Revelation - ప్రకటన గ్రంథము 7 | View All

1. అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.
యిర్మియా 49:36, యెహెఙ్కేలు 7:2, యెహెఙ్కేలు 37:9, దానియేలు 7:2, జెకర్యా 6:5

1. After this I saw four angels standing at the four corners of the earth, holding back the four winds of the earth so no wind could blow on the earth, on the sea, or on any tree.

2. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో

2. Then I saw another angel ascending from the east, who had the seal of the living God. He shouted out with a loud voice to the four angels who had been given permission to damage the earth and the sea:

3. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
యెహెఙ్కేలు 9:4

3. Do not damage the earth or the sea or the trees until we have put a seal on the foreheads of the servants of our God.'

4. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.

4. Now I heard the number of those who were marked with the seal, one hundred and forty-four thousand, sealed from all the tribes of the people of Israel:

5. యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,

5. From the tribe of Judah, twelve thousand were sealed, from the tribe of Reuben, twelve thousand, from the tribe of Gad, twelve thousand,

6. ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,

6. from the tribe of Asher, twelve thousand, from the tribe of Naphtali, twelve thousand, from the tribe of Manasseh, twelve thousand,

7. షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,

7. from the tribe of Simeon, twelve thousand, from the tribe of Levi, twelve thousand, from the tribe of Issachar, twelve thousand,

8. జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.

8. from the tribe of Zebulun, twelve thousand, from the tribe of Joseph, twelve thousand, from the tribe of Benjamin, twelve thousand were sealed.

9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి

9. After these things I looked, and here was an enormous crowd that no one could count, made up of persons from every nation, tribe, people, and language, standing before the throne and before the Lamb dressed in long white robes, and with palm branches in their hands.

10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
1 రాజులు 22:19, 2 దినవృత్తాంతములు 18:18, కీర్తనల గ్రంథము 47:8, యెషయా 6:1, యెహెఙ్కేలు 1:26-27

10. They were shouting out in a loud voice, 'Salvation belongs to our God, to the one seated on the throne, and to the Lamb!'

11. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్‌;

11. And all the angels stood there in a circle around the throne and around the elders and the four living creatures, and they threw themselves down with their faces to the ground before the throne and worshiped God,

12. యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.

12. saying, 'Amen! Praise and glory, and wisdom and thanksgiving, and honor and power and strength be to our God for ever and ever. Amen!'

13. పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.

13. Then one of the elders asked me, 'These dressed in long white robes who are they and where have they come from?'

14. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
ఆదికాండము 49:11, దానియేలు 12:1

14. So I said to him, 'My lord, you know the answer.' Then he said to me, 'These are the ones who have come out of the great tribulation. They have washed their robes and made them white in the blood of the Lamb!

15. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
1 రాజులు 22:19, 2 దినవృత్తాంతములు 18:18, కీర్తనల గ్రంథము 47:8, యెహెఙ్కేలు 1:26-27

15. For this reason they are before the throne of God, and they serve him day and night in his temple, and the one seated on the throne will shelter them.

16. వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
యెషయా 49:10

16. They will never go hungry or be thirsty again, and the sun will not beat down on them, nor any burning heat,

17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
కీర్తనల గ్రంథము 23:1, కీర్తనల గ్రంథము 23:2, యెషయా 25:8, యిర్మియా 2:13, యెహెఙ్కేలు 34:23, యెషయా 49:10

17. because the Lamb in the middle of the throne will shepherd them and lead them to springs of living water, and God will wipe away every tear from their eyes.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Revelation - ప్రకటన గ్రంథము 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రకటన 7:1-8 అటుతరువాత ...... లక్ష నలువది నాలుగు వేలమంది ...... ముద్రింపబడిరి.
తరువాత (ప్రక 18:21) అటుతరువాత (ప్రక 7:1, 9; 15:5; 18:1; 19:1) ఇటుతరువాత (ప్రక 9:12) ఈ సంగతులు జరిగిన తరువాత (ప్రక 4:1) యోహాను గారి రచనా శైలిలో ఈ పదములు వాడుట వాడుకగా వున్నది.
తరువాత అనగా ఆ మాటకు ముందు వెనుక వున్న సందర్బాలకు మధ్య కొంత కాలము వ్యవధి వున్నదని మనము గ్రహించాలి. ఈ ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ప్రకృతి విలయతాండవము, అన్య జనుల ఘోష చూశాము.
కొన్ని దినములు అలా సంభవించిన పిదప నలుదిక్కుల వాయువులు బంధింపబడుట అనగా ప్రకృతి నిమ్మళించినది. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?( సామెతలు 30:4) ఆయన [యేసు] గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను (మత్త 8:26).
దూత చేతిలో దేవుని ముద్ర వున్నది. అది నిజ క్రైస్తవులపై వేయబడనై యున్నది. ఆ ముద్రలో ఏమని వున్నది ఫిలదెల్ఫియ సంఘ వర్తమానములో దేవుడు ముందుగానే బయలుపరచినారు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను (ప్రక 3:12).
ముద్రించు వరకు అనే మాటతో మనకు ఏమి అర్ధమగుచున్నది ప్రియ విశ్వాసీ? ముద్రించిన పిదప మరి భయంకరమైన పరిస్ధితి భూమి మీద సంభావింపనై యున్నది కదా. అది మన తరములో సంభవించినచో నీవు సిద్ధమా. ముద్ర వుంటే సురక్షితం, లేని యెడల; నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి (యెహే 9:5). ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు (యెహే 9:6).
అట్టి ముద్రను ఇశ్రాయేలీయులపై వేయ బడినప్పుడు గోతముల వారిగా లెక్క చెప్పబడినది. ఆనాడు ఇగుప్టు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులలో ఇరువది ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగిన వారు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మంది (నిర్గ 38:26 ). నేడు ఇశ్రాయేలు దేశపు జనాభా ఎనుబదియారు లక్షల ఏబదియైదు వేల ఐదు వందల ముప్పదియైదు అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభువు రాకడ సమయానికి ఇంకా వృద్ధి అగుట తధ్యం కాదా.
మరి కేవలము లక్ష నలువది నాలుగు వేలమంది మాత్రమే ముద్రింపబడుట ఏమిటి? ప్రియ స్నేహితుడా, గ్రంథములోని కొన్ని ప్రామాణిక సంఖ్యలను వున్నవి ఉన్నట్టుగా భావించ కూడదు. ఉదాహరణకు: మూడు, యేడు, పన్నెండు, పదునాలుగు, వెయ్యి వంటివి. ప్రార్ధనా పూర్వకముగా ముందుకు సాగుదమా, ప్రభువు మనతోనుండి మనకు బోధించును గాక. ఆమెన్

ప్రకటన 7:9-17 అటు తరువాత నేను చూడగా, ఇదిగో ...... ...... ...... దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు (మత్త 8:11) అనగా ముందు చెప్పబడిన 1,44,000 మంది యూదులతో కూడా క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ ఫలము పొందిన క్రైస్తవులు ఇక్కడ కనబడుచున్నారు.
మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును (మత్త 24:14). అట్లు వారు ఒక లెక్కింపలేని జనసమూహముగా కనబడుచున్నారు. వారెవరు అంటే, ప్రతి జనములోనుండి ప్రతి వంశములోనుండి ప్రజలలోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలో నుండి అనగా ప్రపంచ నలుమూలలనుండి ప్రోగుచేయబడిన నిజమైన క్రైస్తవులు.
మొదట ప్రకటన 4:8లో నాలుగు జీవుల ఆరాధన చూశాము. ఆ తదుపరి ప్రకటన 4:11 లో ఇరువది నలుగురు పెద్దల ఆరాధన ధ్యానించియున్నాము. ఐతే ఇది రక్షింపబడిన క్రైస్తవ విస్వాసుల ఆరాధన. వారి వస్త్రములు తెల్లనివి, వారి చేతిలో ఖర్జూరపు మట్టలున్నవి అనగా జయశాలి యేసు క్రీస్తు యొక్క రాకడను ప్రచురపరచుచు స్తుతించుచున్నారు. ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేయు చున్నారు (యోహా 12:13).
ఇది అద్భుతమైన యేడు మాటల ఆరాధన. 1. స్తోత్రమును 2.మహిమయు 3.జ్ఞానమును 4.కృతజ్ఞతా స్తుతియు 5.ఘనతయు 6.శక్తియు 7.బలమును కలుగును గాక – ప్రియులారా మనము నేర్చుకుందాము.
దేవదూత యోహాను గారిని అడిగారు, వీరెవరు? ఎక్కడ నుండి వచ్చారు? అని. సార్దీస్ సంఘముతో ప్రభువు చేసిన వాగ్దానము యేమనగా, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు (ప్రక 3:4). ప్రక 4:4 ప్రకారం సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి. మరియూ, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను (ప్రక 6:9-11).
ఇపుడు ఎందుకు యోహాను గారు ఈ ముగ్గురిలో ఒకరై ఉండవచ్చును అనిగాని, సార్దీస్ సంఘస్తులని గాని చెప్పలేక పోయారు. వీరు గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. వారు లోకాంతము వరకూ రక్షింపబడిన వారు అని మననము గ్రహించాలి.
ప్రియ స్నేహితుడా, మనము పరలోకములో ఎలా ఉంటాము, ఎక్కడ ఉంటాము ఇక్కడ తేట తెల్లమౌతుంది. గొఱ్ఱపిల్ల రక్తములో కడుగ బడినావా? నేడే రక్షణ దినము. ఇప్పుడే పాపము లోప్పుకో, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రునిగా చేయును. యెషయా ప్రవచనము: యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును (యెష 1:18) అని వాగ్దానము చేశారు కదా,
ఈరోజే తీర్మానము చేసుకో, సమయముండగానే తీర్మానము చేసుకో. ఆ నిత్య రాజ్యములో ఆరాధన, ఆరాధన, ఆరాధన అంతే గాని ఆకలి లేదు, దాహము లేదు, అస్తమయము లేనే లేదు. జీవజలములతో సేదదీరుతూ దుఃఖము నిట్టూర్పులులేని రాజ్యమది. ముందుకు సాగుదామా, ప్రార్ధన చేద్దాం. ప్రభువు మనతో నుండునుగాక. ఆమెన్



Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |