పేతురు 5:8). ఆ కాలంలో రోమ్ సైనికులు పోరాడే తీరును బట్టి ఇక్కడ పౌలు అలంకారిక భాషను ఉపయోగిస్తున్నాడు. సగం కవచమే వేసుకుంటే సగం విజయం కాదు, అసలు విజయమే కలగదు. అలాంటివారికి అది ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది. క్రీస్తులోని విశ్వాసుల కోసం దేవుడు ఆధ్యాత్మిక కవచాన్ని తయారు చేశాడు. ఇదేమిటో మనం అర్థం చేసుకుని ఆ కవచాన్నంతటినీ ధరించాలి. రక్షణ శిరస్త్రాణాన్ని మాత్రం ఉంచుకుని న్యాయం అనే ఛాతీ కవచాన్ని మొదలైనవాటిని వదిలెయ్యకూడదు. కవచమంతా వేసుకోకపోతే సైతాను కుతంత్రాలను ఎదిరించి మనం నిలబడవలసింది పోయి పడిపోవచ్చు. అలా పడిపోతే సైతాను మనపై తన పాదం మోపి అనేక గాయాలు చేస్తాడనడంలో సందేహం లేదు. సైతాను (“అపనింద పిశాచం”) గురించి నోట్స్ మత్తయి 4:1-10; యోహాను 8:44.

12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

విశ్వాసులతో చేసే పోరాటంలో సైతానుకు అనేకమంది సహాయకులు ఉన్నారు. ఆత్మలుండే అదృశ్య లోకంలో (“పరమ స్థలాల్లో”– నోట్ ఎఫెసీయులకు 1:3) ఉన్న చాలామంది వాడి పక్షాన ఉన్నారు. ఈ అంధకార లోకానికి సైతాను “పాలకుడు”, “దేవుడు” (యోహాను 12:31; 2 కోరింథీయులకు 4:4). కానీ అందులో అదృశ్యులైన పాలకులు ఇంకా ఉన్నారు (దానియేలు 10:13, దానియేలు 10:20; 1 తిమోతికి 4:1; ప్రకటన గ్రంథం 16:14). దురాత్మలు, దయ్యాలు, పిశాచాలు, దేవునిపై తిరగబడిన దేవదూతలంతా ఉన్నారు. అనేకమంది మనుషులు పూజించే “దేవుళ్లు” వీరే (1 కోరింథీయులకు 8:5; 1 కోరింథీయులకు 10:20; ద్వితీయోపదేశకాండము 32:17; కీర్తనల గ్రంథము 106:37. ఈ “దేవుళ్ళు” తాము మంచి వాళ్ళమనీ నిజ దేవుడు తామేనని, దుష్టశక్తులనూ దయ్యాలనూ పరిమార్చే లోకనాధులం తామేనని మనుషుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు).

13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి

“అందుచేత”– ఇలాంటి శక్తులను, వారి మోసకరమైన కుతంత్రాలను, మనల్ని నాశనం చెయ్యాలన్న వారి పట్టుదలను దేవుని కవచం లేకుండా ఎదిరించేదెలా? “ధరించుకోండి”– అంటే ఆ కవచం మనకు అందుబాటులోనే ఉందన్నమాట. ఎక్కడుంది? క్రీస్తులో. లేక ఆ కవచం క్రీస్తే అని చెప్పాలి. రోమీయులకు 13:14 పోల్చి చూడండి. దేవుని కవచాన్ని ధరించుకోవడం అంటే పౌలు ఉద్దేశమేమిటో అర్థం చేసుకునేందుకు ఆ వచనం మనకు సహాయం చేస్తుంది. కవచం ధరించుకోవడమంటే క్రీస్తు బయట పెట్టిన సత్యాన్ని అంటే ఆయన ఏ సత్యమై ఉన్నాడో దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం చెయ్యడమే. అంటే జాగ్రత్తగా పఠించి, అర్థం చేసుకుని, నమ్మి, మన పరిస్థితులకు తగినట్టుగా దేవుని వాక్కును ఉపయోగించుకోవడమే. ఇలా ధరించుకోవడం మొదట మనసులో, హృదయంలో, ఆత్మలో, ఆ తరువాత బయటి ప్రవర్తనలో జరగాలి. “దుర్దినం”– ఈ యుగమంతా చెడ్డదే. పౌలు ఈ లేఖ రాసిన రోజులు చెడ్డవి (ఎఫెసీయులకు 5:15). అయితే ప్రతి విశ్వాసికీ ప్రత్యేకమైన విషమ పరీక్షలూ చెడు ప్రేరేపణలూ ఉన్న సమయాలు వస్తాయి. అప్పుడు అదృశ్యమైన దుష్ట ప్రధానులు అతణ్ణి లేక ఆమెను పడగొట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తారు. అలాంటి దుర్దినాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ప్రతి దినమూ ఈ కవచమంతా ధరించుకోవాలి. ఎలాంటి హెచ్చరికా లేకుండా హఠాత్తుగా సైతాను మనపై దెబ్బ తీయవచ్చు. యోబు 1:6-19; 2 సమూయేలు 11:2; ఆదికాండము 3:1. మనమెప్పుడూ జాగ్రత్తగా ఉండాలి (1 పేతురు 5:8).

14. ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
యెషయా 11:5, యెషయా 59:17

“నిలబడి ఉండండి”– నాలుగు వచనాల్లో పౌలు ఈ మాట రాయడం ఇది నాలుగో సారి. మనం కింద పడిపోయి సైతాను మనలను కాళ్ళతో తొక్కనివ్వకూడదు. వెన్ను చూపి పారిపోకూడదు. ఇతరులు పోరాడుతూ ఉంటే సోమరుల్లాగా కూర్చోకూడదు. పోరాటమంతా క్రీస్తుకు అప్పగించి మనమేమీ పోరాడకుండా కూర్చోవడం కూడా తగదు. క్రీస్తు మనలో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. అయితే మనం కూడా పోరాడాలి. ఈ ఆధ్యాత్మిక యుద్ధరంగంలో ఊరికే నిలుచుని చూస్తూ ఉంటే విజయంలో మనం పాలు పొందలేము. అన్ని దుష్టశక్తులకూ వ్యతిరేకంగా నిలుస్తూ పోరాడి జయించడానికి ధైర్యంతో, పట్టుదలతో, విశ్వాసంతో, క్రీస్తు పట్ల స్వామిభక్తితో పోరాడాలి. అలా చెయ్యని పక్షంలో మన విషయంలో ఈ పోరాటం ప్రారంభానికి ముందే దాదాపుగా ముగిసిపోతుంది, మనం ఓడిపోయిన వారమవుతాం. యెహోషువ 1:17 చూడండి. పౌలు ఆరు కవచ భాగాలను ఉదహరించాడు. వీపుకు ఎలాంటి కవచమూ ఇందులో కనిపించదు. శత్రువుకు వెన్ను చూపి పారిపోయే పిరికిపందలకు ఎలాంటి భద్రతా లేదు. “సత్యాన్ని దట్టిగా”– దట్టి అంటే నడుముకు కట్టుకునే వెడల్పయిన గట్టి బట్ట. విశ్వాసి జీవితంలోనూ పోరాటంలోనూ సత్యమే అన్నిటికీ ఆధారం. ఇక్కడ విశ్వాసి సత్య సంధత, యథార్థత గురించి పౌలు మాట్లాడుతున్నట్టు లేదు. విశ్వాసులందరూ సత్యం పలుకుతూ, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండవలసిందే (ఎఫెసీయులకు 4:15, ఎఫెసీయులకు 4:25; మొ।।). కానీ మన సత్య సంధత, యథార్థతల సహాయంతో సైతానుపై యుద్ధానికి వెళ్ళేందుకు తెగిస్తామా? సైతానును ఎదిరించాలంటే దేవుడు బైబిల్లో వెల్లడి చేసిన సత్యం మనకు అవసరం. యోహాను 8:31-32; యోహాను 17:17-18 పోల్చి చూడండి. సత్యం మనల్ని సైతాను శక్తినుంచి విడిపించి, సరైన విధంగా జీవించేందుకూ పోరాడేందుకూ సమర్థులుగా చేస్తుంది. ఇక్కడ సత్యాన్ని మనల్ని మనం కాపాడుకునేందుకు వాడాలి. వ 17 ప్రకారం శత్రువుపై దాడి చేసేందుకు దాన్ని ఉపయోగించాలి. మనం సత్యాన్ని నమ్మి, అర్థం చేసుకుని, దానిప్రకారం జీవించాలి. లేకుంటే సైతానుతో ఈ పోరాటంలో మనల్ని కాపాడుకునేందుకు గానీ సైతానును దెబ్బ తీసేందుకు గానీ అవకాశం ఉండదు. ముఖ్యంగా మనం క్రీస్తు శుభవార్తను అర్థం చేసుకుని నమ్మాలి (ఎఫెసీయులకు 4:21; 2 థెస్సలొనీకయులకు 2:13-14; తీతుకు 1:1; 1 పేతురు 5:8-9; యోహాను 14:6). సత్యం అనే బెల్టు పెట్టుకోవడం అంటే మన మనసులను బైబిలు సత్యాలతో నింపుకొని సైతాను దాడి చేసినప్పుడు దాన్ని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండాలి. “న్యాయాన్ని కవచంగా ఛాతీకి”– 1 థెస్సలొనీకయులకు 5:8 పోల్చి చూడండి. విశ్వాసి నీతిన్యాయాలతో జీవించేందుకు చేసే ప్రయత్నాల గురించి పౌలు ఇక్కడ మాట్లాడ్డం లేదు. మనందరం నీతిన్యాయాలతో జీవించవలసిందే (ఎఫెసీయులకు 4:1, ఎఫెసీయులకు 4:22-24). కానీ సైతానును ఓడించేందుకు ఇది సరిపోతుందా? ఈ కవచం క్రీస్తుకు గుర్తు, ఆయన విశ్వాసుల పాలిట ఏమై ఉన్నాడో దానికీ గుర్తు. ఆయనే మన నీతిన్యాయాలు (1 కోరింథీయులకు 1:31; 2 కోరింథీయులకు 5:21). మనం ఆయనలో ఆయన నీతిన్యాయాలతో సైతాన్ను ఎదిరించి నిలవగలుగుతాం. అలా కాకపోతే నిలవలేము. దేవుడు విశ్వాసులను క్రీస్తులో న్యాయవంతులుగా ఎంచాడు. అప్పటినుంచి వారిని నిజంగా న్యాయవంతులుగా చేయడానికి పూనుకుంటాడు. సైతానును ఎదిరించి నిలబడాలంటే ఈ రెండు రకాలైన నీతిన్యాయాలు మనకు అవసరం – మన నమ్మకం మూలంగా దేవుడు మనకిచ్చే నీతిన్యాయాలు (రోమీయులకు 3:22-26; రోమీయులకు 5:1; రోమీయులకు 8:1), తన ఆత్మ ద్వారా దేవుడు మనలో క్రమంగా పెంపొందించే నీతిన్యాయాలు (రోమీయులకు 8:4). ఛాతీ కవచాన్ని ధరించుకోవడం అంటే మనం నమ్మకం ద్వారా న్యాయవంతులం అయ్యామనీ, న్యాయంగా జీవించేందుకు దేవుడు మనల్ని పిలిచి, అలా చేసేందుకు శక్తినిచ్చాడనీ ఎప్పుడూ మనసులో ఉంచుకోవడమే. అంటే “కొత్త స్వభావం” ధరించుకోవడమే (ఎఫెసీయులకు 4:24). అంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండి, దేవుడు వెల్లడించిన సత్యం మూలంగా ఆ విషయం ఎరిగి ఉండడమే. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి, అవినీతి, అన్యాయం అంతటి నుంచీ మనం శుద్ధులం అయ్యామని తెలుసుకోవడం ఇందులో ఒక భాగం (1 యోహాను 1:9). ఈ ఎరుక, ఈ నిబ్బరం మనలో ఉండాలి, లేకపోతే సైతాను మనల్ని ఓడిస్తాడు. మన స్వనీతిపై ఆధారపడితే గనుక సైతాను మనల్ని తేలికగా పడగొట్టగలడని వేరే చెప్పాలా.

15. పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
యెషయా 49:3-9, యెషయా 52:7, నహూము 1:15

“శాంతి శుభవార్త సంసిద్ధత”– ఇతరులకు శుభవార్త చెప్పాలన్న మన సిద్ధబాటు గురించి పౌలు మాట్లాడ్డం లేదు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి నిజమే. కానీ సైతానును ఎదిరించి నిలవగలగడం గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు శుభవార్త మాత్రమే మనకు అలాంటి సంసిద్ధతను ఇవ్వగలదని అతనికి తెలుసు. మన ఆధ్యాత్మికమైన పాదాలకు శుభవార్త చెప్పులు తొడుక్కోవాలి. వేరే మాటల్లో చెప్పాలంటే శుభవార్తను అర్థం చేసుకుని, నమ్మి, దాన్ని ప్రేమించి, దాని మూలంగా మనకు దేవునితో సమాధానం ఉందని గ్రహించి, దాని సూత్రాలను మన జీవితాల్లో ప్రవర్తనలో ఆచరించాలి. ఇది కూడా క్రీస్తును ధరించుకోవడం వంటిదే. ఆయనే శుభవార్త, ఆయనే మన శాంతి (ఎఫెసీయులకు 2:14; ఎఫెసీయులకు 3:8).

16. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.

“విశ్వాసం డాలు”– మన చేత పాపం చేయించడానికి ప్రయత్నించే విషమ పరీక్షల అగ్నిబాణాలను సైతాను విసురుతాడు. యుద్ధం చాలించి, సుఖం, సౌఖ్యం కోరి, దేవుణ్ణి విడిచి, స్వార్థం కోసం జీవించమని ప్రేరేపిస్తాడు. ఈ బాణాలు మన మనసుల్లోను హృదయాల్లోను గుచ్చుకుని పోరాడాలన్న మన ఇష్టాన్ని పాడు చెయ్యకుండా మనల్ని కాపాడుకోవడం ఎలా? దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని చేపట్టి వాడుకోవడమే. హీబ్రూ 11 అధ్యాయంలో విశ్వాసం ఏమిటో ఏమి చెయగలదో చూడవచ్చు. 1 పేతురు 5:9 కూడా చూడండి. సైతానును ఓడించదలుచుకుంటే క్రీస్తు చెప్పిన వాక్కుల్లో మనం నమ్మకం ఉంచాలి. ఆయనలోనే తప్ప మనలో నమ్మకం పెట్టుకోకూడదు. ఆయన మనతో ఉన్నాడనీ, పోరాటం కోసం మనకు బలప్రభావాలను ఇస్తాడనీ, సైతాను మనపై ప్రయోగించే ఏ ఆయుధం మీదైనా జయమిస్తాడనీ నమ్మాలి. ఇది పౌలుకున్న నిశ్చయత. ఇది మనలోనూ ఉండాలి (రోమీయులకు 8:31, రోమీయులకు 8:37; 2 కోరింథీయులకు 2:14; 2 తిమోతికి 4:18). నమ్మకం ద్వారా మాత్రమే మనం క్రీస్తును ధరించుకోగలం, శత్రువును విజయవంతంగా ఎదిరించగలం.

17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
యెషయా 11:4, యెషయా 49:2, యెషయా 51:16, యెషయా 59:17, హోషేయ 6:5

“పాపవిముక్తిని శిరాస్త్రాణంగా”– 1 థెస్సలొనీకయులకు 5:8; యెషయా 59:17. శిరస్త్రాణం అంటే తనకు ధరించే హెల్మెట్. దేవుని ఆధ్యాత్మిక సైనికులంగా మన మనసులను పాపవిముక్తి, రక్షణ అసలు ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం పాపం నుంచి మనం విముక్తి పొందామని తెలుసుకుని ఉండాలి (ఎఫెసీయులకు 1:7; ఎఫెసీయులకు 2:5). రాబోయే కాలంలో మన విముక్తి, రక్షణ పరిపూర్ణం అవుతుందన్న సజీవమైన ఆశాభావం మనలో ఉండాలి (రోమీయులకు 8:23-25). యేసుప్రభువు తానే తన ప్రజలకు విముక్తి, రక్షణ. మనం ఆయన్ను ధరించుకోవాలి (కీర్తనల గ్రంథము 18:2-3, కీర్తనల గ్రంథము 18:17; కీర్తనల గ్రంథము 27:1; యిర్మియా 3:23; లూకా 2:30; 1 కోరింథీయులకు 1:31; 2 తిమోతికి 2:10). “పవిత్రాత్మ ఖడ్గం”– ఖడ్గాన్ని మనల్ని రక్షించుకొనేందుకు, శత్రువును గాయపరచేందుకు కూడా వాడవచ్చు. మత్తయి 4:1-11 లో యేసుప్రభువు సైతానుకు వ్యతిరేకంగా ఈ ఆత్మ ఖడ్గాన్ని ఎలా ప్రయోగించాడో చూడండి. క్రీస్తు విశ్వాసులు ఈనాడు కూడా ఇదే చెయ్యగలరు. అయితే వారికి దేవుని వాక్కు తెలిసి, అర్థమై ఉండాలి. వారికి ఎదురయ్యే విషమ పరీక్షల విషయాల్లో ఆ వాక్కును వారు ఉపయోగించుకోగలగాలి. అందువల్ల బైబిలుపై నమ్మకం ఉంచు, అదంటే ప్రీతి కలిగి చదివి, మన మనసులో హృదయంలో నింపుకుని, దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి – ఎఫెసీయులకు 4:13-14; కొలొస్సయులకు 3:16; 2 తిమోతికి 2:15; 2 తిమోతికి 3:16-17. బైబిల్లో దేవుని వాక్కును ఆత్మ ఖడ్గం అని ఎందుకు అన్నారు? ఎందుకంటే పవిత్రాత్మ దాన్ని రాయించాడు. దాన్ని అర్థం చేసుకుని, వాడగలిగే సామర్థ్యాన్ని ఆయనే ఇస్తాడు (ఎఫెసీయులకు 1:17-18; యోహాను 16:13; 1 కోరింథీయులకు 2:10-14). సైతాన్ను ఓడించాలంటే మనకు అవసరమైనది ఏది? వాడు మన మనసులో ప్రవేశపెట్టే సలహాలు, సందేహాలు, దుష్‌ప్రేరణలు వీటికి వ్యతిరేకంగా దేవుని వాక్కును ఉపయోగించాలి.

18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

పౌలు ఇంకా దేవుని సైనికుల గురించే రాస్తున్నాడు. ఆధ్యాత్మిక శత్రువులపై విజయ విధానాన్నే ఇంకా చూపిస్తున్నాడు. ప్రార్థన లేని స్థితి ఉండడమంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తుండడం చూస్తే సైతాను గజగజ వణకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన కవచమంతా మనల్ని సంరక్షించలేదంటున్నాడు. ప్రార్థనతో దాన్ని ధరించాలి, ప్రార్థనతో దానితో నిలబడాలి. ప్రార్థన గురించి కీర్తనల గ్రంథము 66:18; యిర్మియా 33:3; మత్తయి 6:5-13; మత్తయి 7:7-11; మత్తయి 26:41; మార్కు 11:24-25; లూకా 11:5-13; హెబ్రీయులకు 4:16; హెబ్రీయులకు 10:19-22; యాకోబు 5:13, యాకోబు 5:16; 1 పేతురు 4:7. శుభవార్త గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగివున్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చెయ్యడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి – ఎఫెసీయులకు 2:18; రోమీయులకు 8:26; యూదా 1:20. ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి. “అన్ని” సమయాల్లోనూ “అన్ని” విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలూ ఇతరుల కోసం విజ్ఞాపనలూ చేయాలి, కృతజ్ఞతలూ స్తుతులూ సమర్పించాలి (1 తిమోతికి 2:1). ఏకాంతంగా లేక బహిరంగంగా, మాటలతో లేక మాటలు లేకుండా లోలోపల ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చెయ్యడం మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది. “పవిత్రులందరి కోసం”– ఆత్మ సంబంధమైన శత్రువులతో ఈ పోరాటంలో విశ్వాసులంతా పాల్గొంటున్నారు. ప్రార్థన ద్వారా అందులో ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు నిజంగా వారికి సహాయం చేస్తాయా? తప్పకుండా. ఈ విధానాన్ని నియమించినది దేవుడే. ఉపయోగం లేని పనులు చెయ్యాలని దేవుడు చెప్పడు.

19. మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు

“నాకోసం”– రోమీయులకు 15:30; 2 కోరింథీయులకు 1:11; ఫిలిప్పీయులకు 1:19; కొలొస్సయులకు 4:3; 1 థెస్సలొనీకయులకు 5:25; 2 థెస్సలొనీకయులకు 3:1. పౌలు గొప్ప రాయబారి, దేవుని ఆత్మతో నిండినవాడు, క్రీస్తు సైనికుడుగా గొప్ప విజయాలు సాధించినవాడు. అతడు సరైన రీతిలో మాట్లాడేలా సాధారణ విశ్వాసుల ప్రార్థనలు అతనికి సహాయపడతాయా? దీన్నిబట్టి సహాయపడతాయి అని అర్థం అవుతున్నది. “శుభవార్త...సత్యాన్ని”– అంటే శుభవార్త అనేది దేవుడు వెల్లడించినది. ఆయన అలా వెల్లడించకపోతే మనుషులకు ఇది తెలిసేది కాదు. “ధైర్యంగా”– అపో. కార్యములు 4:13, అపో. కార్యములు 4:29, అపో. కార్యములు 4:31.

20. దానినిగూర్చి నేను మాట లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

“సంకెళ్ళ పాలైన ప్రతినిధిని”– ఎఫెసీయులకు 3:1; 2 కోరింథీయులకు 5:20.

21. మీరును నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియసహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియ జేయును.

“తుకికస్”– అపో. కార్యములు 20:4; కొలొస్సయులకు 4:7; 2 తిమోతికి 4:12; తీతుకు 3:12.

22. మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని.

23. తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతోకూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.

“నమ్మకంతో కూడా ప్రేమ”– నిజ విశ్వాసంతో బాటు ప్రేమ కూడా ఉంటుంది (గలతియులకు 5:6). ఈ రెంటికీ మూలాధారం తండ్రి అయిన దేవునితో కలిసి యేసుప్రభువే.

24. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.

విశ్వాసులంతా క్రీస్తును ప్రేమిస్తారు (1 కోరింథీయులకు 16:22; 1 యోహాను 4:8). వారిది అమర ప్రేమ అనవచ్చు. ఎందుకంటే అది దేవునినుంచి కలిగినది (వ 23; 1 యోహాను 4:7; రోమీయులకు 5:5). అది కేవలం మానసికమైన ఉద్రేకం, అనుభూతి మాత్రమే కాదు. తన ప్రజల హృదయాల్లో దేవుడు నాటే ప్రేమ దివ్యమైనది, శాశ్వతమైనది. ఇలాంటి యోగ్యమైన తలంపుతో పౌలు ఈ ఘనమైన ప్రేమ ఉత్తరాన్ని ముగిస్తున్నాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ephesians - ఎఫెసీయులకు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పిల్లలు మరియు తల్లిదండ్రుల విధులు. (1-4) 
పిల్లల ప్రాథమిక బాధ్యత వారి తల్లిదండ్రులకు కట్టుబడి ఉండటం. ఈ విధేయత అంతర్గత గౌరవం మరియు బాహ్య చర్యలు రెండింటినీ కలిగి ఉండాలి మరియు చరిత్ర అంతటా, వారి తల్లిదండ్రులకు విధేయత చూపడంలో ప్రసిద్ధి చెందిన వారు తరచుగా శ్రేయస్సును అనుభవించారు. తల్లిదండ్రుల విధి విషయానికొస్తే, అసహనానికి దూరంగా ఉండాలి మరియు కారణం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల తీర్పుకు విజ్ఞప్తి చేస్తూ మరియు వారి తార్కిక సామర్థ్యాలను నిమగ్నం చేస్తూ వివేకం మరియు వివేకంతో విషయాలను నిర్వహించాలి. పిల్లలను సరిగ్గా పెంచాలి, తగిన మరియు దయతో కూడిన దిద్దుబాటును పొందుపరచాలి మరియు దేవుడు ఆశించే విధులను గురించిన జ్ఞానంతో నింపాలి.
విచారకరంగా, సువార్తను ప్రకటించేవారిలో కూడా ఈ విధి తరచుగా విస్మరించబడుతుంది. కొంతమంది వ్యక్తులు తమ పిల్లలను మతం నుండి దూరం చేస్తారు, అయితే ఇది పిల్లలలో అవిధేయతను క్షమించదు, అయినప్పటికీ ఇది విషాదకరంగా దీనికి దోహదం చేస్తుంది. దేవుడు మాత్రమే హృదయాలను మార్చగలడు, అతను తల్లిదండ్రులు సెట్ చేసిన మంచి పాఠాలు మరియు ఉదాహరణలను ఆశీర్వదిస్తాడు మరియు వారి ప్రార్థనలకు ప్రతిస్పందిస్తాడు. అయితే, వారి ఆత్మ క్షేమం కంటే తమ పిల్లల సంపద మరియు విజయాలకే ప్రాధాన్యత ఇచ్చే వారు దేవుని అనుగ్రహాన్ని ఊహించకూడదు.

సేవకులు మరియు యజమానులు. (5-9) 
సేవకుల బాధ్యతను ఒకే భావనలో చేర్చవచ్చు: విధేయత. గతంలో, సేవకులు తరచుగా బానిసలుగా ఉండేవారు, మరియు అపొస్తలులు సేవకులు మరియు యజమానులు ఇద్దరికీ వారి సంబంధిత విధులను సూచించే పనిలో ఉన్నారు. ఈ విధులను నెరవేర్చడం ద్వారా, దాస్యం యొక్క ప్రతికూల అంశాలు తగ్గిపోతాయి, చివరికి క్రైస్తవ మతం ప్రభావం ద్వారా బానిసత్వాన్ని నిర్మూలించడానికి మార్గం సుగమం చేస్తుంది. సేవకులు తమపై అధికారంలో ఉన్నవారికి గౌరవం చూపించాలని నిర్దేశించబడ్డారు, మొహమాటం లేకుండా నమ్మకంగా సేవ చేయడం ద్వారా నిజాయితీని ప్రదర్శిస్తారు. వారు తమ యజమానులకు శ్రద్ధగా సేవ చేయాలని భావిస్తున్నారు, గమనించినప్పుడు మాత్రమే కాకుండా స్థిరంగా, పర్యవేక్షణ లేనప్పుడు కూడా.
ప్రభువైన యేసుక్రీస్తు పట్ల దృఢమైన భక్తి ప్రతి పాత్రలో విశ్వాసం మరియు నిజాయితీకి పునాదిగా పనిచేస్తుంది. ఈ నిబద్ధత భిక్షాటన లేదా బలవంతంగా ఉండకూడదు కానీ మాస్టర్స్ మరియు వారి ఆందోళనల పట్ల నిజమైన ప్రేమతో పాతుకుపోయింది. అటువంటి విధానం సేవకులకు సేవను సునాయాసంగా చేస్తుంది, యజమానులకు సంతోషాన్నిస్తుంది మరియు ప్రభువైన క్రీస్తుకు ఆమోదయోగ్యమైనది. కర్తవ్య భావం మరియు దేవుడిని మహిమపరచాలనే ఉద్దేశ్యంతో చేపట్టినప్పుడు అత్యంత వినయపూర్వకమైన పనులు కూడా ఆయనచే ప్రతిఫలం పొందుతాయి.
మాస్టర్స్ యొక్క బాధ్యతలు ఈ సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి. సేవకులకు ప్రతిఫలంగా వారు ఆశించిన విధంగా న్యాయమైన ప్రవర్తనను ప్రదర్శిస్తూ, అదే పద్ధతిలో పరస్పరం వ్యవహరించాలని వారు కోరారు. యజమానులు తమ సేవకుల పట్ల సద్భావనను మరియు నిజమైన శ్రద్ధను ప్రదర్శించాలి, దేవుని ఆమోదం పొందాలని కోరుకుంటారు. క్రీస్తు యేసు సందర్భంలో యజమానులు మరియు సేవకులు తోటి సేవకులుగా పరిగణించబడుతున్నందున నిరంకుశత్వం మరియు అతిగా ప్రవర్తించే ప్రవర్తన నిరుత్సాహపరచబడుతుంది. దేవుని పట్ల వారి బాధ్యతలు మరియు వారు ఎదుర్కొనే రాబోయే జవాబుదారీతనం గురించి ఆలోచిస్తే, యజమానులు మరియు సేవకులు ఇద్దరూ ఒకరికొకరు తమ విధులను నెరవేర్చడంలో మరింత మనస్సాక్షిగా మారవచ్చు. ఇది క్రమంగా, మరింత క్రమబద్ధమైన మరియు సంతృప్తికరమైన కుటుంబాలకు దోహదం చేస్తుంది.

క్రైస్తవులందరూ తమ ఆత్మల శత్రువులకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక కవచాన్ని ధరించాలి. (10-18) 
ఆధ్యాత్మిక సంఘర్షణలు మరియు కష్టాల నేపథ్యంలో ఆధ్యాత్మిక దృఢత్వం మరియు ధైర్యం అవసరం. నిజమైన కృపను ప్రదర్శించాలని కోరుకునే వారు దయ యొక్క అన్ని అంశాలను అనుసరించాలి మరియు అతను అందించే దేవుని పూర్తి కవచాన్ని ధరించాలి. ఈ క్రైస్తవ కవచం మన ఆధ్యాత్మిక యుద్ధం పూర్తయ్యే వరకు మరియు మన ప్రయాణం ముగిసే వరకు దానిని తీసివేయకుండా నిరంతరం ధరించడానికి ఉద్దేశించబడింది. మన విరోధులు కేవలం మానవులు లేదా మన స్వంత పాపపు స్వభావం కాదు; అస్థిరమైన ఆత్మలను లెక్కలేనన్ని మార్గాల్లో మోసగించడంలో నైపుణ్యం కలిగిన శత్రువుతో మనం పోరాడతాము. దెయ్యం మన ఆత్మల అంతర్భాగంపై దాడి చేస్తుంది, మన హృదయాల్లోని దైవిక ప్రతిమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. దేవుని దయతో, సాతానుకు లొంగిపోకూడదని మనం నిర్ణయించుకోవాలి; అతనిని ప్రతిఘటించడం వలన అతను వెనక్కి తగ్గుతాడు, కానీ భూమిని అందించడం అతని స్థావరాన్ని బలపరుస్తుంది.
భీకర దాడులను ఎదుర్కొనే భారీ సాయుధ సైనికులు ధరించే కవచం యొక్క వివిధ భాగాలు ఇక్కడ వివరించబడ్డాయి. క్రైస్తవ యుద్ధంలో వెనుకకు తిరగడం యొక్క అననుకూలతను నొక్కిచెప్పడం, వెనుకకు రక్షణ ఉండటం గమనార్హం. సత్యం, లేదా నిష్కపటత్వం, మతంలో చిత్తశుద్ధి యొక్క అనివార్యతను నొక్కిచెబుతూ, అన్ని ఇతర కవచాలను భద్రపరిచే పునాది కట్టు వలె పనిచేస్తుంది. క్రీస్తు యొక్క నీతి, ఆరోపించబడిన మరియు అమర్చబడిన రెండూ, దైవిక కోపానికి వ్యతిరేకంగా రక్షించే మరియు సాతాను దాడులకు వ్యతిరేకంగా హృదయాన్ని బలపరిచే రొమ్ము కవచం వలె పనిచేస్తుంది. రిజల్యూషన్‌ను గ్రేవ్స్‌తో పోల్చారు, కాళ్లను రక్షించడం మరియు విశ్వాసులు సవాళ్లతో కూడిన మార్గాల్లో స్థిరంగా నిలబడేందుకు లేదా ముందుకు సాగేలా చేయడం. సువార్త యొక్క స్పష్టమైన అవగాహన ద్వారా పరీక్షల మధ్య విధేయత కోసం ప్రేరణను అందిస్తూ, శాంతి సువార్త తయారీతో పాదాలు వేయాలి.
టెంప్టేషన్ క్షణాలలో, విశ్వాసం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, ఇది కనిపించని వస్తువులపై ఆధారపడే కవచంగా పనిచేస్తుంది, క్రీస్తును మరియు విమోచన ప్రయోజనాలను పొందుతుంది మరియు డెవిల్ దాడులకు వ్యతిరేకంగా రక్షించబడుతుంది. సాతాను అపవిత్రత నుండి ఆత్మను శుద్ధి చేసే ఒక మంచి నిరీక్షణను మరియు విజయం గురించి లేఖనాధారమైన నిరీక్షణను పురికొల్పుతూ మోక్షం హెల్మెట్‌గా పనిచేస్తుంది. అపొస్తలుడు దాడికి ఒకే ఆయుధాన్ని సిఫార్సు చేస్తాడు - ఆత్మ యొక్క ఖడ్గం, దేవుని వాక్యం, ఇది చెడు కోరికలను అణచివేస్తుంది, దైవదూషణ ఆలోచనలను అణచివేస్తుంది మరియు అవిశ్వాసం మరియు లోపానికి సమాధానం ఇస్తుంది.
క్రైస్తవ కవచం యొక్క అన్ని ఇతర అంశాలకు ప్రార్థన బంధన శక్తిగా పనిచేస్తుంది. మతం మరియు ప్రాపంచిక స్టేషన్లలో వివిధ విధులు ఉన్నప్పటికీ, ప్రార్థన యొక్క సాధారణ సమయాలను నిర్వహించడం చాలా కీలకం. సెట్ మరియు అధికారిక ప్రార్థన తగినది కానప్పటికీ, క్లుప్తమైన భక్తి ప్రార్ధనలు ఎల్లప్పుడూ సరైనవి. పవిత్రమైన ఆలోచనలు మన దైనందిన జీవితాల్లో వ్యాపించి ఉండాలి, ప్రార్థనలో కూడా నిలకడగా ఉండే ఫలించని హృదయం నుండి కాపాడుకోవాలి. ప్రార్థన అన్ని రూపాలను కలిగి ఉండాలి - పబ్లిక్, ప్రైవేట్, రహస్యం, సామాజిక, ఏకాంత, గంభీరమైన మరియు ఆకస్మికమైన - పాపం ఒప్పుకోవడం, దయ కోసం పిటిషన్ మరియు స్వీకరించిన సహాయాలకు కృతజ్ఞతలు. ఇది పరిశుద్ధాత్మ కృపతో, ఆయన మార్గదర్శకత్వంపై ఆధారపడి చేయాలి. నిరుత్సాహం ఉన్నప్పటికీ నిర్దిష్ట అభ్యర్థనలలో పట్టుదల అవసరం. మన శత్రువులు బలీయమైనవారని గుర్తిస్తూ, సాధువులందరికీ మధ్యవర్తిత్వం వహించడానికి వ్యక్తిగత ఆందోళనలకు మించి ప్రార్థనలు విస్తరించాలి, అయితే మన సర్వశక్తిమంతుడైన విమోచకుని శక్తిలో మనం అధిగమించగలము. కాబట్టి, దేవుడు పిలిచినప్పుడు సమాధానమివ్వడంలో మనం ఎంత తరచుగా విస్మరించాము మరియు సహనంతో ప్రార్థనలో పట్టుదలతో ఉండాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, మనల్ని మనం కదిలించుకోవాలని కోరారు.

అపొస్తలుడు వారి ప్రార్థనలను కోరుకుంటాడు మరియు అతని అపోస్టోలిక్ ఆశీర్వాదంతో ముగుస్తుంది. (19-24)
దైవిక ద్యోతకం ద్వారా ఆవిష్కరించబడే వరకు సువార్త యొక్క ద్యోతకం ప్రారంభంలో రహస్యంగా కప్పబడి ఉంది మరియు దానిని ప్రకటించడం క్రీస్తు పరిచారకుల బాధ్యత. అత్యంత నైపుణ్యం మరియు విశిష్ట పరిచారకులకు కూడా విశ్వాసుల ప్రార్థనలు అవసరం, ముఖ్యంగా వారి సేవలో గణనీయమైన కష్టాలు మరియు ప్రమాదాలను ఎదుర్కొనే వారు. ప్రేమ మరియు విశ్వాసంతో కూడిన సోదరులకు శాంతి విస్తరించండి. ఈ సందర్భంలో, శాంతి అనేది దేవునితో సయోధ్య మరియు మనస్సాక్షి యొక్క ప్రశాంతత, అలాగే విశ్వాసుల మధ్య సామరస్యం వంటి వివిధ రూపాలను కలిగి ఉంటుంది. విశ్వాసం, ప్రేమ మరియు ప్రతి ఇతర ధర్మాన్ని ఉత్పత్తి చేసే ఆత్మ యొక్క దయ కూడా కోరబడుతుంది. ఈ లక్షణాలు ఇప్పటికే వ్యక్తీకరించడం ప్రారంభించిన వారి కోసం స్పీకర్ ఈ కోరికలను వ్యక్తపరుస్తాడు.
ఇంకా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని నుండి పరిశుద్ధులకు అన్ని దయ మరియు ఆశీర్వాదాలు తెలియజేయబడ్డాయి. దేవుని అనుగ్రహాన్ని సూచించే దయ, ప్రతి మంచితో పాటు-ఆధ్యాత్మికం మరియు తాత్కాలికం-ఈ దైవిక మూలం నుండి ఉద్భవిస్తుంది మరియు మన ప్రభువైన యేసుక్రీస్తును యథార్థంగా ప్రేమించే వారికి అందించబడుతూనే ఉంటుంది. అటువంటి వ్యక్తులతోనే దయ మరియు ఆశీర్వాదాలు కొనసాగుతాయి.



Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |