Judges - న్యాయాధిపతులు 7 | View All

1. అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.

“లోయ”– యెజ్రేల్ మైదానం, లేక లోయ (న్యాయాధిపతులు 6:33).

2. యెహోవానీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులునా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.

“ఎక్కువమంది”– 1 సమూయేలు 14:6 కీర్తనల గ్రంథము 33:16. “విర్రవీగుతారు”– యిర్మియా 9:23-24 1 కోరింథీయులకు 1:27-31 1 కోరింథీయులకు 3:21 ఎఫెసీయులకు 2:9 పోల్చిచూడండి. తమ గురించి తామే గొప్పలు చెప్పుకోవడం వాళ్ళ పాలిట విపత్తుకు కారణం అయ్యేది.

3. కాబట్టి నీవుఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించు మని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లి పోయిరి.

“భయం”– ద్వితీయోపదేశకాండము 20:8 పోల్చి చూడండి. యుద్ధం చేసేందుకు అనేకమంది దేవునికి అవసరం లేదు గాని ఉన్న కొద్దిమంది మాత్రం నమ్మకంతో ఆయన కోసం దేనికైనా సిద్ధపడి ఇష్టపడిన వారై ఉండాలి.

4. పదివేలమంది నిలిచియుండగా యెహోవాఈ జను లింక ఎక్కువమంది, నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పు దునో వాడు నీతో పోవలెను; ఇతడు నీతో పోకూడదని యెవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెల విచ్చెను.

“పరీక్ష చేస్తాను”– దేవుడు మనుషుల్ని జల్లెడ పట్టి పరీక్షించడం అదృశ్యమైన రీతుల్లో తప్పక జరుగుతూ ఉంది.

5. అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవాకుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.

6. చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందల మంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి.

ఈ మూడు వందల మంది చురుకుగా, పోరుకు సన్నద్ధులై ఉండగా, మిగిలినవారు కొంత విశ్రాంతిగా శత్రువుల దాడికి అనువైన స్థితిలో ఉన్నట్టు కనిపించారు. దేవునికి చాలా మంది మనుషులు అవసరం లేదు గాని ఉన్న కొద్దిమంది జాగరూకతతో దేనికైనా సిద్ధపడి ఉండాలి. ప్రభువు ఇప్పుడు జరిగిస్తున్న ఆధ్యాత్మిక పోరాటాల్లో ఇలా ఉండదని అనుకోగలమా?

7. అప్పుడు యెహోవాగతికిన మూడు వందల మనుష్యులద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను.

8. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెను గాని ఆ మూడువందల మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను.

9. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెనునీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను.

10. పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతో కూడ దండుకు దిగిపొమ్ము.

“భయపడుతూ”– గిద్యోను స్వతహాగా అప్పుడప్పుడు పిరికితనానికీ భయానికీ లోనైనవాడని దేవునికి తెలుసు (న్యాయాధిపతులు 6:15 న్యాయాధిపతులు 6:17). అందువల్ల 11-14 వచనాల్లోని సంఘటన ద్వారా మరి కొంత ప్రోత్సాహం కలిగించాడు.

11. వారు చెప్పు కొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండు లోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.

12. మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.

13. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగానేనొక కలగంటిని, అదే మనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను.

14. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయు డైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.

15. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును విని నప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రా యేలీయుల దండులోనికి తిరిగి వెళ్లిలెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్ప గించుచున్నాడని చెప్పి

గుండె ధైర్యం లేని తన సేవకునికి దేవుడిచ్చిన ఈ ప్రోత్సాహం ఫలించింది. ఏకైక నిజ దేవునిపై మన నమ్మకాన్ని ప్రోత్సహించేదేదైనా దేవునినుంచి వచ్చినదే అని సాధారణంగా చెప్పవచ్చు. ఆ నమ్మకాన్ని నీరు గార్చేది దేవునికి వ్యతిరేకమైన దాని మూలంగా కలిగేది.

16. ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను-నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి;

17. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను.

18. నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచుయెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను.

“గిద్యోను”– అతడు తన స్వంత ఘనత చూడడం లేదు. శత్రువులకు తన పేరంటే హడలని అతడికి తెలుసు (వ 14).

19. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి.

“నడి జాము”– రాత్రి సమయంలో కాపలావాళ్ళు మూడు సార్లు మారుతారు. నడి జాము వేళ శిబిరమంతా నిద్రలో ఉండే సమయం.

20. అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, యెడమచేతు లలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.

21. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.

యెహోషువ 23:10 1 సమూయేలు 14:14-15 2 రాజులు 7:6-7 పోల్చి చూడండి. దేవునికి లోబడి విశ్వాసంతో తెగించేవారు తమకంటే బలం గల శత్రువులను ఓడించగలరు. లూకా 19:9 లూకా 19:20 యాకోబు 4:7 1 పేతురు 5:8-9 పోల్చి చూడండి.

22. ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్ద నున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా

23. నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రా యేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.

24. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూత లను పంపిమిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయు లందరు కూడుకొని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి.

“యొర్దాను”– శత్రువులు నది దాటి తూర్పు దిశగా పారిపోకుండా ఆపేందుకు ఇలా చేశారు.

25. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబునుచంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.

“జేబ్”– కీర్తనల గ్రంథము 83:11.


Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.