Thessalonians I - 1 థెస్సలొనీకయులకు 5 | View All

1. సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమయములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

“రాత్రి పూట దొంగ వచ్చినట్టే”– మత్తయి 24:43-44; లూకా 12:39-40; ప్రకటన గ్రంథం 3:3; ప్రకటన గ్రంథం 16:15. “ప్రభు దినం”– అపో. కార్యములు 2:20; 1 కోరింథీయులకు 5:5; 2 థెస్సలొనీకయులకు 2:2; 2 పేతురు 3:10. ఈ మాటను పాత ఒడంబడిక నుంచి తీసుకొన్నాడు. యెషయా 13:6, యెషయా 13:9 (1 థెస్సలొనీకయులకు 2:12-18); యోవేలు 1:15; యోవేలు 2:31 చూడండి. బైబిలు ప్రభు దినాన్ని దాని తరువాత జరిగే మహా బాధకాలం నుంచి ప్రత్యేకిస్తుంది, ఈ రెండు కాలాలు వేరువేరని చూపుతుంది. మత్తయి 24:29; ప్రకటన గ్రంథం 6:12-17 నోట్స్ చూడండి. 1 థెస్సలొనీకయులకు 4:13-18 లో పౌలు చనిపోయినవారు సజీవంగా లేవడం గురించీ, ఎత్తబడడం గురించీ రాశాడు. ఆ సంఘటన గురించి రాయడంలో తాను ప్రభు దినాన్ని వర్ణిస్తున్నానని ఇక్కడ సూచిస్తున్నాడు. కాబట్టి ప్రభు దినం అనే సమయం ఆరంభంలో క్రీస్తు పైన చెప్పిన విధంగా తన విశ్వాసులకోసం రావడం జరుగుతుందని దీన్ని బట్టి అనిపిస్తున్నది.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
యిర్మియా 31:33-34

“శాంతి”– యిర్మియా 6:14; యెహెఙ్కేలు 13:10. “హఠాత్తుగా”– సామెతలు 6:15; సామెతలు 29:1; యెషయా 29:5-6. “నాశనం”– ఫిలిప్పీయులకు 3:19; 2 పేతురు 3:7. 2 థెస్సలొనీకయులకు 1:8-9 లో ఈ నాశనం ఏమిటో రాసి ఉంది – ప్రభు సన్నిధిలోనుంచి శాశ్వతంగా దూరం కావడం.

4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

ప్రభు దినం వచ్చినప్పుడు క్రైస్తవ విశ్వాసులు ఈ భూమిపై ఉంటారని ఈ వచనంలో పౌలు నేర్పిస్తున్నట్టు ఉంది. “దొంగలాగా మీమీదికి రావడానికి”– దొంగ వస్తాడని కనిపెట్టి చూస్తుండేవారు అతడు వచ్చినప్పుడు ఏమరుపాటుగా ఉండరు. విశ్వాసులు వెలుగులో ఉన్నారు. పరలోకంనుంచి దేవుని కుమారుడు వెల్లడి అయ్యే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు – తీతుకు 2:13. అలాగైతే ఆ సంఘటన జరిగేటప్పుడు వారేమీ ఆశ్చర్యపోరు. విశ్వాసులు ఈ యుగాంతం దగ్గరపడుతూ ఉంటే దాన్ని కనిపెట్టి చూడగలిగేలా యుగాంత సూచనలు కొన్ని బైబిలులో ఉన్నాయి కూడా (హెబ్రీయులకు 10:25; 2 థెస్సలొనీకయులకు 2:3-4; అపో. కార్యములు 2:20; మత్తయి 24:29, మత్తయి 24:33).

5. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారముకాము.

6. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.

“నిద్రపోయిన”– ఏమి జరుగుతున్నదీ, ఏమి జరగబోతున్నదీ నిద్రపోతున్నవారికి తెలియదు. “మత్తులం కాక”– మత్తయి 24:42-43; మత్తయి 25:13.

7. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.

8. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము.
యిర్మియా 6:14, యిర్మియా 8:11, యెహెఙ్కేలు 13:10

“పగటికి చెందిన”– వ 5. విశ్వాసులు క్రీస్తు వచ్చినప్పుడు ఉదయించే నూతన దినానికి చెందినవారు – 2 పేతురు 1:19; ప్రకటన గ్రంథం 22:16. వారు ఆ పగటి వెలుగులో ఇప్పటికే నడుచుకొంటున్నారు. “ఛాతీ కవచం”– ఎఫెసీయులకు 6:14 లో ఈ కవచం నీతిన్యాయాలు అని రాసి ఉంది. క్రైస్తవ సుగుణాలన్నీ ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. “క్రీస్తును” ధరించుకోవడం మూలంగా వాటన్నిటినీ “ధరించుకొందాం”– రోమీయులకు 13:14 చూడండి. ఎఫెసీయులకు 4:24; ఎఫెసీయులకు 6:13 నోట్స్ చూడండి. “శిరస్త్రాణం”– ఎఫెసీయులకు 6:17.

9. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.

“కోపానికి”– 1 థెస్సలొనీకయులకు 1:10 నోట్. ఇక్కడ “కోపం”, “రక్షణ” వ్యతిరేక పదాలు. ఒక దానికి పాపం మీదా పాపుల మీదా ఉండే దేవుని కోపం అని అర్థం. రెండోదానికి పాపం నుంచి విడుదల, పాపం పైకి వచ్చే కోపం నుంచి విడుదల అని అర్థం.

10. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.

“తనతో బ్రతకాలని క్రీస్తు”– బ్రతికి ఉన్న విశ్వాసులకు క్రీస్తు జీవంలోను సహవాసంలోను భాగం ఉంది (రోమీయులకు 6:5-8; 1 యోహాను 1:3). క్రీస్తుతో ఉండేందుకు వెళ్ళిపోయిన విశ్వాసుల అనుభవం విషయంలో ఇది మరీ నిజం – 2 కోరింథీయులకు 5:8; ఫిలిప్పీయులకు 1:23. “మనకోసం చనిపోయాడు”– యోహాను 10:15; రోమీయులకు 5:8; 1 పేతురు 3:18.

11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.

“ప్రోత్సాహం”– 1 థెస్సలొనీకయులకు 4:18. ప్రతి విశ్వాసి బాధ్యత, విశేష అవకాశం ఇదే. “అభివృద్ధి కలిగించుకోండి”– రోమీయులకు 14:19; రోమీయులకు 15:2; 1 కోరింథీయులకు 14:3-5, 1 కోరింథీయులకు 14:12, 1 కోరింథీయులకు 14:17, 1 కోరింథీయులకు 14:26; ఎఫెసీయులకు 4:29.

12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి

“ప్రభువులో”– సంఘ నాయకులకున్న అధికారం ప్రభువు నుంచి కలిగేదే. ప్రభువు కోసమే దాన్ని వాడాలి. “మీమీద నాయకత్వం వహించి”– 1 తిమోతికి 5:17; హెబ్రీయులకు 13:17; 1 పేతురు 5:1-3.

13. వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.

14. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.

“అక్రమంగా”– 1 కోరింథీయులకు 14:40. “కృంగిపోయిన...దుర్బలులకు”– స్థానిక సంఘాల్లో అన్ని రకాల విశ్వాసులూ ఉంటారు. ఎవర్ని కూడా తక్కువగా చూడకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. “దుర్బలులు”– రోమీయులకు 14:1.

15. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
యెషయా 59:17

“అపకారం”– రోమీయులకు 12:17-21. “అపకారం చేయకుండా”– ఎఫెసీయులకు 4:32. “మనుషులందరికి”– కేవలం విశ్వాసులకే కాదు. అవిశ్వాసులకు కూడా.

16. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;

17. యెడతెగక ప్రార్థనచేయుడి;

పౌలు ఇలా చెయ్యాలని ఇతరులకు చెప్పడమే గాక తాను చేసి చూపించాడు – 1 థెస్సలొనీకయులకు 1:3; 1 థెస్సలొనీకయులకు 2:13; రోమీయులకు 1:9-10; ఎఫెసీయులకు 6:18; కొలొస్సయులకు 1:3; 2 తిమోతికి 1:3. ప్రార్థనలోని ప్రభావం, అధిక్యతలు, విశేష అవకాశాలు అతనికి తెలుసు. తాను చేస్తున్న పని ఏదైనప్పటికీ తన హృదయాన్ని ఎప్పుడూ ప్రభువుకు వినిపించేలా ఉంచుకున్నాడు. మనం వేరే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యడం, ముఖ్యంగా బిగ్గరగా ప్రార్థన చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రార్థన అంటే పెదవులతో మాటలేవీ పలకకపోయినా హృదయాన్ని ఆయనవైపు తిప్పి ఉంచడంకూడా. ఆదికాండము 18:32; మత్తయి 6:5-13; మత్తయి 7:7-12; మార్కు 11:24; లూకా 11:1-13; లూకా 18:1-8; రోమీయులకు 8:26-27; ఎఫెసీయులకు 1:17; ఎఫెసీయులకు 6:18; ఫిలిప్పీయులకు 4:6-7; కొలొస్సయులకు 1:9; హెబ్రీయులకు 11:6; యాకోబు 1:5-8; యాకోబు 5:16-18; 1 యోహాను 5:14-15; కీర్తనల గ్రంథము 66:18 నోట్స్, రిఫరెన్సులు చూడండి.

18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

హెబ్రీయులకు 13:15; కొలొస్సయులకు 3:17; ఫిలిప్పీయులకు 4:6; ఎఫెసీయులకు 5:20; కీర్తనల గ్రంథము 50:14; కీర్తనల గ్రంథము 113:1; లేవీయకాండము 7:12-13. “అన్ని పరిస్థితుల్లోనూ” అంటే సంతోషకరం గానీ విచారకరం గానీ ఎలాంటి స్థితిలోనైనా అని అర్థం. జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనమంతా అభ్యసించాలి. “దేవుని చిత్తం”– కొన్ని విషయాల్లో దేవుని సంకల్పమేదో మనకు తెలియకపోవచ్చు. కానీ కృతజ్ఞతలు చెప్పడంలో ఆయన చిత్తమేదో మాత్రం మనకు తెలుసు.

19. ఆత్మను ఆర్పకుడి.

“ఆత్మను ఆర్పకండి”– అపో. కార్యములు 2:3. దేవుని ఆత్మ విశ్వాసుల హృదయాలకు వేడిమిని, వెలుగును, ఆసక్తిని రేకెత్తించే మంటను ఇస్తుంది. కానీ మనలోని ఈ మంట పాపం, నిర్లక్ష్యం, ప్రార్థన లేకపోవడం, కృతజ్ఞత లేకపోవడం మొదలైన వాటి సహాయంతో చల్లారిపోయే అవకాశం ఉంది. ఎఫెసీయులకు 4:30 పోల్చి చూడండి.

20. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.

“దేవుని మూలంగా పలకడం”– అంటే ఈ ఆధ్యాత్మిక సామర్థ్యం ఉన్నవారు సంఘంలో మాట్లాడ్డం గురించి ఇక్కడ పౌలు చెపుతున్నాడు. రోమీయులకు 12:6; 1 కోరింథీయులకు 12:10, 1 కోరింథీయులకు 12:28; 1 కోరింథీయులకు 14:3. ఈ సూచనను బట్టి తెస్సలొనీకలో కొందరు దేవుని మూలంగా పలకడం అనేదాన్ని చిన్నచూపు చూస్తూ ఉండవచ్చు.

21. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

“పరీక్షించండి”– 1 కోరింథీయులకు 14:29; 1 యోహాను 4:1. ప్రతి ప్రవక్తా దేవుని నుంచి వచ్చేవాడు కాదు – మత్తయి 7:15; 2 పేతురు 2:2; యిర్మియా 14:14.

22. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
సామెతలు 20:22

కొందరు తమకు ఇష్టం లేని దుర్మార్గానికి దూరంగా ఉండడంలో ఆరితేరినవారు గాని ఇష్టమైన చెడు పనుల్లో మాత్రం తేలిగ్గా పడిపోతుంటారు. ఏ విధమైన దుర్మార్గం విశ్వాసుల్లో కనిపించరాదు.

23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.

“శాంతి ప్రదాత”– రోమీయులకు 15:33; రోమీయులకు 16:20; 1 కోరింథీయులకు 14:33; ఫిలిప్పీయులకు 4:9; 2 థెస్సలొనీకయులకు 3:16; హెబ్రీయులకు 13:20. “పూర్తిగా”, “యావత్తూ”– వారు కొంత వరకే పవిత్రం కావాలని పౌలు ప్రార్థించడం లేదు. మనకోసం గానీ ఏ విశ్వాసికోసం గానీ మనం కూడా ఇలా కోరకూడదు. కొంతమట్టుకే పవిత్రంగా ఉండడమంటే కొంతమట్టుకు అపవిత్రంగా ఉండడమే గదా. మత్తయి 5:48; 1 కోరింథీయులకు 1:2; 2 కోరింథీయులకు 7:1. “పవిత్రపరుస్తాడు గాక”– యోహాను 17:17-19 నోట్. “నిందా రహితంగా”– 1 థెస్సలొనీకయులకు 3:13 నోట్‌లో రిఫరెన్సులు.

24. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.

“నమ్మకమైనవాడు”– ద్వితీయోపదేశకాండము 7:9; ద్వితీయోపదేశకాండము 32:4; 1 కోరింథీయులకు 10:13; 2 థెస్సలొనీకయులకు 3:3; 2 తిమోతికి 2:13; తీతుకు 1:2; 1 యోహాను 1:9. “ఆయన అలా చేస్తాడు”– 1 కోరింథీయులకు 1:8-9; ఫిలిప్పీయులకు 1:6. ఈ మాటను పౌలు తెస్సలొనీకలోని విశ్వాసులందరికీ (ఇప్పుడున్న విశ్వాసులందరికీ) చెప్తున్నాడు, ఎవరో అసాధారణమైన పవిత్రత ఉన్నవారికి మాత్రమే కాదు.

25. సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.

26. పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.

“ముద్దు”– రోమీయులకు 16:16.

27. సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.

“సోదరులు అందరికీ”(సోదరీలకు కూడా) ఈ లేఖలో వెల్లడి అయిన సత్యం, క్రీస్తురాయబారి ఇచ్చిన హెచ్చరికలు ఈనాడు కూడా అవసరమే.

28. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.Shortcut Links
1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |