Timothy I - 1 తిమోతికి 2 | View All

1. మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును

“మనుషులందరి కోసం”– మన ప్రార్థనలు కేవలం మనకున్న కొద్దిమంది బంధువులకూ స్నేహితులకూ పరిమితం కాకూడదు, గానీ ఈ విశాల ప్రపంచాన్నంతా జ్ఞాపకం చేసుకోవాలి. “విన్నపాలు, ప్రార్థనలు”– ఫిలిప్పీయులకు 4:6. ప్రార్థనపై రిఫరెన్సుల కోసం 1 థెస్సలొనీకయులకు 5:17 చూడండి. “కృతజ్ఞతలు”– ఎఫెసీయులకు 5:20; కొలొస్సయులకు 1:12; కొలొస్సయులకు 2:7; కొలొస్సయులకు 3:16; కొలొస్సయులకు 4:2; 1 థెస్సలొనీకయులకు 5:18; లేవీయకాండము 7:12-13; కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; మొ।।.

2. రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను.

పౌలు పాలకుల కోసం ప్రార్థన చేయాలంటున్నాడు గానీ వారిని విమర్శించాలని అనడం లేదు. యిర్మియా 29:7 చూడండి. క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనలు దేశ కాల పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తాయని పౌలు అంటున్నాడు. అధికారంలో ఉన్నవారు విశ్వాసులు కాకపోయినప్పటికీ వారు విశ్వాసులకు వ్యతిరేకులయినప్పటికీ (పౌలు రోజుల్లో జరిగినట్టుగా) ఇది మాత్రం నిజం. కొన్ని దేశాలలో విశ్వాసులు శాంతియుతంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడపలేకపోవడానికి ఒక కారణం వారు తమ పాలకులకోసం చేయవలసిన ప్రార్థన చేయకపోవడమేనేమో.

3. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.

పాపవిముక్తి లేనివారి కోసం, ఉన్నవారి కోసం ప్రార్థించడం దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. దేవునికి సంతోషాన్ని కలిగించే పనిని చేయడానికి విశ్వాసులు ఆతురత చూపించాలి.

4. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.
యెహెఙ్కేలు 18:23

ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం దేవుని ఉద్దేశం ఏమిటో ఇక్కడ తేటతెల్లమవుతున్నది. క్రీస్తును గురించిన సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనీ ఆయన ఇచ్చే పాపవిముక్తిని, రక్షణను స్వీకరించాలనీ దేవుని ఆశ. 1 తిమోతికి 4:10; యోహాను 1:29; యోహాను 3:16; రోమీయులకు 11:32; 2 కోరింథీయులకు 5:19; 2 పేతురు 3:9; 1 యోహాను 2:1; యెహెఙ్కేలు 18:32 పోల్చి చూడండి. ప్రేమ స్వరూపియైన దేవునికి ఇలాంటి ఆశ ఉంటుందని మనం నమ్మాలి గదా (1 యోహాను 4:8). అయితే చాలామంది సత్యాన్ని తెలుసుకోకపోవడానికీ, రక్షణనూ పాపవిముక్తినీ పొందకపోవడానికీ కారణం ఏమిటి? మత్తయి 23:37; యోహాను 3:19-20; యోహాను 5:40; 2 థెస్సలొనీకయులకు 2:10-12 చూడండి. రోమీయులకు 8:29 లో ఉన్న నోట్స్ కూడా చూడండి.

5. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

“ఒకే దేవుడు”– 1 తిమోతికి 1:17; 1 కోరింథీయులకు 8:6; ఎఫెసీయులకు 4:6. ఇంకా ఇతర చోట్ల దేవత్వంలో క్రీస్తు ఉన్నాడని పౌలు బోధించాడు – 1 తిమోతికి 1:1-2; రోమీయులకు 8:9; రోమీయులకు 9:5; ఫిలిప్పీయులకు 2:6, ఫిలిప్పీయులకు 2:11; కొలొస్సయులకు 1:15; కొలొస్సయులకు 2:9; తీతుకు 2:13. ఇక్కడ ఈ సత్యాన్ని పౌలు కాదనడం లేదు గానీ ఒక మానవుడైన క్రీస్తును గురించి మాట్లాడుతున్నాడు. “వాక్కు” శరీరి అయ్యాడు (యోహాను 1:14; ఫిలిప్పీయులకు 2:7-8; హెబ్రీయులకు 2:14). క్రీస్తులో ఉన్న రెండు స్వభావాల గురించి మత్తయి 1:18; యోహాను 1:14; యోహాను 4:6; రోమీయులకు 1:3; హెబ్రీయులకు 2:14, హెబ్రీయులకు 2:17 లో ఉన్న నోట్స్ చూడండి. “మధ్యవర్తి”– ఈ పదం ఇక్కడ, హెబ్రీయులకు 8:6; హెబ్రీయులకు 9:15; హెబ్రీయులకు 12:24 లో మాత్రమే కనబడుతున్నది. కానీ ఇదే సత్యాన్ని తెలియపరిచే వేరే పదాలు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో అంతటా కనబడతాయి. యోహాను 14:6, యోహాను 14:13-14; రోమీయులకు 5:1-2; ఎఫెసీయులకు 2:18; హెబ్రీయులకు 4:14-16; హెబ్రీయులకు 7:25; హెబ్రీయులకు 10:19-22; హెబ్రీయులకు 13:15; 1 యోహాను 2:1 చూడండి. యేసు మానవుడు, దేవుడు రెండూ కాబట్టి మానవుణ్ణి, దేవుణ్ణి ఇద్దరినీ అర్థం చేసుకొని యోబు ఆశించిన విధంగా దేవునిమీద, మనిషి మీద చేయి ఉంచగల మధ్యవర్తి (యోబు 9:32-35). ఆయన తప్ప ఏ మనిషి గానీ ఏ “స్వామి” గానీ ఏ “దేవుడు” గానీ ఏ పవిత్రుడుగానీ ఏ దేవదూత మనిషికి దేవునికి మధ్యవర్తి కాడు. యేసు పరిపూర్ణమైన మధ్యవర్తి కాబట్టి ఇంకెవ్వరూ అక్కరలేదు. మానవులందరూ, అంతేగాక క్రైస్తవులుగా పిలవబడే వారందరూ కూడా ఈ సత్యాన్ని నిజంగా నమ్మితే భూమిమీద ఎంత మార్పు వస్తుంది!

6. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

“అందరి కోసమూ”– క్రీస్తు అందరికోసం చనిపోయాడు. ఆయన చెల్లించిన వెల ప్రపంచంలో ఉన్నవారందరినీ పాపం నుంచి విడిపించడానికి సరిపోతుంది. ప్రజలు పాపవిముక్తి, రక్షణ లేకుండా నశించిపోతే దానికి బాధ్యులు వారే గాని దేవుడు కాదు. “విడుదల వెల”– మత్తయి 20:28; రోమీయులకు 3:24-25; గలతియులకు 1:4. “సరైన సమయం”– గలతియులకు 4:4.

7. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.

“చాటించేవాడు”అంటే మరొకరి వర్తమానాన్ని ప్రకటించేవాడు. దేవుడు తనను ఈ పనికోసం పిలిచాడనీ అందుకే తాను ఈ సత్యాన్ని బోధిస్తున్నాడనీ పౌలు మళ్ళీ ఒకసారి నొక్కి చెపుతున్నాడు. గలతియులకు 1:11-12 పోల్చి చూడండి. “యూదేతర”– గలతియులకు 2:7-8.

8. కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

“పురుషులు”– బాహాటంగా క్రైస్తవుల మధ్య జరిగే ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు పౌలు. “కోపం”– ఇతరులమీద కోపం, కొట్లాటలు అనేవి సరైన ప్రార్థనకు ఆటంకాలు. మత్తయి 6:12, మత్తయి 6:14-15; ఎఫెసీయులకు 4:23, ఎఫెసీయులకు 4:31-32; కొలొస్సయులకు 3:13, కొలొస్సయులకు 3:15 చూడండి. “పవిత్రమైన చేతులెత్తి”– ఆ కాలంలో యూదుల మధ్య, ఇతర మతాలవారి మధ్య కూడా ప్రార్థన చేసేటప్పుడు చేతులెత్తడం అనేది అలవాటుగా ఉండేది. అయితే పౌలు ఇక్కడ ప్రార్థనలో అంగ విన్యాసం ముఖ్యమని చెప్పడం లేదు. మత్తయి 14:19; మత్తయి 26:39 చూడండి. “పవిత్రమైన చేతులు”– కీర్తనల గ్రంథము 26:6; యెషయా 1:15; యాకోబు 4:8 పోల్చి చూడండి. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అనుకుంటే మనం ఏ విధమైన పాపాన్నీ అంటిపెట్టుకొని ఉండకూడదు. అపవిత్రమైన చేతులెత్తి ప్రార్థించడం అనేది దేవుణ్ణి అవమానించడమే.

9. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,

స్త్రీలు ఏ విధంగా అలంకరించుకున్నారు అన్నది దేవుడు చూచి పట్టించుకుంటాడా? అవును. యెషయా 3:16-23 పోల్చి చూడండి. అందుకే దేవుడు పౌలుచేత ఈ విధంగా రాయించాడు. 1 పేతురు 3:3-4 కూడా చూడండి. విశ్వాసులైన స్త్రీలు సామాన్యమైన దుస్తులు ధరించి మర్యాద పూర్వకంగా ఉండాలి. అందరి దృష్టీ తమవైపు మళ్ళే విధంగానూ మగవారిని ఆకర్షించే విధంగానూ ఉండడానికి ప్రయత్నించ కూడదు. వారు బంగారం, విలువైన నగలు, దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే వారు పేదవారూ, సరైన తిండి, బట్ట లేక బాధపడుతున్న వారూ ఉన్న ప్రపంచంలో ఉన్నారు. అంతేగాక వారి ప్రభువూ రక్షకుడూ అయిన యేసు తానే దరిద్రుడై ఉండి (2 కోరింథీయులకు 8:9) వారిని కూడా తమకోసం తాము బ్రతకకుండా అన్నీ వదులుకుని దేవునికోసం బ్రతకాలన్నాడు (మత్తయి 10:38-39; లూకా 14:33). బంగారం, విలువైన నగలు, దుస్తుల మీద డబ్బు పెట్టడం కన్నా దానిని పేదవారికి లేక శుభవార్త ప్రచారంకోసం ఇవ్వడం ఎంతో మేలు. విశ్వాసులైన స్త్రీలు (పురుషులు కూడా) అణుకువగా ఉండి, అతి సామాన్యంగా తృప్తిగా ఉంటూ (1 తిమోతికి 6:6-8) భూమి మీద కాకుండా పరలోకంలోనే ధనం కూడబెట్టుకోవాలని దేవుని ఉద్దేశం (మత్తయి 6:19-21). విశ్వాసులైన స్త్రీలు (పురుషులు కూడా) తాము మంచి పనులు అనే “నగలు”, “దుస్తులు” ధరించుకోవాలి.

10. దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.

11. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.

“మౌనం”– 1 కోరింథీయులకు 14:34-35. “అణుకువ”– 1 కోరింథీయులకు 11:3, 1 కోరింథీయులకు 11:7-10.

12. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

“నేర్పడానికి”– పురుషులున్న బహిరంగ క్రైస్తవ సభలో నేర్పడం అని పౌలు ఉద్దేశం. ఈ విధంగా చేయడం స్త్రీ పని కాదు. కానీ స్త్రీలు తమకంటే చిన్నవారైన స్త్రీలకూ వ్యక్తిగతంగా పురుషులకూ దేవుని వాక్కును నేర్పే అవకాశం ఉంది. తీతుకు 2:3-5; అపో. కార్యములు 18:26 పోల్చి చూడండి.

13. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
ఆదికాండము 1:27, ఆదికాండము 2:7, ఆదికాండము 2:22

స్త్రీలు బహిరంగంగా పురుషులకు ఎందుకు నేర్పకూడదో, వారిమీద అధికారం ఎందుకు చెలాయించకూడదో దానికి ఇక్కడ పౌలు రెండు కారణాలు చూపిస్తున్నాడు. ఆ రోజుల్లో ఉన్న ఆచార వ్యవహారాలతో, లేదా రోమ్ సామ్రాజ్యంలో ఉన్న పురుషులు సరైనది అనుకున్నదానితో, లేదా అలాంటి ఇంకా ఏ విధమైనదానితో ఈ కారణాలకు సంబంధం లేదు. మొదటి కారణం: దేవుడు మొదట ఆదామును చేశాడు – ఆదికాండము 2:17-18, ఆదికాండము 2:21-22. దేవుడు ఈ విధంగా చేయడంలో గల ఉద్దేశం ఒకటి పురుషుణ్ణి స్త్రీ పైన అధికారిగా ఉంచడమే అని పౌలు అంటున్నాడు. రెండో కారణం: సైతాను మోసపరచినది హవనే గాని ఆదామును కాదు – ఆదికాండము 3:1-6. దేవుని వాక్కుకు సంబంధించిన సిద్ధాంతాలలో స్త్రీలు తేలికగా పెడదారి పడతారని పౌలు అంటున్నాడని ఇక్కడ అనిపిస్తుంది. సంఘంలో వాక్యం నేర్పడానికీ, పురుషుల మీద అధికారం చెలాయించడానికీ స్త్రీలకు ఎందుకు అనుమతి ఇవ్వకూడదు అన్నదానికి ఇది మంచి కారణం.

14. మరియఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.
ఆదికాండము 3:6, ఆదికాండము 3:13

“అపరాధంలో పడింది”– ఆదాము అపరాధంలో పడలేదని పౌలు ఉద్దేశం కాదు (రోమీయులకు 5:12-14 చూడండి), మొదట హవ అపరాధంలో పడిందని.

15. అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.

హవ చేసిన పాపానికి ఇవ్వబడిన శిక్షలలో ఒక శిక్ష స్త్రీలు ప్రసూతి సమయంలో పడే నొప్పులు – ఆదికాండము 3:16. క్రీస్తులో విశ్వాసముంచి తమ జీవితం ద్వారా క్రీస్తు మీద విశ్వాసాన్ని చూపించే స్త్రీలను ప్రోత్సాహపరచే వాక్యం ఇది.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Timothy I - 1 తిమోతికి 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సువార్త యొక్క దయ ర్యాంక్‌లు లేదా స్టేషన్‌ల తేడాను కలిగి ఉండదు కాబట్టి, ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. (1-7) 
క్రీస్తు అనుచరులు జాతీయ, సెక్టారియన్, సామాజిక మరియు రాజకీయ భేదాలకు అతీతంగా ప్రార్థన చేసే సమాజంగా ఉండాలని పిలుస్తారు. మన క్రైస్తవ బాధ్యతను రెండు ముఖ్యమైన సూత్రాలలో సంగ్రహించవచ్చు: దైవభక్తి, ఇది దేవుని సరైన ఆరాధనను కలిగి ఉంటుంది మరియు అన్ని వ్యక్తుల పట్ల నీతి ప్రవర్తనను సూచించే నిజాయితీ. ఈ సూత్రాలు విడదీయరానివి; నిజమైన నిజాయితీకి దైవభక్తి అవసరం, అంగీకరించడం మరియు దేవునికి తగిన గౌరవం ఇవ్వడం, మరియు నిజమైన దైవభక్తిలో నిజాయితీ ఉంటుంది.
మన చర్యలు మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైన వాటితో సమానంగా ఉండాలి. అందరి కోసం విమోచన క్రయధనంగా తనను తాను త్యాగం చేసుకున్న ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఈ ఏర్పాటు ప్రతి దేశంలోని యూదులు మరియు అన్యులకు విస్తరించింది, క్షమించే దేవుని దయ-సీటును చేరుకోవడానికి మరియు సయోధ్యను కోరుకునే వారందరికీ అవకాశం కల్పిస్తుంది.
పాపం మనల్ని దేవుని నుండి దూరం చేసింది, చీలికను సృష్టించింది. మధ్యవర్తియైన యేసుక్రీస్తు శాంతిని పునరుద్ధరించి, నిర్ణీత సమయంలో బయలుపరచబడిన విమోచన క్రయధనంగా సేవచేస్తాడు. పాత నిబంధన యుగంలో, అతని బాధలు మరియు తదుపరి మహిమలు చివరి కాలానికి వెల్లడి చేయబడ్డాయి. రక్షింపబడిన వారు సత్యాన్ని స్వీకరించాలి, ఎందుకంటే ఇది పాపుల మోక్షానికి దేవుడు నిర్ణయించిన మార్గం. సత్యాన్ని గూర్చిన జ్ఞానం లేకుండా, మనం దాని ద్వారా మార్గనిర్దేశం చేయలేము.

పురుషులు మరియు మహిళలు వారి మతపరమైన మరియు సాధారణ జీవితంలో ఎలా ప్రవర్తించాలి. (8-15)
సువార్త సందర్భంలో, ప్రార్థన నిర్దిష్ట ప్రార్థనా స్థలానికి పరిమితం కాదు; బదులుగా, ఇది వివిధ సెట్టింగులలో స్థిరమైన సాధనగా ఉండాలి. మేము మా వ్యక్తిగత ప్రదేశాలలో, మా కుటుంబాలతో, భోజన సమయంలో, ప్రయాణాలలో ఉన్నప్పుడు మరియు పబ్లిక్ మరియు ప్రైవేట్ సమావేశాలలో ప్రైవేట్‌గా ప్రార్థించమని పిలుస్తాము. మన ప్రార్థనలు ఇతరుల పట్ల కోపం, ద్వేషం లేదా కోపం లేకుండా దాతృత్వంతో గుర్తించబడాలి. సందేహం మరియు వివాదం లేకుండా విశ్వాసం మన ప్రార్థనలకు ఆధారం కావాలి.
క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించే స్త్రీలకు, దుబారా మరియు ఆడంబరాన్ని నిరుత్సాహపరిచే వస్త్రధారణలో నమ్రత నొక్కి చెప్పబడుతుంది. దేవునిచే అత్యంత గౌరవించబడిన అత్యంత విలువైన అలంకారమైన మంచి పనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. చక్కదనం మరియు ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా ఉండటం కంటే నమ్రత మరియు శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తీవ్రమైన దైవభక్తికి కట్టుబడి ఉన్నవారు అధిక వ్యక్తిగత అలంకారం కంటే అనారోగ్యం మరియు బాధలో ఉన్నవారి బాధలను తగ్గించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
జీవితంలో మరియు దైవభక్తి యొక్క వృత్తికి అనుగుణంగా లేని అటువంటి అభ్యాసాలలో పాల్గొనడం పాపంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇవి అల్పమైన విషయాలు కాదు కానీ దైవిక ఆదేశాలు. సెయింట్ పాల్ ప్రకారం, మహిళలు చర్చిలో పబ్లిక్ టీచింగ్ పాత్రలను నిర్వహించేందుకు అనుమతించబడరు, ఎందుకంటే బోధనలో అధికార స్థానం ఉంటుంది. అయితే, స్త్రీలు తమ పిల్లలకు ఇంట్లో నిజమైన మత సూత్రాలను బోధించమని ప్రోత్సహిస్తారు. స్త్రీలు వారి సృష్టి క్రమం మరియు అతిక్రమణలో పాత్ర కారణంగా వారి అధీనంలో ఉన్నప్పటికీ, నిగ్రహాన్ని కొనసాగించేవారు మోక్షాన్ని పొందుతారు, ముఖ్యంగా ప్రసవ అనుభవంలో లేదా స్త్రీ నుండి జన్మించిన మెస్సీయకు ధన్యవాదాలు. స్త్రీలు ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్లు మృదుత్వం, సున్నితత్వం మరియు ఆప్యాయతతో తమ అధికారాన్ని ఉపయోగించుకునేలా పురుషులను ప్రేరేపించాలి.



Shortcut Links
1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |