Deuteronomy - ద్వితీయోపదేశకాండము 28 | View All

1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.

1. “మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై, ఈ రోజు నేను మీకు చెబుతోన్న ఆయన ఆదేశాలన్నింటినీ పాటిస్తే, అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఈ భూలోక రాజ్యాలన్నింటికంటె ఉన్నత స్థానంలో ఉంచుతాడు.

2. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.

2. మీరు గనుక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు లభించి, మీ స్వంతం అవుతాయి.

3. నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింప బడుదువు;

3. “యెహోవా మీ పట్టణాలు మీ పొలాలను ఆశీర్వాదిస్తాడు.

4. నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;
లూకా 1:42

4. యెహోవా మీకు అధిక సంతానం యిచ్చి ఆశీర్వాదిస్తాడు. మీపొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు మీ పశువులకు సంతానా భివృద్ధి కలిగిస్తాడు మీకు పశువులు, గొర్రెలు విస్తారంగా ఉంటాయి.

5. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.

5. మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

6. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.

6. మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.

7. నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు.

7. “మీ మీదికి వచ్చే మీ శత్రువులను మీరు ఓడించెటట్టు యెహోవా చేస్తాడు. మీ శత్రువు మీ మీదికి ఒకే మార్గంలో వచ్చి, ఏడు మార్గాల్లో పారిపోతాడు.

8. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.

8. “మీ కొట్టెలు నిండుగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతిదాన్నీ ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును.

9. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటాడు. మీరు మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు విధేయులై, ఆయన మార్గాల్లో మీరు జీవిస్తే ఆయన దీనిని మీకు వాగ్దానం చేసాడు.

10. భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.

10. అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని ఆ దేశ ప్రజలంతా తెలుసుకొంటారు. వారు మీకు భయపడతారు.

11. మరియయెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశు వుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.

11. “మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది పిల్లల్ని ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు మంచి పంట ఇస్తాడు.

12. యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు

12. యెహోవా తన గొప్ప ఆశీర్వాదాల్ని దాచి ఉంచిన ఆకాశాన్ని తెరచి. సరైన సమయంలో మీ భూమిమీద ఆయన వర్షం కురిపిస్తాడు. మీరు చేసే పనులన్నింటినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీ దగ్గర ఉంటుంది. కానీ మీరు వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

13. నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి

13. యెహోవా మిమ్మల్ని తలగానే ఉంచు తాడుగాని తోకగాకాదు. మీరు పైవారు గానే ఉంటారు కాని కిందవారుగా ఉండరు. ఈ వేళ నేను మీకు చెబుతున్న మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు మీరు విధేయులైతే ఇదంతా జరుగుతుంది. ఈ ఆజ్ఞలకు మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి.

14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.

14. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ప్రభోధాల్లో దేనినుండీ మీరు తప్పి పోకూడదు. మీరు కుడి పక్కకు గాని ఎడమ పక్కకు గాని తొలగిపోకూడదు. మీరు ఇతర దేవుళ్లను సేవించడానికి వారిని వెంబడించ కూడదు.

15. నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.

15. “అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే విషయాలను మీరు వినకపోతే, ఈ వేళ నేను మీకు చెప్పే ఆయన ఆదేశాలకు, చట్టాలకు మీరు విధేయులు కాకపోతే అప్పుడు మీకు ఇదిగో ఈ చెడ్డ సంగతులన్నీ సంభవిస్తాయి;

16. పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;

16. “మీ పట్టణాల్ని, పొలాల్ని యెహోవా శపిస్తాడు

17. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;

17. మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు. మీకు సరిపడేటంత ఆహారం ఉండదు.

18. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;

18. యెహోవా మిమ్మల్ని శపిస్తాడు, మీకు అనేక మంది పిల్లలు కలగరు. ఆయన మీ భూమిని శపిస్తాడు, గనుక మంచి పంటను మీరు పొందరు. ఆయన మీ పశువులను శపిస్తాడు, గనుక అవి ఎక్కువ పిల్లల్ని ఈనవు. ఆయన మీ దూడలను గొర్రె పిల్లలను శపిస్తాడు.

19. నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు.

19. మీరు చేసే వాటన్నింటిలో ఎల్లప్పుడూ యెహోవా శపిస్తాడు.

20. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.

20. “మీరు కీడు చేసి, యెహోవాకు దూరమైతే, మీకు చెడు సంగతులు సంభవించేటట్టు ఆయన చేస్తాడు. మీరు చేసే ప్రతిదానిలో మీకు విసుగు, కష్టం కలుగుతుంది. మీరు త్వరగా, పూర్తిగా నాశనం అయ్యేంతవరకు ఆయన అలా చేస్తూనే ఉంటాడు. ఎదుకంటే మీరు ఆయననుంచి దూరమై, ఆయనను విసర్జించారు.

21. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును.

21. మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, మీరు నివసించేందుకని ప్రవేశిస్తున్న దేశంలో, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేటంతవరకు మీకు రోగాలు వచ్చేటట్టు ఆయన చేస్తాడు.

22. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.

22. యెహోవా రోగాలతో మిమ్ములను శిక్షిస్తాడు. మీకు జ్వరం, వాపు వస్తాయి. యెహోవా మీకు భయంకర వేడి కలిగిస్తాడు, భూమిపై వర్షాలు ఉండవు. మీ పంటలు వ్యాధుల మూలంగా లేక వేడి మూలంగా చస్తాయి. మీరు చచ్చేంతవరకు ఈ కీడులన్నీ మీకు సంభవిస్తూనే ఉంటాయి.

23. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.

23. మీకు పైగా ఆకాశం ఇత్తడిలా తేటగా ఉంటుంది. మీ కింద భూమి ఇనుములా గట్టిగా ఉంటుంది.

24. యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.

24. ఆకాశంనుంచి వర్షానికి బదులు ఇసుక, ధూళి యెహోవా పంపిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు అది మీ మీదికి వస్తుంది.

25. యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు.

25. “మీ శత్రువులు మిమ్మల్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. ఒక్క మార్గం గుండా మీరు మీ శత్రువులమీదకు వెళ్లి, వారి దగ్గర్నుండిఏడు వేర్వేరు మార్గాలలో మీరు పారిపోతారు. మీకు సంభవించే సంగతుల మూలంగా ప్రపంచంలోని ప్రజలంతా భయపడతారు.

26. నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.

26. మీ శవాలు అడవి మృగాలకు, పక్షులకు ఆహారం అవుతాయి. మీ శవాల మీదనుండి వాటిని వెళ్లగొట్టే వారు ఎవరూ ఉండరు.

27. యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.

27. “మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఈజిప్టు వాళ్లమీదికి పంపిన గడ్డల్లాంటి వాటితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. పుండ్లు. కుష్ఠు, గజ్జితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు.

28. వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.

28. మీకు పిచ్చి ఎక్కేట్టుగా చేసి యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని గుడ్డివాళ్లుగా చేసి, కలవరపరుస్తాడు.

29. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువు లాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవ డును లేకపోవును,

29. అప్పుడు గుడ్డివారు తడువులాడే రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుతావు. మీరు చేసే ప్రతిదానిలో మీకు మీరు విఫలులవుతారు. ప్రజలు మరల మరల మిమ్మల్ని బాధించి, మీ దగ్గర్నుండి వస్తువులు దొంగిలిస్తారు. మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరు.

30. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.

30. “నీకు ప్రధానం చేయబడిన స్త్రీతో మరొకడు లైగింక సంబంధాలు అనుభవిస్తాడు. నీవు ఇల్లు కడతావు గాని అదులో నీవు నివసించవు. ద్రాక్షతోట నీవు నాటుతావు గాని దానిలో నీవు ఏమీ కూర్చుకోవు.

31. నీ యెద్దు నీ కన్నులయెదుట వధింప బడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొని పోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు.

31. నీ ఆవు నీ కళ్లముందే చంపబడుతుంది గాని నీవు దాని మాంసం ఏమీ తినవు. నీ గాడిద నీ దగ్గర్నుండి బలాత్కారంగా తీసుకొని పోబడుతుంది. అది నీకు తిరిగి ఇవ్వబడదు. నీ గొర్రెలు నీ శత్రువులకు ఇవ్వబడుతాయి. నిన్ను రక్షించేవాడు ఎవడూ ఉండడు.

32. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

32. “మీ కొడుకులు, కూతుళ్లు వేరే జాతి ప్రజలకు ఇవ్వబడేందుకు అనుమతించబడతారు. మీ పిల్లలు మీకు కావాలి గనుక మీ కళ్లు బలహీనమై, మీ చూపు మందగించేటంతవరకు మీరు వాళ్లకోసం చూస్తారు. మరియు దేవుడు మీకు సహాయం చేయడు.

33. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.

33. “మీరు కష్టపడి పండించిన పంట అంతా మీకు తెలియని మరోజాతి తినేస్తుంది. ప్రజలు మిమ్మల్ని చెడుగా చూచి తిడతారు. విరుగగొట్ట బడుతుంటారు.

34. నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెఱ్ఱియెత్తును.

34. మీరు చూసే విషయాల మూలంగా మీకుపిచ్చెక్కుతుంది.

35. యెహోవా నీ అరకాలు మొదలు కొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును.
ప్రకటన గ్రంథం 16:2

35. యెహోవా మిమ్మల్ని రసిపుండ్లతో శిక్షిస్తాడు. ఈ పుండ్లు మీ కాళ్ల మీద మోకాళ్లమీద ఉంటాయి. అవి మీ అరికాలు మొదలుకొని మీ నడి నెత్తివరకు నిండి ఉంటాయి. ఈ పుండ్లనుండి మీరు బాగుపడరు.

36. యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు

36. “మీరు ఎరుగని రాజ్యానికి మిమ్మల్ని, మీ రాజును యెహోవా పంపించేస్తాడు. మీరు, మీ పూర్వీకులు కూడా ఆ రాజ్యాన్ని ఎన్నడూ చూడలేదు. చెక్క, రాళ్లతో చేయబడిన ఇతర దేవుళ్లను అక్కడ మీరు పూజిస్తారు.

37. యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.

37. యెహోవా మిమ్మల్ని పంపించే దేశాల్లో, మీకు సంభవించిన సంగతులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. వాళ్లు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మిమ్మల్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.

38. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.

38. “పొలాల్లో చల్లటానికి మీరు విస్తారంగా విత్తనాలు తీసుకొని వెళ్తారు. కానీ మీ పంట కొద్దిగానే ఉంటుంది. ఎందుకంటే మిడతలు మీ పంటను తినివేస్తాయి.

39. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.

39. మీరు ద్రాక్ష తోటలు నాటి, వాటిలో కష్టపడి పని చేస్తారు. కానీ మీరు ద్రాక్ష పండ్లు కూర్చుకోరు, వాటి రసం తాగలేరు. ఎందుకంటే పురుగులు వాటిని తినివేస్తాయి.

40. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.

40. మీ దేశమంతటా మీకు ఒలీవ చెట్లు ఉంటాయి. కాని ఉపయోగించు కొనేందుకు మీకు ఎలాంటి నూనె ఉండదు. ఎందుచేతనంటే మీ ఒలీవ పండ్లు పాడై రాలిపోతాయి.

41. కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు.

41. మీకు కుమారులు, కుమారైలు ఉంటారు. కాని వారిని మీరు ఉంచుకోలేరు. ఎందుచేతనంటే వారు బంధించబడి తీసుకొని పోబడతారు.

42. మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.

42. మీ చెట్లన్నింటినీ, మీ పోలాల్లోని పంటలన్నింటినీ మిడతలు నాశనం చేస్తాయి.

43. నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.

43. మీ మధ్య నివసించే విదేశీయులు మరింత ఎక్కువ అధికారం కూడ పొందుతారు. మీరేమో మీకు ఉన్న అధికారం కూడ పోగొట్టుకొంటారు.

44. అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.

44. మీకు అప్పు ఇచ్చేందుకు విదేశీయుల దగ్గర ధనం ఉంటుంది. కానీ వారికి అప్పు ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ ధనం ఉండదు. శిరస్సు దేహాన్ని స్వాధీనంలో ఉంచుకొన్నట్టు వారు మిమ్మల్ని స్వాధీనంలో ఉంచుకొంటారు. మీరు తోకలా ఉంటారు.

45. నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టు కొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.

45. “ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనం అయ్యేంతవరకు అవి మిమ్మల్ని తరుముతూ, పట్టుకొంటూనే ఉంటాయి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన వాటిని మీరు వినలేదు. ఆయన మకు ఇచ్చిన ఆదేశాలకు, ఆజ్ఞలకు మీరు విధేయులు కాలేదు.

46. మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.

46. మీకు, మీ సంతతివారికి దేవుడు శాశ్వతంగా తీర్పుతీర్చాడని ఈ శాపాలు ప్రజలకు తెలియజేస్తాయి. మీకు సంభవించే భయంకర విషయాలను చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోతారు.

47. నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు

47. “మీ దేవుడైన యెహోవా మీకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ మీరు సంతోషంగా, ఆనంద హృదయంతో ఆయనను సేవించలేదు.

48. గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.

48. అందుచేత శత్రువులకు మీరు సేవచేస్తారు. ఆకలి, దాహంతో మీరు దిగంబరులుగా ఉంటారు. మీకు ఏమీ ఉండదు. యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతవరకు ఆయన మీ మెడమీద ఇనుప కాడిని పెడతాడు.

49. యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,

49. “దూరంనుండి మీ మీదికి ఒక రాజ్యాన్ని యెహోవా తీసుకొని వస్తాడు. ఈ రాజ్యం భూమి అవతలి పక్కనుండి వస్తుంది. ఈ రాజ్య భాష మీకు అర్థం కాదు. ఆకాశంనుండి పక్షిరాజు వచ్చినట్టు ఈ రాజ్యం వేగంగా మీ మీదికి వస్తుంది.

50. క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును.

50. ఈ రాజ్యం వారి ముఖాలు కఠినంగా ఉంటాయి. వారు ముసలి వాళ్లను లేక్కచేయరు. చిన్నపిల్లల మీద వాళ్లు దయచూపించరు.

51. నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు.

51. మీరు నాశనం అయ్యేంతవరకు మీ పశువుల మందలోని దూడలను, మీ నేల పంటను వారు తింటారు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, మీ పశువుల్లో దూడలు, మీ మందల్లో గొర్రెలు మీకోసం వారు విడిచిపెట్టరు. మీరు నాశనం అయ్యేంతవరకు ఇలా చేస్తూనే ఉంటారు.

52. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు.

52. “ఈ రాజ్యం మీ పట్టణాలన్నింటినీ చుట్టుముట్టేస్తుంది. మీ పట్టణాల చుట్టూ ఉన్న మీ ఎత్తయిన, బలమైన గోడల్ని మీరు నమ్ముకొంటారు. కానీ మీ దేశం అంతటా ఈ గోడలన్నీ కూలిపోతాయి. అవును, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీ పట్టణాలన్నింటిమీదా ఆ రాజ్యం దాడి చేస్తుంది.

53. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.

53. శత్రువు మీ పట్టణం చుట్టూ కనిపెట్టుకొని వుండగా, మీరు ఎంతో శ్రమ అనుభవిస్తారు. మీరు ఆకలి భరించలేక మీ పిల్లల్నే తినివేస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కుమారులు, కుమార్తెల శరీరాలను మీరు తింటారు.

54. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మను ష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున

54. “మీలో దయగల అతి మర్యాదస్తుడు కూడా క్రూరుడవుతాడు. ఇతరులతో కూడా క్రూరంగా వుంటాడు. తాను ప్రేమించే భార్యతోగాని, ఇంకను బతికున్న తన పిల్లలతోగాని క్రూరుడై భాగం పంచుకొనేందుకు ఆతడు ఒప్పుకోడు.

55. అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామము లన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు.

55. మీ పట్టణాల మీద దాడి చేసేందుకు వచ్చే శత్రువు అంత తీవ్ర నష్టం కలిగిస్తాడు. గనుక ఆతనికి తినటానికి కూడా ఏమీ మిగులదు. అందుచేత అతడు తన స్వంత పిల్లల్నే కొందర్ని తిలివేస్తాడు. కాని తన కుటుంబంలో ఇంకెవ్వరికీ అతడు ఏమీ ఇవ్వడు.

56. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును

56. “ఎన్నడూ నేలమీద కాలు మోపనంత సున్నితమైన ధనికురాలు, మీలో ఎంతో గొప్ప దయ, మర్యాద గల స్త్రీ కూడా కఠినంగా ఉండి అలానే చేస్తుంది. ఆమె తన స్వంత ప్రియ భర్తతో లేక తన స్వంత కుమారునితో, స్వంత కుమార్తెతో భాగం పంచుకొనేందుకు నిరాకరిస్తుంది.

57. అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్ల లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును.

57. ఆమె తన మావిని, తాను కన్న తన స్వంత పిల్లలను రహస్యంగా తినేస్తుంది. ఎందుకంటే బొత్తిగా ఆహారం లేదు గనుక. మీ శత్రువు మీ పట్టణాల మీద దాడి చేసి, ఎంతో శ్రమె కలిగించినపుడు ఇలా జరుగుతుంది.

58. నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల

58. “ఈ గ్రంథంలో వ్రాయబడిన చట్టంలోని ఆదేశాలన్నింటికీ మీరు విధేయులు కావాలి. భయంకరమైన, అద్భుతమైన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు గౌరవించాలి. మీరు విధేయులు కాకపోతే, అప్పుడు

59. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.

59. యెహోవా మీకు దారుణమైన కష్టాలు కలిగిస్తాడు. మరియు మీ సంతతివారు గొప్ప కష్టాలు చాలకాలం కొనసాగే భయంకర రోగాలు అనుభవిస్తారు.

60. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.

60. మీరు ఈజిప్టులో చాలా కష్టాలు, రోగాలు చూసారు. అవి మిమ్మల్ని భయస్తుల్నిగా చేసాయి. ప్రభువు ఆ చెడ్డ వాటన్నిటినీ మీ మీదకు రప్పిస్తాడు.

61. మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయ బడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.

61. ఈ గ్రంథంలో వ్రాయబడని ప్రతి విధమైన ప్రతి రోగాన్ని యెహోవా మీ మీదకు రప్పిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు.

62. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి యుందురు.

62. మీరు ఆకాశ నక్షత్రాలు ఉన్నంత మంది ఉండవచ్చు. కానీ మీలో కొంచెంమంది మాత్రమే మిగులుతారు. ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక.

63. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు.

63. “ఇదివరకు మీకు మేలు చేసి, మీ రాజ్యాన్ని విశాలపరచాలంటే. యెహోవాకు సంతోషం. అదే విధంగా మిమ్మల్ని పాడుచేసి, నాశనం చేయటానికి యోహోవా సంతోషిస్తాడు. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలోనుండి మీరు తొలగించివేయబడతారు.

64. దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.

64. భూమి ఈవైపునుండి ఆ వైపునకు గల ప్రపంచ ప్రజలందరి మధ్యకు యెహోవా మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. మీరు గాని మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఆరాధించని దేవుళ్లను, చెక్క, రాతితో చేసిన దేవుళ్లను మీరు సేవిస్తారు.

65. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.

65. “ఈ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపేస్తాడు. మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా అల్లకల్లోలంగా ఉంటారు.

66. నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.

66. మీరు ప్రమాదంలో ఎల్లప్పుడూ అనుమానంగా జీవిస్తారు. రాత్రింబవళ్లు మీకు భయం కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల విషయం మీకు ఎన్నడూ గట్టి నమ్మకం ఉండదు.

67. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.

67. ‘ఇది సాయంత్రం ఆయితే బాగుండును’ అని ఉదయాన మీరంటారు. ‘ఇది ఉదయం అయితే బాగుండును’ అని సాయంత్రం అంటారు. ఎందుకంటే మీ హృదయంలో ఉండే భయంవల్ల, మీరు చూసే చెడు సంగతులవల్ల.

68. మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.

68. యెహోవా మళ్లీ మిమ్మల్ని ఓడల్లో ఈజిప్టుకు పంపిస్తాడు. మీరు మళ్లీ ఎన్నటికీ తిరిగి ఆ స్థలానికి తిరిగి వెళ్లనవసరం లేదని నేను మీతో చెప్పాను, కానీ యెహోవా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ మీరు మీ శత్రువులకు బానిసలుగా అమ్ముడుబోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ మిమ్మల్ని ఎవరూ కొనరు.”



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 28 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
Coming Soon

Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |