Revelation - ప్రకటన గ్రంథము 8 | View All

1. ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.

“ఏడో ముద్ర”– ఆరో అధ్యాయంలో ఏడు ముద్రలున్న పత్రం అధిక భాగం విప్పబడింది, యుగాంతంలో జరగబోయే సంఘటనల్లో అధిక భాగం ఆ ఆరు ముద్రల కింద సంభవిస్తాయి. ఇక్కడ చివరి ముద్రను విప్పాడు యేసుప్రభువు. పత్రంలోని చివరి భాగంలోనుంచి ఏడు బూరలన్నీ, ఏడు కోప పాత్రలన్నీ వస్తాయి. ఆరో ముద్ర విప్పకముందే మహా బాధ కాలం ముగిసిపోతుంది (ప్రకటన గ్రంథం 6:12-17 గురించిన నోట్ చూడండి). ఈ ఎనిమిదో అధ్యాయంలో యుగ సమాప్తిలో దుర్మార్గుల మీదికి రాబోయే దేవుని తీర్పులనూ శిక్షలనూ బూరలు ప్రకటిస్తున్నాయి. ఏడు పాత్రల సమయంలో (15,16 అధ్యాయాలు) దేవుడు వారిమీద పూర్తిగా తన కోపాన్ని కుమ్మరిస్తాడు. “నిశ్శబ్దం”– ప్రకటన గ్రంథం 4:8-11; ప్రకటన గ్రంథం 5:9-14; ప్రకటన గ్రంథం 7:10-12 పోల్చి చూడండి. మానక జరుగుతున్న స్తుతుల తరువాత ఈ నిశ్శబ్దం చాలా అర్థవంతమైనదీ ముఖ్యమైనదీ ఏదో జరగనై ఉన్నదని సూచిస్తున్నది గదా. ఇది గొప్ప తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం వంటిది. జెఫన్యా 1:7 చూడండి. “ప్రభు దినం”, లోకం మీద ఆయన తన ఉగ్రతను కుమ్మరించే సమయం చాలా దగ్గరగా ఉంది. దాన్ని ఆయన బూరలద్వారా చాటిస్తున్నాడు. బూరల సమయంలో జరగబోయే ఈ కడగండ్లు కోప పాత్రల సమయంలో జరగబోయే కడగండ్లంత కఠినమైనవి కావు. బూరల కడగండ్లు వాటి తరువాత రాబోయే కడగండ్ల గురించిన హెచ్చరికలు, ప్రకటనల్లాంటివని అనిపిస్తుంది.

2. అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.

“ఏడు”– సంపూర్ణతను లేక పరిపూర్ణతను సూచించే సంఖ్య.

3. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
నిర్గమకాండము 30:1-3, కీర్తనల గ్రంథము 141:2, ఆమోసు 9:1

“ధూప వేదిక”– నిర్గమకాండము 30:1-6; హెబ్రీయులకు 8:5; హెబ్రీయులకు 9:4. “ధూపార్తి”– లేవీయకాండము 16:12. “ధూపం”– నిర్గమకాండము 30:1-9, నిర్గమకాండము 30:34-38. “పవిత్రులందరి ప్రార్థనలు”– ప్రకటన గ్రంథం 5:8. దేవుని ప్రజల ప్రార్థనల ఫలితంగా ముద్రలు విప్పినట్టుగానే బూరలు ఊదడంలో కూడా ప్రార్థనల ప్రాముఖ్యత ఉంది. జరగబోయేవి వారి ప్రార్థనలకు జవాబుగా జరుగుతాయనుకోవచ్చు (విశేషంగా ప్రకటన గ్రంథం 22:20; మత్తయి 6:10 లో ఉన్న ప్రార్థనలలాంటి వాటికి జవాబుగా). నిజమైన ప్రార్థన చాలా ప్రభావం గలది – యాకోబు 5:16.

4. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.

5. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
నిర్గమకాండము 19:16, లేవీయకాండము 16:12

“ఉరుములూ...భూకంపమూ”– ప్రకటన గ్రంథం 4:5 నోట్. ఈ నోట్స్ రచయిత నమ్మేదేమిటంటే, బూరలు ఊదినప్పుడు కనిపించే విషయాలు ఈ యుగాంత సమయంలో భూలోకంలో జరగబోయే విపత్తులు. ఈ భాగంలో చిహ్నాలూ సంకేతాలూ సూచనలూ ఉన్నాయి గాని ఇవి వాస్తవమైన ఏవో అపదలను సూచిస్తున్నాయి. ఈ సంఘటనల ప్రతి వివరణ అర్థమూ తెలుసుకోవడం, చెప్పడం కష్టతరం. క్లుప్తమైన ఇలాంటి నోట్స్‌లో ప్రతి వివరణ అర్థం చెప్పడం ప్రయత్నించడానికి వీలుండదు.

6. అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.

7. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
నిర్గమకాండము 9:24, యెహెఙ్కేలు 38:22, యోవేలు 2:30

నిర్గమకాండము 9:22-26 పోల్చి చూడండి. ఒకప్పుడు ఒకే దేశం(ఈజిప్టు)లో జరిగినది లోకమంతటా జరగబోతుంది. అయితే పడబోయేవి పిడుగులూ, వడగండ్లూ మాత్రమే కాక వాటితోబాటు అగ్ని, రక్తం. యెహెఙ్కేలు 38:22; యోవేలు 2:30; అపో. కార్యములు 2:19 కూడా చూడండి.

8. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.
నిర్గమకాండము 7:19, యిర్మియా 51:25

నిర్గమకాండము 7:19 పోల్చి చూడండి.

9. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.

10. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగముమీదను నీటిబుగ్గల మీదను పడెను.
యెషయా 14:12

ఈ మండుతూ ఉన్నది ఏదో ఒక రకం తోకచుక్క లేక ఉల్క లేక చిన్న గ్రహం అయి ఉండగలదా? కాబోలు, గాని ఖచ్చితంగా చెప్పలేము. ప్రకటన గ్రంథం 9:1-2 లో “నక్షత్రం” ఒక వ్యక్తికి సూచనగా ఉంది.

11. ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.
యిర్మియా 9:15

“నక్షత్రం” అనే మాట చూడండి. ప్రకటన గ్రంథం 12:4 లో నక్షత్రాలు దేవదూతలకు సూచనలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ నక్షత్రం నీళ్ళను విష పూరితం చేయడానికి అధికారం పొందిన దేవదూతకు సూచన కాగలదా? తెలియదు. ఊహించాలంటే ఊహించవచ్చు గాని దానివల్ల ప్రయోజనం ఏముంది?

12. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
యెషయా 13:10, యెహెఙ్కేలు 32:7-8, యోవేలు 2:10, యోవేలు 3:15

13. మరియు నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు-బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములనుబట్టి భూనివాసులకు అయ్యో, అయ్యో, అయ్యో, అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.

“దేవదూత”– ఇది ఎవరిని సూచిస్తుందో అన్నది ముఖ్యమైన సంగతి కాదు. రాబోయే భయంకరమైన విపత్తుల గురించి దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు అన్నదే ముఖ్యం. ఈ విపత్తుల్లో రెంటి గురించిన వర్ణనలు 9వ అధ్యాయంలో ఉన్నాయి. మూడోది ఏడో బూర ఊదిన తరువాత కలుగుతుంది (ప్రకటన గ్రంథం 11:5). ఈ మూడో విపత్తు బహుశా ఏడో బూర సమయంలో 16వ అధ్యాయంలోని ఏడు కోప పాత్రలను కుమ్మరించడం.Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |