Peter I - 1 పేతురు 2 | View All

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

ఎఫెసీయులకు 4:25, ఎఫెసీయులకు 4:29, ఎఫెసీయులకు 4:31; కొలొస్సయులకు 3:5-10. ఇలాంటివన్నీ పాత స్వభావానికి చెందినవి. విశ్వాసి జీవితంలో వీటికి స్థానం ఉండకూడదు (గలతియులకు 5:19-21).

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

“పాలవల్ల”– అంటే దేవుని వాక్యోపదేశాలు. పై రెండు రిఫరెన్సులు చూడండి. మనం పాత విశ్వాసులమైనా కొత్త విశ్వాసులమైనా మనందరం ఆశించవలసినది ఇదే (కీర్తనల గ్రంథము 119:40, కీర్తనల గ్రంథము 119:131). “పెరిగేలా”– ఎఫెసీయులకు 4:13-15. “కొత్తగా పుట్టిన బిడ్డలలాగా”– అంటే కొత్త విశ్వాసులను దృష్టిలో ఉంచుకొని రాసినది కావచ్చు. లేక క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కుంటుపడిన పాత విశ్వాసులను ఉద్దేశించి రాసినది కావచ్చు (1 కోరింథీయులకు 3:1-2; హెబ్రీయులకు 5:11-14). లేక, క్రీస్తు తిరిగి వచ్చిన తరువాతి స్థితిలో పోల్చుకుంటే మనందరం ఆధ్యాత్మికంగా పసి పాపలమే అని పేతురు ఉద్దేశం కావచ్చు (మత్తయి 18:3 పోల్చి చూడండి). పసితనంలో ఉన్న మూడు లక్షణాలను మనమెప్పుడూ నిలుపుకోవాలి – ఆధ్యాత్మిక పోషణను ఆశించాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి, దేవునిపై ఆధారపడాలి. ఆధ్యాత్మికమైన ఆకలి, దేవుని వాక్కు గురించిన ఆశ బొత్తిగా లేకపోతే ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక జీవం లేదనడానికి అంతకన్నా వేరే రుజువు ఏమి కావాలి?

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
కీర్తనల గ్రంథము 34:8

కీర్తనల గ్రంథము 34:8.

4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై,
కీర్తనల గ్రంథము 118:22, యెషయా 28:16, దానియేలు 2:34-35

“రాయి”– అంటే యేసుప్రభువు. విశ్వాసులు ప్రాణం లేని విగ్రహాలను ఆశ్రయించరు. సజీవుడైన వ్యక్తినే ఆశ్రయిస్తారు. “వద్దన్నారు”– మత్తయి 21:42; మార్కు 8:31; మార్కు 9:12; లూకా 17:25; యోహాను 1:11; అపో. కార్యములు 4:11. “ప్రియంగా”– మత్తయి 3:17. మనుషుల ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి. మనుషులు తాము నిర్మిస్తున్న కట్టడానికి క్రీస్తు పనికిరాడనుకున్నారు.

5. యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
నిర్గమకాండము 19:6, యెషయా 61:6

“సజీవమైన రాళ్ళు”– సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు తామే సజీవమైన రాళ్ళుగా అవుతారు. ఎందుకంటే ఆ సజీవమైన రాయి జీవమిచ్చే ఆత్మ కూడా (1 కోరింథీయులకు 14:15). మనుషులు త్రాగి జీవించగలిగేలా ఆ రాయిలోనుంచే జీవ జలం పారుతూ ఉంది. “ఆలయం”– ఎఫెసీయులకు 2:19-22; హెబ్రీయులకు 3:6; 1 కోరింథీయులకు 3:9. దేవుడు నమూనా తయారు చేసేవాడు, కట్టేవాడు. తన ఇంటి గురించి ఆయన బాగా ఆలోచించి ఏర్పాట్లు చేశాడు, దాన్ని చక్కగా తీర్చి దిద్దుతున్నాడు అన్న విషయంలో మనకు సందేహం అవసరం లేదు. ప్రతి రాయీ ఏ స్థానంలో ఉండాలో ఆయనకు చక్కగా తెలుసు. కొంత కట్టాక కొన్ని రాళ్ళను తీసేసి వేరే రాళ్ళను అక్కడ పెట్టవలసిన అవసరం ఆయనకు కలగదు. దేవుడు ఒక చేత్తో రాళ్ళను తీసేస్తూ ఒక చేత్తో నిర్మిస్తూ ఉండడం జరగడం లేదు. “పవిత్ర యాజులుగా”– విశ్వాసులు దేవునికి ఇల్లుగా కట్టబడుతూ ఉండడమే కాదు. ఆ ఇంట్లో సేవ చేసేందుకు వారు యాజులు కూడా – వ 9; ప్రకటన గ్రంథం 1:6; హెబ్రీయులకు 10:19-22. క్రొత్త ఒడంబడికలో విశ్వాసుల్లో ప్రత్యేకమైన యాజి వ్యవస్థ వేరే ఏమీ లేదు. విశ్వాసులంతా యాజులే. యేసుప్రభు శిష్యుల్లో, లేక రాయబారుల్లో ఏ ఒక్కరినీ ఎవరూ “యాజి” అని బైబిల్లో పేరుతో పిలవలేదు. ఇది గమనించదగ్గ విషయం. నాయకులుగా ఉండేందుకు క్రైస్తవ సంఘానికి క్రీస్తు ఇచ్చినవారిలో “యాజి” అనే ప్రత్యేకమైన పదవి లేదు (ఎఫెసీయులకు 4:11; 1 కోరింథీయులకు 12:28). “ఆధ్యాత్మిక బలులు”– రోమీయులకు 12:1-2; హెబ్రీయులకు 13:15-16. యాజులు అంటే దేవునికి ఏదో ఒకటి అర్పించవలసినవారు. యాజులుగా విశ్వాసులు తమను, తమ స్తుతులను, తాము ప్రేమతో దయతో చేసే క్రియలను దేవునికి అర్పించాలి.

6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
యెషయా 28:16

వ 4; యెషయా 28:16; జెకర్యా 1:4; ఎఫెసీయులకు 2:20.

7. విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
కీర్తనల గ్రంథము 118:22, దానియేలు 2:34-35

“ప్రియమైనది”– 1 పేతురు 1:8 ఆయనలో నమ్మకం ఉంచిన వారికే క్రీస్తు ప్రియమైనవాడు. వారే ఆయన విలువను చూడగలుగుతారు, ఆయన్ను ప్రేమించగలుగుతారు. “మూలరాయి”– కీర్తనల గ్రంథము 118:22; మత్తయి 21:42; అపో. కార్యములు 4:11.

8. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
యెషయా 8:14-15

యెషయా 8:14; రోమీయులకు 9:33. దేవుని సత్యానికి లోబడనివారు సత్యం విషయంలో తొట్రుపడుతారు. ఆ సత్యం క్రీస్తే (లూకా 2:34). ఆయనను కోరుకున్నవారు పై స్థాయికి లేస్తారు. ఆయన్ను కోరుకోనివారు పడుతారు. “నియమించిన విధి”– బహుశా యూదజాతి క్రీస్తును తిరస్కరించడం గురించి పేతురు చెప్తున్నాడు. యేసుప్రభువు, ఆయన రాయబారి పౌలు కూడా దీన్ని వివరించేందుకు కీర్తనలు, యెషయా గ్రంథాల్లో నుంచి రిఫరెన్సులను వాడుకున్నారు. ఈ అంశం గురించి రోమ్ 9—11 అధ్యాయాలు, నోట్స్ చూడండి. ముఖ్యంగా రోమీయులకు 9:14-24, రోమీయులకు 9:30-33; రోమీయులకు 11:7-12, రోమీయులకు 11:22-32 చూడండి.

9. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.
నిర్గమకాండము 19:5, నిర్గమకాండము 23:22, ద్వితీయోపదేశకాండము 4:20, ద్వితీయోపదేశకాండము 7:6, ద్వితీయోపదేశకాండము 10:15, ద్వితీయోపదేశకాండము 14:2, యెషయా 9:2, యెషయా 42:12, యెషయా 43:20-21, నిర్గమకాండము 19:6, యెషయా 61:6

“ఎన్నికైన”– ఎఫెసీయులకు 1:4 ఎఫెసీయులకు 1:11; యోహాను 15:16. “రాజుకు...యాజుల సమూహం”– వ 5. గ్రీకులో ఈ మాటలకు రాజు కొలువులో ఉన్న యాజులు, లేక రాజ్యంగా ఏర్పడిన యాజుల సమూహం, లేక యాజులందరూ రాజులే అయివున్న యాజి వ్యవస్థ అని అర్థం వస్తుంది. లేక ఈ మూడు అర్థాలు కూడా రావచ్చు. “పవిత్ర జనం”– భూమిపై ఇతరులందరిలోకీ ప్రత్యేకంగా ఉన్న జాతి. నిర్గమకాండము 19:5-6; యోహాను 17:6 పోల్చి చూడండి. పేతురు సంఘాన్ని “నూతన ఇస్రాయేల్” అని గానీ “ఆధ్యాత్మిక ఇస్రాయేల్” అని గానీ పిలవడం లేదు. అతడు యూదుల్లోని విశ్వాసులకు రాస్తున్నాడు. నిజమైన ఇస్రాయేల్ అంటే వారే, క్రీస్తును తిరస్కరించినవారు కాదు. ఇస్రాయేల్ జాతిని దేవుడు ఇకపై పట్టించుకోబోవడం లేదని పేతురు చెప్పడం లేదు (అపో. కార్యములు 1:6-7 పోల్చి చూడండి). క్రొత్త ఒడంబడిక గ్రంథం రాసిన వారిలో ఎవరూ సంఘాన్ని కొత్త ఇస్రాయేల్ అని పిలవలేదు. ఇతర ప్రజల్లో విశ్వాసులైనవారిని పాత ఇస్రాయేల్ అనే చెట్టుకు అంటుకట్టడం జరిగింది. రోమ్ 11 అధ్యాయం; ఎఫెసీయులకు 2:11-19 చూడండి. “వెలుగు”– అపో. కార్యములు 26:18; 2 కోరింథీయులకు 4:6; ఎఫెసీయులకు 5:8; కొలొస్సయులకు 1:13; 1 యోహాను 1:5-7. “ఉత్తమ గుణాలు”– ఈ గ్రీకు పదానికి సుశీలత, మంచితనం, ఘన బుద్ధి, పొగడదగినవి అని అర్థం. ఇదే పదాన్ని ఫిలిప్పీ 4:8లో “శ్రేష్ఠమైనవి” అనీ, 2 పేతురు 1:3, 2 పేతురు 1:5 లో “సుగుణం” అనీ తర్జుమా చేశారు. యూద క్రైస్తవులైనా ఇతర జనాల్లోని క్రైస్తవులైనా ఇప్పుడు విశ్వాసులందరి విద్యుక్త ధర్మం, విశేష అవకాశం ఏకైక నిజ దేవుని శ్రేష్ఠతనూ మంచితనాన్నీ లోకానికి ప్రకటించడమే. మనం మన ఘనత గురించి చూడకూడదు. మన మంచితనం గురించి ప్రకటించుకోకూడదు. ఆయన మంచితనాన్నే చాటాలి (కీర్తనల గ్రంథము 40:10; కీర్తనల గ్రంథము 71:16; యెషయా 42:12; యెషయా 43:7; ఎఫెసీయులకు 1:6, ఎఫెసీయులకు 1:12, ఎఫెసీయులకు 1:14 పోల్చి చూడండి).

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
హోషేయ 1:6, హోషేయ 1:10, హోషేయ 2:1, హోషేయ 2:23

క్రీస్తులో నమ్మకం ఉంచకముందు యూదులు, ఇతర ప్రజలు కూడా దేవుని ఆధ్యాత్మిక ప్రజ కారు. హోషేయ 1:9-10; హోషేయ 2:23; రోమీయులకు 9:24-26; ఎఫెసీయులకు 2:11-12. మనుషులను చీకటిలోనుంచి వెలుగులోకి పిలవడంలో దేవుడు చూపినది కల్తీ లేని కరుణ మాత్రమే (తీతుకు 3:5).

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,
కీర్తనల గ్రంథము 39:12

“పరవాసులు”– 1 పేతురు 1:1, 1 పేతురు 1:7. “దురాశలు”– 1 పేతురు 1:14. అవి ఈ లోకానికి చెందినవి. విశ్వాసులైతే పరలోక సంబంధులు. “యుద్ధం”– విశ్వాసులపై యుద్ధంలో (ఎఫెసీయులకు 6:11-12) సైతాను వాడే ఆయుధాల్లో పాప సంబంధమైన విషయాలపట్ల ఆశ ఒకటి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని నరికి గాయపరిచే కత్తుల్లాంటివి చెడు కోరికలు. దేవునినుండీ, పవిత్రతనుండీ మన ఆలోచనల్ని మళ్ళించే అగ్నిబాణాల్లాంటివి. వాటికి మనం లొంగిపోవలసిన అవసరం లేదు. వాటికి మన హృదయాల్లో తావియ్యవలసిన అవసరం కూడా లేదు. “విసర్జించండి” అన్న ఆజ్ఞ ఉంది. దేవుని కృప మూలంగా మనం అలా చెయ్యగలమని అర్థం. ప్రతి చెడు తలంపునుంచీ పూర్తిగా విడుదల పొందడమే మన గమ్యంగా పెట్టుకోవాలి.

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
యెషయా 10:3

మత్తయి 5:16 చూడండి. “దూషిస్తూ ఉంటే”– క్రీస్తును తిరస్కరించేవారు విశ్వాసులను దూషించాలనీ వారిలో తప్పులు పట్టుకోవాలనీ లేనివాటిని కల్పించాలనీ ఉంటారు. ఇతరులు మనల్ని దూషించడం మనం మరింత మంచిగా ప్రవర్తించాలన్న నిశ్చయాన్ని మనలో కలిగించాలి. ఈ దుర్మార్గత మన మేలుకే పని చేయాలి. “దైవ దర్శన దినాన”– ఇది దేవుని దీవెన, లేదా తీర్పు వచ్చే ఒక ప్రత్యేకమైన దినం కావచ్చు.

13. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

రోమీయులకు 13:1-5.

14. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి.

15. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.

“మంచి చేయడం”– వాదాల ద్వారా చెయ్యలేనిదానిని మంచి పనుల ద్వారా చెయ్యవచ్చు. క్రీస్తు శుభవార్త తరుఫున దాన్ని నమ్మినవారి పవిత్ర జీవితాలే అన్నిటి కంటే గట్టి వాదన, రుజువు. “తెలివి తక్కువగా మాట్లాడే”– 1 పేతురు 1:14; 2 పేతురు 3:16. వారు క్రీస్తును గురించీ, ఆయన శుభవార్త గురించీ, ఆయన ప్రజల గురించీ తెలిసీ తెలియని మాటలు మాట్లాడుతారు. ఎందుకంటే నిజ దేవుడు వారికి తెలియదు (యోహాను 15:21; ఎఫెసీయులకు 4:17-18). “మూర్ఖులు”– రోమీయులకు 1:21-22.

16. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.

గలతియులకు 5:13; రోమీయులకు 6:15-18.

17. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.
సామెతలు 24:21

“అందరిపట్ల”పేద గొప్ప తారతమ్యం, ఉచ్ఛ నీచ స్థితిగతులు, విద్య మొదలైనవాటితో నిమిత్తం లేకుండా అలా చేయాలి. జాతి గర్వం, దురభిమానం, తామే అధికులమన్న భావం పరిత్యజించాలి. విశ్వాసులు ఎవరినీ తృణీకరించకూడదు. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. యాకోబు 2:1-4, యాకోబు 2:9; 1 కోరింథీయులకు 12:14-26; అపో. కార్యములు 6:1; రోమీయులకు 12:10 చూడండి.

18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

ఎఫెసీయులకు 6:5-8; కొలొస్సయులకు 3:22-24.

19. ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

“మెచ్చుకోదగిన”– దేవుడే అలాంటివారిని మెచ్చుకుంటాడు. ప్రతిఫలమిస్తాడు.

20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;

1 పేతురు 4:15-16 పోల్చి చూడండి.

21. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

“పిలుపు”– తన ప్రత్యేక ప్రజగా ఉండేందుకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మంచి చేసినందువల్ల బాధలు అనుభవించడం కూడా ఆ పిలుపులో భాగమే. ఈ విధంగా బాధలు పడిన వారిలో క్రీస్తే గొప్ప ఉదాహరణ. ఆయన మంచి తప్ప మరేదీ చెయ్యలేదు గానీ మనందరికంటే ఎక్కువగా బాధలు పడ్డాడు. “నడవాలని” – మత్తయి 4:19; మత్తయి 8:22; మత్తయి 16:24; మత్తయి 19:21; లూకా 9:23; యోహాను 1:43; యోహాను 10:4, యోహాను 10:27; యోహాను 12:26; రోమీయులకు 15:5; 1 కోరింథీయులకు 11:1. నమ్మామని అనుకుంటూ క్రీస్తును అనుసరించకుండా ఉండేవారు తమను తాము మోసపుచ్చుకుంటున్నారు.

23. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
యెషయా 53:7

యెషయా 53:7; మత్తయి 26:63; మత్తయి 27:12-14; లూకా 23:8-9. మనం కూడా అదే విధంగా ప్రవర్తించాలి.

24. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
యెషయా 53:4, యెషయా 53:5, యెషయా 53:12

మన స్థానంలో మనకు బదులుగా క్రీస్తు బాధల పాలై మరణించాడన్న స్పష్టమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. 1 పేతురు 3:18; యెషయా 53:5; మత్తయి 20:28; యోహాను 1:29; యోహాను 10:11, యోహాను 10:14; రోమీయులకు 3:25; 2 కోరింథీయులకు 5:14, 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 9:28 కూడా చూడండి. క్రీస్తు బాధల్లో మరణంలో గల ఉద్దేశం ఇక్కడ రాసి ఉంది. రోమీయులకు 14:9; 2 కోరింథీయులకు 5:15 పోల్చి చూడండి. “పాపాల విషయంలో చనిపోయి”– రోమీయులకు 6:10-14; గలతియులకు 2:20; గలతియులకు 5:24; కొలొస్సయులకు 3:5. “న్యాయాల కోసం”– రోమీయులకు 6:18-19; రోమీయులకు 14:19, రోమీయులకు 14:21; 2 కోరింథీయులకు 5:21; ఎఫెసీయులకు 4:24; ఫిలిప్పీయులకు 1:11; 1 తిమోతికి 6:11. “ఆరోగ్యం”– యెషయా 53:5. పాపాలు మనవి, అందుకు పడిన శిక్ష ఆయనది.

25. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.
యెషయా 53:6, యెహెఙ్కేలు 34:5-6

“త్రోవ తప్పిపోయారు”– యెషయా 53:6. “కాపరిగా”– 1 పేతురు 5:4. యోహాను 10:1-18. “పై విచారణ కర్త”– గ్రీకులో ఈ పదం అపో. కార్యములు 20:28; ఫిలిప్పీయులకు 1:1; తీతుకు 1:7 లో ఉంది. క్రీస్తు ముఖ్య కాపరి అయినట్టుగానే ముఖ్య విచారణ కర్త కూడా. వేరే ఎవరూ లేరు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Peter I - 1 పేతురు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మళ్లీ పుట్టిన క్రైస్తవ పాత్రకు తగిన కోపాన్ని సిఫార్సు చేస్తారు. (1-10)
ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం అనేది ద్వేషం మరియు మోసంతో నిండిన హృదయాన్ని వెల్లడిస్తుంది, దేవుని బోధల నుండి ప్రయోజనం పొందే మన సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. శిశువులు తమ పోషణ కోసం పాలను కోరుకున్నట్లే, క్రైస్తవులు ఆధ్యాత్మిక పోషణ కోసం దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా కోరుకోవాలి. యేసుక్రీస్తు, తన అపరిమితమైన దయతో, అవసరమైన పాపులమైన మనకు కృపను సమృద్ధిగా అందజేస్తాడు. ఈ జీవితంలో అత్యంత భక్తుడైన సేవకులు కూడా అనుభవించే దేవుని ఓదార్పుల రుచి ఉన్నప్పటికీ, వారు అతని పూర్తి మహిమను మాత్రమే చూస్తారు.
క్రీస్తును రాయిగా వర్ణించడం రక్షకుడిగా మరియు విశ్వాసుల పునాదిగా ఆయన పాత్రను నొక్కి చెబుతుంది. అతని అమూల్యమైన స్వభావం, విశిష్ట కార్యాలయం మరియు అద్భుతమైన సేవలు అతని అసమానమైన విలువను హైలైట్ చేస్తాయి. నిజమైన విశ్వాసులు పవిత్ర యాజకత్వాన్ని కలిగి ఉంటారు, దేవునికి అంకితం చేయబడతారు, ఇతరులకు సేవ చేస్తారు మరియు పరలోక బహుమతులు పొందుతారు. అయినప్పటికీ, ప్రార్థన మరియు ప్రశంసల వంటి అత్యంత ఆధ్యాత్మిక త్యాగాలు కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆమోదయోగ్యమైనవి.
ప్రధాన మూలస్తంభమైన క్రీస్తు, విశ్వాసులందరినీ శాశ్వతమైన దేవాలయంలోకి ఏకం చేస్తాడు, మొత్తం నిర్మాణం యొక్క బరువును భరించాడు. శాశ్వతమైన పునాదిగా ఎన్నుకోబడిన ఆయన సాటిలేని విలువైనవాడు. క్రీస్తుపై ఒకరి జీవితాన్ని నిర్మించుకోవడంలో ఆయనపై విశ్వాసం ఉంటుంది, ఈ భావన తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. ప్రపంచంలోని గందరగోళం ఉన్నప్పటికీ, క్రీస్తుపై స్థాపించబడిన వారు అస్థిరంగా, గందరగోళంగా మరియు భయపడకుండా ఉన్నారు.
ప్రతి నిజమైన క్రైస్తవుడు ఎంచుకున్న తరానికి చెందినవాడు, భిన్నమైన ఆత్మ, సూత్రం మరియు ఆచరణతో విభిన్నమైన వ్యక్తులను ఏర్పరుస్తాడు. ఈ విశిష్టత క్రీస్తులో ఎన్నుకోబడటం మరియు అతని ఆత్మ ద్వారా పవిత్రపరచబడటం నుండి ఉద్భవించింది. చీకటి స్థితి నుండి ఉద్భవించి, క్రైస్తవులు ఆనందం, ఆనందం మరియు శ్రేయస్సుగా పరివర్తన చెందుతారు, వారి వృత్తులు మరియు ప్రవర్తన ద్వారా ప్రభువు స్తుతులను ప్రదర్శిస్తారు. వారిని తన ప్రజలుగా చేసి, కరుణించిన దేవునికి వారి ఋణత్వం ఎనలేనిది.
దేవుని దయ లేని స్థితి, ప్రాపంచిక ఆస్తులు ఉన్నప్పటికీ, విచారకరం. దేవుని దయ మరియు ప్రేమను ప్రతిబింబించడం పశ్చాత్తాపాన్ని పెంపొందిస్తుంది. దేవుని ఉచిత దయ నుండి నిజంగా ప్రయోజనం పొందాలంటే, మనం దానిని దుర్వినియోగం చేయకూడదు లేదా అగౌరవపరచకూడదు. దయ పొందాలని కోరుకునే వారు దేవుని ప్రజలుగా నడుచుకోవాలి, వారు పొందిన కృపను గుర్తించి, సాకారం చేసుకోవాలి.

అన్యజనుల మధ్య పవిత్ర సంభాషణ నిర్దేశించబడింది. (11,12)
అత్యంత నిజాయితీగల వ్యక్తులు, ప్రత్యేక తరంగా ఎంపిక చేయబడినవారు, దేవునికి అంకితం చేయబడిన వ్యక్తులు, ఘోరమైన పాపాల నుండి దూరంగా ఉండటానికి ప్రోత్సాహం అవసరం. ఈ పాపాలలో, శరీర కోరికలు మానవ ఆత్మకు గొప్ప ముప్పును కలిగిస్తాయి. ఈ కోరికలకు లొంగిపోవడం తీవ్రమైన తీర్పు, ఇది ఒకరి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు హానికరమైన పరిణామాలకు దారి తీస్తుంది. దైవిక సందర్శన దినం సమీపిస్తోంది, ఆ సమయంలో దేవుడు తన మాట మరియు దయ ద్వారా పశ్చాత్తాపాన్ని ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో, చాలా మంది దేవుణ్ణి స్తుతిస్తారు మరియు అతని ప్రజల సద్గుణ జీవితాలు సానుకూల పరివర్తనకు దోహదం చేస్తాయి.

సబ్జెక్ట్‌లు తమ సివిల్ గవర్నర్‌లకు సరైన విధేయత చూపాలని ఉద్బోధించారు. (13-17) 
నిజాయితీగల క్రైస్తవ ప్రసంగానికి సమగ్రత అవసరం, అన్ని సంబంధిత బాధ్యతలను మనస్సాక్షితో నెరవేర్చడం ద్వారా మాత్రమే సాధించవచ్చు. అపొస్తలుడు ఈ విధులను వ్యక్తిగతంగా సూచిస్తాడు. ఈ విధులను పాటించడం అనేది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది, వాటిని క్రైస్తవుని కర్తవ్యంగా మాత్రమే కాకుండా అజ్ఞాన వ్యక్తుల యొక్క నిరాధారమైన విమర్శలను తిరస్కరించే సాధనంగా కూడా చేస్తుంది. ప్రతి సంబంధంలో, క్రైస్తవులు తమను తాము సరైన రీతిలో ప్రవర్తించడానికి ప్రయత్నించాలి, వారి స్వేచ్ఛ తప్పు చేయడానికి లేదా వారి విధులను విస్మరించడానికి ఒక సాకుగా ఉపయోగపడదని నిర్ధారించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా తాము దేవుని సేవకులమని వారు గుర్తించడం చాలా ముఖ్యం.

బాధలో ఉన్న రక్షకుని ఉదాహరణ ప్రకారం, వారి యజమానులకు సేవకులు మరియు అందరూ సహనంతో ఉండాలి. (18-25)
ఆ సమయాల్లో, సేవకులు సాధారణంగా అన్యమతస్తుల క్రింద బానిసలుగా పరిగణించబడ్డారు, వారు తరచూ వారితో కఠినంగా వ్యవహరించేవారు. అయినప్పటికీ, దేవుణ్ణి అవమానించకుండా లేదా కించపరచకుండా ఉండటానికి భక్తితో, ప్రొవిడెన్స్ ద్వారా నియమించబడిన మాస్టర్స్‌కు లోబడి ఉండమని అపొస్తలుడు వారికి ఆదేశిస్తాడు. ఈ ఆదేశం సహేతుకమైన సేవతో కూడిన కంటెంట్‌కు మాత్రమే కాకుండా కఠినంగా లేదా అన్యాయంగా కోపంగా ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఒక పక్షం యొక్క పాపాత్మకమైన ప్రవర్తన మరొక పక్షంలో ఇలాంటి ప్రవర్తనను క్షమించదని నొక్కి చెప్పబడింది; యజమాని పాపంగా మరియు మొండిగా ప్రవర్తించినప్పటికీ సేవకుడు వారి విధులను నెరవేర్చడానికి బాధ్యత వహిస్తాడు.
మరోవైపు, యజమానులు తమ సేవకులు మరియు తక్కువవారి పట్ల సౌమ్యత మరియు సౌమ్యతను ప్రదర్శించాలని కోరారు. క్రైస్తవులు తమ తప్పులను సరిదిద్దేటప్పుడు సహనాన్ని ప్రదర్శించడంలో ఉన్న ప్రాముఖ్యత లేదా గౌరవాన్ని ప్రకరణం ప్రశ్నిస్తుంది. బదులుగా, క్రైస్తవులు, వారి మంచి ప్రవర్తనలో, ఫిర్యాదు చేయకుండా లేదా ప్రతీకారం తీర్చుకోకుండా గర్వంగా మరియు ఉద్వేగభరితమైన అన్యమత గురువుల నుండి దుర్వినియోగాన్ని సహిస్తూ, వారి విధులను కొనసాగించినట్లయితే, అలాంటి ప్రవర్తన దేవునికి సంతోషాన్నిస్తుందని సూచిస్తుంది. ఈ ఓర్పు దైవిక దయ యొక్క విలక్షణమైన అభివ్యక్తిగా పరిగణించబడుతుంది మరియు దైవిక ప్రతిఫలం వాగ్దానం చేయబడింది.
ఈ వచనం క్రీస్తు మరణం యొక్క విస్తృత ఉద్దేశ్యాన్ని కూడా నొక్కి చెబుతుంది, ఇది బాధలో సహనానికి ఉదాహరణగా మాత్రమే కాకుండా, మన పాపాలను భరించడం మరియు దైవిక న్యాయం యొక్క సంతృప్తిని సూచిస్తుంది. క్రీస్తు త్యాగం పాపాలను తొలగించి, నీతితో కూడిన కొత్త, పవిత్ర జీవితానికి మార్గం సుగమం చేసినట్లుగా చిత్రీకరించబడింది. క్రీస్తు మరణం మరియు పునరుత్థానం నీతిమంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యంతో పాటు ఒక ఉదాహరణ మరియు శక్తివంతమైన ప్రేరణలను అందిస్తాయి.
తదుపరి చర్చ సమర్థన భావనను తాకింది, ఇక్కడ క్రీస్తు త్యాగం పాపాలకు పరిహారంగా పనిచేస్తుంది, అతని చారల ద్వారా ఆత్మ యొక్క అనారోగ్యాలను నయం చేస్తుంది. మనిషి యొక్క పాపాత్మకమైన స్వభావాన్ని, దారితప్పిన అతని ధోరణిని మరియు అతను పచ్చిక బయళ్ల నుండి, గొర్రెల కాపరి మరియు మంద నుండి తప్పిపోయినప్పుడు, అనేక ప్రమాదాలకు తనను తాను బహిర్గతం చేయడం వలన కలిగే దుఃఖాన్ని చిత్రీకరించడానికి ఈ భాగం మారుతుంది. మార్పిడి ద్వారా పునరుద్ధరణ యొక్క థీమ్ పరిచయం చేయబడింది, ఇది దైవిక దయ యొక్క ప్రభావంగా తిరిగి రావడాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పునరాగమనం యొక్క అంతిమ దృష్టి క్రీస్తు వైపుకు ఉంది, పాపులు, వారి మార్పిడికి ముందు, శాశ్వతంగా లోపభూయిష్ట స్థితిలో ఉంటారని మరియు వారి జీవితం నిరంతర సంచారం ద్వారా గుర్తించబడుతుందని నొక్కిచెప్పారు.



Shortcut Links
1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |