Joshua - యెహోషువ 10 | View All

1. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు; అతడు యెరికోను దాని రాజును నిర్మూలముచేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలముచేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధిచేసికొని వారితో కలిసికొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడిరి.

1. When Adonizedek king of Jerusalem heard how Joshua had taken Ai, and had utterly destroyed it, doing to Ai and its king as he had done to Jericho and its king, and how the inhabitants of Gibeon had made peace with Israel and were among them,

2. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకుగిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని

2. he feared greatly, because Gibeon was a great city, like one of the royal cities, and because it was greater than Ai, and all its men were mighty.

3. హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,

3. So Adonizedek king of Jerusalem sent to Hoham king of Hebron, to Piram king of Jarmuth, to Japhia king of Lachish, and to Debir king of Eglon, saying,

4. లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను.

4. 'Come up to me, and help me, and let us smite Gibeon; for it has made peace with Joshua and with the people of Israel.'

5. కాబట్టి అమోరీయుల అయిదుగురురాజులను, అనగా యెరూష లేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి.

5. Then the five kings of the Amorites, the king of Jerusalem, the king of Hebron, the king of Jarmuth, the king of Lachish, and the king of Eglon, gathered their forces, and went up with all their armies and encamped against Gibeon, and made war against it.

6. గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా

6. And the men of Gibeon sent to Joshua at the camp in Gilgal, saying, 'Do not relax your hand from your servants; come up to us quickly, and save us, and help us; for all the kings of the Amorites that dwell in the hill country are gathered against us.'

7. యెహో షువయును అతనియొద్దనున్న యోధులందరును పరాక్రమ ముగల శూరులందరును గిల్గాలునుండి బయలుదేరిరి.

7. So Joshua went up from Gilgal, he and all the people of war with him, and all the mighty men of valor.

8. అప్పుడు యెహోవావారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ యెదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా

8. And the LORD said to Joshua, 'Do not fear them, for I have given them into your hands; there shall not a man of them stand before you.'

9. యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగాపడెను.

9. So Joshua came upon them suddenly, having marched up all night from Gilgal.

10. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‌ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.

10. And the LORD threw them into a panic before Israel, who slew them with a great slaughter at Gibeon, and chased them by the way of the ascent of Bethhoron, and smote them as far as Azekah and Makkedah.

11. మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‌ హోరోనుకు దిగిపోవుత్రోవను పారి పోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.

11. And as they fled before Israel, while they were going down the ascent of Bethhoron, the LORD threw down great stones from heaven upon them as far as Azekah, and they died; there were more who died because of the hailstones than the men of Israel killed with the sword.

12. యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.

12. Then spoke Joshua to the LORD in the day when the LORD gave the Amorites over to the men of Israel; and he said in the sight of Israel, 'Sun, stand thou still at Gibeon, and thou Moon in the valley of Aijalon.'

13. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.

13. And the sun stood still, and the moon stayed, until the nation took vengeance on their enemies. Is this not written in the Book of Jashar? The sun stayed in the midst of heaven, and did not hasten to go down for about a whole day.

14. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.

14. There has been no day like it before or since, when the LORD hearkened to the voice of a man; for the LORD fought for Israel.

15. అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి.

15. Then Joshua returned, and all Israel with him, to the camp at Gilgal.

16. ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి.

16. These five kings fled, and hid themselves in the cave at Makkedah.

17. మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులయిదుగురు దొరికిరని యెహోషు వకు తెలుపబడినప్పుడు

17. And it was told Joshua, 'The five kings have been found, hidden in the cave at Makkedah.'

18. యెహోషువఆ గుహ ద్వార మున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి.

18. And Joshua said, 'Roll great stones against the mouth of the cave, and set men by it to guard them;

19. మీ దేవు డైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండ మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటివారిని కొట్టివేయుడనెను.

19. but do not stay there yourselves, pursue your enemies, fall upon their rear, do not let them enter their cities; for the LORD your God has given them into your hand.'

20. వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రా యేలీయులును బహు జనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి.

20. When Joshua and the men of Israel had finished slaying them with a very great slaughter, until they were wiped out, and when the remnant which remained of them had entered into the fortified cities,

21. జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.

21. all the people returned safe to Joshua in the camp at Makkedah; not a man moved his tongue against any of the people of Israel.

22. యెహోషువఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా

22. Then Joshua said, 'Open the mouth of the cave, and bring those five kings out to me from the cave.'

23. వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.

23. And they did so, and brought those five kings out to him from the cave, the king of Jerusalem, the king of Hebron, the king of Jarmuth, the king of Lachish, and the king of Eglon.

24. వారు ఆ రాజు లను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.

24. And when they brought those kings out to Joshua, Joshua summoned all the men of Israel, and said to the chiefs of the men of war who had gone with him, 'Come near, put your feet upon the necks of these kings.' Then they came near, and put their feet on their necks.

25. అప్పుడు యెహోషువ వారితోమీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి; మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను.

25. And Joshua said to them, 'Do not be afraid or dismayed; be strong and of good courage; for thus the LORD will do to all your enemies against whom you fight.'

26. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను.

26. And afterward Joshua smote them and put them to death, and he hung them on five trees. And they hung upon the trees until evening;

27. ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి.

27. but at the time of the going down of the sun, Joshua commanded, and they took them down from the trees, and threw them into the cave where they had hidden themselves, and they set great stones against the mouth of the cave, which remain to this very day.

28. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.

28. And Joshua took Makkedah on that day, and smote it and its king with the edge of the sword; he utterly destroyed every person in it, he left none remaining; and he did to the king of Makkedah as he had done to the king of Jericho.

29. యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.

29. Then Joshua passed on from Makkedah, and all Israel with him, to Libnah, and fought against Libnah;

30. యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను.

30. and the LORD gave it also and its king into the hand of Israel; and he smote it with the edge of the sword, and every person in it; he left none remaining in it; and he did to its king as he had done to the king of Jericho.

31. అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా

31. And Joshua passed on from Libnah, and all Israel with him, to Lachish, and laid siege to it, and assaulted it:

32. యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.

32. and the LORD gave Lachish into the hand of Israel, and he took it on the second day, and smote it with the edge of the sword, and every person in it, as he had done to Libnah.

33. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.

33. Then Horam king of Gezer came up to help Lachish; and Joshua smote him and his people, until he left none remaining.

34. అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి

34. And Joshua passed on with all Israel from Lachish to Eglon; and they laid siege to it, and assaulted it;

35. ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారి నందరిని ఆ దినము నిర్మూలముచేసెను.

35. and they took it on that day, and smote it with the edge of the sword; and every person in it he utterly destroyed that day, as he had done to Lachish.

36. అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి

36. Then Joshua went up with all Israel from Eglon to Hebron; and they assaulted it,

37. దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లో నుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూ లము చేసెను.

37. and took it, and smote it with the edge of the sword, and its king and its towns, and every person in it; he left none remaining, as he had done to Eglon, and utterly destroyed it with every person in it.

38. అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి

38. Then Joshua, with all Israel, turned back to Debir and assaulted it,

39. దానిని దాని రాజును దాని సమస్త పుర ములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.

39. and he took it with its king and all its towns; and they smote them with the edge of the sword, and utterly destroyed every person in it; he left none remaining; as he had done to Hebron and to Libnah and its king, so he did to Debir and to its king.

40. అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.

40. So Joshua defeated the whole land, the hill country and the Negeb and the lowland and the slopes, and all their kings; he left none remaining, but utterly destroyed all that breathed, as the LORD God of Israel commanded.

41. కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను.

41. And Joshua defeated them from Kadeshbarnea to Gaza, and all the country of Goshen, as far as Gibeon.

42. ఇశ్రా యేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నంద రిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టు కొనెను.

42. And Joshua took all these kings and their land at one time, because the LORD God of Israel fought for Israel.

43. తరువాత యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.

43. Then Joshua returned, and all Israel with him, to the camp at Gilgal.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఒకప్పుడు చెడు మరియు ప్రాపంచిక స్నేహాల ప్రభావానికి లోనైన వ్యక్తులు సాతాను సేవ నుండి వైదొలిగి, దేవుడు మరియు అతని ప్రజలతో (ఇజ్రాయెల్‌లో చేరడం ద్వారా సంకేతం) సంబంధాన్ని స్వీకరించినప్పుడు, ప్రపంచం వారిని మరియు వారి పూర్వ సహచరులను తృణీకరించడం ప్రారంభించినట్లయితే వారు ఆశ్చర్యపోనవసరం లేదు. విరోధులు అవుతారు. తాము ఉన్న ఆపదను గుర్తించి, క్రైస్తవ మతం యొక్క మార్గాన్ని అనుసరించాలని దాదాపుగా నమ్మకం ఉన్న అనేకమందిని నిరుత్సాహపరిచేందుకు సాతాను ఇటువంటి వ్యూహాలను ఉపయోగిస్తాడు, కానీ దానితో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడతాడు. ఈ పరిస్థితులు దేవుని రక్షణ, సహాయం మరియు విమోచన కోసం మనల్ని ప్రేరేపించాలి. (1-6)

ఇటీవల ప్రభువుపై తమ నమ్మకాన్ని ఉంచడం ప్రారంభించిన అత్యంత వినయపూర్వకమైన మరియు బలహీనమైన వ్యక్తులు కూడా చాలా కాలంగా నమ్మకమైన సేవకులుగా ఉన్నవారికి సమానమైన రక్షణకు అర్హులు. మనతో అనుబంధం లేదా సువార్తపై వారి విశ్వాసం కారణంగా, గిబియోనీయుల వలె, ఇబ్బందులను ఎదుర్కొనే బాధలను రక్షించడం మరియు ఆదుకోవడం మా బాధ్యత. జాషువా, ఒక ఉదాహరణగా, తన కొత్త మిత్రులను విడిచిపెట్టలేదు. మన నిజమైన యెహోషువా, దేవుడు, ఆయనపై నమ్మకం ఉంచేవారిని ఎన్నటికీ విఫలం చేయడు! మన విశ్వాసం కొన్నిసార్లు క్షీణించవచ్చు, కానీ దేవుని వాగ్దానాలు మన ప్రయత్నాలను బలపరచడంలో మరియు ప్రోత్సహించడంలో ఎప్పుడూ విఫలం కావు. జాషువా యొక్క అచంచలమైన విశ్వాసం మరియు ఇజ్రాయెల్ యొక్క విజయాల కోసం రోజును పొడిగిస్తూ సూర్యుడు నిశ్చలంగా కనిపించిన ఒక అద్భుత సంఘటనతో ప్రతిస్పందించిన దేవుని శక్తిని గమనించండి. జాషువా దేవుని ఆత్మ ప్రభావంతో పనిచేశాడు, మరియు ఈ సంఘటనను ఆధునిక ఖగోళ పరంగా వివరించలేకపోయినా, విశ్వాసానికి ప్రతిస్పందనగా దేవుని అసాధారణ జోక్యాన్ని ఇది సూచిస్తుంది. దేవుని వ్రాతపూర్వక వాక్యం యొక్క సత్యానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు ఎదురైనప్పుడు, ప్రభువుకు ఏదీ చాలా కష్టం కాదని మనం నమ్మకంగా ప్రకటించవచ్చు. ఈ సంఘటన ఇజ్రాయెల్ యొక్క గొప్పతనాన్ని పొరుగు దేశాలకు ప్రకటించింది, వారికి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. ఇది దేవుని పనులకు సాక్ష్యంగా పనిచేస్తుంది, ఇతరులను సాక్ష్యమివ్వడానికి మరియు అతని అసమానమైన శక్తిని మరియు ఉనికిని గుర్తించడానికి ఆహ్వానిస్తుంది. (7-14)

ఇశ్రాయేలీయులలో ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరూ సాహసించలేదు, దేవుని రక్షణలో వారి పూర్తి భద్రతను ప్రదర్శిస్తారు. తిరుగుబాటు చేసిన రాజులు దేవుడు ఎన్నుకున్న ప్రజలకు వ్యతిరేకంగా చేసిన చర్యలకు జవాబుదారీగా ఉండేవారు. మోసం మరియు అసత్యం నుండి ఆశ్రయం పొందడం దేవుని తీర్పు నుండి వారిని రక్షించదు. ఈ రాజుల అసహ్యకరమైన దుష్టత్వం తారాస్థాయికి చేరుకుంది మరియు కనానీయ దేశాల పాపాల పట్ల ఆయన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా దేవుని న్యాయం వారిపైకి వచ్చింది. ఈ న్యాయ చర్య దేవుని ప్రజలలో వారి ముందు తరిమివేయబడిన దేశాల పాపాల పట్ల లోతైన భయం మరియు అసహ్య భావనను కలిగించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చారిత్రాత్మక వృత్తాంతం చీకటి శక్తులపై క్రీస్తు సాధించిన విజయాలకు మరియు విశ్వాసులు అతని ద్వారా ఎలా అధిగమించవచ్చో సూచించే సూచనగా పనిచేస్తుంది. మన ఆధ్యాత్మిక పోరాటాలలో, మనం కేవలం ముఖ్యమైన విజయాలను సాధించడంలో సంతృప్తి చెందకూడదు; బదులుగా, మన హృదయాలలో ఉత్పన్నమయ్యే పాపపు అవశేషాలను మనం చురుకుగా వెంబడించాలి మరియు నిర్మూలించాలి. ఈ విజయాన్ని నిరంతరం కొనసాగించడం ద్వారా, యుద్ధం గెలిచి మన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తయ్యే వరకు ప్రభువు మార్గదర్శకత్వం మరియు ప్రకాశాన్ని అందిస్తాడు. (15-27)

జాషువా ఈ నగరాలను స్వాధీనం చేసుకోవడంలో వేగంగా పనిచేశాడు, మనం శ్రద్ధగా మరియు మన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తక్కువ సమయంలో ఎంత సాధించవచ్చో వివరిస్తుంది. ఇక్కడ దేవుని చర్యలు కనానీయుల విగ్రహారాధన మరియు అసహ్యమైన ఆచారాల పట్ల ఆయనకున్న బలమైన అసమ్మతిని ప్రదర్శించాయి, వారి విధ్వంసం ఎంతవరకు వారి నేరాల తీవ్రతను నొక్కిచెప్పాయి. ఈ సంఘటన ప్రభువైన యేసును వ్యతిరేకించే వారందరినీ అంతిమంగా నాశనం చేయడాన్ని ముందే సూచించింది, అతని సమృద్ధిగా ఉన్న కృపను తిరస్కరించింది మరియు తద్వారా అతని కోపం యొక్క బరువును అనుభవించింది. ఇశ్రాయేలు సాధించిన విజయం ప్రభువు వారి తరపున పోరాడినందున సాధ్యమైంది. దేవుడు యుద్ధానికి బాధ్యత వహించకుండా, వారు విజయం సాధించలేరు. ఇది ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుంది - దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మనకు వ్యతిరేకంగా ప్రబలమైన శక్తి ఉండదు. ఆయన మన పక్షాన ఉంటే, మనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరు? (28-43)



Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |