James - యాకోబు 2 | View All

1. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.
యోబు 34:19, కీర్తనల గ్రంథము 24:7-10

దేవుడు పక్షపాతం చూపడు. అన్యాయంగా కొందరిని ప్రత్యేకంగా అభిమానించడం చెయ్యడు. ఆయన విశ్వాసులంగా ఇందులో మనం ఆయన్ను అనుకరించాలి (రోమీయులకు 2:11; 1 కోరింథీయులకు 12:13; ఎఫెసీయులకు 6:9; కొలొస్సయులకు 3:11, కొలొస్సయులకు 3:25; 1 తిమోతికి 5:21; 1 పేతురు 1:17). ఈ ఉపదేశాన్ని నేడు క్రైస్తవ సంఘాల్లో తరచుగా నిర్లక్ష్యం చేయడం, పాటించక పోవడం జరుగుతున్నది. ఎంత విచారకరం! యాకోబు (అతని ద్వారా మాట్లాడుతున్న దేవుని ఆత్మ) ఇలాంటి పక్షపాతం చెడ్డ ఉద్దేశాలవల్ల వస్తుందని స్పష్టంగా చెప్తున్నాడు (వ 4). క్రీస్తులో మనం మనుషులందరినీ ఒకే విధంగా అంగీకరించాలి. ఒకే విధంగా గౌరవించి మన్నన చూపాలి – రోమీయులకు 12:10, రోమీయులకు 12:16; రోమీయులకు 14:4; ఫిలిప్పీయులకు 2:3. మనమేదో ఉన్నతులం అనుకుని, ఇతరులు పేదలనీ చదువులేనివారనీ సరైన బట్టలు వేసుకోలేదనీ చిన్నచూపు చూడడం క్రీస్తు ప్రజల్లో ఏమాత్రం కనిపించకూడదు. “మహిమ”– హెబ్రీయులకు 1:3; 2 కోరింథీయులకు 4:6. దేవుని మహిమ క్రీస్తే.

2. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?

5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

లూకా 6:20 పోల్చి చూడండి. మత్తయి 11:5; లూకా 4:18; 1 కోరింథీయులకు 1:26 కూడా చూడండి. “ప్రేమించేవారికి”– యాకోబు 1:12. దేవుణ్ణి ప్రేమించనివారికి ఆయనిచ్చే వారసత్వం ఉండదు – 1 కోరింథీయులకు 16:22; 1 యోహాను 4:8. “వారసులుగా”– మత్తయి 5:5; 1 కోరింథీయులకు 6:9; 1 కోరింథీయులకు 15:50; గలతియులకు 5:21; హెబ్రీయులకు 1:14; హెబ్రీయులకు 6:12; ప్రకటన గ్రంథం 21:7. మత్తయి 4:17 దగ్గర దేవుని రాజ్యం గురించి నోట్ ఉంది.

6. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్న వారు వీరే గదా?

7. మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?

“పిలవబడ్డారో”– యోహాను 6:37; యోహాను 17:6; 1 కోరింథీయులకు 6:19-20. “పేరు”– యేసు అనే పేరు.

8. మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.
లేవీయకాండము 19:18

లేవీయకాండము 19:18; మత్తయి 19:19; మత్తయి 22:39; లూకా 10:27; రోమీయులకు 13:9-10; గలతియులకు 5:14. “రాజాజ్ఞ”– ఇది మానవ సంబంధాలను శాసించే రాజాజ్ఞ. తన రాజ్య వాసులందరికీ రారాజు ఇచ్చిన ఆజ్ఞ.

9. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
ద్వితీయోపదేశకాండము 1:17

“పక్షపాతం”– యాకోబు 1-4 వచనాలకు మనల్ని మళ్ళీ తీసుకువెళ్తున్నాడు. పేదలను చిన్నచూపు చూచి, ధనికులపట్ల పక్షపాతం చూపడం పాపం. మనుషులకు దేవుడు నియమించిన గొప్ప చట్టానికి ఇది వ్యతిరేకం.

10. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;

ధర్మశాస్త్రమంతా పాటించి ఒకే ఒక ఆజ్ఞను మీరితే ఆ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని మీరినవాడి కిందే లెక్క. ప్రేమించాలన్న దేవుని ఆజ్ఞకు విధేయత చూపకపోతే చాలా గొప్ప ఆజ్ఞను అతడు మీరుతున్నాడన్నమాట. కాబట్టి అతడు ఘోర పాపి అవుతాడు. అందువల్ల పక్షపాతం చూపడం తేలిక విషయమేమీ కాదని మనం గ్రహించగలం. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా దేవుని ఆజ్ఞలను భంగపరచిన వాళ్ళమే. ధర్మశాస్త్రం విధించే శిక్ష అంతటికీ తగిన వారమే (కొలొస్సయులకు 3:10). క్రీస్తు క్షమాపణ మనందరికీ అవసరమే (రోమీయులకు 3:9, రోమీయులకు 3:19, రోమీయులకు 3:23).

11. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి.
నిర్గమకాండము 20:13-16, ద్వితీయోపదేశకాండము 5:17, ద్వితీయోపదేశకాండము 5:18

నిర్గమకాండము 20:13-14. ఒక్క చిన్న భాగంలోనే యాకోబు పక్షపాతం, వ్యభిచారం, హత్యలను కలిపి మాట్లాడ్డం గమనించదగినది. ఆ విధంగా పక్షపాతం చూపడం ఎంత ఘోర పాపమో చూపిస్తున్నాడు.

12. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి.

“విముక్తి”– యాకోబు 1:25. “తీర్పు పొందబోయే”– 2 కోరింథీయులకు 5:9-10. మనకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా రాబోయే తీర్పును దృష్టిలో ఉంచుకుని ఇతరులపట్ల ప్రవర్తిస్తాం.

13. కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.

మత్తయి 5:7; మత్తయి 7:1-2; మత్తయి 18:23-35; లూకా 6:37-38; సామెతలు 21:13; కీర్తనల గ్రంథము 18:25-26.

14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?

“రక్షించగలదా?”– రక్షించలేదు. అలాంటి నమ్మకం ఎవరినైనా రక్షించడం అసాధ్యం. దీనికి కారణం అది నిజమైన నమ్మకం కాదు. అది బైబిల్లో వివరించిన రక్షణకోసమైన నమ్మకం కాదు. బైబిల్లో ఉన్న స్పష్టమైన ఉపదేశం ఇది: మన క్రియలతో నిమిత్తం లేకుండా నమ్మకం ద్వారా దేవుని కృప మూలంగానే మనకు పాపవిముక్తి కలిగింది (ఎఫెసీయులకు 2:8-9; రోమీయులకు 3:24-25, రోమీయులకు 3:28; రోమీయులకు 4:5). అయితే ఈ నమ్మకం, కృప మార్గం ద్వారా దేవుడు మనుషులను మారుస్తాడు. వారికి నూతన ఆధ్యాత్మిక జన్మనిస్తాడు. వారిని నూతన సృష్టిగా చేస్తాడు. యాకోబు 1:18; 2 కోరింథీయులకు 5:17 చూడండి. ఇలాంటి వారు “ఆయన ముందుగా ఏర్పాటు చేసిన మంచి పనులు చేయాలని” క్రీస్తులో సృజించబడ్డారు (ఎఫెసీయులకు 2:10). నమ్మకం నిజమైనది అనడానికి మంచి పనులు నిదర్శనం, మన హృదయాల్లో దేవుడు రక్షణ కార్యం చేశాడనేందుకు ఆధారం (హెబ్రీయులకు 6:10; గలతియులకు 5:6). మంచి పనులు కనిపించకపోవడం మన నమ్మకం మాటలకే పరిమితం అన్నదానికి రుజువు. దేవుని కృప వల్ల మనలో ఏమీ మార్పు రాలేదన్నమాట. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన నమ్మకం ఒక శక్తివంతమైన ప్రభావం. హెబ్రీయులకు 10:39; హెబ్రీయులకు 11:4 నోట్స్ చూడండి.

15. సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.

కేవలం మాటలే కోటలు కడుతూ చేతలేమీ కనిపించకపోవడం ఆధ్యాత్మిక మరణానికి సూచన. 1 యోహాను 3:17-18. ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తి తనలో దేవుని ప్రేమ లేదని కనపరుస్తున్నాడన్నమాట. అతనిలో ప్రేమ లేదంటే అతనికి దేవుడు తెలియదన్నమాట (1 యోహాను 4:8). వేరే మాటల్లో చెప్పాలంటే తనకు ఉన్నదని అతడు చెప్తున్న నమ్మకం వాస్తవమైనది కాదన్నమాట (ఇవ్వడం గురించి 2 కోరింథీయులకు 9:15 చూడండి). నిర్జీవమైన నమ్మకం అంటే ఏమిటి? దేవుడు చూడాలని ఇష్టపడే కరుణ, ప్రేమ, దయ మొదలైన వాటిని (గలతియులకు 5:22-23) ప్రదర్శించని నమ్మకం. నిర్జీవమైన నమ్మకం బహు నిష్ఠగలదై, సంప్రదాయబద్ధమై ఉండవచ్చు. సరైన సిద్ధాంతాలన్నిటినీ అది నమ్మవచ్చు. దేవునిలోను, ఆయన వాక్కులోను తనకు స్థిరమైన నమ్మకం ఉందని అది తనను తాను నమ్మించుకోవచ్చు. కానీ అది పాపవిముక్తి కలిగించి జీవాన్నిచ్చే విధంగా యేసుప్రభువును స్వీకరించలేదు. యోహాను 5:39-40 పోల్చి చూడండి.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.

18. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.

యాకోబు ఉపదేశానికి కొందరు ఈ విధంగా అభ్యంతరం వెలిబుచ్చుతూ – “కొందరికి నమ్మకం ఉంది, కొందరికి మంచి పనులు ఉన్నాయి. ఈ రెండూ మతంలో ప్రధానమైన భాగాలే. కానీ ఒకటి లేకుండా మరొకటి ఉండవచ్చు” అని చెప్పవచ్చు. యాకోబు దీనికి అంగీకరించడం లేదు. మంచి పనులు, ప్రేమ పూర్వకమైన చర్యలు లేవంటే నమ్మకం కూడా లేదు అని అతడు నొక్కి చెప్తున్నాడు. మంచి పనులు లేకుండా నమ్మకాన్ని చూపడం అసాధ్యం.

19. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.

దేవుణ్ణి గురించీ క్రీస్తును గురించీ సత్యం దయ్యాలకు తెలుసు. మార్కు 5:2-7 కూడా చూడండి. అవి నమ్ముతాయి గాని వాటికి పాపవిముక్తి లేదు. అవి నమ్ముతాయి గాని మంచి పనులు చెయ్యవు. వాటిని మార్చివేయగల సజీవమైన నమ్మకం వాటికి లేదు. చాలామంది క్రైస్తవులతో సహా మత సంప్రదాయాల ప్రకారం జీవించే అనేకమందిలో దయ్యాలకన్నా సజీవ విశ్వాసం ఎక్కువేమీ లేదు. ఇదెంత విచారకరమైన, భయంకరమైన సత్యం! దేవుడొక్కడే అని వారు నమ్ముతారు గాని నిర్దయులుగా, ప్రేమలేనివారుగా, స్వార్థపరులుగా, కఠిన హృదయులుగా ఉంటారు. దయ్యాల నమ్మకం లాంటి నమ్మకం వల్ల వారికి లాభమేమిటి?

20. వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?

“తెలివితక్కువవాడా”– పై సత్యాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తికి దేవుడిచ్చే జ్ఞానం లేదన్నమాట. “నిర్జీవమని”– దేనికి పనికిరాని నమ్మకం ప్రయోజనకరమైన దేన్ని కలిగించదు. అంత పనికి మాలిన నమ్మకం దేవునికెలా సమ్మతం అవుతుంది?

21. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?
ఆదికాండము 22:2, ఆదికాండము 22:9

రోమీయులకు 1:16-17; రోమీయులకు 3:22-28; రోమీయులకు 4:5; రోమీయులకు 10:9-10; ఎఫెసీయులకు 2:8-9 లో క్రీస్తురాయబారియైన పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని యాకోబు వ్యతిరేకించడం లేదు. అదే విషయాన్ని వేరొక దృష్టికోణంలో చెప్తున్నాడు. నిజమైన నమ్మకం, మంచి పనులు ఈ రెంటినీ విడదీయడం అసాధ్యం అంటున్నాడు. అవి ఎంత పెనవేసుకుని ఉండేవంటే ఒకదాని గురించి చెప్పగలిగిన మాటను రెంటి గురించీ కలిపి చెప్పవచ్చు. రోమీయులకు 2:7-10; గలతియులకు 5:6; ఎఫెసీయులకు 2:10; తీతుకు 2:14 లో పౌలు చెప్పినదీ మత్తయి 7:24-27; మత్తయి 25:35-43 లో యేసుప్రభువు చెప్పినదీ ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ప్రేమ రూపంలో వెల్లడి కాని నమ్మకం వ్యర్థమైన మృతమైన నమ్మకం. మంచి పనులు నమ్మకం నుండే వస్తాయి కాబట్టి అవి కూడా నమ్మకంలో భాగమేనని యాకోబు మాటలు సూచిస్తున్నాయి. యాకోబు పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం లేదు. మంచి పనులు కనిపించకపోయినా కేవలం వట్టి నమ్మకం మాత్రం చాలని చెప్పేవాళ్ళనే వ్యతిరేకిస్తున్నాడు. ఆదికాండము 22:1-18.

22. విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?

నమ్మకం, క్రియలు కలిసి పని చెయ్యకపోతే వేరువేరుగానూ పని చెయ్యవు. క్రియలు నమ్మకం ఉందనడానికి రుజువు, నమ్మకం యొక్క నెరవేర్పు, నమ్మకం తనను తాను కనపరచుకోవడం.

23. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.
ఆదికాండము 15:6, 2 దినవృత్తాంతములు 20:7, యెషయా 41:8

ఆదికాండము 15:6; రోమీయులకు 4:3 చూడండి. అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోవడానికి అనేక సంవత్సరాల ముందు ఈ సంఘటన జరిగిందని యాకోబుకూ ఈ లేఖ చదివేవారికీ కూడా తెలుసు. నమ్మకం ద్వారా దేవుడు అప్పటికే అబ్రాహామును నిర్దోషిగా ఎంచాడు. కానీ అబ్రాహాము నమ్మకం సజీవమైనది. అతడు ఇస్సాకును అర్పించినప్పుడు అది సజీవమైనదని తనను తాను నిరూపించుకుంది. అబ్రాహాము ఇస్సాకును అర్పించకముందే అలా అర్పించడం అతని నమ్మకంలో అంతర్భాగంగా ఉన్నదని కూడా చెప్పవచ్చు. “స్నేహితుడు”– 2 దినవృత్తాంతములు 20:7. యోహాను 15:15 పోల్చి చూడండి.

24. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతి మంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.

ఈ సత్యాన్ని గట్టిగా నొక్కి చెప్పడం కోసం యాకోబు ఈ విధంగా రాస్తున్నాడు. మంచి పనులను చేయించే నమ్మకం మూలంగా, మంచి పనులను తనలో అంతర్భాగంగా కలిగి ఉన్న నమ్మకం మూలంగా దేవుడు మనుషులను నిర్దోషులుగా లెక్కిస్తాడని యాకోబు ఉద్దేశం.

25. అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?
యెహోషువ 2:4, యెహోషువ 2:15, యెహోషువ 6:17

యెహోషువ 2:1-21; హెబ్రీయులకు 11:31. రాహాబుకు నమ్మకం లేకపోయినట్టయితే ఆమె అలా చేసి ఉండేది కాదు. ఆమె చర్యలు ఆమెలోని నమ్మకంలోనుంచి వచ్చాయి. అవి ఆమెలోని నమ్మకానికి రుజువు.

26. ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

మంచి పనులు చేయించని నమ్మకం, తనలో అంతర్భాగంగా మంచి పనులు ఉండని నమ్మకం మృత దేహం వంటిది. అందులో ప్రాణం లేదు. చలనం లేదు. అది త్వరలోనే కంపుగొట్టడం ఆరంభిస్తుంది. మన నమ్మకం చురుకుగా పని చేస్తూ ఉందా? దేవునికోసం ఫలిస్తూ ఉందా? లేకుంటే మనం కూడా దయ్యాలలాగా (వ 19) భయంతో వణకుదాం. పశ్చాత్తాపపడి హృదయ పూర్వకంగా దేవునివైపుకు తిరుగుదాం.


Shortcut Links
యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.