“ఎవరూ లేరు”– దేవుని స్నేహితుడైన అబ్రాహాము కాదు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన గొప్పవాడైన మోషే కాదు, ఇస్రాయేల్ రాజైన దావీదు కాదు, ప్రవక్తలలో ఒకడు కాదు, పరలోకంలోని పెద్దలలో, ప్రాణులలో, దేవదూతలలో ఎవరూ కాదు ఆ పత్రం విప్పగలిగినది. పరలోకంలో ఉన్నవారంతా, భూనివాసులంతా ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నవారంతా ఆ ముద్రలను తీయడానికి తాము తగినవారం కాదని ఒప్పుకోవలసివచ్చింది. ఆ పత్రాన్ని చేపట్టడానికి ఎవరూ ఆ సింహాసనం దగ్గరకు వెళ్ళడానికి తెగించలేదు.