Revelation - ప్రకటన గ్రంథము 16 | View All

1. మరియుమీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
కీర్తనల గ్రంథము 69:24, కీర్తనల గ్రంథము 79:6, యెషయా 66:6, యిర్మియా 10:25, యెహెఙ్కేలు 22:31, జెఫన్యా 3:8

“ఏడు కోప పాత్రలు”– ఆ ఏడు ముద్రలు దేవుని చేతిలోని చుట్టిన పత్రాన్ని పూర్తిగా మూసివేశాయి (ప్రకటన గ్రంథం 5:1). ఆ ఏడు బూరలు రాబోయే విపత్తుల గురించి పూర్తిగా హెచ్చరికలు ఇచ్చేవి. ఈ ఏడు పాత్రల్లో లోకమంతటిమీద ఉన్న దేవుని ఉగ్రత పరిమాణం పూర్తిగా ఇమిడి ఉంది. ఈ పాత్రల కింద జరగబోయే విపత్తులు బూరల సమయంలో జరగబోయే విపత్తుల్ని కొన్ని విధాలుగా పోలినవి గానీ వాటికంటే ఇవి కఠినమైనవి, తీవ్రమైనవి. “గర్భాలయం నుంచి”– ఈ గొప్ప స్వరం బహుశా దేవుని స్వరం. ఈ సమయంలో ఆలయంలోకి మరెవరూ ప్రవేశించలేక పోయారు (ప్రకటన గ్రంథం 15:8).

2. అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండుపుట్టెను.
ద్వితీయోపదేశకాండము 28:35

“కురుపు”– నిర్గమకాండము 9:9-11 పోల్చి చూడండి.

3. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందు వలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.
నిర్గమకాండము 7:20-21

“సముద్రం”– ప్రకటన గ్రంథం 8:8-9. రెండో బూర సమయాన సముద్రంలో మూడో భాగం, దానిలోని ప్రాణులలో మూడో భాగం మాత్రమే దెబ్బ తిన్నది.

4. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.
కీర్తనల గ్రంథము 78:44

5. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;
నిర్గమకాండము 3:14, ద్వితీయోపదేశకాండము 32:4, కీర్తనల గ్రంథము 119:137, కీర్తనల గ్రంథము 145:17, యెషయా 41:4

ప్రకటన గ్రంథం 15:3 నోట్‌లో రిఫరెన్సులు చూడండి. దుర్మార్గుల మీద తన కోపాన్ని కుమ్మరించడంలో దేవుని న్యాయం మూడు సార్లు నొక్కి చెప్పబడింది. 2 థెస్సలొనీకయులకు 1:5-7; కీర్తనల గ్రంథము 47:2 (నోట్‌) కూడా చూడండి. దీన్ని నమ్మడానికి మనుషులకు మనసు లేదు కాబట్టి దీన్ని ఇలా నొక్కి చెప్పడం జరిగిందేమో. భూమిపైకి విపత్తులు వస్తే వారు దేవుని మీద ఫిర్యాదులు చేస్తారు, తాము నిర్దోషులమన్నట్టూ తమపట్ల దేవుడు అన్యాయాన్ని జరిగిస్తున్నట్టూ వారు మాట్లాడుతారు. ఎందుకంటే దీని గురించి (దేవుని గురించిన ఇతర సంగతుల విషయంలో కూడా) వారి ఆలోచనలు వక్రంగా ఉన్నాయి. వారు సత్యాన్ని తారుమారు చేస్తారు. పరలోకంలో ఉన్నవారి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ఈ యుగాంతంలో సాధ్యమైనంత ఘోరమైన విపత్తులు భూమిమీదికి వచ్చేటప్పుడు వాటిని పంపడంలో దేవుడు పరిపూర్ణ న్యాయాన్ని చూపుతున్నాడని పరలోక నివాసులంతా ఏకీభవిస్తారు.

6. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.
కీర్తనల గ్రంథము 79:3, యెషయా 49:26

ఇక్కడ పరిపూర్ణ ప్రతీకారం కనిపిస్తున్నది. లేవీయకాండము 26:23-24; సంఖ్యాకాండము 31:1-3; ద్వితీయోపదేశకాండము 32:35, ద్వితీయోపదేశకాండము 332:41-42 పోల్చి చూడండి. “దీనికి వారు తగినవారే”– దేవుడు ఏ వ్యక్తికైనా పంపిన శిక్షకు ఆ వ్యక్తి తగినవాడే. తగని శిక్షను దేవుడు ఎవరికీ పంపడు.

7. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.
కీర్తనల గ్రంథము 19:9, కీర్తనల గ్రంథము 119:137, ఆమోసు 4:13

8. నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.

“సూర్యమండలం”– ప్రకటన గ్రంథం 8:12 లో సూర్యమండలంలో మూడో భాగం మాత్రమే దెబ్బ తిన్నది.

9. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.

“దేవుని పేరును దూషించారు”– ముమ్మారు చెప్పిన మాట (వ 11,21). పతిత మానవ స్వభావానికి చెందిన భ్రష్టత్వాన్నీ కాఠిన్యాన్నీ పిచ్చితనాన్నీ చూపిస్తూ నొక్కి చెప్పిన మాట ఇది. తమ మీదికి ఈ విపత్తుల్ని తెచ్చి పెట్టేది వారి పాపాలే. అయితే ఆ పాపాలు ఒప్పుకొని విడిచి పెట్టడానికి బదులుగా వారు వాటిని న్యాయంగా పంపవలసిన దేవుని మీద కోపగించి దేవదూషణ చేస్తారు. రోమీయులకు 8:7; యోహాను 7:7 చూడండి. “చేకూర్చలేదు”– ప్రకటన గ్రంథం 9:20-21.

10. అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి.
నిర్గమకాండము 10:22, యెషయా 8:22

“మృగం సింహాసనం”– ఈ గ్రంథంలో ఈ మాట కనిపించేది ఇక్కడ మాత్రమే (దేవుని సింహాసనం గురించి 40 సార్లు కనిపిస్తున్నది). పరిస్థితులు తన అదుపులో ఉన్నాయని మృగం అనుకొంటాడు. సమయం మించిపోయిన తరువాత “పరలోకం పరిపాలిస్తుంది” (దానియేలు 4:26) అని గుర్తిస్తాడు. “చీకటి”– నిర్గమకాండము 10:21-23 పోల్చి చూడండి. “వేదన”– మునుపటి విపత్తువల్ల కాలిన గాయాల మూలమైనది.

11. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.
దానియేలు 2:19

12. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.
ఆదికాండము 15:18, ద్వితీయోపదేశకాండము 1:7, యెషయా 11:15, యెషయా 41:2, యెషయా 41:25, యెషయా 44:27, యిర్మియా 50:38, యిర్మియా 51:36

ప్రకటన గ్రంథం 9:14-19 పోల్చి చూడండి. “యూఫ్రటీస్”– ప్రకటన గ్రంథం 9:14 నోట్. ఈ నదికి తూర్పుగా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇండియా మొదలైన దేశాలు ఉన్నాయి. నది నీళ్ళు ఎండిపోవడం అనేది ఆ దేశాల సైన్యాలు పశ్చిమ ఆసియాకు రావడానికి అన్ని ఆటంకాలనూ తీసివేయబోయే సంగతిని సూచించవచ్చునేమో.

13. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.
నిర్గమకాండము 8:3

ఈ యుగాంతంలో గొప్ప సైన్యాలు ప్రయాణాలు చేసేందుకు కారణం సరైన ఆలోచన కాదు, యుద్ధ నీతిని అనుసరించడమూ కాదు. యెహెఙ్కేలు 38:4; యెహెఙ్కేలు 39:2 పోల్చి చూడండి. దేశాల పాలకులను దయ్యాలు మోసగించి పురికొల్పుతాయి. ఈ దయ్యాలు ఎక్కడనుంచి వస్తాయో గమనించండి – సైతాను, రాబోయే క్రీస్తువిరోధి, కపట ప్రవక్త (13వ అధ్యాయంలోని రెండో మృగం). దయ్యాల గురించి మత్తయి 4:24 నోట్ చూడండి.

14. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి
ఆమోసు 4:13

15. హెబ్రీభాషలో హార్‌ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.

16. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.
న్యాయాధిపతులు 5:19, 2 రాజులు 9:27, 2 రాజులు 23:29, జెకర్యా 12:11

“హర్‌మెగిద్దోన్”– హీబ్రూ భాషలో హర్ అంటే కొండ, పర్వతం. మెగిద్దో ఇస్రాయేల్ దేశంలో ఒక విశాలమైన మైదాన ప్రాంతం. అది నజరేతు గ్రామానికీ గలలీ కొండలకూ దక్షిణాన, కర్మెల్ పర్వత పంక్తికీ తూర్పుగా ఉన్న ప్రాంతం (2 దినవృత్తాంతములు 35:22; జెకర్యా 12:11). దీన్ని ఎస్‌ద్రెలోన్ మైదానం, యెజ్రీల్ లోయ కూడా అంటారు. మెగిద్దో అనే పురాతనమైన పట్టణం ఈ మైదానం దక్షిణ సరిహద్దులో ఉంది (న్యాయాధిపతులు 1:27; 1 రాజులు 9:15).

17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.
కీర్తనల గ్రంథము 69:24, కీర్తనల గ్రంథము 79:6, యెషయా 66:6

“గర్భాలయం”– వ 1. “సింహాసనం నుంచి”– ప్రకటన గ్రంథం 19:5; ప్రకటన గ్రంథం 21:3.

18. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
నిర్గమకాండము 19:16, దానియేలు 12:1

ప్రకటన గ్రంథం 4:5; ప్రకటన గ్రంథం 8:5; ప్రకటన గ్రంథం 11:19 పోల్చి చూడండి. “భూకంపం”– ఈ మాట ఈ గ్రంథంలో ఏడు సార్లు కనిపిస్తున్నది. చరిత్రలోని భూకంపాలన్నిట్లోకి ఇది ఘోరమైనదిగా ఉంటుంది.

19. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.
కీర్తనల గ్రంథము 75:8, యెషయా 51:17, యిర్మియా 25:15, దానియేలు 4:30

“మహా నగరం”– బబులోను ఏ నగరాన్ని సూచిస్తుందో ఆ నగరం గురించి “మహా” అనే మాట 10 సార్లు ఈ గ్రంథంలో కనిపిస్తున్నది గానీ మరే నగరం గురించీ ఒక్క సారి కూడా కనబడదు. భూకంపం అనే మాట కనబడిన వెంటనే (వ 18) ఈ వచనంలో మహా బబులోను ప్రస్తావన ఉంది. అంతేగాక 18వ అధ్యాయంలో బబులోను పతనం గురించిన వర్ణన చూస్తే దాని పతనం భూకంపంవల్ల కలిగే నాశనం లాంటిది (ప్రకటన గ్రంథం 18:8-10, ప్రకటన గ్రంథం 18:21. తరచుగా భూకంపాలవల్ల అగ్ని రగులుకొంటుంది). ఈ కారణాలచేత ఈ మహా నగరం బబులోను ఏ నగరాన్ని సూచిస్తుందో ఆ నగరమే అనుకోవచ్చు (ప్రకటన గ్రంథం 17:9, ప్రకటన గ్రంథం 17:18). “నగరాలు కుప్ప కూలాయి”– ఈ భూకంపం స్థానికమైనది కాదు (ప్రకటన గ్రంథం 11:13 లోని దాని వంటిది కాదు). యెషయా 24:18-20; హెబ్రీయులకు 12:26-27 పోల్చి చూడండి. భూమి అంతా కంపించే సమయం రాబోతున్నది. “కోప తీవ్రత మద్యం”– ప్రకటన గ్రంథం 14:10.

20. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.

21. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.

“వడగండ్లు”– నిర్గమకాండము 9:22-26 పోల్చి చూడండి. “దేవుణ్ణి దూషించారు”– వ 9,11.Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |