27. మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొన లేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.
“వశం చేసుకోలేదు”– ఈ మాటలే 29,30,31,33 వచనాల్లో మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. దేవుని పట్ల ఇస్రాయేల్వారి అవిధేయత వారికి ఇబ్బందుల్ని తెచ్చి పెట్టింది. అంతేగాక చాలా భూభాగాన్ని వారు వశపరచుకోలేకపోయారు. విధేయత ప్రాధాన్యత గురించి యెహోషువ 1:7-8 చూడండి.