Hebrews - హెబ్రీయులకు 4 | View All

1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
కీర్తనల గ్రంథము 95:11

దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనేది ఈ భాగంలోని అంశం – వ 1. క్రీస్తు విశ్వాసులు అందులో ప్రవేశిస్తారు. కానీ నమ్మకం లేని ఇస్రాయేల్ అలా ప్రవేశించలేదు – వ 2,3. ఈ విశ్రాంతి ఇస్రాయేల్‌వారి కాలంలో ఉంది, దానిలో వారు ప్రవేశించే అవకాశం ఉంది – వ 4-6. అయితే వారలా చేరలేదు గనుక, కొందరు అందులో చేరాలని దేవుని ఉద్దేశం గనుక, దేవుడు మరో దినాన్నీ సమయాన్నీ నియమించాడు – వ 6-8. చివరికి తేలినది: ఇప్పుడు మనుషులు ప్రవేశించగల విశ్రాంతి ఉంది – వ 9,10. హెచ్చరిక: అందులో ప్రవేశించేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేయాలి – వ 11, ఎందుకంటే అవిశ్వాసిని దేవుని వాక్కు కనిపెట్టి ప్రవేశించనీయ కుండా అడ్డగించగలదు – వ 12,13. “ఆయన విశ్రాంతి”– అంటే ఆధ్యాత్మిక విశ్రాంతి, మత్తయి 11:28 లో యేసు చెప్పిన విశ్రాంతి. ఇది క్రీస్తులో రక్షణను సూచిస్తున్నది. కనాను దేశం ఈ విశ్రాంతికి చిహ్నం లేక సాదృశ్యం మాత్రమే (యెహోషువ 1:18 నోట్‌). “మీలో ఎవరైనా”– “మనలో ఎవరైనా” అనడం లేదు రచయిత. విశ్వాసులు తమకు పాపవిముక్తి, రక్షణ ఉందో లేదో తెలుసుకోలేరని రచయిత చెప్పడం లేదు. తాము చివరికి నాశనం అవుతామేమోనన్న భయంతోనే జీవితం గడపాలని చెప్పడం లేదు (హెబ్రీయులకు 2:15; లూకా 12:32; రోమీయులకు 8:15; 1 యోహాను 5:13 చూడండి). రచయిత తన రక్షణ గురించి భయపడడం లేదు గానీ హీబ్రూవారిలో కొందరి రక్షణ గురించి భయపడుతున్నాడు. క్రైస్తవులమని చెప్పుకునేవారు అపనమ్మకం, అవిధేయత సూచనలు కనపరిస్తే మనందరం కంగారు పడవలసిందే. వారిని హెచ్చరించి ప్రోత్సహించడంలో జాగ్రత్త వహించాలి కూడా – హెబ్రీయులకు 3:13; 1 తిమోతికి 5:20.

2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.

ఇస్రాయేల్‌కు ప్రకటించిన శుభవార్త ఇది: వాగ్దాన దేశం మీ ముందు ఉంది. వెళ్ళి స్వాధీనం చేసుకోండి – ద్వితీయోపదేశకాండము 1:19-21. మనుషులకు ఇప్పుడు ప్రకటిస్తున్న శుభవార్త ఇది: దేవుడు క్రీస్తులో విశ్రాంతినీ పాపవిముక్తినీ రక్షణనూ అందిస్తున్నాడు. ఆయనలో నమ్మకం ద్వారా దాన్ని స్వీకరించండి. ఇస్రాయేల్‌ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఈ విధంగా వారు తమ అపనమ్మకాన్నీ అవిధేయతనూ ప్రదర్శించారు. ఇప్పుడు మనుషులు క్రీస్తును స్వీకరించకుండా, ఆయనలోని దేవుని దీవెనలను స్వంతం చేసుకోకుండా ఉండడం ద్వారా తమ అపనమ్మకాన్ని బయటపెట్టుకుంటున్నారు. శుభవార్తను వినడం మాత్రమే సరిపోదు. వినడంలో విశ్వాసాన్ని జోడించాలి. విశ్వాసం విధేయతను పుట్టించాలి.

3. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.

దేవుడు కీర్తనల గ్రంథము 95:11 లో చెప్పిన విశ్రాంతిలో ప్రవేశించే మార్గం ఒకటే – అది క్రీస్తులో నమ్మకం ఉంచడం.

4. మరియదేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు.
ఆదికాండము 2:2

రచయిత ఆదికాండము 2:2; కీర్తనల గ్రంథము 95:11 లను (మరో సారి) ఉదహరించడం ద్వారా దేవుని విశ్రాంతి ఒకటి ఉందనీ, సృష్టి పూర్తి అయినప్పటినుంచీ అది ఉందనీ తెలియజేస్తున్నాడు. దేవుడు విశ్వాసులకు ఇచ్చే ఆధ్యాత్మిక విశ్రాంతికి ఈ విశ్రాంతి సూచన, దృష్టాంతం.

5. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.

6. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించు దురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను,

మనుషుల్లో కొందరు తన విశ్రాంతిలో ప్రవేశించాలని దేవుని ఉద్దేశం. ఆ విశ్రాంతికి సూచనగా ఉన్న కనానులో ఇస్రాయేల్ ప్రజలు చేరుకున్న తరువాత కూడా ఆ విశ్రాంతిలో చేరలేదు. యెహోషువ ద్వారా దేవుడు వారికి శత్రువులనుంచి నెమ్మది ఇచ్చాడు (యెహోషువ 21:44; యెహోషువ 22:4), గానీ ఆధ్యాత్మిక విశ్రాంతి ఇవ్వలేదు. కాబట్టి దేవుడొక కొత్త సమయాన్ని నియమించి దాన్ని “ఈ రోజు” అన్నాడు. “ఈ రోజు” అంటే క్రీస్తు మొదటిసారి వచ్చిన సమయంతో ఆరంభమైన ఈ శకమంతా. హెబ్రీయులకు 3:7 చూడండి. యెహోషువ గానీ మోషే గానీ ధర్మశాస్త్రం గానీ పాత ఒడంబడిక మొత్తం గానీ దేవుడు ఆ ప్రజలకు కలగాలని కోరిన విశ్రాంతిని కలిగించలేకపోయింది. కాబట్టి దేవుడు మరో సమయాన్నీ మరో ఒడంబడికనూ నియమించాడు.

7. నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములోనేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
కీర్తనల గ్రంథము 95:7-8

8. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.
ద్వితీయోపదేశకాండము 31:7, యెహోషువ 22:4

9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.

“విశ్రాంతి”– యూదులు విశ్రాంతి దినాన్ని రాబోయే లోకానికి ఒక సాదృశ్యంగా ఎంచారు – “ఇస్రాయేల్‌వారు అన్నారు ‘లోకనాథుడైన ప్రభూ, రాబోయే లోకం నమూనా మాకు చూపించు’; అందుకు దేవుడు ‘విశ్రాంతి దినమే ఆ నమూనా’ అని జవాబిచ్చాడు” (ఒక యూదా వ్యాఖ్యానంలో కనిపించే మాటలు). 92వ కీర్తన “రాబోయే లోకం గురించి చెప్తున్నది. ఆ లోకం అంతా విశ్రాంతి దినమే, శాశ్వత జీవం గురించిన విశ్రాంతే గనుక ఆ కీర్తనను విశ్రాంతి దినం కోసం కీర్తన” అని వారు అన్నారు. ఈ లేఖ రచయిత ఇక్కడ అదే ఉపదేశాన్ని చేస్తున్నట్టుంది.

10. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
ఆదికాండము 2:2

విశ్వాసులు దేవుని విశ్రాంతిలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు? ఈ లోకంలో వారి జీవితం అంతమైన తరువాత సంపూర్ణంగా ప్రవేశిస్తారని నిస్సందేహమే. అప్పుడు వారు తమ ప్రయాస అంతా ముగించి దేవుని సన్నిధిలో విశ్రమిస్తారు. ప్రకటన గ్రంథం 14:13; 2 కోరింథీయులకు 5:8; ఫిలిప్పీయులకు 1:21-24 పోల్చి చూడండి. కానీ ఒక విధంగా చూస్తే వారు ఇప్పుడే కొంతవరకు ఆ విశ్రాంతిలో ఉన్నారు – మత్తయి 11:28-29. ఇప్పటి విశ్రాంతి అంతిమ విశ్రాంతి కాదు. దానికి తొలిరుచి మాత్రమే. దీని అర్థం స్వంత పనుల ద్వారా పాపవిముక్తి, రక్షణ సంపాదించుకునే ప్రయత్నాలను మానుకుని రక్షణ కోసం క్రీస్తు పైనే నమ్మకం ఉంచడమే (రోమీయులకు 4:4-5 చూడండి). ఆ విశ్రాంతి ఇప్పుడే మొదలై దేవుని సన్నిధిలో లోపం లేని విశ్రాంతితో అంతం అవుతుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విశ్రాంతిని క్రీస్తులో అనుభవించడం ప్రారంభించకపోతే, రాబోయే లోకంలో శాశ్వత విశ్రాంతి మనకు దొరకదని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.

11. కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.

మత్తయి 11:12; లూకా 13:24; 2 కోరింథీయులకు 13:5; 2 పేతురు 1:10. మనలో మన సాటి క్రైస్తవుల్లో అపనమ్మకం, అవిధేయత ఏమైనా ఉన్నాయేమో అని జాగ్రత్తగా చూచుకుంటూ విశ్వాసంతో గమ్యం వైపుకు సాగిపోవాలి. ఇప్పుడు క్రీస్తు వాగ్దానం చేసిన విశ్రాంతి మనకు ఉందని ఖాయం చేసుకుని, ఆయన కాడి నెత్తుకుని ఆయనతో ముందుకు సాగిపోవడం ద్వారా అంతిమ విశ్రాంతిలో ప్రవేశించగలమనే నిశ్చయత కలిగి ఉందాం.

12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
యెషయా 49:2

“నమ్మకం లేని చెడ్డ హృదయం”, పాపం మూలంగా బండబారిపోయిన హృదయం (హెబ్రీయులకు 3:12-13) దేవుని కంటబడకుండా దాక్కోవడం అసాధ్యం అని రచయిత చెప్తున్నాడు. దేవుని వాక్కు అంతరంగాన్ని బట్టబయలు చేస్తుంది. తన వాక్కును ఇచ్చిన దేవునికి ఎవర్ని తన విశ్రాంతిలో రానియ్యాలో ఎవరిని బయట ఉంచాలో బాగా తెలుసు. “జీవం...బలప్రభావాలు గలది”– 1 పేతురు 1:23. “ఖడ్గం”– ఎఫెసీయులకు 6:17; యిర్మియా 23:29 పోల్చి చూడండి.

13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

“ఆయన కంటికి”– 2 దినవృత్తాంతములు 16:9; కీర్తనల గ్రంథము 14:2; కీర్తనల గ్రంథము 90:8; కీర్తనల గ్రంథము 139:1-12; యిర్మియా 23:24; మత్తయి 6:4. “లెక్క అప్పచెప్పాలి”– మత్తయి 12:36; అపో. కార్యములు 17:31; రోమీయులకు 14:12; ప్రకటన గ్రంథం 22:12.

14. ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

రచయిత హెబ్రీయులకు 2:17 లో పరిచయం చేసిన అంశానికే తిరిగి వస్తున్నాడు – క్రీస్తు ప్రముఖ యాజి. ప్రోత్సాహ వాక్కులు, హెచ్చరికలతో కలిపి ఈ అంశాన్ని గురించిన చర్చను హెబ్రీయులకు 10:18 దాకా కొనసాగిస్తున్నాడు. “అయితే”– హెబ్రీయులకు 3:1; హెబ్రీయులకు 4:1. మనం దేవుని సత్యాన్ని మన జీవితాలలో ఆచరణ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ సత్యాన్ని ఇస్తాడు. “గొప్ప ప్రముఖయాజి”– లోకమంతటా మనుషులు తమకు ఒక యాజి అవసరమని, అంటే తమకన్నా దేవునికి మరింత సన్నిహితంగా ఉండి దేవుని ఎదుట తమకు ప్రతినిధిగా ఉండగల వ్యక్తి అవసరమని అనుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ భూమిపై దాదాపు ప్రతి మతంలోనూ ఈ భావన కనిపిస్తుంది. క్రీస్తు రాకముందు సుమారు 1400 సంవత్సరాలుగా యూదులకు యాజులు, ఒక ప్రముఖ యాజి కూడా ఉన్నారు. కానీ క్రీస్తును అనుసరించేవారికి కంటికి కనిపించే ప్రముఖయాజి ఎవరూ లేరు. వారికి ఈ భూమిపై అలాంటి ప్రముఖయాజి ఎవరూ కనబడడం లేదు కాబట్టి వారికసలు ఎవరూ లేరని క్రీస్తుపై నమ్మకం ఉంచని యూదులు అనుకుని ఉండవచ్చు. ఈ తప్పు అభిప్రాయాన్ని ఈ లేఖ రచయిత ఖండిస్తున్నాడు. క్రీస్తుకు చెందిన విశ్వాసులకు సాధ్యమైనంత గొప్ప ప్రముఖయాజి ఉన్నాడు – ఆయన సాక్షాత్తూ దేవుని కుమారుడే. ఆయన ఈ భూమిపై లేని సంగతి, కంటికి కనిపించని సంగతి వల్ల ఎలాంటి లోటూ లేదు, సరిగదా ఇది ప్రయోజనకరం. ఎందుకంటే ఆయన ఆకాశాల గుండా ఎక్కిపోయి ఉన్నత స్థలంలో ఉన్న దేవుని సన్నిధికి చేరి అక్కడ ఉన్నాడు. అక్కడ భూమిపై ఉన్న ఏ ప్రముఖ యాజి చేయగలిగినదాని కన్నా ఉత్తమమైన రీతిలో ఆయన తన ప్రజలకు ప్రతినిధిగా ఉండగలడు. ఈ సత్యం తెలియకపోవడం మనుషులను అంతటా మానవ యాజి వ్యవస్థలకూ మతాలకూ బానిసలుగా ఉంచేస్తుంది. అందువల్ల యేసును ప్రముఖయాజిగా చూపించేందుకూ, తన పని చేయడానికి ఆయన ఎంతగా తగినవాడో వివరించేందుకూ రచయిత చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు.

15. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

“మన బలహీనతలు”– మనందరిలో కావలసిన దానికన్నా ఎక్కువే ఉన్నాయి ఇవి. మత్తయి 26:41; రోమీయులకు 7:18; రోమీయులకు 8:26; 1 కోరింథీయులకు 2:3; 2 కోరింథీయులకు 12:5, 2 కోరింథీయులకు 12:9; గలతియులకు 5:17 చూడండి. “సానుభూతి”– దేవుడు తన ప్రజలైన ఇస్రాయేల్‌వారికి యాజి వ్యవస్థను స్థాపించిన కారణం ఇదే. ప్రజల బలహీనతలు, చింతలు, దుఃఖాలు, బాధలు, అవసరతలు ఎరిగి ఉండి వాటిని సానుభూతి పూర్వకంగా దేవునికి విన్నవించగలవాడే సరైన యాజి – హెబ్రీయులకు 5:1-2. నిర్గమకాండము 28:29 పోల్చి చూడండి. ఇస్రాయేల్‌లో గానీ మరెక్కడా గానీ ఎప్పుడైనా ఉన్న యాజులందరి కన్నా, యేసుప్రభువు దీన్ని మరింత బాగా చేయగలడు. “విషమ పరీక్షలకు గురి అయ్యాడు”– హెబ్రీయులకు 2:18; మత్తయి 4:1-10. అందువల్ల మనపట్ల సానుభూతి చూపగలడు. భూమిపై మనుషులకు వచ్చే విషమ పరీక్షలన్నిటికీ యేసు గురయ్యాడు. ఆయనకు నిజమైన రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావం ఉన్నాయి – హెబ్రీయులకు 2:14. దేవునికి చెందిన వారందరికీ వ్యతిరేకంగా సైతాను ఎంత రెచ్చిపోతాడో ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు. మనకూ మన నమ్మకానికీ విరుద్ధంగా సైతాను దుర్మార్గత ఎంత బలవంతంగా ప్రయోగిస్తాడో ఆయనకు తెలుసు. సైతాను ప్రయోగించగలిగే ప్రతి అగ్నిబాణం వల్ల ఆయనకు బాధ కలిగింది. అయినప్పటికీ “ఆయన పాపం లేనివాడు”, అంటే ఆయనెప్పుడూ పాపం చెయ్యలేదనీ ప్రతి సారీ కూడా విషమ పరీక్షనుంచి విజయవంతంగా బయటికి వచ్చాడనీ అర్థం కావచ్చు. లేక ఆయనలో భ్రష్ట స్వభావం లేదు అని అర్థం కావచ్చు. ఈ రెండూ కూడా నిజమే (హెబ్రీయులకు 2:17 నోట్ చూడండి). భ్రష్ట స్వభావం లేకపోతే విషమ పరీక్షకు గురి కావడం సాధ్యమేనా? సాధ్యమే. ఆదికాండము 3:1-6 చూడండి. 2 పేతురు 2:4; యూదా 1:6 కూడా చూడండి. నిజానికి భ్రష్ట స్వభావం లేని వ్యక్తి, విషమ పరీక్షలకు లొంగని వ్యక్తి, త్వరగా లొంగిపోయే పాపికన్న మరెక్కువగా విషమ పరీక్షల బలప్రభావాలను అనుభవిస్తాడని అనుకోవచ్చు.

16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

“కృప సింహాసనం”– విశ్వాన్ని ఏలేందుకు దేవుడు ఆసీనుడై ఉండే సింహాసనం. మన గొప్ప ప్రముఖయాజి అయిన క్రీస్తు అక్కడ ఆయన పక్కన కూచుని ఉన్నాడు – హెబ్రీయులకు 1:3; ప్రకటన గ్రంథం 3:21. మన పాపాలకోసం ఆయన చేసిన బలి అర్పణ కారణంగా ఇప్పుడు కృప రాజ్యమేలుతున్నది. రోమీయులకు 5:21 చూడండి. మనకు అవసరమైన వాటన్నిటికోసం దేవుని చెంతకు రమ్మని ఆయనే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు – మత్తయి 6:9-13; మత్తయి 7:7-10; యోహాను 16:23-24. మనకు అన్నిటికన్నా ముఖ్యంగా అవసరమైనవి కరుణ, కృప. పాపం చేయకుండా భద్రత మనకు కావాలి, ఒకవేళ పాపం చేస్తే క్షమాపణ కావాలి. మనం విశ్వాన్ని ఏలే సింహాసనం దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఉనికిలో ఉన్న ఏ శక్తి కూడా మనకు అవసరమైనవి ఇవ్వకుండా దేవుణ్ణి అడ్డగించడం అసాధ్యం. అది కృప సింహాసనం గనుక మనకు అవసరమైనది ఇవ్వడం ఆయనకు ఇష్టమేనని మనకు తెలుసు (ఫిలిప్పీయులకు 4:19 పోల్చి చూడండి). మనకు నిబ్బరం కలిగించి, అవసరం సమయంలో ఆయన ఎదుటికి వచ్చే ధైర్యం ఇచ్చేందుకు ఇంతకన్నా వేరే సత్యం మనకేది కావాలి?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Hebrews - హెబ్రీయులకు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అవిశ్వాసం ద్వారా వాగ్దానం చేయబడిన విశ్రాంతికి ఎవరైనా కొరత రాకూడదని వినయపూర్వకమైన, జాగ్రత్తతో కూడిన భయం ఉద్బోధించబడింది. (1-10) 
రెండు నిబంధనలలోనూ ఒకే సువార్త ప్రకటించబడినప్పటికీ, సువార్త ద్వారా మనకు అందించబడిన అధికారాలు మోషే ధర్మశాస్త్రం క్రింద ఇవ్వబడిన వాటిని అధిగమించాయి. చరిత్ర అంతటా, లాభదాయకమైన శ్రోతలు ఎల్లప్పుడూ ఉన్నారు మరియు వాక్యానికి ప్రతిస్పందనగా అవిశ్వాసం ఉత్పాదకత యొక్క ప్రధాన అంశంగా ఉంది. పదం యొక్క జీవశక్తి వినేవారిలో విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, పాక్షిక నిర్లక్ష్యం మరియు సాధారణం, అలసటతో కూడిన వృత్తి యొక్క విచారకరమైన ఫలితం ఏమిటంటే, వ్యక్తులు తరచుగా తక్కువగా కనిపించడం. కాబట్టి, దేవుని రాజ్యంలోకి స్పష్టమైన ప్రవేశాన్ని పొందేందుకు మనం కృషి చేద్దాం. దేవుడు తన పనిని పూర్తి చేసి, విశ్రాంతి తీసుకున్నట్లే, విశ్వసించే వారు తమ పనిని పూర్తి చేసి, తదనంతరం విశ్రాంతిని అనుభవించేలా చూస్తాడు.
ఏడవ రోజు లేదా యూదుల కోసం యెహోషువా నేతృత్వంలోని రోజు కంటే ఎక్కువ ఆధ్యాత్మిక మరియు అద్భుతమైన సబ్బాత్ దేవుని ప్రజలకు వేచి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విశ్రాంతి సువార్త యుగంలో దయ, సౌలభ్యం మరియు పవిత్రత, అలాగే దేవుని ప్రజలు తమ విశ్వాసం యొక్క నెరవేర్పును మరియు వారి కోరికలన్నింటిని గ్రహించే మహిమతో కూడిన విశ్రాంతి. అపొస్తలుడు చర్చించిన మరియు అతను ముగించినట్లుగా, ఇంకా ఆస్వాదించవలసిన విశ్రాంతి లేదా విశ్రాంతి అనేది నిస్సందేహంగా స్వర్గపు విశ్రాంతి. ఈ విశ్రాంతి దేవుని ప్రజలకు మిగిలి ఉంది మరియు ఈ ప్రపంచంలో శ్రమ మరియు కష్టాలతో కూడిన జీవితానికి భిన్నంగా ఉంటుంది. ప్రభువైన యేసు పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు వారు పొందే విశ్రాంతి అది. ఏది ఏమైనప్పటికీ, విశ్వసించని వారు ఈ ఆధ్యాత్మిక విశ్రాంతిలోకి ఎప్పటికీ ప్రవేశించరు, ప్రస్తుతం దయ లేదా భవిష్యత్తులో కీర్తి. మనిషి యొక్క విశ్రాంతి తనలో ఉందని దేవుడు స్థిరంగా ప్రకటించాడు మరియు అతని ప్రేమలో ఆత్మకు నిజమైన ఆనందం లభిస్తుంది. అతని కుమారుని ద్వారా ఆయన వాగ్దానాలలో విశ్వాసం, ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి ప్రత్యేకమైన మార్గం.

దేవుని పట్ల మన విధానాలలో విశ్వాసం మరియు ఆశకు సంబంధించిన వాదనలు మరియు ఉద్దేశ్యాలు. (11-16)
అంతిమ లక్ష్యాన్ని పరిగణించండి: ఆధ్యాత్మిక మరియు శాశ్వతమైన విశ్రాంతి, వర్తమానంలో మిగిలిన దయ మరియు భవిష్యత్తులో కీర్తి-భూమిపై క్రీస్తులో మరియు పరలోకంలో క్రీస్తుతో విశ్రాంతి పొందడం. శ్రద్ధగల మరియు శ్రద్ధగల శ్రమను అనుసరించి, తీపి మరియు సంతృప్తికరమైన విశ్రాంతి వాగ్దానం చేయబడింది. ఇప్పుడు పెట్టుబడి పెట్టే శ్రమ ఆ భవిష్యత్తును మరింత ఆనందదాయకంగా మారుస్తుంది. మనం శ్రద్ధగా పని చేద్దాం మరియు మన విధులలో ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం.
పవిత్ర గ్రంథాలు దేవుని వాక్యాన్ని ఏర్పరుస్తాయి. అతని ఆత్మతో నింపబడినప్పుడు, అది నమ్మకంగా శక్తివంతమైన విశ్వాసాన్ని, మార్పిడిని మరియు ఓదార్పునిస్తుంది. ఇది గర్వించదగిన ఆత్మను అణగదొక్కుతుంది, వికృతమైన ఆత్మను సాత్వికంగా మరియు విధేయుడిగా మారుస్తుంది మరియు ఆత్మలో లోతుగా పాతుకుపోయిన పాపపు అలవాట్లను విడదీస్తుంది. ఈ దైవిక పదం ఆలోచనలు, ఉద్దేశాలు, చాలా మంది యొక్క నీచత్వం మరియు పాపపు సూత్రాలను వెల్లడిస్తుంది మరియు వారి చర్యలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇది పాప హృదయపు లోతులను బయట పెడుతుంది.
మీ మనస్సులలో క్రైస్తవ విశ్వాసం యొక్క సిద్ధాంతాలపై దృఢమైన పట్టును కొనసాగించండి, మీ హృదయాలలో దాని ఉత్తేజకరమైన సూత్రాలను నింపండి, మీ పెదవులతో బహిరంగంగా ప్రకటించండి మరియు మీ జీవితాల్లో దానికి సమర్పించండి. క్రీస్తు మన కోసం చనిపోవడం ద్వారా భూమిపై తన యాజకత్వం యొక్క ఒక అంశాన్ని నెరవేర్చాడు మరియు అతను మరొకదాన్ని పరలోకంలో కొనసాగిస్తున్నాడు - వాదించడం, వాదించడం మరియు తన ప్రజల అర్పణలను సమర్పించడం. తోటి జీవికి ప్రత్యేకమైన, తోటి-భావనతో రక్షకుని కలిగి ఉండటం యొక్క జ్ఞానం, పాపం యొక్క అన్ని ప్రభావాలను దాని అపరాధం కాకుండా అనుభవించాలని నిర్దేశించింది. దేవుడు తన కుమారుని పాపాత్ముని పోలికతో పంపాడు రోమీయులకు 8:3. అతను ఎంత పవిత్రంగా మరియు స్వచ్ఛంగా ఉంటాడో, అతను స్వభావరీత్యా పాపం పట్ల అంత విముఖత కలిగివుండాలి మరియు దాని చెడు గురించి అతని లోతుగా అర్థం చేసుకోవాలి. తత్ఫలితంగా, అతను తన ప్రజలను దాని అపరాధం మరియు అధికారం రెండింటి నుండి విడిపించడానికి మరింత నిశ్చయించుకున్నాడు.
మన ప్రధాన యాజకుని శ్రేష్ఠతలో ధైర్యం తెచ్చుకుని, ధైర్యంగా కృప సింహాసనాన్ని చేరుకోండి. దయ మరియు దయ మన ప్రధాన అవసరాలు-మన పాపాలను క్షమించే దయ మరియు మన ఆత్మలను శుద్ధి చేసే దయ. తక్షణ ఏర్పాట్ల కోసం దేవునిపై మన రోజువారీ ఆధారపడటంతో పాటు, కష్టాల వల్ల లేదా శ్రేయస్సు వల్ల వచ్చినా, ముఖ్యంగా మన మరణ క్షణాల కోసం ప్రలోభాల సీజన్ల కోసం కూడా మనం మన ప్రార్థనలలో సిద్ధపడాలి. భక్తితో మరియు దైవభీతితో, న్యాయస్థానానికి బలవంతం చేసినట్లు కాకుండా, దయ ప్రస్థానం చేసే కరుణాపీఠానికి దయతో ఆహ్వానించినట్లుగా చేరుకోండి. పవిత్రమైన మన ప్రవేశం యేసు రక్తం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది; అతను మన న్యాయవాది, మన ఆత్మలు కోరుకునే లేదా కోరుకునే ప్రతిదాన్ని సంపాదించాడు.



Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |