Joshua - యెహోషువ 4 | View All

1. జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను

1. And ye LORDE sayde vnto Iosua: Take you twolue men, out of euery trybe one, & comaunde them, & saye:

2. ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి

2. Take vp twolue stones out of Iordane,

3. యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారి కాజ్ఞాపించుము

3. from the place where the fete of the prestes stode in their araye: & cary them with you, yt ye maie leaue them in ye lodginge, where ye shal lodge this night.

4. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి

4. The Iosua called twolue me which were prepared of the children of Israel, out of euery trybe one,

5. వారితో ఇట్లనెనుయొర్దాను నడుమనున్న మీ దేవు డైన యెహోవా మంద సము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను.

5. & sayde vnto the: Go youre waye ouer before the Arke of the LORDE youre God in the myddes of Iordane, & take euery man a stone vpon his shulder, after the nombre of the trybes of ye children of Israel,

6. ఇకమీదట మీ కుమారులుఈ రాళ్లెందు కని అడుగునప్పుడు మీరుయెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను.

6. yt they maye be a token amonge you. And whan youre children are their fathers here after, and saye: What do these stones there?

7. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును,

7. That ye maye then saye vnto them, how that the water of Iordane claue in sunder before the Arke of the LORDES couenaunt, whan it wente thorow Iordane, & that these stones are set for a perpetuall remembraunce vnto the children of Israel.

8. అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రా యేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పి నట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి.

8. Then dyd the children of Israel as Iosua commaunded them, and bare twolue stones out of the myddes of Iordane (as the LORDE had sayde vnto Iosua) acordinge to the nombre of the trybes of the children of Israel, and broughte the same with them in to the lodginge, and lefte them there.

9. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.

9. And Iosua set vp twolue stones in ye myddes of Iordane, where ye fete of the prestes stode, that bare ye Arke of the couenaunt: and there they be yet vnto this daye.

10. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, నెరవేరువరకు యాజకులు మందసమును మోయుచు యొర్దానునడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి.

10. As for ye prestes that bare ye Arke, they stode in the myddes of Iordane, vntyll all was perfourmed that the LORDE charged Iosua to saye vnto ye people acordinge as Moses gaue Iosua in commaundemet. The people also made haist, and wente ouer.

11. జనులందరు దాటిన తరువాత వారు చూచుచుం డగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి.

11. Now whan all the people was gone ouer, the Arke of the LORDE wente ouer also, and the prestes wente before the people.

12. మరియఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి.

12. And the Rubenites, & Gaddites, and ye halfe trybe of Manasse wente harnessed before the childre of Israel, like as Moses had sayde vnto the:

13. సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.

13. Aboute a fortye thousande men ready harnessed to the warre, wente before the LORDE to the battayll, vpon ye felde of Iericho.

14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయు లందరి యెదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి.

14. In that daye the LORDE made Iosua greate in the sighte of all Israel: and like as they feared Moses, so stode they in awe of him, all his life longe.

15. యెహోవాసాక్ష్యపు మందసమును మోయు యాజ కులకు యొర్దానులోనుండి యివతలికి రండని

15. And the LORDE sayde vnto Iosua:

16. ఆజ్ఞాపించు మని యెహోషువతో సెలవియ్యగా

16. Commaunde the prestes which beare the Arke of witnesse, that they come vp out of Iordane.

17. యెహోషువ యొర్దానులోనుండి యెక్కి రండని ఆ యాజకుల కాజ్ఞా పించెను.

17. So Iosua comaunded the prestes, & sayde: Come vp out of Iordane.

18. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను.

18. And whan the prestes yt bare the Arke of the couenaut of ye LORDE were come out of Iordane, and trode with the soles of their fete vpon the drye londe, ye water of Iordane came agayne in to his place, and flowed (like as afore tyme) vpon all his banckes.

19. మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా

19. It was ye tenth daye of the first moneth, whan the people came vp out of Iordane: & they pitched their tentes in Gilgall vpon ye East syde of ye cite of Iericho.

20. వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి

20. And ye twolue stones which they had taken out of Iordane, dyd Iosua set vp at Gilgall,

21. ఇశ్రాయేలీయులతో ఇట్లనెనురాబోవు కాలమున మీ సంతతివారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా;

21. & saide vnto the children of Israel: Whan youre children are their fathers herafter, & saie: What meane these stones?

22. అప్పుడు మీరుఇశ్రా యేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి.

22. Ye shall tell the, & saye: Israel wete drye thorow Iordane,

23. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసు లందరు తెలిసికొనుటకును,

23. what tyme as ye LORDE yor God dryed vp ye water of Iordane before you, vntyll ye were ouer: like as the LORDE yor God dyd in the reed see, which he dryed vp before vs, yt we mighte go thorow:

24. మీరు ఎల్లప్పుడును మీ దేవు డైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.

24. that all the people vpon earth mighte knowe the hade of the LORDE, how mightie it is, to the intent that ye shulde allwaye feare the LORDE youre God.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవుని క్రియలు నిజంగా స్మరణకు అర్హమైనవి, అయినప్పటికీ మానవ హృదయం వాటిని సులభంగా మరచిపోతుంది. కాబట్టి, మన జ్ఞాపకాలను రిఫ్రెష్‌గా ఉంచుకోవడానికి వివిధ పద్ధతులు అవసరం, దేవుని మహిమ కోసం మాత్రమే కాకుండా మన స్వంత ప్రయోజనం మరియు భవిష్యత్తు తరాలకు కూడా. సన్నాహక సాధనంగా ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయమని దేవుడే ఆదేశించాడు. (1-9)

మందసాన్ని మోస్తున్న యాజకులు ముందుకు వెళ్లమని ఆజ్ఞాపించే వరకు అలాగే ఉన్నారు. ఒడంబడిక మందసము వంటి వారితో దేవుని సన్నిధికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పుడు, సవాలు సమయాల్లో కూడా ఎవరూ అలసిపోకండి. జాషువా యొక్క గౌరవప్రదమైన చర్యలు గుర్తించబడ్డాయి, ఎందుకంటే ఎవరు నిజంగా గౌరవించబడతారు మరియు భయపడతారు, దేవుడు తమతో ఉన్నాడని ప్రదర్శించేవారు మరియు వారు అన్నింటికంటే ఆయనకు ప్రాధాన్యత ఇస్తారు. (10-19)

తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని పదాలు మరియు పనులను సరైన మార్గంలో నడిపించే బాధ్యతను ముందుగానే మరియు స్థిరంగా అందించాలి. వారి బోధనలన్నింటిలో, తల్లిదండ్రులు తమ పిల్లలలో దేవుని పట్ల భయాన్ని మరియు భక్తిని కలిగించాలి, హృదయపూర్వక భక్తి అనేది అత్యంత విలువైన విద్య అని గుర్తించాలి. ఇశ్రాయేలీయులలాగే మనం కూడా మన దేవుని ప్రేమపూర్వక దయను స్తుతించడానికి పిలువబడ్డాము. విపత్కర సమయాల్లోనూ, సవాలుతో కూడుకున్న పరిస్థితుల్లోనూ మనల్ని అద్భుతంగా నడిపించిన మన దేవుని గౌరవార్థం మనం ప్రతీకాత్మక స్తంభాన్ని ప్రతిష్టించకూడదా? ఇప్పటి వరకు, ప్రభువు పాతకాలపు పరిశుద్ధులకు ఉన్నట్లే మనకు నిరంతరం సహాయకుడిగా ఉన్నాడు. ప్రజలు అతని పనిని గుర్తించడంలో విఫలమైనప్పుడు మరియు వారి తరచుగా విమోచనలో అతని మంచితనాన్ని గుర్తించడానికి నిరాకరించినప్పుడు ఇది ఆశ్చర్యకరమైనది మరియు కృతజ్ఞత లేనిది. (20-24)



Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |