ప్రముఖ పాపి అయిన పౌలును కరుణించి రక్షించడం ద్వారా క్రీస్తు ఎలాంటి పాపినైనా రక్షించగలడని నిరూపించు కున్నాడు. తాను క్రీస్తు కృపను పొందలేనంత పాపిని అని ఎవరూ అనుకోకూడదు.
“ఓర్పు”– 2 పేతురు 3:9, 2 పేతురు 3:15. పాపులపట్ల, బలహీనులపట్ల, మూర్ఖులపట్ల దేవుడు తన ఓర్పునూ సహనాన్నీ చూపించకపోతే ఎవరికీ రక్షణ, పాపవిముక్తి కలిగేవి కావు.
“శాశ్వత జీవం”– యోహాను 3:15-16. క్రీస్తు మీద విశ్వాసముంచితేనే ఈ శాశ్వత జీవం కలుగుతుంది (యోహాను 1:12-13; యోహాను 3:36).
“ఆదర్శం”– దేవుడు మనుషులను ఎలా రక్షిస్తాడు అనేదానికి పౌలు మంచి ఉదాహరణ. ఇదంతా కేవలం దేవుని కృప, కరుణలకు ఎంతమాత్రం తగనివారిని దేవుడు కరుణించడం. మనకు రక్షణ, పాపవిముక్తి కలగాలంటే గొప్ప వెలుగును చూడనవసరం లేదు. పౌలుకు కలిగిన ప్రత్యేక అనుభవాలు కలగనవసరం లేదు. గానీ పౌలు పొందినట్టుగా కృప, కరుణ పొందడం అవసరమే.