John III - 3 యోహాను 1 | View All

1. పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.

“గాయస్”– అపొ కా గ్రంథంలో, పౌలు లేఖల్లో ఈ పేరు గల వ్యక్తులు ముగ్గురున్నారు (అపో. కార్యములు 19:29; అపో. కార్యములు 20:4; రోమీయులకు 16:23; 1 కోరింథీయులకు 1:14). ఆ రోజుల్లో ఇది సాధారణమైన పేరే. అందువల్ల ఈ గాయస్ ఆ ముగ్గురిలో ఒకడో, లేక వేరొక వ్యక్తో చెప్పలేము. “పెద్దనైన”– 2 యోహాను 1:1. “నిజమైన”– 2 యోహాను 1:2.

2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

“ఆధ్యాత్మికంగా”– గాయస్ తన ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఇతర విషయాల్లో అతనికి కొన్ని సమస్యలు ఉన్నట్టున్నాయి. అవి అతని ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూ ఉండవచ్చు. గాయస్‌కున్న నిజమైన అవసరత ఏమిటో గుర్తించి యోహాను అతని గురించి ప్రార్థించి ఉంటాడు.

3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని.

“సత్యంలో”– 2 యోహాను 1:4. “సత్యంలో నడుచుకొంటున్నావని”– గాయస్ దేవుడు వెల్లడించినదాని విషయంలో యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు. సత్యాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకున్నాడు. “సోదరులు”– ఆధ్యాత్మిక సోదరులు, అంటే క్రీస్తు విశ్వాసులు. “ఆనందం”– 2 యోహాను 1:4.

4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.

“నా పిల్లలు”– అంటే ఆధ్యాత్మికంగా అతని పరిచర్య మూలంగా క్రీస్తులోకి వచ్చినవారు. 1 తిమోతికి 1:2 పోల్చి చూడండి.

5. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయు చున్నావు.

“సోదరులు”– అంటే సంచారం చేసే శుభవార్త ప్రచారకులు. వీరు క్రీస్తు శుభవార్తను ప్రకటిస్తూ ఒక చోటనుంచీ వేరొక చోటికి తిరుగుతూ ఉండేవారు. “నమ్మకంగా”– దేవుని సత్యానికి అతడు నమ్మకంగా ఉన్నాడు. ఇది క్రీస్తు సేవకులకు తన చేతనైనంతగా సహాయపడేలా చేసింది. అతడు నేర్చుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టాడు. ఇది మనందరికీ ఆదర్శం.

6. వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి

“ప్రేమ”– 1 యోహాను 3:16-18.

7. కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును.

“ఇతర ప్రజలు”– అంటే యూదేతరుల్లో క్రీస్తును నమ్మనివారు. ఈ దేవ సేవకులు దేవుడే తమ అవసరాలు తీరుస్తాడని నమ్మి, సత్యాన్ని ప్రకటించడం కోసం బయలు దేరారు. సంఘాల్లోని విశ్వాసులు వారికి సహాయపడకపోతే వారెన్నో కష్టాలు ఎదుర్కోవలసి వచ్చేది. “పేరుకోసం”– అపో. కార్యములు 5:41. అంటే యేసుప్రభువు పేరు. ఈ ప్రచారకులు తమ స్వార్థం కోసం, లాభం కోసం బయలుదేరలేదు. “దేవునికి తగినట్టు”– 1 థెస్సలొనీకయులకు 2:12 పోల్చి చూడండి. స్థానిక సంఘాల్లో క్రైస్తవులు దేవుని సేవకులను పిలిచి వారిని తన పరిచర్యలో ఉంచిన దేవునికి ఇష్టమయ్యే రీతిలో పోషించి మర్యాద చెయ్యాలి. “సాగనంపితే”– ప్రకటించడానికి మరో చోటుకు వెళ్ళే సమయం వచ్చిందని వారు నిర్ణయించుకుంటే గాయస్ ఆ ప్రయాణానికి కావలసిన డబ్బు, ఇతర ఏర్పాట్లు చేసేవాడు.

8. మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.

“సత్యం విషయంలో భాగస్థులమయ్యేలా”– విశ్వాసులంతా శుభవార్త ప్రచారకులు కాలేరు. సంచారం చేస్తూ శుభవార్త ప్రకటించలేరు. అలా చేస్తున్న వారికి సహాయం మాత్రం అందరూ చేయగలరు. సంఘమంతా ఏక మనసుతో, ఏకాగ్రతతో భూమి నలుమూలలకూ శుభవార్త వ్యాపించేలా తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలి.

9. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.

గొప్ప రాయబారి యోహానునే లెక్క చేయనంత కండకావరం, అహంకారం, దురభిమానం ఉన్న ఒక వ్యక్తిని ఇక్కడ చూడవచ్చు. సంఘంపై తానొక్కడే పెత్తనం చేయాలనీ, అందరూ తననే గొప్పగా ఎంచి తన మాటకే లోబడాలనీ అతని కోరిక, ఇలాంటివారు నేడు మన సంఘాల్లో బోలెడంతమంది ఉన్నారు. తన సంగతే గానీ క్రీస్తు సంగతి చూడని ఇలాంటివారిని మనం కనిపెట్టి చూస్తుండాలి.

10. వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.

“వదరుతున్నాడు”– ప్రముఖుడుగా ఉండాలంటే మిగతా వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడ్డమే మార్గం అని కొందరి ఉద్దేశం. ఇతరుల పేరును కించపరిస్తే తమ పేరు వన్నెకెక్కుతుందని వారి తప్పు అంచనా. “వెలి వేస్తున్నాడు”– దేవుని సేవకులకు శుభవార్త ప్రకటించడంలో సహాయపడే మనసు అతనిలో లేదు సరిగదా ఇతరులను కూడా వారికి సహాయపడనీయకుండా అడ్డగిస్తున్నాడు. సంఘంలో తన అధిపత్యానికి ఈ “‘సోదరులు” ఆటంకమని అనుకుంటున్నాడేమో.

11. ప్రియుడా, చెడుకార్య మును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.

“మంచిని చూచి ఆ ప్రకారం”– 1 కోరింథీయులకు 4:16; ఎఫెసీయులకు 5:1; 1 థెస్సలొనీకయులకు 1:6; 1 థెస్సలొనీకయులకు 2:14; హెబ్రీయులకు 6:12; హెబ్రీయులకు 13:7. “మంచి”– 1 యోహాను 3:7-10. “చేసేవాడు”– ఒక మనిషి చేసే ఒక చర్య గురించి కాదు యోహాను మాట్లాడుతున్నది, ఆ వ్యక్తి జీవిత విధానం గురించి.

12. దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.

“సత్యం వల్ల కూడా”– దేవుని సత్యాన్ని అతడు ఆచరణలో పెట్టాడు. కాబట్టి దేవుని వాక్కునుబట్టి అతడు మంచివాడు. మనలో ప్రతి ఒక్కరూ ఎలాంటివారో మనం చేసే పనులను బట్టి దేవుని వాక్కు తెలియజేస్తున్నది.

13. అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు;

14. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.
సంఖ్యాకాండము 12:8Shortcut Links
3 యోహాను - 3 John : 1 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |