Peter II - 2 పేతురు 1 | View All

1. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

1 పేతురు 1:1. పేతురు యేసుప్రభువును “మన దేవుడూ రక్షకుడూ” అనడం గమనించండి. తీతుకు 2:13; ఫిలిప్పీయులకు 2:6; హెబ్రీయులకు 1:3, హెబ్రీయులకు 1:8, హెబ్రీయులకు 1:10; యోహాను 20:28. “నీతీన్యాయాలు”– రోమీయులకు 3:20-26. “అమూల్య”– నమ్మకం నిజంగా ఎంతో విలువగలది (1 పేతురు 1:7). నమ్మకం ఉన్నవారు దాన్ని “పొందారు”. అంటే నమ్మకం దేవుడు ఇచ్చేది (అపో. కార్యములు 3:16; ఎఫెసీయులకు 2:8; ఫిలిప్పీయులకు 1:29). “దాసుడు”– రోమీయులకు 1:3. “సీమోను”– మత్తయి 4:18; మత్తయి 10:2.

2. తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,

రోమీయులకు 1:2. “అధికమవుతాయి గాక”– 1 పేతురు 1:2. విశ్వాసుల పాలిట కృప, శాంతి ఏ విధంగా పొర్లి పారుతున్నాయో గమనించండి. యోహాను 17:3 పోల్చి చూడండి – మనకు తండ్రి, కుమారుడు ఎంత బాగా తెలిసి ఉంటే శాంతి అంత అధికం అవుతుంది. దేవుని కృపను అంత ఎక్కువగా గుర్తించగలుగుతాము. తన కృపను మనం మరింతగా స్వీకరించి ఉపయోగించుకునేలా తనను మనం మరింతగా ఎరగాలని దేవుడు కోరుతున్నాడు. 2 పేతురు 3:18 చూడండి. విశ్వాసులు దేవుణ్ణి అంతకంతకూ బాగా తెలుసుకోవాలని పౌలు ఎప్పుడూ ప్రార్థించేవాడు – ఎఫెసీయులకు 1:17; ఎఫెసీయులకు 3:19; ఎఫెసీయులకు 4:13; ఫిలిప్పీయులకు 1:9-10; కొలొస్సయులకు 1:9-12.

3. దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

“మహిమ”– యోహాను 1:14; యోహాను 17:5. “సుగుణాన్ని”– దేవుడు మంచివాడు. ఆయన గుణాలు పొగడదగినవి – నిర్గమకాండము 33:19; నెహెమ్యా 9:25; కీర్తనల గ్రంథము 17:13; కీర్తనల గ్రంథము 31:19; కీర్తనల గ్రంథము 145:7; 1 పేతురు 2:3. “పిలిచిన”– 1 పేతురు 1:15; 1 పేతురు 2:9, 1 పేతురు 2:21; 1 పేతురు 3:9; 1 పేతురు 5:10 (రోమీయులకు 1:1; రోమీయులకు 8:30 నోట్స్‌). “ఆయనను”– యేసుప్రభువును అని అర్థం. ఆయన దేవుడు గనుక ఆయనకు దివ్య బలప్రభావాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితాన్ని గడపవలసిన రీతిలో గడపడానికి అవసరమైన వాటన్నిటినీ ఆయన మనకిచ్చాడు. ఎఫెసీయులకు 1:3 పోల్చి చూడండి. జ్ఞానం, ప్రభావం, పవిత్రత, బలం అన్నిటికీ ఆయనే మూలాధారం, విశ్వాసులందరిలోనూ ఆయన ఉన్నాడు (రోమీయులకు 8:9-10; 2 కోరింథీయులకు 13:5; కొలొస్సయులకు 1:27; కొలొస్సయులకు 2:20). “భక్తి”– 1 తిమోతికి 2:2; 1 తిమోతికి 3:16; 1 తిమోతికి 4:8; 1 తిమోతికి 6:5-6, 1 తిమోతికి 6:11; తీతుకు 1:1.

4. ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్య ములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను

“వాగ్థానాలు”– క్రొత్త ఒడంబడిక, మొత్తంగా బైబిలంతటా ఈ వాగ్దానాలున్నాయి. “వీటిద్వారా”– ఈ వాగ్దానాలను కనుగొని, వాటిని నమ్మి, ధ్యానించి దేవుడు మనకిచ్చిన విషయాలను స్వంతం చేసుకునేందుకు వాటిని ఉపయోగించుకోవాలి. “దురాశ”– 1 పేతురు 1:14; 1 పేతురు 2:11; 1 పేతురు 4:2. “భ్రష్టత్వం”– ఆదికాండము 6:11-12; కీర్తనల గ్రంథము 14:3; యెషయా 1:4; అపో. కార్యములు 2:40; ఎఫెసీయులకు 4:22. “తప్పించుకొని”– ఈ లోకంలోని కుళ్ళు నుంచి మనం తప్పించుకోకపోతే దాని మీదికి వచ్చే దేవుని కోపాన్నీ తప్పించుకోలేము (మత్తయి 23:33; రోమీయులకు 2:3; 1 థెస్సలొనీకయులకు 5:3; 2 తిమోతికి 2:26; హెబ్రీయులకు 2:3; హెబ్రీయులకు 12:25). దేవుని ఘనమైన, విలువైన వాగ్దానాలు దీనంతటి నుంచీ తప్పించుకునే మార్గాన్ని చూపిస్తున్నాయి. అవి మనకు నమ్మకాన్ని, ఆశాభావాన్ని, బలప్రభావాలను ఇస్తాయి. “దైవిక స్వభావంలో పాలివారు”– క్రీస్తు విశ్వాసులు దేవుళ్ళయిపోరు. ఏ మనిషికైనా సృష్టించబడిన ఏ జీవికైనా అది అసాధ్యం. కానీ విశ్వాసులు క్రీస్తుతో ఏకం అయినవారు. ఆయన వారిలో, వారు ఆయనలో ఉన్నారు. దేవుని ఆత్మ వారిలో ఉన్నాడు (యోహాను 14:17; యోహాను 17:20-23; రోమీయులకు 8:9-11). ఈ విధంగా మాత్రమే వారు దైవిక స్వభావంలో పాలుపొందుతారు.

5. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును,సద్గుణమునందు జ్ఞానమును,

మనకు అవసరమైనవాటన్నిటినీ క్రీస్తు ఇచ్చాడు గనుక ఆయన ఇచ్చినదాన్ని చేపట్టి క్రైస్తవ జీవితం తాలూకు అన్ని మంచి లక్షణాల్లోనూ ఎదగడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. “విశ్వాసం”– మనందరం మొదలు పెట్టవలసింది ఇక్కడే. ఇది లేకుండా మనం నిజక్రైస్తవులం కాము. ఇతర సుగుణాలను మనం అలవరచుకోగలిగినప్పటికీ అవి మనకు శాశ్వత మేలును కలిగించవు – హెబ్రీయులకు 11:6; యోహాను 3:36. “సుగుణం”– వ 3. ఇక్కడి గ్రీకు పదం శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని, నైతిక విలువలను, యథార్థతను, మంచితనాన్ని సూచిస్తున్నది. “సమకూర్చుకోండి”– అంటే ఒక సుగుణం మనకు కలిగే వరకూ మరొకదాని గురించి ప్రయత్నించవద్దని కాదు. మనం ఆధ్యాత్మిక జీవనంలో ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నిటినీ ఒకే సారి అలవరచుకోవాలి. వాటిని సమకూర్చుకోవడం ఎలా? నమ్మకం మూలంగా దేవుని వాగ్దానాలను చేపట్టి, మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రార్థిస్తూ, దేవుని వాక్కును ధ్యానిస్తూ ఉండడం ద్వారా. అంతేగాక ఏమేం చెయ్యాలో మనకు తెలిసిన వాటన్నిటినీ నేరుగా, ఆచరణలో పెడుతూ వెళ్ళడం ద్వారా, క్రీస్తునూ నూతన స్వభావాన్నీ “ధరించుకోవడం” ద్వారా అలా చెయ్యవచ్చు (కీర్తనల గ్రంథము 1:1-3; లూకా 11:28; రోమీయులకు 13:14; 2 కోరింథీయులకు 5:7; ఎఫెసీయులకు 4:22-24; మొ।।). “జ్ఞానం”– వ 2. దీన్ని ఒక సారి మనం అలవరచుకుని ఇక మరచిపోవడం కుదరదు. దీనిలో విశ్వాసులు అస్తమానం ఎదుగుతూ ఉండాలి – ఫిలిప్పీయులకు 3:10.

6. జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని,

“నిగ్రహం”– ఇది దేవుని ఆత్మ ఫలం (గలతియులకు 5:23). ఆత్మకు లోబడడం ద్వారా, ఆత్మలో నడుచుకోవడం ద్వారా, మన ఆలోచనలను, కోరికలను, చర్యలను అదుపులో ఉంచుకునేందుకు ఆత్మ ఇచ్చే బలం ద్వారా దీన్ని “సమకూర్చుకుంటాం”. “సహనం”– మనకు ఏ బాధలు, కష్టాలు వచ్చినా ఓపిగ్గా సహించి విశ్వాసంలో సాగిపోవడం అని అర్థం. ఇది స్వభావ సిద్ధంగా మనలో ఉండేది కాదు. దాన్ని సమకూర్చుకోవడం మనం నేర్చుకోవాలి (యాకోబు 1:2-4, యాకోబు 1:12). “భక్తి”– వ 3; 2 పేతురు 3:11. ఈ మాటకు అర్థం ఆచరణలో క్రియల్లో దేవునిపట్ల కనిపించే భక్తిశ్రద్ధలు.

7. భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.

“సోదరులపట్ల అనురాగం”– రోమీయులకు 12:10; 1 థెస్సలొనీకయులకు 4:9; హెబ్రీయులకు 13:1; 1 పేతురు 1:22. ఇది సోదర విశ్వాసులపట్ల ఆచరణ పూర్వకంగా వెల్లడి అయ్యే ప్రేమ, వాత్సల్యత. “ప్రేమ”– తన విశ్వాసుల హృదయాల్లో దేవుడు నింపే దివ్య ప్రేమ (ఆగాపే – 1 కోరింథీయులకు 13:1 నోట్‌).

8. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలు లైనను కాకుండ చేయును.

“అధికం అవుతూ”– 2 పేతురు 3:18; గలతియులకు 5:22-23; ఎఫెసీయులకు 4:12-15; ఫిలిప్పీయులకు 3:12-14. “వ్యర్థంగా, నిష్‌ఫలంగా”– మనం అలా ఉండాలని కోరకపోవచ్చు గాని పైన చెప్పిన లక్షణాలను మన బ్రతుకుల్లో సమకూర్చుకోకపోతే అలా ఉంటాం.

9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.

“మరచిపోయిన”– పాపంనుంచి శుద్ధి పొందడం ఏమిటో అన్నది అతడు మనసులో పెట్టుకుంటే దేవుడు తనను ఉన్నతమైన పవిత్ర జీవనం గడిపేందుకు పిలిచాడని గుర్తిస్తాడు, వ 5-7లోని సుగుణాలను సమకూర్చుకుంటాడు. “గుడ్డివాడు”, “దూర దృష్టి లేనివాడు”– అంటే కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను చూడలేని అంధుడు అని అర్థం. అలాంటి వ్యక్తి ఈ లోకంలోని వాటిని చూడగలడు గానీ పౌలు 2 కోరింథీయులకు 4:18 లో చెప్పిన విషయాల్లాంటివాటికి అంధుడు. దూరదృష్టి లేని వారు పూర్తిగా గుడ్డివారు కాదు.

10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

“పిలిచి ఎన్నుకొన్న”– అంటే దేవుడు పాపవిముక్తి, రక్షణకోసం వారిని ఎన్నుకుని ఆ స్థితిలోకి వారిని పిలిచాడని పేతురు ఉద్దేశం. యోహాను 6:37; రోమీయులకు 8:28-30; ఎఫెసీయులకు 1:4-6 నోట్స్. దేవుడు మనల్ని పిలిచాడనీ, ఎన్నుకున్నాడనీ మనకెలా తెలుస్తుంది? వ 5-7లోని సుగుణాలను సమకూర్చుకోవడం ఒక మార్గం. వాటినలా సమకూర్చుకోకపోతే అసలు దేవుడిచ్చే రక్షణ మనకు తెలుసా అని సందేహపడవలసి వస్తుంది. “తొట్రుపడరు”– ఈ సుగుణాలను సమకూర్చుకోవడం ద్వారా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని రూఢి అవుతుంది. అప్పుడు ఆయనలో మన నిబ్బరం, నమ్మకం అధికం అవుతాయి. దానితోబాటు నిలిచి ఉండేందుకు శక్తి కూడా పెరుగుతుంది.

11. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.

“రాజ్యంలో”– మత్తయి 4:17; మత్తయి 5:3, మత్తయి 5:10; మత్తయి 6:10, మత్తయి 6:33; మత్తయి 7:21; మత్తయి 25:34; 1 థెస్సలొనీకయులకు 2:12; 2 తిమోతికి 4:1, 2 తిమోతికి 4:18; హెబ్రీయులకు 12:28. వ 5-7లోని సుగుణాలను ఆత్రుతతో సమకూర్చుకున్న విశ్వాసులను క్రీస్తు “సమృద్ధి అయిన ప్రవేశం” ఇస్తాడు. అలా సమకూర్చుకోవడం నిర్లక్ష్యం చేసినవారికి బహుశా అంత ఘనమైన స్వాగతం లభించదు. మత్తయి 5:19; 2 కోరింథీయులకు 5:10; ప్రకటన గ్రంథం 22:12 పోల్చి చూడండి.

12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.

“నిలకడగా”– కొలొస్సయులకు 1:23; లూకా 21:19; 1 కోరింథీయులకు 16:13; 2 కోరింథీయులకు 1:21, 2 కోరింథీయులకు 1:24. “జ్ఞాపకం చేయడానికి”– రోమీయులకు 15:15; 1 కోరింథీయులకు 15:1; 2 తిమోతికి 1:6; 2 తిమోతికి 2:14. దేవుడు వెల్లడించిన సత్యాలను జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరత విశ్వాసులకు ఎప్పుడూ ఉంటుంది. మర్చిపోవడానికి చాలా అవకాశం ఉంది. అందువల్ల కలిగే ఫలితాలు చాలా హానికరమైనవి. ద్వితీయోపదేశకాండము 8:5; మొ।। చూడండి.

13. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,

14. నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

పేతురు తాను త్వరలో చనిపోతానని ఎదురు చూస్తున్నాడు. యోహాను 21:18-19; 2 తిమోతికి 4:6 పోల్చి చూడండి. అంటే తన జీవిత కాలంలోనే క్రీస్తు తిరిగి వస్తాడని అతడు అనుకోవడం లేదన్నమాట.

15. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.

“శ్రద్ధాసక్తులు”– ఈ లేఖ రాయడం ద్వారా చాలావరకు అలాంటి శ్రద్ధాసక్తులు కనపరిచాడు. అయితే పై విషయాల గురించి మరింత వివరంగా రాసి పంపుతానని దీని అర్థం కావచ్చు.

16. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని

“మేము”– అంటే తానూ ఇతర రాయబారులూ. యేసు పరిచర్య కాలమంతటిలోనూ వారు ఆయనతో ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆయన లోని మానవాతీత ప్రభావాన్ని చూశారు. “కట్టుకథలు”– 2 పేతురు 2:3; 1 తిమోతికి 1:4; 1 తిమోతికి 4:7 పోల్చి చూడండి. “దివ్యత్వం”– యోహాను 1:14. “కండ్లారా చూచిన”– యోహాను 15:27; అపో. కార్యములు 1:3. ఆయన చేసినవి, చెప్పినవి వారికి ఉన్నది ఉన్నట్టు తెలుసు. ఎలాంటి సందేహానికీ తావు లేదు.

17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా
కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

మత్తయి 17:5 చూడండి. ఈ స్వరం దేవుని నివాస స్థలం అయిన పరలోకం నుంచి వచ్చింది.

18. మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.

మత్తయి 17:6. ఎవరికో జరిగినదాన్ని పేతురు ఇక్కడ రాయడం లేదు. అతడు కూడా ఇది జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు. యేసు దివ్యమైన మార్పు చెందడం చూశాడు. పరలోకంనుండి వచ్చిన స్వరాన్ని విన్నాడు. ప్రథమ శిష్యుల సాక్ష్యాన్ని అంత శక్తివంతంగా చేసిన విషయాల్లో ఇది ఒకటి. అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:32; మొ।। పోల్చి చూడండి. “పవిత్ర పర్వతం”– ఆ సంఘటన కోసం దేవుడు ఆ పర్వతాన్ని ప్రత్యేకించాడు గనుక అది పవిత్రం అయింది. లేవీయకాండము 20:7 నోట్.

19. మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

“చీకటిలో”– కీర్తనల గ్రంథము 82:5; సామెతలు 4:19; యోహాను 1:5; యోహాను 3:19; రోమీయులకు 1:21; ఎఫెసీయులకు 4:18; ఎఫెసీయులకు 6:12; 1 యోహాను 2:11. “అరుణోదయం”– అంటే యేసుప్రభు ప్రత్యక్షం. అప్పుడు లోక పాపాంధకారం, రాత్రి సమయం పటాపంచలవుతుంది – రోమీయులకు 13:12; యెషయా 60:1-3. “వేకువచుక్క”– ప్రకటన గ్రంథం 22:16. ఈ వచనంలో పాత ఒడంబడిక ప్రవక్తల వాక్కులు చదివి వారు చెప్తున్నదాన్ని జాగ్రత్తగా గమనించాలని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. “ఆ వాక్కు”– అంటే పాత ఒడంబడిక గ్రంథంలోని ప్రవక్తలన్నమాట. ఆదికాండము 20:7 నోట్స్ చూడండి. మన యేసుప్రభు ప్రభావం, రాకడల గురించి వారు కూడా చెప్పారు (వ 16; కీర్తనల గ్రంథము 2:8-9; కీర్తనల గ్రంథము 96:13; కీర్తనల గ్రంథము 98:9; యెషయా 2:12-19; యెషయా 13:9-11; యెషయా 26:21; యెషయా 62:11; యెషయా 63:1-6; దానియేలు 7:13-14; జెకర్యా 14:3-5; మొ।।). యేసు మార్పు చెందిన సంఘటన వారి భవిష్యద్వాక్కులను స్థిరం చేసింది. అవన్నీ నెరవేరతాయని విశ్వాసులకు మరింత నిబ్బరాన్ని ఇచ్చింది. ప్రవక్తల వాక్కు దేవుడు విశ్వాసులకిచ్చిన ఒక వెలుగు (కీర్తనల గ్రంథము 119:105; సామెతలు 6:23 పోల్చి చూడండి). మనం ఎక్కడ ఉన్నదీ, ఎక్కడికి వెళ్తున్నదీ అది మనకు చూపిస్తుంది. తొట్రు పడకుండా, పడిపోకుండా నడిచేందుకు అది సహాయం చేస్తుంది.

20. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

“లేఖనం”– అంటే పాత ఒడంబడిక గ్రంథం. ప్రవక్తలు తాము చూచినదాన్ని గురించిన తమ స్వంత వ్యాఖ్యానం రాయలేదు. వారు రాసినదాన్ని కేవలం మన బుద్ధి కుశలత ద్వారా వివరించి చెప్పగలగడం అసాధ్యం. కపట ప్రవక్తలు ఇందుకు వ్యతిరేకం. తమ స్వంత ఆలోచనల, ఊహల మూలంగా పలుకుతారు. ఆ విధంగానే అర్థం కూడా చెప్తారు. యిర్మియా 14:14; యిర్మియా 23:16; యెహెఙ్కేలు 13:3. భవిష్యద్వాక్కులు దేవునినుంచే వచ్చాయి. దేవుని సహాయంతోనే వాటిని అర్థం చేసుకోగలం.

21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.

“మానవ ఇష్టాన్ని బట్టి”– ప్రవక్తల వాక్కులు అంటే పాత ఒడంబడిక గ్రంథంలో రాసి ఉన్నదంతా అని అర్థం. ఏదైనా చెప్పాలనీ, రాయాలనీ ప్రవక్తలు తమంతట తామే నిర్ణయించుకోలేదు. వారికి వాక్కులు పరలోకం నుంచే వచ్చాయి. యిర్మియా 1:9 పోల్చి చూడండి. “యెహోవా ఇలా మాట్లాడుతున్నాడు” అనీ, “యెహోవా వాక్కు ఆలకించండి” అనీ వారు అనగలిగారు (యెషయా 1:2, యెషయా 1:10-11; యిర్మియా 2:4; యెహెఙ్కేలు 3:16-17; మొ।।). ఎందుకంటే అది పూర్తిగా వాస్తవం. వారు పలకవలసిన మాటలను ఉన్నవి ఉన్నట్టు దేవుడు వారికి ఇచ్చాడు. వారు దేవుని సత్యాన్ని ప్రకటించడం కోసం దేవుని చేతిలోని పరికరాలు. మత్తయి 4:4; మత్తయి 5:17-18; మార్కు 12:4-6; యోహాను 10:35; అపో. కార్యములు 4:25; 1 కోరింథీయులకు 2:13; 2 తిమోతికి 3:16; హెబ్రీయులకు 1:5-13; 1 పేతురు 1:11 చూడండి. మనం బైబిలును నిర్లక్ష్యం చేస్తే సజీవ దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తున్నామన్న మాట. భవిష్యద్వాక్కులు మనకు తెలియకపోతే దేవుడు ఈ భూమిపై ఏమి చేయనున్నాడో మనకు తెలియదు.Shortcut Links
2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |