Thessalonians I - 1 థెస్సలొనీకయులకు 1 | View All

1. తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

“దేవునిలో...క్రీస్తులో”– ఈ మాటల ద్వారా పౌలు ఒకే దైవత్వంలోని ఇద్దరు వేరువేరు వ్యక్తుల ఏకత్వాన్ని చూపుతున్నాడు (మత్తయి 3:16-17; మత్తయి 28:19; యోహాను 10:30; యోహాను 17:1-5; ఫిలిప్పీయులకు 2:6). విశ్వాసులు “దేవునిలో” ఉన్నారు. ఆయనే వారి ఆశ్రయం, వారి ఇల్లు, వారి ఆధ్యాత్మిక జీవితానికి నిలయం. కీర్తనల గ్రంథము 90:1; కొలొస్సయులకు 3:3 పోల్చి చూడండి. “పౌలు”– అపో. కార్యములు 8:1-3; అపో. కార్యములు 13:9. “సిల్వానస్”– అంటే సైలస్ – అపో. కార్యములు 15:22, అపో. కార్యములు 15:40. “తిమోతి”– అపో. కార్యములు 16:1-4. తెస్సలోనికలో సంఘాన్ని స్థాపించినప్పుడు సైలస్ కూడా (బహుశా తిమోతి కూడా) పౌలుతో ఉన్నాడు – అపో. కార్యములు 17:1-4, అపో. కార్యములు 17:10-14. “కృప, శాంతి”– రోమీయులకు 1:2.

3. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవు నికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

ఇక్కడ మూడు గొప్ప క్రైస్తవ లక్షణాలూ, అవి క్రైస్తవుల్లో కలిగించే మార్పూ చూడవచ్చు. నిజ విశ్వాసం ఎప్పుడూ మంచి పనులను చేయిస్తుంది. యాకోబు 2:14-17, యాకోబు 2:26 చూడండి. ఇక్కడ “ప్రేమ” అని తర్జుమా చేసిన గ్రీకు పదం “ఆగాపే”. అదేమిటో అర్థం చేసుకోవాలంటే 1 కోరింథీయులకు 13:1-13 చూడండి. అది ఇచ్చే ఫలితాన్నిబట్టే ప్రేమ ఏమిటో అర్థం అవుతుంది. నిజమైన ప్రేమ క్రీస్తుకోసం ప్రయాసపడేందుకు ఎప్పుడు సిద్ధమే. “ఆశాభావం”– రోమీయులకు 5:2-5; రోమీయులకు 8:24-25. విశ్వాసుల ఆశాభావం తన సన్నిధిలో శాశ్వత జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవునిపై ఉంది. కాబట్టి వారు అన్నిటినీ సహించడానికి సిద్ధపడి ఉంటారు – తీతుకు 1:2.

4. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

“ఎన్నుకొన్న”– మార్కు 13:20; యోహాను 13:18; యోహాను 15:19; రోమీయులకు 8:33; ఎఫెసీయులకు 1:4-5, ఎఫెసీయులకు 1:11; 1 పేతురు 1:2; 1 పేతురు 2:9. “మాకు తెలుసు”– వారు నిజ విశ్వాసులనేందుకు ఉన్న సాక్ష్యాధారాలు చాలా బలంగా ఉన్నాయి. దేవుడు వారిని శాశ్వత జీవం కోసం ఎన్నుకున్నాడని వాటి మూలంగా పౌలుకు గట్టి నమ్మకం కుదిరింది.

5. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.

వ 3తో కలుపుకొని ఈ వచనాల్లో వారి రక్షణ గురించి పౌలుకు గట్టి సాక్ష్యాధారాలిచ్చిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆయన మొదట వారికి శుభవార్త ప్రకటించి నప్పుడు పవిత్రాత్మ ప్రభావాన్ని అతడు అనుభవించాడు, వారిలో కలిగిన గంబీరమైన మార్పును అతడు చూశాడు. ఆ మార్పు హింసలనే పరీక్షకు కూడా తట్టుకుంది. క్రీస్తుకోసం వారి సాక్ష్యం సత్యమనీ, తీవ్ర ఆసక్తి గలదని అతనికి తెలుసు.

6. పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.

“కష్టంలో”– 1 థెస్సలొనీకయులకు 2:14; అపో. కార్యములు 17:5-10. ఇది వారిని శుభవార్తనుంచి తొలగించలేదు. దేవుడు ఎన్నుకున్నవారిని ఇది ఎన్నడూ అలా చేయదు. “ఆనందం”– అపో. కార్యములు 8:8; అపో. కార్యములు 13:52; అపో. కార్యములు 16:34; రోమీయులకు 14:17. దేవుని ఆత్మ ఒక్కడే శుభవార్తను నమ్మినవారి హృదయాల్లో ఈ ఆనందాన్ని కలిగించగలడు. “మమ్ములను”– అందరూ కూడా అనుసరించదగిన మాదిరిని క్రైస్తవ నాయకులు చూపించాలి. 1 కోరింథీయులకు 4:16; 1 కోరింథీయులకు 11:1; ఫిలిప్పీయులకు 3:17; 2 థెస్సలొనీకయులకు 3:7, 2 థెస్సలొనీకయులకు 3:9; 1 తిమోతికి 1:16; 1 తిమోతికి 4:12;తీతుకు 2:7; హెబ్రీయులకు 6:12; హెబ్రీయులకు 13:7; 1 పేతురు 5:3.

7. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;

“మాసిదోనియ, అకయ”– అప్పుడు గ్రీసు దేశంలో ఈ రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. తెస్సలొనీక మాసిదోనియలో ఉంది. “మాదిరి”– అన్నిటికన్నా అతి ఉత్తమమైన ఆదర్శాన్ని అనుసరించి నడుచుకోవడంవల్ల అతడు విశ్వాసులకు మాదిరి అయ్యాడు (1 కోరింథీయులకు 11:1). వారు అతణ్ణి అనుసరిస్తూ ఇతరులకు మాదిరి అయ్యారు.

8. అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.

“అంతటా”– రోమీయులకు 1:8 పోల్చి చూడండి. “మారు మ్రోగింది”– వారు క్రీస్తు కోసం బహిరంగంగా స్పష్టమైన సాక్ష్యం చెప్పారు. విశ్వాసులంతా ఇలానే ఉండాలి.

9. మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,

“జీవం గల సత్య దేవుని”– జీవం లేని అబద్ధమైన “దేవుళ్ళ”కు ఆయన వేరుగా ఉన్నాడని చెప్పేందుకు పౌలు ఈ మాటను ఉపయోగించాడు. 1 కోరింథీయులకు 8:5-6; కీర్తనల గ్రంథము 115:3-8; యెషయా 44:20; యిర్మియా 10:14; రోమీయులకు 1:22-23, రోమీయులకు 1:25. సజీవుడైన సత్య దేవుడు మన దేవుడుగా ఉండాలంటే ఈ తెస్సలొనీకవారు చేసినట్టే మనం చెయ్యాలి. నిజమైన దేవుణ్ణి సేవిస్తూ విగ్రహాలను కూడా పూజించడం కుదరదు. “ఎదురు చూడడానికి”– 1 కోరింథీయులకు 1:7; తీతుకు 2:13; హెబ్రీయులకు 9:28. తెస్సలొనీకవారికి రాసిన రెండు ఉత్తరాల్లోనూ క్రీస్తు రెండో రాకడ ఒక ప్రాముఖ్యమైన అంశం. కొత్త ఒడంబడిక మొత్తానికీ ఇది ప్రాముఖ్యమైన అంశమే – 1 థెస్సలొనీకయులకు 2:19; 1 థెస్సలొనీకయులకు 3:13; 1 థెస్సలొనీకయులకు 4:13-18; 2 థెస్సలొనీకయులకు 1:7; 2 థెస్సలొనీకయులకు 2:1; మత్తయి 24:30; యోహాను 14:3; అపో. కార్యములు 1:11. “విగ్రహాలు”– అక్కడి విశ్వాసుల్లో అనేకమంది యూదేతరులు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని భాగాల్లో విగ్రహ పూజ సామాన్యంగా జరుగుతూ ఉన్నట్టే, అప్పట్లో వారిలో కూడా అలానే జరిగేది. వారు మారారు అనడానికి ఒక స్పష్టమైన చిహ్నం వారు తమ విగ్రహాలను వదిలి ఏకైక నిజ దేవుని వైపుకు తిరగడమే.

10. దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.

“దేవుని కోపం”– రోమీయులకు 1:18; రోమీయులకు 2:5; ఎఫెసీయులకు 5:6; కొలొస్సయులకు 3:6; ప్రకటన గ్రంథం 6:16. దేవుని కోపం గురించి నోట్స్ సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18. దేవుడు లోకానికి తీర్పు తీర్చడానికి పూనుకున్నప్పుడు దేవుని కోపం లోకంమీదికి వస్తుంది. “రక్షణకు” వ్యతిరేకం “దేవుని కోపం” – 1 థెస్సలొనీకయులకు 5:9. దీని అర్థం శాశ్వత శిక్ష – 2 థెస్సలొనీకయులకు 1:7-10; మత్తయి 25:46. ఈ కోపం నుంచి విశ్వాసులను రక్షించగలిగేది యేసు ఒక్కడే. రోమీయులకు 5:9 చూడండి. ఈ యుగాంతంలో వచ్చే మహా బాధ కాలాన్ని (మత్తయి 24:21) ఎక్కడా దేవుని కోపం అని పిలవడం కనిపించదు బైబిలంతటిలోనూ. మహా బాధకాలం అంటే దేవుని ప్రజలపైకి వచ్చే సైతాను కోపం (మత్తయి 24:29; ప్రకటన గ్రంథం 6:12-17; ప్రకటన గ్రంథం 13:7, ప్రకటన గ్రంథం 13:15-17). “చనిపోయిన వారిలోనుంచి”– మత్తయి 28:6; అపో. కార్యములు 1:3; అపో. కార్యములు 2:24-32; 1 కోరింథీయులకు 15:3-8.Shortcut Links
1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |