Titus - తీతుకు 1 | View All

1. దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును,

“ఎన్నుకొన్నవారి”– రోమీయులకు 8:33; కొలొస్సయులకు 3:12; యోహాను 6:37; యోహాను 15:16; యోహాను 17:6. “విశ్వాసం ప్రకారం”– ప్రజలను క్రీస్తు విశ్వాసంలోకి నడిపించి, వారిని ప్రోత్సహిస్తూ, దేవుని సత్యం ద్వారా వారి విశ్వాసాన్ని మరింత బలపర్చడమే పౌలు గొప్ప పని. రోమీయులకు 1:7, రోమీయులకు 1:11-12 పోల్చి చూడండి. పౌలు ప్రకటించిన సత్యం “దైవభక్తికి అనుగుణమైన సత్యం”. ఇది యేసుక్రీస్తు పట్ల నిజమైన భక్తినీ పవిత్రమైన జీవితాన్నీ కలగజేస్తుంది. ఈ విధంగా చేయని ఏ మత బోధైనా అబద్ధమైనది.

2. నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో

దేవుని సేవకుడుగా పౌలు చేస్తున్న పని, దేవుని ప్రజల విశ్వాసం, జ్ఞానం ఇవి శాశ్వత జీవం కోసం ఎదురుచూడడంతో ముడిపడి ఉన్నాయి. శాశ్వత జీవం గురించి నోట్ యోహాను 3:16. ఆశాభావం గురించి నోట్స్ రోమీయులకు 5:2; రోమీయులకు 8:24-25; 1 పేతురు 1:3. శాశ్వత జీవం విశ్వాసులందరికీ ఇప్పుడే ఉన్నట్లు బైబిలులో కొన్ని చోట్ల కనిపిస్తుంది గానీ దీని సంపూర్ణ ప్రత్యక్షత, అనుభవం భవిష్యత్తులోనే ఉంది గనుక విశ్వాసులు దానిలోకి తర్వాత ఎప్పుడో ప్రవేశిస్తారని క్రొత్త ఒడంబడిక గ్రంథం అక్కడక్కడ చెప్తుంది (తీతుకు 3:7; రోమీయులకు 2:7. రోమీయులకు 13:11; హెబ్రీయులకు 6:12; 2 పేతురు 1:5 పోల్చి చూడండి). “అబద్ధమాడలేని”– హెబ్రీయులకు 6:18; సంఖ్యాకాండము 23:19; 1 సమూయేలు 15:29; కీర్తనల గ్రంథము 31:5. “యుగాల ఆరంభానికి ముందే”– 2 తిమోతికి 1:9; ఎఫెసీయులకు 1:4. మానవ జాతిని సృష్టించకముందే దేవుడు మనిషికి వాగ్దానం ఎలా చేయగలడు? అప్పుడు ఆయన వారి గురించి తన కుమారునికి వాగ్దానం చేసి తరువాత మనుషులకు తెలియజేశాడు.

3. నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను

“తగిన కాలంలో”– గలతియులకు 4:4; యోహాను 7:30; 1 తిమోతికి 6:15. “ప్రకటించడం...నాకు అప్పగించాడు”– ఎఫెసీయులకు 3:2-9; 1 తిమోతికి 1:11; గలతియులకు 1:11-12.

4. తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

5. నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.

క్రేతు అనేది గ్రీసు దేశానికి దక్షిణం వైపు మధ్యధరా సముద్రంలోని ఒక పెద్ద ద్వీపం. “పెద్దలను”– 1 తిమోతికి 3:1 చూడండి. కొత్త సంఘాలలో పెద్దలను నియమించడం అనేది ఇంచుమించుగా అపో. కార్యములు 6:3-6 లో చెప్పిన విధంగానే జరిగేదని అనుకోవచ్చు.

6. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.

1 తిమోతికి 3:2-7 పోల్చి చూడండి. ఇందులో ఉన్న లక్షణాలు కొన్ని అందులో లేవు. అందులో ఉన్న కొన్ని ఇందులో లేవు. సంఘం పెద్దలు లేక పై విచారణ చేసేవారు లేక సంఘ నాయకులు ఎలా ఉండాలి అనేదానికి పూర్తి వివరాలు కావాలంటే ఈ రెండు జాబితాలు అవసరం. “సంఘ నాయకుడు” (వ 7) – వీరిని పెద్దలని కూడా అన్నారు (అపో. కార్యములు 20:17, అపో. కార్యములు 20:28). “విశ్వాసులై”– పెద్దల సంతానం విధేయత గలవారే కాకుండా (1 తిమోతికి 3:4-5) విశ్వాసులు అయి ఉండాలి కూడా.

7. ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,

“ముక్కోపి”– అతి త్వరగా కోపం తెచ్చుకునే సంఘం పెద్ద ప్రజలను నొప్పించడమే కాకుండా చాలా కీడు కలిగించవచ్చు కూడా. “అక్రమ లాభం”– 1 తిమోతికి 3:8; 1 తిమోతికి 6:5-11.

8. అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి,

“మంచి”– ఫిలిప్పీయులకు 4:8-9 పోల్చి చూడండి. మంచి అంటే మనకు ప్రీతి లేకపోతే మంచిది కానిదాన్ని ఇష్టపడుతున్నామన్న మాట. దీనివల్ల మనం దేవుని సేవకు తగినవారం కామని తేటతెల్లమే గదా (మత్తయి 12:35). “మనసును అదుపులో ఉంచుకునేవాడు”– తీతుకు 2:2, తీతుకు 2:6; 2 కోరింథీయులకు 10:5. సంఘ నాయకుడు ఎప్పుడూ తన కోరికలకూ ఒత్తిడులకూ బలి అయిపోకూడదు. “న్యాయవంతుడు”– తీతుకు 2:12. నిజాయితీ లేనివాడూ అన్యాయస్థుడూ మోసగాడూ అయిన మనిషి సంఘానికి శాపమే గానీ ఆశీర్వాదం కాదు. “పవిత్రుడు”– అతడు పవిత్రుడు కాకపోతే అపవిత్రుడై ఉన్నాడు. అలాంటివాడు సంఘాన్ని ఎప్పుడూ సక్రమంగా పవిత్ర మార్గంలో నడపలేడు. మార్గదర్శిగా ఉండలేడు. “ఆశలు అదుపులో ఉంచుకొనేవాడై”– 2 తిమోతికి 1:7; 1 కోరింథీయులకు 9:25-27.

9. తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.

“క్షేమకరమైన సిద్ధాంతాలు”– 1 తిమోతికి 1:3 నోట్ చూడండి. “ఉపదేశం”– సంఘం పెద్ద శుభవార్తను గట్టిగా చేపట్టి ఉండేవాడే కాకుండా దాన్ని నేర్పిస్తూ వారి తప్పులను ఖండించేటంత బాగా తెలుసుకోవాలి. “ఉపదేశం”– సంఘం పెద్ద శుభవార్తను గట్టిగా చేపట్టి ఉండేవాడే కాకుండా దాన్ని నేర్పిస్తూ వారి తప్పులను ఖండించేటంత బాగా తెలుసుకోవాలి.

10. అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.

“తిరుగుబాటుదారులు”– దేవునిమీద, సంఘ అధికారం మీద తిరుగుబాటు చేసేవారు – 2 తిమోతికి 2:3-4; హెబ్రీయులకు 3:8, హెబ్రీయులకు 3:12; ద్వితీయోపదేశకాండము 9:7, ద్వితీయోపదేశకాండము 9:24; ద్వితీయోపదేశకాండము 31:27; యెహోషువ 22:18; 1 సమూయేలు 15:23; కీర్తనల గ్రంథము 78:40, కీర్తనల గ్రంథము 78:56; యెషయా 1:2, యెషయా 1:20. “వదరుబోతులు”– 1 తిమోతికి 1:6. చాలామంది క్రైస్తవం గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు గానీ అర్థవంతమైనది చెప్పడానికి వారిదగ్గర ఏమీ లేదు. అంతేగాక వారు క్రైస్తవాన్ని ఆచరణలో పెట్టరు. “మోసగాళ్ళు”– మత్తయి 24:24; రోమీయులకు 3:13; రోమీయులకు 16:18; 2 కోరింథీయులకు 11:13; ఎఫెసీయులకు 4:14; 1 పేతురు 3:10; ప్రకటన గ్రంథం 21:27; కీర్తనల గ్రంథము 50:19; కీర్తనల గ్రంథము 51:6; కీర్తనల గ్రంథము 101:7. “సున్నతి గలవారు”– బహుశా క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న యూదులు (గలతియులకు 2:12; అపో. కార్యములు 15:1, అపో. కార్యములు 15:5).

11. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉప దేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయు చున్నారు.

“అక్రమ లాభం”– వ 7; 1 తిమోతికి 6:5, 1 తిమోతికి 6:9-10. “కొంపలు”– తప్పుడు బోధకులు తరచుగా ఇంటింటికి వెళ్తూ తమ బోధలకు ఎక్కడైనా స్థానం దొరుకుతుందేమోనని చూస్తారు (2 తిమోతికి 3:6). “మూయించాలి”– సంఘం పెద్దలు ఇలాంటివారికి బోధించడానికీ నేర్పించడానికీ అవకాశం ఇవ్వకూడదు. వారి బోధలను ఖండించి (వ 9) వారిని గట్టిగా మందలించాలి (వ 14).

12. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు.

“క్రేతు ద్వీపవాసులు”– వ 5. ఈ మాటలు క్రేతువాడైన ఒక కవి రాశాడని అన్నారు. క్రేతువాసులతో తన అనుభవం ద్వారా పౌలు ఈ కవి రాసిన మాటల్లోని సత్యాన్ని తెలుసుకున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాలవారికి సంప్రదాయంగా వచ్చిన వారి వారి సాంఘిక, ధార్మిక, మత సంబంధమైన పరిస్థితులను బట్టి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ విశేష గుణాలు వారితో బాగా పరిచయం ఉన్నవారికే తెలుస్తాయి.

13. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,

“కల్పిత కథలు”– 1 తిమోతికి 1:4. “ఆదేశాలు”– కొలొస్సయులకు 2:21-22. కొంతమంది తమకు మాత్రం హక్కు లేకపోయినప్పటికీ క్రైస్తవుల మీద అధికారం చెలాయించడానికి ప్రయత్నం చేస్తారు.

14. విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.

“విశ్వాస సత్యాలలో”– ఇతరులను మందలించేవారు మంచి ఉద్దేశంతో ఆ పని చేయాలి. 2 తిమోతికి 2:24-26 పోల్చి చూడండి.

15. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.

“శుద్ధ హృదయం”– లూకా 11:41; మార్కు 7:15, మార్కు 7:19; రోమీయులకు 14:20; 1 తిమోతికి 4:3-5; మత్తయి 5:8; మత్తయి 6:22-23. “భ్రష్టులు”– హృదయంలో భ్రష్టులైన చాలామంది మతస్థులు (కొంతమంది క్రైస్తవులు కూడా) బయటి నియమాలూ ఆచారాలూ “శుద్ధమైన”, “అశుద్ధమైన” తిండి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్త పాటిస్తుంటారు. మత్తయి 23:25-28 చూడండి. వాస్తవానికి ఇలాంటివారికి శుద్ధమైనది, పవిత్రమైనది ఏదీ కాదని పౌలు అంటున్నాడు. వారు దేవుని కుమారుణ్ణి తిరస్కరించే పాపులు గనుక వారు ముట్టినదేదైనా అశుద్ధం, అపవిత్రం అవుతుంది. “అంతర్వాణి”– అపో. కార్యములు 23:1; అపో. కార్యములు 24:16; 1 కోరింథీయులకు 8:7; 1 తిమోతికి 1:5, 1 తిమోతికి 1:19; 1 తిమోతికి 4:2; హెబ్రీయులకు 9:14.

16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.

దేవుణ్ణి తెలుసుకోకపోయినా తమకు దేవుడు తెలుసని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు – యోహాను 8:41; రోమీయులకు 2:17. “కాదంటున్నారు”– వారు చేసే పనులను బట్టి దేవుణ్ణి ఎరగరనీ, దేవుడంటే వారికి లెక్క లేదనీ కనపరచుకుంటారు (రోమీయులకు 2:24; 1 యోహాను 2:4-6; 1 యోహాను 3:10; మత్తయి 7:17-20).Shortcut Links
తీతుకు - Titus : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |